ఈ నెల 25న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో పట్టుబడిన నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు కడపకు తీసుకొచ్చారు.
ఈ నెల 25న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో పట్టుబడిన నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను ఓఎస్‌డీ రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాన్సిట్ వారంట్‌పై కడపకు తీసుకొచ్చారు. వీరిలో ముగ్గురు చైనాకు చెందిన ఈ మింగ్ హుయి, జాంగ్ హుయిలీ, చన్ ఫెంగ్ తోపాటు హర్యానా రాష్ట్రానికి చెందిన అనూజ్ దహియా ఉన్నారని ఓఎస్‌డీ బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నిందితుల నుంచి 1.4 టన్నుల ఎర్ర చందనం, వోక్స్ వ్యాగన్ కారు, ఐదు ల్యాప్‌టాప్‌లు, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.