టెక్నాలజీ సేవలు మరింత విస్తృతం
డీజీపీ రాముడు
పలమనేరు : పోలీస్ శాఖలో నూత న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సేవలను మరింత విస్తృతం చేస్తామని డీజీపీ రాముడు చెప్పారు. పలమనేరులోని సీఐ కార్యాలయంలో డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ శ్రీనివాస్, స్థానిక డీఎస్పీ శంకర్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టెక్నాలజీని వాడుకోవడంతో సిబ్బంది కొరతను కూడా తగ్గించుకోవ చ్చన్నారు. త్వరలో రాష్ర్ట వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసేలా చొరవ చూపుతామన్నారు. ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలైతే కోర్టుకు కావాల్సిన సాక్ష్యాల సేకరణ చాలా సులభతరమవుతుందన్నారు.
ట్రాఫిక్‌కు సంబంధించి తిరుపతి నగరంలో అధునాతన పద్ధతులను అవలంబిస్తున్నారని, ఇవి సత్పలితాలు ఇస్తాయని చెప్పారు. రాబోవు రోజుల్లో టెక్నాలజీ మరింత పెరుగుతుందని, నేరాలను అదుపు చేయడం కాస్త సులభతరమవుతుందని తెలిపారు. జిల్లాలో అమలవుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ సిస్టం చాలా బాగుందని మెచ్చుకున్నారు. పొలీసులు ప్రజల భాగస్వామ్యంతో నేరాలను అదుపుచేయడానికి ఆస్కా రం ఉంటుందన్నారు. ప్రజలు పోలీసులకు మరింత సహకరిస్తే వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సీఐ సురేందర్ రెడ్డి, ఎస్‌ఐ లోకేష్ పాల్గొన్నారు.