Red sandalwood logs
-
9 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా): ఒంటిమిట్ట మండలం నర్వకాటపల్లి గ్రామ సమీపంలోని యల్లాపుల్లల బావికొండ వద్ద తొమ్మిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. వారి నుంచి 49 ఎర్రచందనం దుంగలను (టన్ను బరువు), రెండు కార్లు, రెండు మోటార్‌సైకిళ్లు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అరెస్టు అయినవారిలో మహమ్మద్ బాషా (నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఏఎస్‌పేట), మేడితరాజు మల్లేశ్వరరాజు(అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం, మాధవరంపోడు), గెనే నాగభూషణం(తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, అరిగిలవారిపల్లి), ఎలప్పు బాలచంద్రయ్య(నెల్లూరు జిల్లా చింతరెడ్డిపాలెం), గుండం మునికుమార్, నాగూర్ మునివేలు, పరుకూరు లోకేష్ (తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలం, బంగారమ్మ కండ్రిగ), వీసం రాజారెడ్డి(అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం, ఎస్.ఉప్పరపల్లె), ఆవులూరి సుబ్రహ్మణ్యం(రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట) ఉన్నారని వివరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ తుషార్ డూడి పాల్గొన్నారు. -
పుష్ప సినిమా సీన్.. రియల్‌గా ఎక్కడంటే?
ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో ఓ సీన్ ఇది. ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు ఓ ప్రదేశంలో దాచి ఉంచుతారు. ఆ ప్రదేశం గురించి పోలీసులు తెలుసుకుంటారు. వారు అక్కడికి వెళ్తున్న సమాచారం స్మగ్లర్లకు చేరడంతో ఆ సినిమా హీరో, మరికొందరు వెంటనే దుంగలను పక్కనే ఉన్న నీటి ప్రవాహంలోకి నెట్టేస్తారు. హీరో తన అనుచరుడి ద్వారా జలాశయ అధికారికి ముడుపులిచ్చి గేట్లు మూయించేస్తాడు. ఈ సీన్ మొత్తం రక్తి కట్టిస్తుంది. ఇలాంటి సీన్ జిల్లాలోని సోమశిల జలాశయంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు విలువైన దుంగలను నరికించి ఎవరికీ అనుమానం రాకుండా జలాశయంలో దాచేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. సాక్షి, నెల్లూరు: జిల్లా జలనిధిగా ఉన్న సోమశిల జలాశయం లోతట్టు ప్రాంతం ఎక్కవ భాగం వైఎస్సార్ జిల్లాలో ఉంది. రెండు జిల్లాల సరిహద్దుగా ఉన్న ఆ ప్రాంతంలో రిజర్వు ఫారెస్ట్ సుమారు 48 చదరపు కి.మీ విస్తరించి ఉంది. ఆ ఫారెస్ట్‌లో ఎర్రచందనం వృక్షాలున్నాయి. నాణ్యత కలిగిన దుంగలు ఇక్కడ లభిస్తుండడంతో అక్రమార్కులు ఆ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నారు. దీనికితోడు జలాశయ లోతట్టు ప్రాంతం కావడంతో రవాణా మార్గానికి అనువుగా ఉండదు. దీంతో అటవీ, పోలీస్ శాఖల అధికారులు ఆ వైపు వెళ్లేందుకు ఇష్టపడరు. దీంతో స్మగ్లర్లు రెచ్చిపోతుంటారు. తమ పరిధి కాదంటూ.. గతంలో సోమశిల జలాశయంలో ఓ ఇంజినీర్ లోతట్టు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారి గేటు తాళం తనవద్దే ఉంచుకుని అక్రమ చేపల వేటకు, ఎర్ర స్మగ్లర్లకు రాత్రి వేళల్లో సహకరించి అధికారులకు దొరికిన సందర్భం ఉంది. కానీ ఆ అధికారి రాజకీయ పరపతితో కేసు లేకుండా తప్పించుకోగలిగాడు. మూడు రోజుల క్రితం 11 దుంగలు జలాశయంలో బయటపడ్డాయి. వాస్తవానికి దీని గురించి ముందే తెలిసినా అటవీశాఖ, పోలీస్ అధికారులు ఎవరికి వారు తమ పరిధిలో కాదంటూ పట్టించుకోలేదు. తాజాగా దుంగల ఫొటోలతో సహా సోషల్ మీడియాలో రావడంతో హడావుడిగా స్వాధీనం చేసుకున్నట్లుగా అటవీ శాఖ ప్రకటించింది. ఇలా చేస్తున్నారు.. జలాశయం లోతట్టు ప్రాంతంలో ఇరువైపులా చేపలు పట్టే జాలర్లు ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఉంటూ చేపలు పట్టి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. స్థానికంగా ఎర్ర స్మగ్లర్లకు సహకరించే వ్యక్తుల ద్వారా కొందరు జాలర్లతో పరిచయం పెంచుకుని వారి ద్వారా పడవలో లోతట్టు ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అలాగే తమిళ కూలీలను కూడా ఇదే పద్ధతిలో చేర్చి ఎర్ర వృక్షాలను నరికిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దుంగలను జలాశయం లోతట్టు కోనల్లోని నీటిలో నిల్వ ఉంచుతారని చెబుతున్నారు. ఒకవేళ అధికారులు దాడులు చేసినా కనిపించని విధంగా నీటిలో డంపింగ్ చేస్తారు. వారికి అనువైన సమయంలో ఆ డంప్‌ను రవాణా చేసుకుంటారు. ఇలా విలువైన సంపద తరలిపోతున్నా అధికారుల్లో చలనం లేదనే విమర్శలున్నాయి. పక్కా సమాచారం ఉన్నా.. స్థానికంగా ఉన్న ఎర్ర అక్రమార్కుల సహకారంతోనే దుంగలు తరలుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఎవరు దొంగలో కూడా స్థానిక అటవీ, పోలీస్ శాఖకు పక్కా సమాచారం ఉంది. అయితే అక్రమార్కులతో ఉన్న లోపాయికారి ఒప్పందంతో వారు పట్టుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఏదైనా ఒత్తిడి వచ్చినా, సమాచారం బహిరంగమైతే అప్పటికప్పుడు అధికారులు నాణ్యత లేని దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ప్రచారం ఉంది. మూడు రోజుల క్రితం జరిగిన దుంగల విషయంలో కూడా అధికారులు పట్టించుకోకపోగా సమాచారం ఇచ్చిన మీడియాపై రుసరుసలాడడం వారి లోపాయికారి ఒప్పందానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మీరు చెబితే సస్పెండ్ చేయాలా? సోమశిల జలాశయంలో ఎర్రచందనం దుంగల డంప్‌పై మీడియా సమాచారం ఇస్తే వెంటనే మేము స్థానిక అధికారులను సస్పెండ్ చేయాలా?. మూడు రోజల క్రితం జరిగింది అని చెబుతున్నారు. అవన్ని మేము పరిశీలిస్తాం. విచారణ జరిపిస్తాం. – షణ్ముగకుమార్, డీఎఫ్ఓ, నెల్లూరు -
నిజమే.. ముగ్గురు కాదు ..ఒక్కడే!
ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధులను చూస్తే ఏమనిపిస్తోంది? చూడటానికి ఒకేలా ఉన్నా డ్రెస్‌లే వేర్వేరుగా ఉన్నాయనుకుంటున్నారు కదూ! అవును నిజమే..ముగ్గురు కాదు..ఒక్కడే..కాకపోతే త్రిబుల్ యాక్షన్..అవసరం బట్టి ఆర్టీసీ బస్టాండు, తిరుమల, శేషాచలం అడవుల్లో వీళ్లు వేస్తున్న ‘ఎర్ర’గెటప్‌లివి. ఈ తమిళ తంబీల సెటప్ చూసి టాస్క్‌ఫోర్స్ విస్తుపోయింది. ఈ గెటప్‌ల కథేమిటంటే.. సాక్షి, చంద్రగిరి: ఎర్రచందనం దుంగల కోసం శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న ఎర్రకూలీలు, స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ అధికారులు అడ్డుకున్న ఘటన శ్రీవారిమెట్టు వద్ద చోటు చేసుకుంది. టాస్క్‌ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఆదేశాలతో ఆర్ఎస్ఐ వాసు, డీఆర్ఓ నరసింహారావు బృందాలు మంగళవారం అర్ధరాత్రి శ్రీవారిమెట్టు వద్ద కూంబింగ్ చేశాయి. సుమారు 15 మంది స్మగ్లర్లు, కూలీలు అడవిలోకి ప్రవేశిస్తుండటం చూసి వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో వారు పారిపోయారు. వెంటాడి ఒకరిని అదుపులో కి తీసుకున్నారు. చదవండి: భూమి ఇస్తేనే.. తలకొరివి పెడతా..! ప్రాధమిక విచారణలో అతడు తిరువణ్ణామలై జిల్లా జమునామత్తూరు, వెళ్లి చెరువుకు చెందిన వెంకటేశన్ అని తేలింది. ఎర్రచందనం దుంగల కోసం వచ్చినట్లు అతడు వెల్లడించాడు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాగును తనిఖీ చేయగా 3 జతల దుస్తులు లభించాయి. బస్సులో రావడానికి తెల్లటి దుస్తులు, తిరుమలలో తిరిగేందుకు కాషాయం దుస్తులు, అడవిలో వెళ్లేందుకు మరొక దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం స్మగ్లర్ వేషధారణకు సంబంధించిన ఫొటోలను టాస్క్‌ఫోర్స్ అధికారులు విడుదల చేశారు. నిందితుడిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. చదవండి: రేపటి వరకు టీచర్ల బదిలీల వెబ్ ఆప్షన్ -
18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వైఎస్సార్ కడప: జిల్లాలోని జమ్మలమడుగు శివారులో మంగళవారం వేకువజామున సుమోలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో కాపు కాసిన పోలీసులు.. రోడ్డు మార్గంలో వెళ్తున్న సుమోను ఆపి తనిఖీ చేయగా 18 ఎర్రచందనం దుంగలు దొరికాయి. పోలీసులను చూసి సుమోను ఆపి డ్రైవర్ పరారైనట్లు తెలిసింది. కాగా ఎర్రచందనం దుంగలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వే కోడూరు (వైఎస్సార్ జిల్లా): అక్రమంగా తరలించేందుకు మామిడి తోటలో దాచి ఉంచిన 51 ఎర్రచందనం దుంగలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం జ్యోతికాలనీకి ఎదురుగా ఉన్న మామిడి తోటలో ఎర్రచందనం దుంగలు దాచి ఉంచారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రూ. 25 లక్షల విలువైన ఎర్రదుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
ఆరుగురు తమిళ కూలీలు అరెస్ట్
కడప : వైఎస్ఆర్ జిల్లా గువ్వల చెరువు అటవీప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ఆదివారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగరు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు.50 ఎర్రచందనం దుంగలతోపాటు రెండు ప్రైవేట్ బస్సులు, లారీ సీజ్ చేశారు. తమిళకూలీలను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఘటన స్థలాన్ని టాస్క్‌ఫోర్స్ డీఐజీ ఎం.కాంతారావు పరిశీలించారు. -
ముగ్గురు 'ఎర్ర' కూలీల అరెస్ట్
రైల్వే కోడూరు అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం తంగి మడుగు వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానిక అటవీ ప్రాంతం నుంచి దుంగలను తరలిస్తున్న ముగ్గురు తమిళ కూలీలను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి 10 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ. 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. -
15 మంది తమిళ కూలీల అరెస్ట్
-
15 మంది తమిళ కూలీల అరెస్ట్
సుండుపల్లి (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా సుండుపల్లి సమీపంలోని కృష్ణారెడ్డి చెరువు వద్ద శనివారం 20 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 15 మంది తమిళ కూలీలను సుండుపల్లి ఎస్ఐ మధుసూదనరెడ్డి అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ సిబ్బందితో దాడి చేసి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 15మందిని అరెస్ట్ చేసారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ.11.20 లక్షలు ఉంటుందని ఎస్ఐ చెప్పారు. తమిళనాడులోని వేలూరుకు చెందిన తలారి విజయకుమార్ తమ నాయకుడని, ఆయన ఆదేశం మేరకే ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నామని కూలీలు చెప్పినట్లు ఎస్ఐ మీడియాకు వివరించారు. కూలీలను ప్రత్యేక బస్సులో రాయచోటి కోర్టుకు తరలించారు. -
రూ.66 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి (చిత్తూరు) : అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న 8 మంది స్మగ్లర్లను తిరుపతిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 75 ఎర్రచందనం దుంగలతో పాటు, 3 కార్లు, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ. 66 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. -
రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
చిట్వేలు (వైఎస్సార్ జిల్లా) : చిట్వేలి మండలం చెర్లోపల్లి వద్ద శనివారం రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు బైకులు, రెండు లారీలను సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ఎర్రచందనం దొంగలను అరెస్ట్ చేశారు. -
25ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఖాజీపేట (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా ఖాజీపేట బైపాస్ రోడ్డులో శనివారం సాయంత్రం ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న లారీని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఐదుగురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రం ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఫారెస్ట్ రేంజ్ అధికారిణి ప్రియాంక రెడ్డి బైపాస్ రోడ్డులో కాపు కాశారు. లారీలో తరలిస్తున్న 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగలను బెంగుళూరుకు తరలిస్తున్నట్లు ఆమె చెప్పారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు (కార్వేటినగర్) : చిత్తూరు జిల్లా కార్వేటినగర్ మండలం కొల్లగుంట్ల చెక్‌పోస్టు వద్ద శనివారం రూ.53లక్షల విలువైన 13 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాటాసఫారీ వాహనంలో అక్రమంగా తమిళనాడుకు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎర్రచందనం దొంగలు పరారయ్యారు. -
రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చంద్రగిరి (చిత్తూరు) : శేషాచలం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. కోటి విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే .. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని అటవీ ప్రాంతంలోని పగడగుండాల కోన వద్ద గురువారం సాయంత్రం 35 ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. విషయం తెలిసిన 11వ బెటాలియన్ పోలీసులు, అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లారు. వారిని చూసి దాదాపు 40 మంది కూలీలు దుంగలను వదిలి పరారయ్యారు. ఈ దాడిలో పట్టుబడిన తమిళనాడుకు చెందిన రామచంద్రన్, చిన్న రాజా అనే కూలీలను అదుపులోకి తీసుకుని, చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
పోరుమామిళ్ల : వైఎస్సార్ జిల్లా కాశినాయిని మండలం ఇటుకలపాడులో ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆదివారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ లారీలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్టు వెలుగు చూసింది. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు రూ. 30 లక్షల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీని కూడా సీజ్ చేశారు.