రాజధాని విషయంలో గత టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా తాము ప్రజలకు తెలియజేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంటేషన్‌ను వైఎస్సార్ సీపీ ప్రసారం చేసింది. ఇందులో భాగంగా రాజధానిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ వివరాలను ప్రజల ముందుకు తీసుకువచ్చినట్లు అంబటి రాంబాబు తెలిపారు. అమరావతిలో ఏం జరిగిందనే విషయంలో.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఆధారాలతో సహా విజువల్‌ను ప్రదర్శిస్తున్నామని పేర్కొన్నారు. ‘రాజధాని ప్రాంతంలో అసైన్డు భూముల కొనుగోలు, క్విడ్ ప్రోకో ఒప్పందాలు, రాజధాని ప్రకటన విషయంలో గందరగోళం, ల్యాండ్ పూలింగ్ విషయంలో జరిగిన అన్యాయం, లింగమనేనికి సంబంధించిన భూములకు సరిగ్గా పది మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోవడం’ వంటి అంశాలను ఇందులో చర్చించారు.