తునిలో కాపు ఐక్యగర్జన నిర్వహిస్తుండగా విధ్వంసకాండ జరిగినప్పుడు ఒకవైపు రైలు తగలబడుతుండగానే అదే సమయంలో ఆ ఘటన వెనక ఎవరున్నారో ఏపీ సీఎం చంద్రబాబుకు ఎలా తెలుసని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అప్పుడు రైలు కాలుతుండగానే చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఆ ఘటన వెనుక కాపులు లేరని.. కడప నుంచి వచ్చిన గూండాలు ఉన్నారని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.