కిర్లంపూడి: కాపులను రౌడీలుగా చిత్రీకరించడం దారుణమని కాపు నేతలు అన్నారు. తుని ఘటనలో అరెస్టైన వారంతా రౌడీలేనన్న హోంమంత్రి చినరాజప్ప వ్యాఖ్యలు సరికాదని నేతలు తీవ్రంగా ఖండించారు.
కిర్లంపూడిలో మంగళవారం మధ్యాహ్నం కాపునేతలు మాట్లాడుతూ..తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఎన్నికల హామీని అమలు చేయాలని కోరితే అరెస్ట్లు చేస్తారా..?? అని ప్రశ్నించారు. అమాయకులను అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోమని కాపు నేతలు హెచ్చరించారు.
తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసే వరకు పోలీస్ వ్యాన్ లోనే ఉంటానని బలవంతంగా దించాలని చూస్తే ఇక్కడే దీక్షకు కూర్చుంటానని కాపు నాయకుడు ముద్రగడ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. కాకినాడ, అమలాపురం సహా అన్ని పట్టణాల్లో భారీగా పోలీసులను మోహరించారు.