
చెంగలరాయుడుకు చేదు అనుభవం
విజయవాడ: కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగలరాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆయన భావించగా.. రైల్వేకోడూరు టీడీపీ నేతలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో చెంగలరాయుడు టీడీపీలో చేరడం తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.
చెంగలరాయుడు టీడీపీలో చేరడం వలన పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని, ఆయన రూ. 70 కోట్ల కాంట్రాక్టు పనుల కోసమే పార్టీలోకి వస్తానంటున్నారని రైల్వేకోడూరు టీడీపీ ఇంఛార్జ్ విశ్వనాథ్ అన్నారు. చెంగలరాయుడుకు జిల్లాలోకానీ, నియోజకవర్గంలోకానీ ఎలాంటి బలం లేదని ఆయన విమర్శించారు.