ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రైల్వే కోడూరు అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం తంగి మడుగు వద్ద సోమవారం చోటుచేసుకుంది.
స్థానిక అటవీ ప్రాంతం నుంచి దుంగలను తరలిస్తున్న ముగ్గురు తమిళ కూలీలను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి 10 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ. 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.