
రూ.66 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి (చిత్తూరు) : అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న 8 మంది స్మగ్లర్లను తిరుపతిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 75 ఎర్రచందనం దుంగలతో పాటు, 3 కార్లు, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ. 66 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.