
'ఆత్మరక్షణ కోసమే కాల్పులు'
తిరుపతి : ఆత్మరక్షణ కోసమే ఎర్ర చందనం స్మగ్లర్లపై కాల్పులు జరిపినట్లు టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు తెలిపారు. స్మగ్లర్లు ఉన్నట్లు సమాచారం అందటంతో సోమవారం రాత్రి 7 గంటల నుంచి కూంబింబ్ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై స్మగ్లర్లు దాడికి యత్నించి కాల్పులకు పాల్పడినట్లు డీఐజీ తెలిపారు. దాంతో తాము ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చినట్లు ఆయన వివరణ ఇచ్చారు.
కాగా మంగళవారం తెల్లవారుజామున తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని డీఐజీ ధ్రువీకరించారు.