కొత్త పోలీస్‌ బాస్‌గా సాంబశివరావు బాధ్యతలు | Sambasiva Rao takes charge as In-charge DGP of Andhra pradesh | Sakshi
Sakshi News home page

కొత్త పోలీస్‌ బాస్‌గా సాంబశివరావు బాధ్యతలు

Published Sat, Jul 23 2016 2:23 PM | Last Updated on Thu, Mar 28 2019 5:34 PM

కొత్త పోలీస్‌ బాస్‌గా సాంబశివరావు బాధ్యతలు - Sakshi

కొత్త పోలీస్‌ బాస్‌గా సాంబశివరావు బాధ్యతలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కొత్త పోలీస్ బాస్గా సాంబశివరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. డీజీపీగా ఇవాళ పదవీ విరమణ చేసిన రాముడు... సాంబశివరావుకు ఇంఛార్జ్  బాధ్యతలు అప్పగించారు. ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న సాంబశివరావును ప్రభుత్వం ఇన్‌ఛార్జ్‌ డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు సాంబశివరావుకు అభినందనలు తెలిపారు.

పోలీసుల్ని వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని డీజీపీ తెలిపారు. టెక్నాలజీ సాయంతో ప్రజలకు సేవ చేసేలా పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తానన్నారు. గోదావరి పుష్కరాల్లో లోపాల్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణా పుష్కరాలను  సమర్ధవంతంగా నిర్వహిస్తామని డీజీపీ సాంబశివరావు హామీ ఇచ్చారు.  పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారుడు సంతృప్తికరంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూస్తామని సాంబశివరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement