చెన్నై : చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్రచందనం తమిళనాడుకు చెందిన కూలీలను ఎన్కౌంటర్ చేయడంపై తమిళ పార్టీలు భగ్గుమన్నాయి. తమిళనాడులో ఉన్న ఆంధ్రా హోటళ్లు, బ్యాంకులు, ఆస్తులపై దాడులు చేస్తామని నామ్ తమిళర్ కచ్చి హెచ్చరించింది. దీంతో చెన్నైలో ఉన్న ఆంధ్రా ప్రాంతం వారి ఆస్తులు, సంస్థలకు తమిళనాడు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చెన్నైలోని ఆంధ్రా క్లబ్ను మూసివేశారు.
కూలీల మృతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎండీఎంకే నేత వైగో డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని తమిళనాడు కాంగ్రెస్ నేత ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమైన విషయం తెలిసిందే. వీరంతా తమిళనాడుకు చెందిన కూలీలు.
'ఆంధ్రా ఆస్తులు, బ్యాంకులపై దాడి చేస్తాం'
Published Tue, Apr 7 2015 2:56 PM | Last Updated on Sat, Jun 2 2018 2:11 PM
Advertisement