
అభిషేక్ మహంతి
సాక్షి, కడప అర్బన్/ఎడ్యుకేషన్: జిల్లా ఎస్పీగా అభిషేక్ మహంతిని నియమిస్తూ బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 26వ తేదీ రాత్రి వైఎస్సార్‌సీపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మను డీజీపీ కార్యాలయంలో సరెండర్ కావాలని ఎన్నికల కమిషను ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన అభిషేక్ మహంతిని తిరిగి మళ్లీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయన 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.
గతేడాది 2018 నవంబర్ 2న వైఎస్సార్‌జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి 102 రోజులు పనిచేశారు. ఫిబ్రవరి 14వ తేదీన గ్రేహౌండ్స్‌గ్రూప్ కమాండర్‌గా బదిలీ అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తిరిగి జిల్లా ఎస్పీగా నియమితుల య్యారు. ఈయన నేడో, రేపో బాధ్యతలను చేపట్టనున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును విచారిస్తున్న సిట్ బృందంలో అభిషేక్ పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment