అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలం మాధవరం వద్ద జరిగింది.
రైల్వేకోడూరు: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలం మాధవరం వద్ద జరిగింది. ఓ వాహనంలో సుమారు 20 లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనాన్ని పోలీసులు తనిఖీల సందర్భంగా పట్టుకున్నారు. ఎర్రచందనం స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. స్మగ్లర్లు పరారీ అయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.