
25 నుంచి కాపు కార్పొరేషన్ రుణాలు
రాజమండ్రి : ఈ నెల 25 నుంచి తొలి విడత కాపు కార్పొరేషన్ రుణాలు మంజూరు చేస్తామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప వెల్లడించారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎన్ చినరాజప్ప మాట్లాడుతూ... 25 వేల మందికి రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపించి...బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్ చినరాజప్ప స్పష్టం చేశారు. జిల్లాలో రబీ పంటకు ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చినరాజప్ప తెలిపారు.