ఎన్నికల కోడ్‌ను లెక్కచేయకుండా గ్రూప్ 2 ప్రిలిమినరి పరీక్షలో టీడీపీ ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు అడగడం దారుణమని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల సంఘం ఈ అంశంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన వైఎస్సార్ సీపీ నాయకుడు నాగిరెడ్డితో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి గ్రూప్ 2 పరీక్షలో ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు అడగడంపై ఫిర్యాదు చేశారు.