railway kodur
-
పోసానిపై సీఐ స్టేట్మెంట్ ఇవ్వడమేంటి?.. ప్రకటనపై అనుమానాలు!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళిపై పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న పోసానిపై నాటకాలాడుతున్నారంటూ రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు చేసిన ప్రకటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్లు ప్రకటన విడుదల చేయకుండా ముందుగానే సీఐ మాట్లాడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పోసాని భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోసాని ఆరోగ్యంపై పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం మానవత్వం లేకుండా పోలీసులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు.గత రాత్రి నుంచి ఛాతి నొప్పితో బాధపడుతున్న పోసాని.. కొంతకాలంగా కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఎడమ భుజం నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. తీవ్రమైన గొంతునొప్పితో కూడా బాధపడుతున్న పోసాని.. మాట్లాడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు. పోసాని తీవ్రమైన గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్నారు. అబ్డామిన్ హెర్నియా సర్జరీలో ఇన్ఫెక్షన్ వల్ల పోసానికి తీవ్రమైన సమస్య ఉంది.హెర్నియా సర్జరీ తర్వాత నెలరోజులు ఆస్పత్రిలోనే పోసాని చికిత్స తీసుకున్నారు తీవ్రమైన వెన్నునొప్పితో మూడుసార్లు వోకల్ కార్డు సర్జరీ జరిగింది. కొద్ది రోజుల క్రితం పోసానికి గుండెకు సంబంధించిన చికిత్స జరగగా, హార్ట్ సర్జరీ చేసిన స్టంట్ వేశారు వైద్యులు. హార్ట్ సర్జరీ తర్వాత ఛాతిలో నొప్పితో పోసాని బాధపడుతున్నారు. -
పోసానిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు
-
రైల్వేకోడూరులో సాధికార హోరు
సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో బడుగు, బలహీన వర్గాల సాధికారత హోరెత్తింది. బుధవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు నీరాజనాలు పలికారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమను అభివృద్ధి దిశగా నడిపిస్తున్న తీరును వివరిస్తూ ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు. వారికి ప్రతి వీధిలో స్థానిక ప్రజలు హారతులతో స్వాగతం పలికారు. రాజ్ రెసిడెన్సీ నుంచి టోల్గేట్ వరకు కిక్కిరిసిన జనం మధ్య సాగిన ఈ యాత్రలో మహిళలు కదం తొక్కారు. ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా యాత్రలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభ వేలాది ప్రజలతో జనసంద్రాన్ని తలపించింది. ఈ సభలో పలువురు నేతలు ప్రసంగిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న పథకాలు, ఈ వర్గాలు సమాజంలో తలెత్తుకొనేలా వారికి అందిస్తున్న చేయూతను వివరించారు. సభ ఆద్యంతం ప్రజలు జై జగన్, జగనే మళ్లీ కావాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. పేదవాడి అకౌంటులో సంక్షేమం : ఎంపీ నందిగం సురేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందిస్తున్న సంక్షేమం ఎప్పటికీ మరు వలేనిదని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. అవినీతి లేని పరిపాలనను అందిస్తున్న సీఎం జగన్ ప్రతి పేదవాడికి అకౌంటులో ఠంచనుగా పథకాల నగదు జమ చేస్తున్నారన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలేనని, చివరకు కుర్చీ, సైకిల్ పార్టీ గుర్తు కూడా ఆయనవి కావని అన్నారు. 14 ఏళ్ల బాబు హయాంలో వచ్చింది వెన్నుపోటు పథకం మాత్రమేనని, ప్రజల సంక్షేమానికి సంబంధించిన పథకాలేవీ లేవని తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ప్రజలకు సంక్షేమం అందుతోందని చెప్పారు. సీఎం జగన్ అందిస్తున్న పథకాలు, చేయూతతో బడుగు, బలహీన వర్గాల జీవన విధానం ఎంతో మెరుగు పడిందని, ఇప్పుడు వారు సమాజంలో తలెత్తుకొని ధీమాతో జీవిస్తున్నారని వివరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పూర్తి స్థాయిలో రాజకీయ హక్కులతోపాటు ఉన్నత పదవులు ఇచ్చారని అన్నారు. టీడీపీ నాయకులు డబ్బుతో ఓటు కొనాలని చూస్తున్నారని, బాబును నమ్ముకుని ఓటు వేస్తే ఒక్క దినం గడవదని తెలిపారు. ప్రతి ఇంటికీ సంక్షేమం అందించిన సీఎం జగన్‌కు ఓటు వేస్తే ఒక తరం గడుస్తుందన్నారు. 175 సీట్లు గెలిపిద్దాం : అలీ సీఎం వైఎస్ జగన్ సామాజిక సాధికారతను చేతల్లో చేసి చూపించారని ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ చెప్పారు. 2019లో సీఎం జగన్‌కు 151 సీట్లిచ్చామని, ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో 175 సీట్లను సీఎం జగన్‌కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. బడుగులకు న్యాయం : ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయాన్ని చేతల్లో చేసి చూపించారని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ఈ వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, ఆయన ఒరగబెట్టిందేమీ లేదని చెప్పారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బీసీలకు ఎమ్మెల్యేలు, మంత్రి పదవులిచ్చారని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా అధికారాన్ని అప్పజెప్పారని తెలిపారు. రైల్వే కోడూరును అభివృద్ధి చేస్తున్న సీఎం జగన్ : ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైల్వేకోడూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.1,600 కోట్లు వెచ్చించామన్నారు. రూ. 11 కోట్లతో రైల్వేకోడూరు అండర్ బ్రిడ్జి, 50 కోట్లతో కోడూరు – చిట్వేలి డబుల్‌రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. పెనగ లూరు చిట్వేలి మండలాలకు 235 కోట్లతో సాగు, తాగు నీరందిస్తున్నామని, రూ.150 కోట్లతో ఎన్నో భవనాలు, సీసీరోడ్లు, వాటర్ ట్యాంకులు, రూ. 50 కోట్లతో గుంజన నది ప్రొటెక్షన్‌వాల్ నిర్మించడానికి కృషిచేశామన్నారు. రాబోయే కాలంలో 10 వేల ఉద్యోగాలతో జాబ్‌మేళా నిర్వహించి నిరుద్యోగుల, యువకుల రుణం తీర్చుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్లు రామసుబ్బారెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కారు ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి
సాక్షి, రైల్వేకోడూరు : ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక వస్తున్న కారు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. రైల్వేకోడూరు మండలం మైసూరివారిపల్లె పంచాయతీ మ్యాంగో యార్డు సమీపంలో కడప– తిరుపతి జాతీయ రహదారిపై గురువారం ఉదయం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో మైసూరివారిపల్లెకు చెందిన కావేటి శివయ్య (45), లక్కాకుల మురళి (43) మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మైసూరివారిపల్లెకు చెందిన కావేటి శివయ్య మ్యాంగో యార్డు వద్ద టీ కొట్టు నిర్వహిస్తూ ఆయా సీజన్లలో మామిడి, బొప్పాయి వ్యా పారాలు చేసేవాడు. అతని గ్రామానికి చెందిన బంధువు లక్కాకుల మురళితో కలిసి గురువారం ఉదయం మ్యాంగో యార్డుకు వచ్చేందుకు ద్విచక్రవాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో కడప – తిరుపతి జాతీయ రహదారిపై వెనుక వస్తున్న రైల్వేకోడూరుకు చెందిన ఓ కారు వేగంగా వచ్చి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ద్విచక్రవాహనం దెబ్బతినగా శివయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఎడమ కాలు విరిగి తీవ్ర రక్తస్రావమైన మురళిని తిరుపతికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో కుక్కలదొడ్డి వద్ద మృతి చెందాడు. ప్రమాదానికి గురైన కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. మృతుడు శివయ్యకు భార్య జ్యోతి కుమారి, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు తండ్రికి చేదోడువాదోడుగా టీ కొట్టులో ఉంటున్నాడు. మురళికి భార్య శారద ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతులిద్దరు బంధువులు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా కారును స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రాజంపేటకు తరలించారు. -
11 మంది ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్ట్
సాక్షి, రైల్వేకోడూరు : రైల్వేకోడూరులోని శేషాచలం సమీపాన ఉన్న ప్రదేశాల్లో మూడు వేర్వేరు ప్రాంతాలలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న 11 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 22 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. మైసూరువారిపల్లె గ్రామ పంచాయతీలోని హెలీప్యాడ్ సమీప ప్రాంతం, ఓబులవారిపల్లె మండలం బాలిశెట్టిపల్లె సమీపంలోని గుంజనేరు వద్ద, చిట్వేలి మండలం గొట్టిమానుకోన అటవీ ప్రాంతంలో కొందరు ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించేందుకు వాహనాలలో లోడ్ చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వేకోడూరుకు చెందిన కుంభకోణం శ్రీరాములు ఆచారి, చమర్తి సుబ్బరాజు, కుంభా వెంకటరమణ, షేక్ జాబీర్, తమిళనాడుకు చెందిన వెంకటేష్, కొండూరు రాజశేఖర్‌రాజు, పంటా సురేష్, కమినబోయిన రామకృష్ణ, వినోద్‌కుమార్, బయనబోయిన గుర్రయ్య, బోయ వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 ఎర్రచందనం దుంగలు, ఒక టెంపో వాహనం, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ దుంగల విలువ రూ.లక్ష 12 వేలు 800 ఉంటుంది. పారిపోయిన స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ కె.సాయినాథ్, ఎస్సైలు పి.వెంకటేశ్వర్లు, ఎమ్.భక్తవత్స లం, హెచ్.డాక్టర్ నాయక్, పి.సత్యనారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రయాణికుల వాహనాన్ని ఢీకొన్న స్కార్పియో : ఒకరు మృతి
ఎస్ ఉప్పరపల్లె (రైల్వేకోడూరు రూరల్): ప్రయాణికులతో వెళుతున్న వాహనాన్ని స్కార్పియో వాహనం ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా 11 మంది గాయపడిన సంఘటన మండలంలోని ఎస్ ఉప్పరపల్లె వద్ద కడప– తిరుపతి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్ఐ భక్తవత్సలం కథనం మేరకు ఓ పేపరు వాహనం( సాక్షి కాదు) టాటా ఏస్ ఏపీ 04 టీవీ 1118 నెంబరు వాహనంలో 9 మంది ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎస్. ఉప్పరపల్లె వద్ద సోమవారం ఉదయం 7:10 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న టీఎన్ 28 ఏబీ 8484 నెంబరు గల స్కార్పియో ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించబోయి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొంది. పేపరు వాహనాన్ని నడుపుతున్న కడప ఐటీఐ సర్కిల్‌కు చెందిన మల్లేశ్వర్ రెడ్డి(38) తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం తిరుపతిలోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అందులో ప్రయాణిస్తున్న కోడూరు ధర్మాపురానికి చెందిన నాగరత్నమ్మ, చిట్వేలి మండలం నాగవరానికి చెందిన తల్లీకొడుకులైన బొమ్మవరం శంకరమ్మ, మధులకు, మైసూరివారిపల్లెకు చెందిన సాధు మునిలక్ష్మి, నీలం భారతి, జయలక్ష్మి, ఆదిత్య, రమ్యలకు గాయాలయ్యాయి. వీరంతా తిరుపతిలో రుయా, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్కార్పియోలో ఉన్న డ్రైవర్, మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వీరు తమిళనాడులోని ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎమ్మెల్యే కొరముట్ల పరామర్శ ప్రమాదంలో గాయపడి తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పరామర్శించారు. వైద్యులను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. -
చెంగలరాయుడుకు చేదు అనుభవం
విజయవాడ: కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగలరాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆయన భావించగా.. రైల్వేకోడూరు టీడీపీ నేతలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో చెంగలరాయుడు టీడీపీలో చేరడం తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. చెంగలరాయుడు టీడీపీలో చేరడం వలన పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని, ఆయన రూ. 70 కోట్ల కాంట్రాక్టు పనుల కోసమే పార్టీలోకి వస్తానంటున్నారని రైల్వేకోడూరు టీడీపీ ఇంఛార్జ్ విశ్వనాథ్ అన్నారు. చెంగలరాయుడుకు జిల్లాలోకానీ, నియోజకవర్గంలోకానీ ఎలాంటి బలం లేదని ఆయన విమర్శించారు. -
గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి
శెట్టిగుంట(రైల్వేకోడూరు రూరల్): గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటనలో రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఎస్.మస్తాన్ వలీ(35) రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేటలో వివాహం చేసుకున్నాడు. గురువారం కొత్త ద్విచక్ర వాహనంలో పుల్లంపేటకు వచ్చి తిరిగి శ్రీ కాళహస్తికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతినికి భార్య అమీనా బేగం ఉన్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
సూరపురాజుపల్లె(రైల్వేకోడూరు రూరల్): సూరపురాజుపల్లె సమీపంలోని ఏటి పక్కనున్న ఓ మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్సై రమేష్‌బాబు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు 40 ఏళ్లు ఉండవచ్చు. మృతదేహం పూర్తిగా కుళ్లి పోయి గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉంది. ఒంటిపై ఆకుపచ్చ టీ షర్టు ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రైల్వేకోడూరులో ఇటీవల ఎవరూ అదృశ్యం కాలేదు. అన్ని రకాల కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
రైల్వే కోడూరులో ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలం మాధవరం వద్ద జరిగింది. ఓ వాహనంలో సుమారు 20 లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనాన్ని పోలీసులు తనిఖీల సందర్భంగా పట్టుకున్నారు. ఎర్రచందనం స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. స్మగ్లర్లు పరారీ అయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ముగ్గురు 'ఎర్ర' కూలీల అరెస్ట్
రైల్వే కోడూరు అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం తంగి మడుగు వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానిక అటవీ ప్రాంతం నుంచి దుంగలను తరలిస్తున్న ముగ్గురు తమిళ కూలీలను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి 10 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ. 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. -
మన రాష్రంలో ఎన్నిఇళ్లు ఉన్నయో బాబుకు తెలుసా:జగన్
-
స్మగ్లర్ల కోసం ముమ్మరంగా కూంబింగ్
రెల్వేకోడూరురూరల్, న్యూస్‌లైన్: ఎర్రచందనం స్మగ్లర్లకోసం అడవులలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు రాజంపేట సబ్ డీఎఫ్ఓ శ్రీనివాసరావు తెలిపారు. రైల్వేకోడూరుకు కొత్తగా వచ్చిన 12 మంది ఆర్ముడు పోలీసులకు రైల్వేకోడూరులోని ఫారెస్టు అతిథిగృహంలో సోమవారం ఆయన పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇటీవల స్మగ్లర్లు ఫారెస్టు అధికారులను కిరాతకంగా చంపారని, వారిని పట్టుకనేందుకు అడవుల్లో జల్లెడ పడుతున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే కొన్ని బలగాలు ఉన్నాయని, సోమవారం కొత్తగా మరో 12 మంది వచ్చారని తెలిపారు. కోడి వెంగమ్మబావి, మెట్లకోన, గంగిశెట్టిబండలు, గుండంపెంట, పాయలబావి, శిలలకోన, బంగ్లాపోడు తదితర ప్రాంతాలలో గస్తీ ముమ్మరంగా సాగుతోందన్నారు. ఎఫ్ఆర్ఓ శ్రీరాములు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అమరణ దీక్షలు