ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించడం వల్లే తుని ఘటన జరిగిందని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించడం వల్లే తుని ఘటన జరిగిందని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించడాన్ని ప్రస్తావించారు. సోమవారం కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
టీడీపీకి అమ్ముడుపోయిన ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి సోదరులు వైఎస్ఆర్ సీపీ నేతలను విమర్శించడం తగదన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్లను 420లుగా అభివర్ణించిన ఆనం సోదరులు ఇప్పుడు పదవుల కోసం కాళ్లు పట్టుకుంటున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు.