'మావోయిస్టుల ఆరోగ్యం నిలకడగా ఉంది' | maoists health stable, says rahul dev sharma | Sakshi

'మావోయిస్టుల ఆరోగ్యం నిలకడగా ఉంది'

Oct 9 2016 12:25 PM | Updated on Oct 9 2018 2:51 PM

పెదపాడు కాల్పుల ఘటనలో గాయపడిన ఇద్దరు మావోయిస్టుల ఆరోగ్యం నిలకడగా ఉందని విశాఖపట్నం జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు.

విశాఖపట్నం : పెదపాడు కాల్పుల ఘటనలో గాయపడిన ఇద్దరు మావోయిస్టుల ఆరోగ్యం నిలకడగా ఉందని విశాఖపట్నం జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో రాహుల్దేవ్ శర్మ మాట్లాడుతూ... గాయపడిన ఇద్దరూ మావోయిస్టులు కాదనడంలో వాస్తవం లేదన్నారు. అయితే నర్సింగ్పై రివార్డు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మువ్వల అంబరి మిలీషియా సభ్యుడే అని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరికి పోలీసులు రక్తదానం అందించడం మానవతా ధృక్పథం అని రాహుల్ దేవ్ శర్మ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement