'అసెంబ్లీలో బాబును నిలదీస్తాం'
గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకే టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోపించారు. గుంటూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తుని ఘటనతో భూమన కరుణాకర్రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెవిరెడ్డి చెప్పారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో భూమనకు 30 ఏళ్ల నుంచి పరిచయముందన్నారు. విచారణ పేరుతో ఆయన్ను పోలీసులు వేధిస్తున్నారని చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని ఘటనతో భూమనకు సంబంధం లేకపోయినా తప్పుడు కేసులు పెట్టారన్నారు. చంద్రబాబుకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని...అసెంబ్లీలో కచ్చితంగా బాబును నిలదీస్తామని చెవిరెడ్డి చెప్పారు.