ముద్రగడను కూడా అరెస్ట్ చేస్తాం : బోండా ఉమ
విజయవాడ: మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా అరెస్ట్ చేస్తామని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో మంగళవారం ఆయన మాట్లాడుతూ...ముద్రగడపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
త్వరలోనే ముద్రగడ రాజకీయ ముసుగు తొలగిపోతుందన్నారు. తుని ఘటనలో దర్యాప్తులో అన్ని ఆధారాలు సేకరించాకే అరెస్ట్లు చేస్తున్నామన్నారు. ఈ కేసులో ఇంకా ఎక్కువ అరెస్ట్లు ఉంటాయని బోండా చెప్పారు. ఇప్పటికే హోంమంత్రి చినరాజప్ప తుని ఘటనలో అరెస్టైన వారిని రౌడీలని అనడంపై కాపు నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజా బోండా వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచే విధంగా మారాయి.