Rahul Dev Sharma
-
ఎస్పీపై ఎందుకు ఒత్తిడి తెచ్చావ్?
సాక్షి, అమరావతి: రక్షణ, అంతర్గత భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాల వ్యవహారంలో సస్పెండైన ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఆరోపణలతో సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాయడం, దాన్ని బహిర్గతం చేయడం క్రమశిక్షణ ఉల్లంఘనేనని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి జి.పాలరాజు స్పష్టం చేశారు. గతంలో కడప జిల్లా ఎస్పీగా పనిచేసిన రాహుల్‌దేవ్‌శర్మ, పోలీసు అధికారుల అసోసియేషన్ ప్రతినిధిగా ఉన్న గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డితో కలిసి పాలరాజు ఆదివారం మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ఆ రోజు ఇంటెలిజెన్స్ బాస్‌గా ఉన్న నువ్వు.. ఇప్పుడు నా పక్కనే కూర్చున్న నాటి కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మపై ఎందుకు ఒత్తిడి తెచ్చావు? వివేకా హత్య కేసులో విచారణను ప్రభావితం చేసేలా ఎందుకు వ్యవహరించావ్? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేశావ్? దర్యాప్తును న్యాయబద్ధంగా, ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మీకు నచ్చిన కోణంలో చేయాలని ఎందుకు ఒత్తిడి తెచ్చావ్? సాక్ష్యాధారాలుంటే అప్పుడే ఎందుకివ్వలేదు? రెండేళ్లుగా నోరు మెదపకుండా తిరుపతి ఉప ఎన్నికలకు ఒకరోజు ముందు రాజకీయ దురుద్దేశాలతో అసంబద్ధమైన ఆరోపణలకు దిగావ్’ అని పేర్కొన్నారు. ఏబీ ఆరోపణలు నిరాధారమని, ఆయన లేఖపై వాస్తవాలను వెల్లడించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ వివరాలివీ.. ఆ క్షణం నుంచి ఏబీ పర్యవేక్షణలోనే దర్యాప్తు మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మార్చి 14 అర్ధరాత్రి (15వతేదీ తెల్లవారు జామున) హత్యకు గురైనట్లు ఇంటెలిజెన్స్ బాస్ హోదాలో సమాచారం అందుకున్న క్షణం నుంచి ఏబీ వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తును స్వయంగా నడిపించారు. స్థానిక పోలీసులు, సీఐడీ, సిట్, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం అధికారులకు అప్పటి డీజీపీతో కలిసి అనుక్షణం ఆదేశాలిస్తూ దర్యాప్తు మొత్తం తన కనుసన్నల్లోనే పర్యవేక్షించారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన మార్చి 31 వరకు కొనసాగారు. అప్పటి వరకు అంటే 17 రోజులపాటు ప్రతి రోజు అప్పటి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అప్పటి సీఎం, డీజీపీలతో వివేకా కేసు దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు చర్చించారు. ఆ కేసు పురోగతిని సమీక్షించడంతో పాటు దర్యాప్తు ఎలా ముందుకు వెళ్లాలో అధికారులకు పూస గుచ్చినట్లు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి సీఎం సైతం ఏబీవీ అందించిన అంశాలనే రోజువారీ మీడియా సమావేశాల్లో కూలంకషంగా వివరించారు. మార్చి 31న ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీవీ బదిలీ అయినా అప్పటి ప్రభుత్వ పర్యవేక్షణలోనే మూడు నెలలపాటు సిట్ దర్యాప్తు కొనసాగింది. అంతటి కీలక పాత్ర పోషించిన ఏబీవీ ఇప్పుడు తాను ఇచ్చిన సమాచారాన్ని సిట్, సీఐడీ ఏ మేరకు ఉపయోగించుకుందో తెలియదని చెప్పడం హాస్యాస్పదం. ఇంకేదైనా కీలక సమాచారం ఉంటే అçప్పుడే సిట్‌కు ఎందుకు ఇవ్వలేదు? గత ప్రభుత్వ హయాంలో మూడు నెలలు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దాదాపు 9 నెలలు దర్యాప్తు చేసిన సిట్‌కు కీలక సమాచారం ఇవ్వకుండా ఏబీవీ ఏం చేసినట్లు? సీఎం కుటుంబాన్ని టార్గెట్ చేశారు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలను వెలికితీసే ప్రయత్నాలను పక్కనపెట్టిన ఏబీ వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఈ కేసులో వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను, బంధువులను అరెస్టు చేయాలని అప్పటి ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, ఇతర అధికారులపై ఒత్తిడి చేసిన విషయం నిజమా? కాదా? ఏబీవీ చెప్పాలి. నిబద్ధత కలిగిన అధికారి కాబట్టే ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తీవ్ర ఒత్తిళ్లకు తలొగ్గలేదు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు సీఐడీ, సిట్ అధికారులపై ఆరోపణలు చేస్తూ సీబీఐ డైరెక్టర్‌కి ఏబీవీ లేఖ రాయడం హాస్యాస్పదం, అసమంజసం. ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం శిక్షార్హమే సాధారణ పౌరులు సైతం ఏదైనా నేరానికి సంబంధించిన కీలక సమాచారం తమ వద్ద ఉంటే సంబంధిత దర్యాప్తు అధికారులకు అందించకపోవడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అలాంటిది ఒక ఐపీఎస్ అధికారిగా ఉంటూ కీలక కేసులో తన వద్ద ఉన్న సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు ఇంతవరకు అందించకపోవడం ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం శిక్షార్హమే. ఏబీవీ వద్ద నిజంగానే కీలక సమాచారం ఉంటే రాతపూర్వకంగా సీబీఐకి సీల్డ్ కవర్లో అందించకుండా ఎన్నికల సమయంలో బహిరంగంగా వెల్లడించడం ఏమిటి? తనపై వచ్చిన అభియోగాలపై కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ వద్ద విచారణ ఎదుర్కొన్న ఏబీవీ మీడియాలో, బాహాటంగా అధికారులపై ఆరోపణలు, విమర్శలు చేయడం ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది. -
జిల్లా ఎస్పీగా అభిషేక్ మహంతి
సాక్షి, కడప అర్బన్/ఎడ్యుకేషన్: జిల్లా ఎస్పీగా అభిషేక్ మహంతిని నియమిస్తూ బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 26వ తేదీ రాత్రి వైఎస్సార్సీపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఎస్పీ రాహుల్దేవ్శర్మను డీజీపీ కార్యాలయంలో సరెండర్ కావాలని ఎన్నికల కమిషను ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన అభిషేక్ మహంతిని తిరిగి మళ్లీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయన 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. గతేడాది 2018 నవంబర్ 2న వైఎస్సార్‌జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి 102 రోజులు పనిచేశారు. ఫిబ్రవరి 14వ తేదీన గ్రేహౌండ్స్గ్రూప్ కమాండర్‌గా బదిలీ అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తిరిగి జిల్లా ఎస్పీగా నియమితుల య్యారు. ఈయన నేడో, రేపో బాధ్యతలను చేపట్టనున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును విచారిస్తున్న సిట్ బృందంలో అభిషేక్ పనిచేస్తున్నారు. -
బిగ్ బ్రేకింగ్: ఈసీ సంచలన నిర్ణయం
ఢిల్లీ: ఏపీ ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వర రావును ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలను కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించింది. పోలీస్ హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరికి ఎటువంటి ఎన్నికల పనులు అప్పగించవద్దని ఈసీ ఆదేశించింది. వారి స్థానాల్లో తదుపరి సీనియర్ అధికారులకు బాధ్యతలను అప్పగించాలని తెలిపింది. పోలీస్ వ్యవస్థలో కీలక అధికారులుగా ఉన్న వీరు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా తెలుగుదేశం కార్యకర్తల్లా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా పనిచేస్తుండటంతో ఈసీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఏబీ వెంకటేశ్వర రావు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని, పలు దఫాలుగా వైఎస్సార్సీపీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం వెంకటేశ్వరరావుతో పాటు ఇద్దరు ఎస్పీలను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. -
వివేకానందరెడ్డి మృతి.. డోర్ లాక్ ఎవరు తీశారు?
సాక్షి, పులివెందుల : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అకాల మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. పులివెందుల్లోని వైఎస్ వివేకానంద రెడ్డి నివాసంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు. అసలేం జరిగింది? బెడ్ రూమ్‌లో ఏసీ ఉన్నప్పటికీ డోర్ ఎందుకు ఓపెన్ చేసి ఉంది? సైడ్ డోర్ లాక్ ఎవరు తీశారు? అనే కోణాల్లో విచారణ జరపుతూ వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఈ ఫిర్యాదుపై పులివెందుల సీఐ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై సెక్షన్ 171 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాత్రూమ్లో పడి ఉన్నారని, తలపై గాయాలున్నాయని, ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. చాలా సీరియస్‌గా తీసుకున్నాం : ఎస్పీ వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై లోతుగా దర్యప్తు చేస్తున్నామని కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, ఫోరెన్సిక్ నిపుణులను ప్రత్యేకంగా రప్పిస్తున్నామన్నారు. ఇప్పటికే ఘటనా స్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించాయని తెలిపారు. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నామని, విచారణలో ఎవరి పాత్ర అయినా ఉన్నట్లు తేలితే చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
'మావోయిస్టుల ఆరోగ్యం నిలకడగా ఉంది'
విశాఖపట్నం : పెదపాడు కాల్పుల ఘటనలో గాయపడిన ఇద్దరు మావోయిస్టుల ఆరోగ్యం నిలకడగా ఉందని విశాఖపట్నం జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో రాహుల్‌దేవ్ శర్మ మాట్లాడుతూ... గాయపడిన ఇద్దరూ మావోయిస్టులు కాదనడంలో వాస్తవం లేదన్నారు. అయితే నర్సింగ్పై రివార్డు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మువ్వల అంబరి మిలీషియా సభ్యుడే అని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరికి పోలీసులు రక్తదానం అందించడం మానవతా ధృక్పథం అని రాహుల్ దేవ్ శర్మ చెప్పారు. -
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
ఈ నెల 25న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో పట్టుబడిన నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను ఓఎస్డీ రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాన్సిట్ వారంట్‌పై కడపకు తీసుకొచ్చారు. వీరిలో ముగ్గురు చైనాకు చెందిన ఈ మింగ్ హుయి, జాంగ్ హుయిలీ, చన్ ఫెంగ్ తోపాటు హర్యానా రాష్ట్రానికి చెందిన అనూజ్ దహియా ఉన్నారని ఓఎస్డీ బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నిందితుల నుంచి 1.4 టన్నుల ఎర్ర చందనం, వోక్స్ వ్యాగన్ కారు, ఐదు ల్యాప్‌టాప్‌లు, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.