vishwanath
-
వివాహానికి హాజరైన మాజీ సీఎం YS జగన్
-
తెలుగుతెరపై మరో కళాఖండం
ఎక్కువ భాగం రాజస్థాన్‌లోనే... ఇక షూటింగ్ విషయానికొస్తే... ఈ సినిమాలో చాలాభాగం రాజస్థాన్ లోని జైపూర్‌లో చిత్రీకరించారు. ఇక్కడ షూటింగ్ పర్మిషన్ కోసం జైపూర్ టూరిజం డిపార్ట్మెంట్ సంప్రదించగా కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోమన్నారట. దీంతో అజ్మీర్ జిల్లా కలెక్టరును కలవడానికి వెళ్లగా ఆయన ‘శంకరాభరణం’ సినిమాకు పెద్ద అభిమాని కావడంతో విశ్వనాథ్‌ని గుర్తుపట్టి క్షణాల్లో అనుమతి ఇప్పించారట.తెలుగుతెరపై మరో కళాఖండం ‘సిరివెన్నెల’. కళాతపస్వి కె. విశ్వనాథ్ కెరీర్లో మైలురాయిగా నిలిచియిన సినిమాల్లో ఇదొకటి. శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న ‘సిరివెన్నెల’ 1986లో విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకం నుంచి వచ్చిన మరో ఆణిముత్యం. ఈ సినిమా కథ ఓ అంధుడైన ఫ్లూటిస్ట్ హరిప్రసాద్, మూగమ్మాయి అయిన ఓ ఆర్టిస్ట్ చుట్టూ నడుస్తుంది. కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలన్నీ ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తూనే ఉంటాయి. అన్ని పాటల్నీ సీతారామ శాస్త్రి రాశారు. ఈయనకు పాటల రచయితగా ఇదే తొలి సినిమా. ఈ సినిమాతో చేబ్రోలు సీతారామ శాస్త్రి పేరు తెరమీద ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగా మారింది. ‘విధాత తలపున ప్రభవించినదీ..’ పాటకు సీతారామ శాస్త్రి ఉత్తమ గేయరచయితగా, ఉత్తమ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం, మూన్ మూన్ సేన్ ఉత్తమ సహాయనటిగా, ఎంవీ రఘు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు.చిత్రవధకు గురి చేసిన కథచక్కటి సంస్కృతీ సంప్రదాయాలు కలబోసిన కథా కథనాలతో ప్రేక్షకుడికి పంచభక్ష పరమాన్నాలను వడ్డించే విశ్వనాథ్‌ను ‘సిరివెన్నెల’ కథ మాత్రం చిత్రవధకు గురి చేసిందట. మాటలు రాని అమ్మాయేంటి, కళ్లు కనపడని అబ్బాయేంటి? ఈ కథను ఎందుకు తీసుకున్నానా? అని బాధపడని రోజు లేదట. మధ్యలో వదల్లేను... అలాగని కంటిన్యూ చేయలేను అని మానసికంగా చిత్రవధకు గురయ్యారట. అంతలా విశ్వనాథ్‌ను ఇబ్బంది పెట్టిన ఈ కథ చివరికి తెలుగు సినీ చరిత్రలో ఓ కళాఖండమై నిలిచింది.‘విధాత తలపున...’కు వారం రోజులుసీతారామ శాస్త్రి ఈ సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేశారు. తన తొలి సినిమాకే చిరస్థాయిగా గుర్తుండిపోయే పాటలందించి శభాష్ అనిపించుకున్నారు. వాస్తవానికి తన సినిమాలన్నింటికీ వేటూరి చేత పాటలు రాయించుకునే విశ్వనాథ్‌పై ఏదో కారణం చేత ఆ సమయంలో వేటూరి అలిగారట. దీంతో ఆయన్నెందుకు ఇబ్బంది పెట్టడమని సీతారామశాస్త్రిని పిలిపించి రాయించుకున్నారట. అప్పటì కి ఆయన టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. సెలవుపై వచ్చి మరీ ఈ సినిమాకు పాటలు రాశారు.తొలుత భరణి పేరుతో కథలు, పాటలు రాసేవారు ఆయన. ‘సిరివెన్నెల’తో తన తొలి సినిమానే ఇంటి పేరుగా నిలుపుకున్నారు. అలాగే ఈ సినిమాలో హీరో వేణువు నుంచి వచ్చే సంగీతాన్ని ప్రఖ్యాత వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా అందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓంకార సంబంధమున్న ‘విధాత తలపున ప్రభవించినది...’ పాట రాయడానికి సీతారామశాస్త్రికి వారం రోజులు పట్టిందట. ‘సిరివెన్నెల’ (1986) విడుదలై పాతికేళ్లకు పైనే అయినప్పటికీ ఈ చిత్రం గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏ తరానికైనా నచ్చే ఈ ప్రేమకథ ఎప్పటికీ చెరిగిపోదు. తెలుగు చలన చిత్ర చరిత్రలో, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర ఈ ‘సిరివెన్నెల’. – దాచేపల్లి సురేష్‌కుమార్ -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా హైడ్ న్ సిక్
విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ్, శ్రీధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం హైడ్ న్ సిక్. బసిరెడ్డి రానా దర్శకత్వంలో వహించిన ఈ చిత్రాన్ని సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మించారు. తాజా ఈ మూవీ ట్రైలర్‌ని తిరుపతి ఎస్ఐటీ కాలేజీలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి మాట్లాడుతూ.. ఈ చిత్రం అందరిని అలరించే ఓ సస్పెన్స్ అవుతుందని.. అందరూ కచ్చితంగా సెప్టెంబర్ 20 న థియేటర్లో ఆదరించాలని పేర్కొన్నారు.హీరోయిన్ శిల్పా మంజునాథ్ మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్ చిత్రం విద్యార్థుల నుంచి పెద్దవారి వరకు అందరిని థ్రిల్ కు గురిచేస్తుందని, ఖచ్చితంగా థియేటర్లో ఆదరించాలని కోరారు. థియేటర్ లో చూసే ప్రేక్షకులను ఆధ్యాంతం కట్టి పడేసే అద్భుతమైన కథతో హైడ్ న్ సిక్ చిత్రం రూపొందిందని.. ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అలరిస్తుందని, సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే ఎన్నో సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని డైరెక్టర్ బస్సు రెడ్డి రానా తెలిపారుహీరో విశ్వంత్ మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్ చిత్రంతో మీ ముందుకు వస్తున్నాము అని, ఇలాంటి ఎనర్జీనే ఈ చిత్రానికి అవసరం అని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ఎక్కడ చూసినా చిత్రం పట్ల చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని, ఆ వైబ్ తోనే సెప్టెంబర్ 20న థియేటర్లో కలుద్దామని.. ఈ సందర్భంగా దర్శకుడు బాసిరెడ్డి రానా, నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి, అలాగే కాలేజీ మేనేజ్ మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు. -
కాశీ నుంచి అయోధ్యకు... ఐఆర్సీటీసీ అద్భుత ప్యాకేజీ
ఉత్తరప్రదేశ్‌లోని కాశీ, అయోధ్యలను సందర్శించాలనుకునేవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వేకు అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వారణాసి, అయోధ్యలను సందర్శించేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణ సదుపాయం, వసతి, ఆహారం మొదలైనవి అందజేయనున్నారు.ఈ ప్యాకేజీ ఆరు పగళ్లు, ఐదు రాత్రులు ఉండనుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణం సాగించేందుకు రూ.15,750(ఒక్కరు) చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణికుల తమకు అందుబాటులో ఉండే ప్యాకేజీని కూడా ఎన్నుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి ‘రామ్ మందిర్ దర్శన్’ అనే పేరు పెట్టారు. ఈ ప్యాకేజీ వారణాసి నుంచి అయోధ్య వరకూ కొనసాగనుంది. ఈ టూర్ ప్రతి శుక్రవారం ప్రారంభమవుతుంది.ఐఆర్సీసీటీ వెబ్సైట్ www.irctctourism.comని సందర్శించడం ద్వారా ప్రయాణికులు ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. అలాగే ఐఆర్సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. Embark on a divine journey to the land of spiritual awakening! Join IRCTC Tourism’s Ram Mandir Darshan and seek blessings at the revered destinations - Ayodhya & Varanasi!To experience the essence of Hinduism and rejuvenate your soul, book your journey at… pic.twitter.com/hMPlPIbTsN— IRCTC (@IRCTCofficial) August 18, 2024 -
కాశీ విశ్వనాథునికి మధుర జైలు నుంచి గులాల్
మహాశివుడు కొలువైన కాశీలో రంగ్భరి ఏకాదశి(మార్చి 20)రోజున హోలీ వేడుకలు జరగనున్నాయి. ఆ రోజున విశ్వనాథుడు, పార్వతిమాత భక్తుల నడుమ హోలీ ఆడనున్నారు. దీంతో కాశీ మొత్తం రంగులమయంగా మారనుంది. ఈసారి కాశీ విశ్వనాథుని హోలీ వేడుకల కోసం మథురలో ప్రత్యేక గులాల్ సిద్ధం చేస్తున్నారు. మథుర జైలులోని ఖైదీలు కాశీలో కొలువైన పరమశివుని కోసం పండ్లు, పూలు, కూరగాయల రసాలతో హోలీ రంగులు తయారు చేస్తున్నారు. ఈ విధంగా తయారైన ఎరుపు, పసుపు గులాల్‌లను కాశీలో హోలీ వేడుకలకు వినియోగించనున్నట్లు సమాచారం. మథుర నుండి ఒక క్వింటాల్ హెర్బల్ గులాల్ కాశీకి రానున్నదని, ఈ గులాల్ తయారీలో సుగంధాన్ని కూడా ఉపయోగిస్తున్నారని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. అయోధ్య నుండి కూడా కాశీ విశ్వేశ్వరుని హోలీ వేడుకలకు హెర్బల్ గులాల్ రానుంది. అలాగే కాశీ వ్యాపారులు కూడా విశ్వేశ్వరునికి హెర్బల్ గులాల్ సమర్పించనున్నారు. హోలీ వేడుకల్లో మహాశివుడు, పార్వతిమాత ఆసీనులయ్యే సింహాసనం ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. హోలీ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. -
రేపు లైవ్‌లో మహాదేవుని కల్యాణం
రేపు (శుక్రవారం) మహా శివరాత్రి సందర్భంగా యూపీలోని కాశీలో మహాదేవుని కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను భక్తులు తమ మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షంగా చూడవచ్చు. కాశీ విశ్వనాథ దేవాలయం ట్రస్ట్.. మార్చి 8న మంగళ హారతి నుండి మార్చి 9 న భోగ్ హారతి వరకు మొత్తం 36 గంటల పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో నాన్‌స్టాప్ లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని ట్రస్ట్ అంచనా వేస్తోంది. వికలాంగులు, వృద్ధులు సులభంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది మహాశివరాత్రి సందర్భంగా సుమారు 8 లక్షల మంది భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నారని, ఈసారి ఆ సంఖ్య 10 లక్షలు దాటే అవకాశం ఉందని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. వారణాసిలోని అస్సీ ఘాట్, దశాశ్వమేధ్ ఘాట్, వారణాసి కాంట్ రైల్వే స్టేషన్ ఇతర ప్రధాన ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడి నుంచి ప్రత్యక్ష దర్శనాన్ని ప్రసారం చేయనున్నమని తెలిపారు. -
వారణాసిలో 26 మాంసం దుకాణాలు సీల్!
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలోగల 26 మాంసం దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. న్యూ రోడ్, బెనియాబాగ్ ప్రాంతంలో మాంసం, చికెన్ దుకాణాలను అధికారులు మూసివేయించారు. కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలోని మాంసం, చికెన్ దుకాణాలను మూసివేయాలని ఆదేశిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ గత నెలలో తీర్మానం చేసింది. ఈ నేపధ్యంలో వెటర్నరీ అధికారి డాక్టర్ అజయ్ ప్రతాప్ సింగ్ ఇటీవల బెనియాబాగ్, న్యూ రోడ్లో గల మాంసం, చికెన్ దుకాణాలను తనిఖీ చేశారు. వీటిలో 26 దుకాణదారులు ఆహార భద్రతా విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని తేలింది. ఈ తనిఖీల తర్వాత, ఆయా దుకాణాలను మూసివేయాలని వెటర్నరీ అధికారి గత వారం నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికీ దుకాణాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు(శనివారం) వెటర్నరీ అధికారి నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం బెనియాబాగ్, కొత్తరోడ్డు ప్రాంతంలోని 26 దుకాణాలను సీజ్ చేసింది. -
నా జీవితం ఇలా అవడానికి కారణం రవి బాబు..!
-
నా జీవితం బాలకృష్ణ గారి మాటతో మారిపోయింది..!
-
చాలా సంతోషంగా నా జీవితాన్ని ఇప్పటివరకు గడిపాను
-
చేసిన తప్పుని తలుచుకుంటూ జీవితాన్ని గడుపుతున్న..!
-
ఆర్జీవీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన విశ్వనాథ్
-
కొడుకుకు ఉరేసి.. ఆపై ఉరేసుకొని
బంజారాహిల్స్: మూడేళ్ల బిడ్డ ఆలనాపాలన ఓవైపు... కడుపున పెరుగుతున్న శిశువు ఎదుగుదలను చూసుకోవాల్సిన బాధ్యత మరోవైపు. ఈ క్రమంలో అత్తింటి వారి వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. మరణమే శరణ్యమని భావించింది. ‘అమ్మా... మా అత్త నన్ను చితకబాదింది... ఏం చేస్తారో అని భయమేస్తోంది... చచ్చిపోవాలనిపిస్తోంది’అంటూ రోదిస్తూ తల్లికి ఫోన్ చేసిన 12 గంటల వ్యవధిలోనే బలవన్మరణానికి పాల్పడింది. తన ఒడిలో పడుకున్న బిడ్డకు ముందుగా ఉరేసి ఆ తర్వాత కడుపున ఉన్న బిడ్డతో సహా తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ ఫిలింనగర్‌లోని వినాయకనగర్ బస్తీలో చోటుచేసుకుంది. పెళ్లయిన నెల నుంచే వేధింపులు... మేడిపల్లికి చెందిన శిరీష (23) వివాహం ఫిలింనగర్‌లోని వినాయకనగర్ బస్తీకి చెందిన కారు డ్రైవర్ కావటి విశ్వనాథ్ (32)తో 2019 జూన్ 9న జరిగింది. వివాహ సమయంలో రూ. 8 లక్షల కట్నంతోపాటు 15 తులాల బంగారం ఇచ్చారు. పెళ్లి జరిగిన నెల రోజులకే అత్త బసవమ్మ, భర్త విశ్వనాథ్ విశ్వరూపం చూపించారు. రోజూ కొట్టడంతోపాటు, అదనపు కట్నం తెమ్మంటూ పుట్టింటికి తరచూ పంపేవారు. పుట్టింటికి వచ్చిన శిరీషకు తల్లి లక్ష్మి అప్పుచేసి ఒక్కోసారి రూ. లక్ష చొప్పున అయిదుసార్లు డబ్బులు ఇచ్చి పంపింది. అయినాసరే కూతురు కాపురం బాగుపడకపోగా రోజురోజుకూ వేధింపులు పెరిగిపోయి అత్తతోపాటు భర్త విశ్వనాథ్ తీవ్రంగా కొట్టేవాడు. ఈ నెల 9న పెళ్లి రోజున కూడా ఆమెను చితకబాదాడు. అదనపు కట్నం తేవాలంటూ పుట్టింటికి పంపించేందుకు యత్నించగా ఈసారి ఆమె కాళ్లావేళ్లాపడింది. అయినాసరే ఆ కర్కశ హృదయాలు కరగలేదు. శుక్రవారం ఉదయం 12 గంటలకు తల్లికి ఫోన్ చేసి అత్త కొట్టిందంటూ చెప్పి భోరుమంది. వాళ్ల కదలికలు చూస్తుంటే తనను ఏదో చేసేలా ఉన్నారంటూ ఫోన్ కట్ చేసింది. ఆ తర్వాత తల్లి లక్ష్మి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ అని వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో అల్లుడు విశ్వనాథ్ అత్త లక్ష్మికి ఫోన్ చేసి మీ కూతురు ఉరేసుకుందంటూ చెప్పాడు. కన్నీరుమున్నీరైన మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బస్తీకి పరిగెత్తుకొచ్చారు. కుమార్తెతోపాటు పక్కనే చిన్నారి మనీష్ విగతజీవిగా కనిపించడంతో గుండెలవిసేలా రోదించారు. తన కూతురు వరకట్న వేధింపులతోనే చనిపోయిందని... ఆమె మృతిపై విచారణ జరపాలని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు భర్త విశ్వనాథ్‌పై ఐపీసీ సెక్షన్ 304 (బీ), 498 (ఏ), 3, 4, వరకట్న నిషేధిత చట్టం, రెడ్‌విత్ 109 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అత్త బసవమ్మ, మామ రమే‹Ùలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
తక్కువ కాలంలో ఎక్కువ మేలు
మీరు ఎంతకాలం పాలించారు అనేది ప్రజలకు ముఖ్యం కాదు, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా పాలించారన్నది ముఖ్యం. ఆ పదవీ కాలంలో చేసిన కృషి వల్ల తర్వాతి తరాల జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చిందన్నదాన్ని బట్టి వారి స్థానాన్ని చరిత్ర నిర్ధారిస్తుంది. అతి తక్కువ కాలం ప్రధాని పదవిలో ఉన్నప్పటికీ, అనితరసాధ్యమైన మండల్ రిజర్వేషన్ల అమలుకు పూనుకొని దేశంలోని శూద్ర వర్గాలకు ఎనలేని సేవ చేశారు క్షత్రియుడైన వీపీ సింగ్. ఆయన అలా చేసి ఉండకపోతే, భారతదేశ చరిత్రలో ఒక నిశ్శబ్ద విప్లవం జరిగేది కాదు. అందుకే స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రిగా ఆయన పాత్రను తిరిగి అంచనా వేయవలసి ఉంది. జూన్ 25న న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో దివంగత ప్రధాని వీపీ సింగ్ (విశ్వనాథ్ ప్రతాప్ సింగ్: 25 జూన్ 1931 – 27 నవంబర్ 2008) 92వ జయంతి వేడుకల సమావేశాన్ని నిర్వహించేందుకు అనేక సామాజిక న్యాయ అనుకూల సంస్థలు ప్లాన్ చేశాయి. దాదాపుగా మర్చిపోయిన మండల్ మహాపురుషుడు అయిన వీపీ సింగ్ గురించి ఇటువంటి వేడుకలు జరుపుకోవడం ఇదే మొదటిసారి. ఉత్తరప్రదేశ్‌లోని క్షత్రియ రాజ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకోవడానికి పలువురు రాజకీయ నాయ కులు, కార్యకర్తలు, రచయితలు ఈ సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు. తనను తాను ఓబీసీ అని చెప్పుకొన్న నరేంద్ర మోదీ నుంచి అనేక ఇతర ప్రధానమంత్రులను దేశం చూసి ఉన్నందున, స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రిగా వీపీ సింగ్ పాత్రను తిరిగి అంచనా వేయవలసి ఉంది. అదే రాష్ట్రంలోని భూస్వామ్య పాలక నేపథ్యం ఉన్న యోగీ ఆదిత్యనాథ్, రాజ్‌నాథ్ సింగ్ వంటి క్షత్రియ పాలకులతో పోలిస్తే ప్రధానమంత్రిగా వీపీ సింగ్ పాత్రను కూడా మనం పునరావలోకనం చేయాల్సి ఉంది. మండల్ సిఫారసుల అమలు ఓబీసీలకు జాతీయ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లను సిఫార్సు చేసిన మండల్ కమిషన్ అమలును సమర్థించడం కోసం ఆనాడు వీపీ సింగ్ చేసిన పోరాటాన్ని చూసిన వ్యక్తిగా... ఆ సమయంలో మోదీ ప్రధానిగా ఉండి ఉంటే వీపీ సింగ్లాగా మండల్ కమిషన్ సిఫార్సు లను అమలు చేసి ఉంటారా అని అడగాలనుకుంటున్నాను. అలాగే మండల్ రిజర్వేషన్లతో లబ్ధిదారుడై ప్రధాని అయిన శూద్రుడు దేవే గౌడ అయినా అలా చేసి ఉంటారా అని నేను అడుగుతున్నాను. నల్లజాతీయుల హక్కుల కోసం నిలబడి, హత్యకు గురవడానికి కూడా అబ్రహాం లింకన్ సిద్ధపడిన విధంగా... సామాజిక న్యాయ పరిరక్షణం కోసం ఆనాడు వీపీ సింగ్ తీసుకున్న సైద్ధాంతిక, నైతిక వైఖరిని మరెవరూ తీసుకుని ఉండరు. అబ్రహాం లింకన్ అమెరికాలో తన జీవితాన్ని త్యాగం చేయగా, వీపీ సింగ్ మండల్ వ్యతిరేక పాలక శక్తులలో తన స్థానంతోపాటు, ప్రతిష్ఠను కూడా త్యాగం చేశారు. ఆ సమయంలో ఆయనకు బద్ధశత్రువుగా ఉన్న కాంగ్రెస్, అన్ని విధాలా ఆయన పని ముగించడానికి సిద్ధపడింది. వీపీ సింగ్ అధికారాన్ని బీజేపీ కూలదోసిన వెంటనే కాంగ్రెస్ అదే ఉత్తరప్రదేశ్ నుంచి మరో క్షత్రియుడైన చంద్రశేఖర్‌ను ప్రధానిగా తీసుకొచ్చింది. ఆయన తన జీవితమంతా సోషలిస్టుగా నటించారు కానీ బలమైన సామాజిక న్యాయ వ్యతిరేక శక్తిగా మిగిలిపోయారు. 1991లో మరొక కాంగ్రెస్ వ్యక్తి పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు. వీపీ సింగ్ తన పదవిని పణంగా పెట్టి ఆ రిస్క్ తీసుకోకపోయి ఉంటే, మండల్ రిజర్వేషన్లను పీవీ అమలు చేసి ఉండేవారని ఎవరూ అనుకోలేరు. ఆ సమయంలో అనేక ఇతర రాజకీయ శక్తులు మండల్ రిజర్వేషన్ల అమలు కోసం డిమాండ్ చేసిన మాట నిజం. అయితే వీపీ సింగ్ అలా చేసి ఉండకపోతే, భారతదేశ చరిత్రలో ఒక నిశ్శబ్ద విప్లవం జరిగేది కాదు. ఎందుకంటే ఆనాటి శూద్ర ఓబీసీలు ఆ సమయంలో సామాజిక న్యాయానికి సంబంధించిన సైద్ధాంతిక, తాత్విక సమస్యను నిర్వహించడంలో పూర్తిగా అసమర్థులుగా ఉండేవారు. మండల్ రిజర్వేషన్ అమలు కోసం డిమాండ్ చేసి దాన్ని అమలు చేయడానికి ఉత్తర భారతదేశంలో కొంతమంది రాజకీయ నాయకులు ఉండి ఉన్నప్పటికీ, శత్రుత్వంతో కూడిన అధికార నిర్మాణాలు, మీడియా నుంచి పూర్తిగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మండల్ రిజర్వేషన్ని రక్షించడానికి తగిన మేధో శక్తులు ఆనాటి శూద్ర ఓబీసీలలో లేవు. మీడియాలోని అరుణ్ శౌరీ తరహా సామాజిక న్యాయ వ్యతిరేక శక్తులు, అన్ని పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా (దూరదర్శన్‌తో సహా) మండల్ రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వీరంతా ఓబీసీ నాయకులను చాలా తేలికగా కట్టిపడేసేవారు. వారు ద్విజ యువ కులను ఆత్మాహుతి చేసుకునేలా పురికొల్పడమే కాకుండా, మండల్ అనుకూల శక్తులను దూషించడం, దాడి చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. కమ్యూనిస్ట్ ద్విజులు కూడా మండల్ రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా ఉండేవారు. దొరకని జాగా నేను, నాతోపాటు గెయిల్ ఓంవెద్ వంటి చాలా కొద్దిమంది మండల్ అనుకూల రచయితలు వీపీ సింగ్ విధానానికి మద్దతుగా ఆంగ్లంలో ఒక చిన్న కథనాన్ని కూడా ప్రచురించడానికి స్థలం కోసం కష్టపడాల్సి వచ్చేది. ‘ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’ వంటి పత్రికలు మాత్రమే కనీసంగా చోటిచ్చాయి. అప్పట్లో సోషల్ మీడియా అంటూ ఏమీ లేదు. మేము నిస్సహాయంగా ఒంటరిగా ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయాం. కానీ ఏకైక బలం ఏమిటంటే, ఆగస్ట్ 15న ఎర్రకోట నుండి చేసిన అత్యంత ధైర్యంతో కూడుకున్న ప్రసంగంతో సహా సాధ్యమైన ప్రతి ప్రజా వేదిక నుండి మండల్ రిజర్వేషన్ అమలును వీపీ సింగ్ పట్టువిడవకుండా సమర్థించడమే. ఆయన రాజీనామా లేఖ, తాను రాజీనామా చేయడానికి ముందు దేశాన్ని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగం... ఆయనకు ముందు, ఆ తర్వాత ఉండిన ఇతర ప్రధాన మంత్రులందరినీ అవమానం, అపరాధంతో కూడిన చీకటి మేఘాలలో ఉంచింది. స్వయం ప్రకటిత ఓబీసీగా చెప్పుకొని, ఆ విధంగా మరిన్ని ఓట్లు తెచ్చుకున్న ప్రధాని మోదీ, క్షత్రియ నేపథ్యం ఉన్న వీపీ సింగ్ ఆనాడు సామాజిక న్యాయంపై చేసిన ఆ తాత్విక పరిరక్షణ ఉపన్యాసాలను చదివితే, నిజంగానే తల వంచుకోవాల్సి వస్తుంది. ధైర్యంగా, దృఢనిశ్చయంతో మండల్ రిజర్వేశషన్ని అమలు చేసిన భారతదేశ అసాధారణమైన ప్రధాన మంత్రిగా ఆ వ్యక్తి పేరును మోదీ ఎన్నడూ తలవరు. ఆయన పుట్టిన రోజున ఎప్పుడూ ప్రకటన ఇవ్వరు. నిశ్శబ్ద విప్లవం వీపీ సింగ్ ప్రధానమంత్రి పదవిలో ఉన్న ఆ కొంతకాలం (2 డిసెంబర్ 1989 – 10 నవంబర్ 1990), గ్రామాల్లో చెప్పుకొనే ఒక సామెతను గుర్తు చేస్తుంది. ‘మీరు ఎంతకాలం పాలించారు అనేది ప్రజలకు ముఖ్యం కాదు, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా పాలించారన్నది ముఖ్యం’. వీపీ సింగ్ ఏడాది కంటే తక్కువ పాలనతో పోలిస్తే... నెహ్రూ పదిహేడేళ్ల పాలన, ఇందిరాగాంధీ పద్నాలుగేళ్ల కష్టతరమైన పాలన, ఇఫ్పుడు మోదీ పదేళ్ల పాలన మసకబారి పోతుంది. ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలోనే, ఐదు వేల సంవత్సరాల దేశ చరిత్రను ఆయన మార్చేశారు. తీన్ మూర్తి హౌస్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రైమ్ మినిస్టర్ల సంగ్రహాలయంలో వీపీ సింగ్‌కు ఎంత స్థలం కేటాయించారో నాకు తెలియదు. కానీ నెహ్రూ, ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీతో సహా మిగతా ప్రధానులందరికీ లభించినంత స్థలానికి ఆయన పూర్తిగా అర్హులు. ప్రస్తుత, గత పాలక పార్టీలు ఆయనను మరచిపోవాలని కోరు కున్నప్పుడు ప్రజలు ఆయనను వారి జ్ఞాపకాలలోకి తప్పక తీసుకు రావాలి. అంతేకాకుండా ఆయన పుట్టిన రోజును సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా ముఖ్యం. సామాజిక న్యాయ రాష్ట్రంగా ఉంటున్న తమిళనాడు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ వీపీ సింగ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అలాంటి ప్రయత్నాలు తప్పక జరగాలి. -కంచె ఐలయ్య, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కళాతపస్వికి నివాళులు.. షూటింగ్స్ బంద్ చేస్తూ నిర్ణయం
కళాతపస్వీ కె. విశ్వనాథ్ మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఇక లేరన్న వార్త తెలిసి చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. గొప్ప దర్శకుడిగానే కాకుండా ఇండస్ట్రీ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందంటూ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులంతా కదిలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కె.విశ్వనాథ్ నివాసానికి చేరుకొని ఆయన పార్థీవదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కె. విశ్వనాథ్ మృతి నేపథ్యంలో సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన మరణానికి నివాళిగా సినిమా నేడు జరగనున్న అన్ని షూటింగులు బంద్ చేస్తున్నట్లు తెలిపింది. స్వచ్చందంగానే షూటింగులను నిలిపివేసినట్లు తెలిపింది. -
తెలుగు సినిమా గొప్పదనం మీరు.. కె.విశ్వనాథ్‌కు ప్రముఖుల నివాళులు
మరో సినీ దిగ్గజం నేలకొరిగింది. కళా తపస్వి శకం ముగిసింది. లెజెండరీ డైరెక్టర్ కె. విశ్వనాథ్ మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గతరాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చిన విశ్వనాథ్ 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.విశ్వనాథ్ మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయిందంటూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. Deeply grieved to hear of the demise of renowned film director, Sri K. Viswanath. As a film-maker he brought depth & dignity to the medium earning global recognition for his movies with a message. May his atma attain sadgati! Om shanti! pic.twitter.com/snX4RVsIVJ — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) February 3, 2023 Shocked beyond words! Shri K Viswanath ‘s loss is an irreplaceable void to Indian / Telugu Cinema and to me personally! Man of numerous iconic, timeless films! The Legend Will Live on! Om Shanti !! 🙏🙏 pic.twitter.com/3JzLrCCs6z — Chiranjeevi Konidela (@KChiruTweets) February 3, 2023 ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే మాకు K. విశ్వనాధ్ గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. Your signature on Telugu Cinema &art in general will shine brightly forever. సినిమా గ్రామర్ లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాన్తo రుణపడి ఉంటాము sir🙏🏻 — rajamouli ss (@ssrajamouli) February 3, 2023 Rest in peace Vishwanath garu … thank u for everything🙏🏻🙏🏻🙏🏻.. u Continue to live in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 #RipLegend pic.twitter.com/QfjPIYAfsx — Anushka Shetty (@MsAnushkaShetty) February 3, 2023 Sad to hear about the passing of India’s 1st auteur director #KVishwanath ..He is gone , but his films will live forever 💐💐💐 — Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2023 Deeply saddened by the passing of legendary director K. Vishwanath Garu. His urge n passion for storytelling and his commitment to excellence have inspired many filmmakers like me to strive for the best in our own work. We all will miss him dearly... #RIPVishwanathGaru 🙏🏻 pic.twitter.com/PFvbOEuaFd — Krish Jagarlamudi (@DirKrish) February 3, 2023 Disheartening to know about the tragic news of #KVishwanath garu. Words may not suffice to express his loss. His contribution to Telugu Cinema will live on in our memories forever. My sincere condolences to his entire family & dear ones. OM SHANTI 🙏 — Ravi Teja (@RaviTeja_offl) February 3, 2023 We have lost another gem! What a legend! #KVishwanath gaaru will be remembered forever for his art, his passion and understanding of films. Never got an opportunity to work with him, but been a great admirer of his work. Will be missed. RIP #KVishwanathgaru Om Shanti 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/HNxvrELJnt — KhushbuSundar (@khushsundar) February 3, 2023 Rest in peace the legendary #KVishwanath sir .. You will remembered forever in our hearts , you always live through ur great films 🙏 Om shanti#RipLegend #RIPVishwanathGaru pic.twitter.com/XZE6aYUvP8 — Director Maruthi (@DirectorMaruthi) February 3, 2023 Ulaganayagan @ikamalhaasan posted a hand-written letter bidding goodbye to the Legendary director #KVishwanath garu. 💔#KViswanathGaru pic.twitter.com/5IMs70O8Hu — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 3, 2023 తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను. pic.twitter.com/3Ub8BwZQ88 — Jr NTR (@tarak9999) February 2, 2023 Cinema is above Boxoffice. Cinema is above Stars. Cinema is above any individual. Who taught us this ? The greatest of greatest #KViswanathGaaru మీ రుణం …వీడుకోలు 🙏🏼🙏🏼🙏🏼 — Nani (@NameisNani) February 3, 2023 నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన .. ఆ రెంటి నట్టనడుమ తన తపన సాగించి , తపస్సు కావించి, తనువు చాలించిన ఋషి 🙏🙏🙏 వెండితెరకి ఇకపై దొరకునా అటువంటి సేవ ! — mmkeeravaani (@mmkeeravaani) February 2, 2023 -
కె. విశ్వనాథ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన బాలకృష్ణ
కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు.. భారతీయ సంస్కృతీ, సంప్రదాయలు మరీ ముఖ్యంగా మన తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణము.. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. కళా తపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.. - నందమూరి బాలకృష్ణ కాగా విశ్వనాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఏకైక చిత్రం జననీ జన్మభూమి(1984). కానీ, ఆ చిత్రం ఆడలేదు. అయితే.. నరసింహానాయుడు, సీమ సింహం, లక్ష్మీ నరసింహా, పాండు రంగడు చిత్రాల్లో బాలకృష్ణ తండ్రి పాత్రలో అలరించారు కళాతపస్వి. -
Karnataka: సొంత ప్రభుత్వాన్ని ఏకిపారేసిన బీజేపీ సీనియర్ నేత
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ వివాదం తరువాత హిందు దేవాలయ ప్రాంగణంలో ముస్లిం వ్యాపారులను నిషేధించాలంటూ రైట్ వింగ్ సంస్థలు పిలుపునివ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. కర్ణాటక ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతుంటే ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని విశ్వనాథ్ ఆరోపించారు. ప్రభుత్వం తప్పక స్టాండ్ తీసుకోవాలని హితవు పలికారు. దీనిపై అభ్యంతరాలను ఇప్పటికే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో చర్చించినట్లు తెలిపారు. కాగా 2019లో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించినవారిలో విశ్వనాథ్ ఒకరు. చదవండి: ఢిల్లీ ఎయిర్ పోర్టులో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం ‘ఇతర దేశాలలో కూడా ముస్లింలు నివసిస్తున్నారు. అక్కడ వారు ఆహారం, పువ్వులు అమ్ముతుంటారు.. ఒకవేళ మనం అక్కడికి వెళ్తే వాళ్ల నుంచి ఏం తీసుకుకోకుండా ఉంటామా? వీళ్లంతా చిరు వ్యాపారులు, కాలే కడుపు కోసం పనిచేసుకునే వారు. వారికి మతాల పట్టింపు లేదు. ఇది బీజేపీ ప్రభుత్వం. మత సంస్థ కాదు’ అని ఎమ్మెల్సీ విశ్వనాథ్ నొక్కి చెప్పారు. అయితే రాష్ట్రం రైట్ వింగ్ ఒత్తిడికి లొంగిపోతోందా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించడానికి నిరాకరించారు. ఇదిలా ఉండగా బీజేపీ ప్రభుత్వానికి సొంత పార్టీ నుంచే విమర్శలు రావడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చదవండి: బెంగాల్ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు, వీడియో వైరల్ -
తండ్రి దినసరి కూలీ, తనయుడు ఇటలీలో జరిగే అంతర్జాతీయ పోటీలకు
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన యువ నావికుడు అంతర్జాతీయ ఘనత సాధించాడు. ఇటలీలో జరగబోయే ఆప్టిమిస్ట్ వరల్డ్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌కు 15 ఏళ్ల నావికుడు పాడిదళ విశ్వనాథ్ ఎంపికయ్యాడు. ఇతను గోవాలోని ఐఎన్ఎస్ మాండోవిలోని నేవీ బాయ్స్ స్పాట్స్ కంపెనీలో శిక్షణ పొందుతున్నాడు. ఇటలీలోని రివా డెల్ గార్డాలో జరిగే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే జూనియర్ బాయ్స్ యాచింగ్ జట్టులో విశ్వనాథ్ పాల్గొననున్నాడు. ఈ పోటీలు జూన్ 30న ప్రారంభమై..జూలై 10న ముగియనున్నాయి. విశ్వనాథ్ నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాడు. సూర్యపేటకు చెందిన ఇతని తల్లిదండ్రులు నిర్మాణ రంగంలో దినసరి కూలీలు. 21 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఇక విశ్వనాథ్‌ను తన 12వ ఏటలోనే నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ఎంపిక చేసింది. ఇంతకముందు 2017లో సబ్ జూనియర్ ఇంటర్నేషనల్ రెగట్టాలో రజత పతకం సాధించాడు. అప్పటి నుంచి ఆప్టిమిస్ట్ తరగతిలో జాతీయ జట్టులో పాల్గొంటున్నాడు.. ఆసియన్ ఛాంపియన్షిప్, ఒలంపిక్స్‌లో దేశానికి పతకాలు సాధించడమే తన లక్ష్యమని విశ్వనాథ్ తెలిపాడు. ప్రొఫెషనల్ నావికుడు కావాలనే తన కల త్వరలోనే నిజం కాబోతుందని హర్షం వ్యక్తం చేశాడు. 12ఏళ్ల వయస్సులో తనను ఎంపిక చేసినందుకు నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపాడు. -
కలకలం: ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం
మైసూరు: సీఎం యడియూరప్పకు ఆరోగ్యం సరిగా లేదు, దీంతోపాటు రాష్ట్ర పరిపాలన కూడా సరిగా లేదని, దీనిపై హైకమాండ్ వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ అన్నారు. ఆయన బుధవారం మైసూరు జయలక్ష్మీపురంలో ఎంపీ శ్రీనివాస్ ప్రసాద్ ఇంటికి వెళ్లి తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం విశ్వనాథ్ మాట్లాడుతూ ఎంపీ ఇంట్లో పలు విషయాలకు ముహూర్తం పెట్టినట్లు చెప్పారు. కొద్ది రోజులు వేచి చూడాలని తెలిపారు. చదవండి: ఢిల్లీ టూర్‌తో వేడెక్కిన కర్ణాటక రాజకీయం చదవండి: సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మంత్రి -
సేంద్రియ ఇంటిపంటల పితామహుడు!
వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసుకోండి. మీకు నచ్చిన పంటలనే మీ ఇంటిపై పండించుకోండి. మీరు పండించుకున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లనే ఇంటిల్లపాదీ తినండి! – దివంగత డా. బి.ఎన్. విశ్వనాథ్, భారతీయ సేంద్రియ ఇంటిపంటల పితామహుడు, బెంగళూరు నగరాల్లో సేంద్రియ ఇంటిపంటల చరిత్రలో ఒక విచారకరమైన ఘట్టం. భారతీయ ఆర్గానిక్ టెర్రస్ కిచెన్ గార్డెనింగ్ పితామహుడు డాక్టర్ బి.ఎన్.విశ్వనాథ్ ఇక లేరు. ఆదివారం బెంగళూరులోని ఆసుపత్రిలో కన్నుమూశారు. గత ఏడాదిన్నరగా కిడ్నీ జబ్బుతో బాధపడుతున్న ఆయనను కరోనా బలితీసుకుంది. బెంగళూరు కేంద్రంగా రసాయనిక అవశేషాల్లేని సేఫ్ ఫుడ్ ఉద్యమాన్ని ప్రారంభించిన ఆయన.. టెర్రస్‌లపై సేంద్రియ ఇంటిపంటల సాగును నిరంతర శ్రమతో ఉద్యమంగా విస్తరింపజేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కీటక శాస్త్ర నిపుణుడిగా పనిచేసి రిటైరైన డా. విశ్వనాథ్ తమ ఇంటిపై 1995 నుంచి సేంద్రియ ఇంటిపంటలు సాగు చేయనారంభించారు. అంతేకాదు, నగరాలు, పట్టణాల్లో ఇళ్లు కట్టుకొని స్థిర నివాసం ఉంటున్న వారే కాదు, అపార్ట్మెంట్లలో అద్దెకుంటున్న వారు సైతం తమకు ఉన్న కొద్ది గజాల స్థలంలో అయినా సరే.. వంటింటి వ్యర్థాలను కంపోస్టుగా మార్చుకొని సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవటం తమ బాధ్యతగా గుర్తెరగాలని ఎలుగెత్తి చాటిచెప్పారు. బెంగళూరు, మైసూరు, మాండ్య, ధార్వాడ్–హుబ్లీ తదితర చోట్ల అవిశ్రాంతంగా టెర్రస్ గార్డెనింగ్పై శిక్షణ ఇచ్చారు. ఈ పాతికేళ్లలో కనీసం వెయ్యికి పైగా శిక్షణా శిబిరాలు నిర్వహించారు. కనీసం పది వేల మంది ముఖతా ఆయన దగ్గర శిక్షణ పొంది, టెర్రస్ గార్డెనింగ్‌ను తమ జీవితాల్లో భాగం చేసుకున్నారు. ముఖాముఖి సంభాషణకు వీలుగా ఉండాలని కేవలం పది, పదిహేను మందికి మాత్రమే ఒకసారి శిక్షణ ఇచ్చేవారు. ఉపన్యసించటం, పీపీటీ ద్వారా మెలకువలను విపులంగా తెలియజెప్పటంతోపాటు శిక్షణ పొందే వారందరికీ మట్టిలో చేతులు పెట్టి పనిచేయటం నేర్పించేవారు. కొన్నేళ్లు ఆయన స్వయంగా నిర్వహించిన శిక్షణా శిబిరాలను గత కొన్నేళ్లుగా ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఎఎంఇ ఫౌండేషన్ నిర్వహిస్తుండగా, డా. విశ్వనాథ్ రిసోర్స్ పర్సన్‌గా శిక్షణ ఇస్తున్నారు. కన్నడంలో, ఆంగ్లంలో టెర్రస్ గార్డెనింగ్పై పుస్తకాలు రాశారు. బెంగళూరు సిటీ ఫార్మర్స్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి చివరి వరకు అధ్యక్షునిగా సేవలందించారు. ఎవరి ఇళ్ల మీద వాళ్లు సేంద్రియ ఇంటిపంటలు పండించుకొని తినటం మొదటి దశ. అమృత సమానమైన మిగులు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇతర ఉత్పత్తులను అమ్మకానికి పెట్టించడం ద్వారా ప్రజలను సేంద్రియ ఇంటిపంటల సాగు వైపు ఆకర్షించే ప్రయత్నం చేయటం డా. విశ్వనాథ్ ప్రత్యేకత. ఇందుకోసం ‘ఊట ఫ్రం యువర్ తోట’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసి.. మూడు నెలలకోసారి బెంగళూరు సిటీలో ఒక్కోచోట సేంద్రియ ఇంటిపంటల సంతలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికి 35 సంతల(www.ofyt.org)ను నిర్వహించారు. ఇతర నగరాల్లో ఇంటిపంటల సాగుదారులు బెంగళూరు అనుభవాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. 1995 నుంచి ప్రారంభమైన టెర్రస్ ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్ కార్యకాలాపాల రజతోత్సవాలను ఈనెల 15 నుంచి నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ లోగా ఆదివారం డా. విశ్వనాథ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. ఆహారోత్పత్తిలో రైతులతో సహానుభూతి చెందటం కోసం నగర, పట్టణవాసులు సిటీ ఫార్మర్స్‌గా మారి తమ ఇళ్లపైనే పంటలు పండించుకోవాలన్నది ఆయన సందేశం. అందుకోసమే పాతికేళ్లుగా శ్రమించారు. హుబ్లిలో ఏడేళ్ల క్రితం డా. విశ్వనాథ్ నిర్వహించిన జాతీయ సదస్సులో ‘సాక్షి’ తరఫున నేను పాల్గొన్నాను. అంతకుముందే బెంగళూరు వెళ్లి మరీ ఆయనను ఇంటర్వ్యూ చేశాను. తాజా పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు స్థానిక ఆహార భద్రతను అందించేవి సేంద్రియ ఇంటిపంటలే అని ఆయన మాటల ద్వారా, చేతల ద్వారా చాటిచెప్పారు. ఇంటిపంటలపై చిన్నచూపు మాని ఆ స్ఫూర్తిని కొనసాగించడమే ఆధునిక సేంద్రియ ఇంటిపంటల పితామహుడికి మనం ఇవ్వదగిన నివాళి. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ 24 నుంచి హైడ్రోపోనిక్స్‌పై కేరళ వర్సిటీ ఆన్లైన్ శిక్షణ మట్టి లేకుండా నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో ఆకుకూరలు, కొన్ని రకాల కూరగాయలు, ఔషధ మొక్కలను సాగు చేసే పద్ధతి హైడ్రోపోనిక్స్. నీటిలో మొక్కల వేళ్లకు ద్రవపోషకాలు అందించడం హైడ్రోపోనిక్స్ ప్రత్యేకత. నగర, పట్టణాల్లో షెడ్లలోనూ సాగు చేయడానికి వీలైన పద్ధతి ఇది. కరోనా కష్టకాలంలో ఈ పద్ధతిపై ఆసక్తి పెరుగుతున్న నేపధ్యంలో కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన త్రిస్సూర్‌లోని హైటెక్ పరిశోధన–శిక్షణా కేంద్రం ఆన్లైన్ శిక్షణా శిబిరం నిర్వహించనుంది. మాధ్యమం ఆంగ్లం. ఆగస్టు 24 నుంచి 28 వరకు ఉ. 10.30 – 12.30 వరకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ ౖసైంటిస్ట్ డా. సుశీల తెలిపారు. హైడ్రోపోనిక్స్ సాగులో వివిధ పద్ధతులు, డిజైన్, నిర్మాణం, నీటి నాణ్యతా ప్రమాణాలు, పోషకాల నిర్వహణ, చీడపీడల యాజమాన్యం, కృత్రిమ కాంతి సంగతులను శాస్త్రీయంగా వివరిస్తారు. ఫీజు రూ. 4,500. ఈ కింది బ్యాంకు ఖాతాకు డబ్బు పంపిన తర్వాత పేరు, చిరునామా వివరాలను suseela1963palazhy@gmail.com and suseela.p@kau.inకు మెయిల్ చెయ్యాలి. తర్వాత ఆన్లైన్ తరగతుల లింక్ పంపుతారు. వివరాలకు.. Name: The Professor & Head, Instructional Farm, Vellanikkara, Account number: 67395972864, Branch:SBI, Ollukkara Branch, IFSE CODE: SBIN0070210 -
ఆస్తమా పేషెంట్లు భయపడొద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి సోకే అవకాశాలున్న పది ప్రధానమైన రోగలక్షణాలు, కారణాల్లో ఆస్తమా వ్యాధి లేదని పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ నిపుణులు డా.విశ్వనాథ్ గెల్లా స్పష్టం చేశారు. ఆస్తమా కారణంగా ఈ వ్యాధి తమకు త్వరగా సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఆస్తమా పేషెంట్లు కూడా సాధారణ రోగుల మాదిరిగా ఈ వైరస్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాజాగా అమెరికా, చైనా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైందన్నారు. ఇప్పటివరకు చైనా, అమెరికా, తదితర దేశాల్లో కరోనా కారణంగా సంభవించిన మరణాల్లోనూ ఆస్తమా ఉన్న వారు దాదాపుగా లేనట్టేనని తేలిందన్నారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్, 2018 అధ్యయనం ప్రకారం భారత్‌లో దాదాపు 4కోట్ల మంది ఆస్తమా రోగులున్నారని, వారిలో 5 శాతం మందిలో ఇది తీవ్రస్థాయిలో ఉందని చెప్పారు. ఇలాంటి పేషెంట్లు మాత్రం కరోనాకు గురయ్యే అవకాశాలున్నాయన్నారు. హ్యాండ్ హైజీన్‌ను పాటించే విషయంలో సరైన పద్ధతుల్లో వ్యవహరించాలని, ఎంత సమయంపాటు చేతులు కడుక్కోవాలి, దానికోసం అనుసరించాల్సిన విధానాలు తెలుసుకోవాలన్నారు. మంగళవారం (మే 5) ‘వరల్డ్ ఆస్తమా డే’, ‘వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే’ల సందర్భంగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వూ్యలో పల్మనాలజిస్ట్ డా. విశ్వనాథ్ గెల్లా వివిధ అంశాలపై ఏం చెప్పారంటే... ఆస్తమా ఆ జాబితాలో లేదు: కరోనా ప్రధానంగా డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, శ్వాసకోశ సంబంధి త, సీవోపీడీ వంటి పది రకాల లక్షణాలు, ఇప్పటికే వివిధ రకాల ఆరోగ్య సమస్యలున్న వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్టు వెల్లడైంది. ఆ జాబితాలో ఆస్తమా లేదు. ఇన్హేలర్స్ మానొద్దు... ఆస్తమా చికిత్సలో భాగంగా వాడుతున్న ఇన్హేలర్ల వినియోగాన్ని రోగులు ఆపొద్దు. వీటిని ఆపేసి ఆందోళనలతో ఆసుపత్రులకు వెళ్లి స్టెరాయిడ్స్ డోస్ పెంచడం వల్ల సమస్యలు ఎదురుకావొచ్చు. జపాన్ పరిశోధనల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తమా ఉన్నవారు ఇన్హేలర్స్ను మానాల్సిన అవసరం లేదు. టెలి మెడిసిన్‌కు ప్రాధాన్యతనివ్వాలి... ప్రస్తుత పరిస్థితుల్లో వీడియో, టెలి మెడిసిన్ కన్సల్టేషన్ ద్వారా మందులు తీసుకోవడం మంచిది. ఆసుపత్రులకు వెళ్లడం వల్ల ఇతర సమస్యలు తలెత్తే అవకాశముంది. ఏదైనా సమస్య ఎదురైతే మాత్రం సంబంధిత డాక్టర్ని నేరుగా కలవాలి. తమకు తాము ఇన్హేలర్ డోస్ తగ్గించుకోవడం సరికాదు. ఆస్తమా రోగులు అక్యూట్ అటాక్ రాకుండా జాగ్రత్త పడాలి. అలర్జీలతో జాగ్రత్త పడాలి... ప్రస్తుత సమయంలో ఆస్తమా రోగులు అలర్జీల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. కార్పెట్‌తో వచ్చే అలర్జీలు, దుమ్ము, కొన్నిరకాల ఫాబ్రిక్స్, వాసనలు, వృత్తిరీత్యా వచ్చేసమస్యలతో అలర్జీలు వస్తాయి. అలర్జెక్ రునటిక్స్ ఉంటే తుమ్ములు, జలుబు వంటివి వస్తాయి. ప్రాణాయామం చేయగలిగితే మంచి ఫలితాలుంటాయి. చేతులు శుభ్రపరుచుకునేందుకు... చేతులను శుభ్రం చేసుకునే విషయంలో కూడా పది స్టెప్స్‌ను పాటించాలి. రోజువారీ జీవనంలో శుభ్రతా చర్యలకు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. బయట తిరిగొచ్చిన చెప్పులతో ఇంట్లో తిరగడం సరైంది కాదు. -
పెద్దవంశీ స్టయిల్లో...
బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్, విశ్వంత్, నిత్యా శెట్టి ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. చెందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. మార్చి 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘ఏమైపోతానే మనసిక ఆగేలాలేదే...’ పాటను పూజా హెగ్డే విడుదల చేశారు. ఈ పాటకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ‘‘ఈ పాట వెనక ఓ కథ ఉంది. మొదట విజువల్స్ చిత్రీకరించి, ఆ తర్వాత ట్యూన్ కంపోజ్ చేయడం జరిగింది. గతంలో వంశీగారు ‘లేడీస్ టైలర్’కి అలా చేశారు. మా ప్రయోగం కూడా ఆకట్టుకుంటుంది అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత ఆనంద్ ప్రసాద్. ‘‘ప్రతీ సన్నివేశం కడుపుబ్బా నవ్వించడమే కాకుండా ఉత్కంఠను రేపుతుంది’’ అన్నారు దర్శకుడు చందు. ఈ సినిమాకు సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: సునీల్ కుమార్ యన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి. -
ముదిరిన ‘కర్ణాటక’ కష్టాలు
బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం వరుస షాక్‌లతో సతమతమవుతోంది. తాజాగా జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.హెచ్.విశ్వనాథ్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడకు అందజేశారు. సంకీర్ణ ప్రభుత్వం సరైన రీతిలో పనిచేసేందుకు గాను సిద్దరామయ్య నేతృత్వంలో ఏర్పాటైన సమన్వయ కమిటీ ఏడాది గడుస్తున్నా ఉమ్మడి ప్రణాళికను రూపొందించలేకపోయిందని మండిపడ్డారు. ఇరు పార్టీల మధ్య సమన్వయానికి సిద్ధరామయ్య చర్యలు తీసుకోలేదన్నారు. తుముకూరులో మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమి వెనుక కుట్ర ఉందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో ధిక్కార స్వరం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రామలింగారెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తీసుకున్న పలు నిర్ణయాలపై మండిపడుతున్నారు. కొత్తగా వచ్చిన వాళ్లకి, ఇతర పార్టీల నుంచి చేరిన వారికి, కాంగ్రెస్ విధానాలు తెలియని వారికి ప్రాధాన్యత ఇవ్వడమే పార్టీ ప్రస్తుత స్థితికి కారణమని ధ్వజమెత్తారు. ఇదే పరిస్థితి కొనసాగితే సీనియర్ నేతలు పార్టీలో ఉండలేరని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత రోషన్ బేగ్ సైతం ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితికి సిద్దరామయ్య, దినేశ్ రావులే కారణమని మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. సిద్దరామయ్య పొగరు వల్లే పార్టీ ఇలా తయారైందన్నారు. -
తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు!
న్యూయార్క్: కళాశాలకు చెందిన కంప్యూటర్లకు భారీగా నష్టం కల్గించినందుకు తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు శిక్ష పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్ ఆకుతోట(27) స్టూడెంట్ వీసాపై 2015లో అమెరికా వెళ్లాడు. అల్బనీ సిటీలో సెయింట్ రోజ్ కాలేజీలో 2017లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఫిబ్రవరిలో ‘యూఎస్బీ కిల్లర్’ అనే పెన్‌డ్రైవ్ సాయంతో కాలేజీలోని 66 కంప్యూటర్లను పాడుచేశాడు. ఈ పనిని మొబైల్లో షూట్‌చేశాడు. అధికారుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన నార్త్ కరోలినా పోలీసులు విశ్వనాథ్‌ను అరెస్ట్‌చేశారు. కావాలనే ఈ పనికి పూనుకున్నట్లు ఒప్పుకున్న అతడు జరిగిన నష్టం రూ.40 లక్షలు చెల్లించేందుకు కూడా అంగీకరించాడు. ఆగస్టులో కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. -
అమెరికాలో భారతీయ జంట మృతి
న్యూయార్క్: అమెరికాలోని ఓ జాతీయ పార్కులో 800 అడుగుల ఎత్తు ఉన్న ఒక కొండ అంచు నుంచి కిందకు పడి ఓ భారతీయ జంట దుర్మరణంపాలైంది. మృతులను విష్ణు విశ్వనాథ్ (29), మీనాక్షి మూర్తి (30)గా గుర్తించారు. 2014లో పెళ్లిచేసుకున్న వీరు కేరళలోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని యోసెమిటీ వ్యాలీ జాతీయపార్కులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ పార్కులో నిట్టనిలువుగా 800 అడుగుల ఎత్తు ఉండే టఫ్ట్ పాయింట్ అనే కొండ అంచు ప్రాంతం నుంచి విశ్వనాథ్, మీనాక్షిలు కింద పడ్డారు.గత బుధవారం ఉద్యానవన సందర్శకులు మృతదేహాలను గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వగా గురువారం తీవ్రంగా శ్రమించి ప్రమాద స్థలి నుంచి శవాలను వెలికితీశారు. న్యూయార్క్‌లో నివసించే ఈ జంట ఇటీవలే కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌జోసే నగరానికి మారారనీ, అక్కడి సిస్కో కంపెనీలో విశ్వనాథ్ ఉద్యోగం చేసేవారని అధికారులు గుర్తించారు. ప్రపంచమంతా తిరుగుతూ తమ అనుభవాలను ‘హాలిడేస్ అండ్ హ్యాప్పీలీ ఎవర్ ఆఫ్టర్స్’ అనే బ్లాగ్‌లో రాసేవారు. పార్కు అధికార ప్రతినిధి జేమీ రిచర్డ్స్ మాట్లాడుతూ ‘వారు కింద పడటానికి కారణమేంటో మాకు ఇంకా తెలియదు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇదొక తీవ్ర విషాద ఘటన’ అని అన్నారు. ఇదే పార్కులో ఈ మేలో ఆశిష్ పెనుగొండ (29) అనే భారతీయుడు హాప్ డోమ్ అనే ప్రాంతానికి ఎక్కుతుండగా కిందపడి మరణించాడు. ఈ ఏడాదిలోనే పది మంది మృతి యోసెమిటీ వ్యాలీ అడవి, కొండలతో నిండిన, అందమైన జాతీయపార్కు. ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఇక్కడ దారులు ప్రమాదకరంగా ఉంటాయి. ‘అడుగులు వేసేటప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే ఇక్కడ కచ్చితంగా జారిపడతారు’ అని రిచర్డ్స్ తెలిపారు. ఈ ఏడాదిలోనే యోసెమిటీ వ్యాలీ పార్కులో ప్రమాదవశాత్తూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే చనిపోయిన పదిమందిలో ఆరుగురు ఇక్కడి కొండలు ఎక్కుతున్నప్పుడే ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయారు. విశ్వనాథ్, మీనాక్షిలు పడిపోయిన ‘టఫ్ట్ పాయింట్’ అనే కొండ అంచు నుంచి చూస్తే యోసెమిటీ పార్కు మొత్తం, యోసెమిటీ జలపాతం, ఎల్ క్యాపిటన్ కొండ బాగా కనిపిస్తాయి. ఆ సుందర దృశ్యాలను చూసేందుకు ఈ కొండ అంచుకు వస్తారు. -
స్పాట్ బెడతా!
పోలీస్ సినిమాల గురించి మాట్లాడుకునేప్పుడు ఇప్పటికీ ప్రస్తావనకొచ్చే సినిమా. లాఠీకి పదునైన పనిచెప్పిన సినిమా. ఖాకీ పౌరుషాన్ని కళ్లకు కట్టిన సినిమాలోని దృశ్యాలు ఇవి.... సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘సార్... వికాస్ దినపత్రిక నుంచి వస్తున్నాను. నా పేరు విశ్వనాథ్’’ తనను తాను పరిచయం చేసుకున్నాడు కళ్లద్దాల రిపోర్టర్.‘‘సర్లేగాని అడుగు’’ అన్నారు సీయం క్యాజ్వల్గా.ఈలోపు ఇద్దరి మధ్య ఫొటోగ్రాఫర్ దూరి...‘‘కొంచెం నవ్వండి సార్’’ అన్నాడు.‘‘మధ్యలో నీ గొడవేంది. కాస్త అవతలుండు’’ అని విసుక్కున్నారు సీయం.రిపోర్టర్ ప్రశ్న అందుకున్నాడు...‘‘ముఖ్యమంత్రి కావాలని ముందే అనుకున్నారా? అవ్వక ముందు అయిన తరువాత మీ అనుభవాలు చెబుతారా?’’‘‘జరిగిపోయినదాని గురించి ఇప్పుడెందుకయ్యా. జరగాల్సిన దాని గురించి ఏమైన అడగదల్చుకుంటే అడుగు’’ అన్నారు సీయం.‘‘సార్... మీరు మద్యపానాన్ని నిషేధిస్తున్నారట?’’ అడిగాడు రిపోర్టర్.పక్కలో ఫుల్‌బాటిల్ పడ్డట్టు అదిరిపడ్డారు హోంమినిస్టర్గారు. అంతలోనే సర్దుకుని...‘‘అబ్బబ్బే...అలాంటిదేమీ లేదండీ.ఆలోచనలో ఉంది. సీయంగారు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు’’ అని బుకాయిస్తూ ‘‘అనవసరంగా పేపర్లో రాయొద్దు’’ అన్నారు హోంమంత్రి.మంత్రిగారి మాటలకు సీయంగారికి చిర్రెత్తుకొచ్చింది.‘‘నిర్ణయానికి రాకపోవడం ఏందయ్యా. తీసిపారేయ్యడం ఖాయం’’ గట్టిగా చెప్పారు సీయం.‘‘కారణం చెబుతారా?’’ అడిగాడు రిపోర్టర్.‘‘చూడూ... నువ్వు తాగుతావా?’’ సూటిగా అడిగారు సీయం.సిగ్గుతో మెలికలు తిరిగాడు రిపోర్టర్.‘‘ఫరవాలేదు చెప్పు’’ అన్నారు సీయం.‘‘అప్పుడప్పుడూ సార్’’ మరింతగా సిగ్గుపడ్డాడు రిపోర్టర్.‘‘అయితే తాగెల్లి నీ పెళ్లాన్ని అడుగు చెబ్బుద్ది’’ అన్నారు సీయం.‘మీరు భలే కామెడీ మాట్లాడతారు సార్’’ మూడోసారి మెలికలు తిరిగాడు రిపోర్టర్.‘‘కడుపు మండినప్పుడు వచ్చేది కామెడియే లేవయ్యా’’ జీవితసత్యాన్ని చెప్పారు సీయం.మరో ప్రశ్న అందుకున్నాడు రిపోర్టర్...‘‘మీరు ఎన్నికలలో చేసిన వాగ్ధానాలను నెరవేర్చగలనని అనుకుంటున్నారా?’’హోంమంత్రికి మళ్లీ కోపం వచ్చింది.‘‘ఏమిటండీ అది...ఎన్నికలన్నాక ఎన్నెన్నో చెబుతాం. చెప్పాంగదా అని చేతుల్లో లేనివన్నీ చేయగలుగుతామా? అడిగేదో కాస్త ఆలోచించి అడగాలి’’ విసుక్కున్నారు హోంమంత్రి.సీయంగారు హోంమంత్రి వైపు గుర్రుగా చూశారు. ఆపై ఇలా అన్నారు...‘‘కృష్ణారావు! నీకు అపశకునాలు పలకడం అలవాటైపోయింది. ఇదిగో వికాసు...నాకు ప్రజలకు మధ్య దళారీలు పెట్టదల్చుకోలేదు’’రిపోర్టర్‌తో మాట్లాడిన తరువాత సీయంగారు బయటికి వచ్చారు. భారీ బందోబస్త్! ఎటు చూసినా పోలీసులు! ఆశ్చర్యంతో అదిరిపడ్డారు సీయం.‘‘ఏంది? ఏందయ్యా ఇదంతా?’’ కారు డోరు తీస్తూ విసుక్కున్నారు సీయం.‘‘మీకు సెక్యూరిటీ సార్’’ గొప్పగా అన్నారు హోంమంత్రి.‘‘ఒక్క మనిషికి ఏందయ్యా ఇంత హడావిడి. నాకు ఈ కారు చాలు. ఇంకేం బడ్లా’’ అన్నారు సీయం.‘‘మీరు ఇలా సెక్యూరిటీ కూడా వద్దనడం బాలేదు. చీఫ్ మినిస్టర్‌గా రేపొద్దున మీకేమైనా జరిగితే హోంమినిస్టర్‌గా తట్టుకోలేను’’ అర్జెంటుగా ఆందోళనను కళ్లలోకి తెచ్చుకున్నారు హోంమినిస్టర్.‘‘ఇదిగో హోము. ప్రజలకు మనం సెక్యూరిటీ ఇవ్వాలిగాని ప్రజల డబ్బుతో మనకెందుకయ్యాసెక్యూరిటీ?’’ నిలదీశారు సీయం.‘‘సార్! మా బాధ్యత కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ’’ అన్నాడు పెద్దపోలీసాయన.‘‘సరే...మీ తృప్తి కోసం గేటు బయట ఇద్దరు పోలీసులను పెట్టుకోండి. నా ముందుగానీ వెనగ్గాని మీరెవరు రాబల్లే. బయలుదేరండి’’ అన్నారు సీయం. కారు ఎక్కబోయే ముందు ‘‘రత్తమ్మా...ఏది కాస్త ఎదురు రా’’ అని పిలిచారు.నిండు ముల్తైదువు సీయంగారి కారుకు ఎదురొచ్చింది.ముందు సీట్లో హోంమంత్రి కూర్చోబోతుంటే...‘‘ఇదిగో కృష్ణారావు! అట్టా ఇరుక్కొని పోవడం దేనికి? బోలెడంత జాగా ఉంది. వెనక్కి రా కబుర్లు చెప్పుకుందాం’’ అన్నారు సీయం.‘‘ఎప్పుడూ ఇలా జోకులు వేస్తూనే ఉంటారు’’ నవ్వుతూ వెనకసీట్లో సీయం పక్కన కూర్చొన్నారు హోంమంత్రి. కారు కదిలింది. ‘‘చిరునవ్వుతో ఎదురొచ్చే ముల్తైదువు కంటే సెక్యూరిటీ ఏం ఉంటుంది!’’ అన్నారు సీయం. జీబు దిగి ఆ పోలీస్‌స్టేషన్‌లోకి రాజసంగా నడిచొచ్చాడు రౌడీషీటర్ నీలకంఠం. ‘‘నమస్తే బై. నేనే నీలకంఠం. ఈ సిటీ మొత్తానికి ఏ మనిషి మూమెంట్‌కి స్పాట్ పెట్టాలన్నా మనం పెట్టాల్సిందే. అసలు ఈ చుట్టుపక్కల ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా నన్ను కలవాల్సిందే. నువ్వు కల్వలేదు. నేను బాధపడను. నేను ఏ మూమెంట్ చేసినా, ఏ స్పాట్పెట్టినా ముందుగా చెప్పేది పోలీసోళ్లకే’’తనను తాను పరిచయం చేసుకుంటూనే తనతో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో చెప్పకనే చెప్పాడు నీలకంఠం.ఆ తరువాత ‘సంటీ’ అని పిలిచాడు. తమ్ముడు సంటి జర్దా నములకుంటూ నడుముకు కట్టుకున్న కాశీ తువ్వాలును విప్పాడు. అందులోని డబ్బుల కట్టలను టేబుల్‌పై వేశాడు. కుక్కకు బిస్కెట్ వేసినట్లుగా, తీసుకోమన్నట్లుగా తల ఊపాడు నీలకంఠం.‘‘ఎట్లా పెట్టుకుందాం పేమెంట్స్. వీక్లియా? మంత్లీయా? మనకి పొలిటికల్ మూమెంట్ ఉంది. ప్రమోషన్ కోసం ట్రై చేస్తాం. మన స్పాట్ మీద స్టేట్పాలిటిక్స్ నడుస్తుంది’’ ఇలా ఏవేవో మాట్లాడుతున్నాడునీలకంఠం.అటు నుంచి మాత్రం సౌండు లేదు. స్పందన లేదు.‘‘మాట్లాడు’’ అన్నాడు నీలకంఠం.నీలకంఠాన్ని కోపంగా ఒక్క తోపు తోసి...‘‘పోలీస్‌స్టేషన్ అంటే సారాబట్టీ అనుకున్నావా? ఊచల్లో పెట్టి వెన్నుపూసలు వంచడానికి వచ్చాను. మైండిట్ రాస్కెల్’’ అని హెచ్చరించాడు ఇన్స్పెక్టర్. -
నాన్న ఇంటికి రాలేదు!
తెలుగులో డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వారిని బాగా మెప్పించిన ఓ సినిమాలోని సన్నివేశాలివి. ఈ సినిమా స్క్రీన్‌ప్లే పరంగా చూపిన కొత్తదనం, చేసిన ప్రయోగం గుర్తించి, గుర్తుంచుకోదగ్గది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం.. సాయిరామ్‌కు మేనేజర్‌గా ప్రమోషన్ వచ్చి రెండు రోజులైంది. సాయిరామ్ కంటే మేనేజర్ అయ్యేందుకు ఎక్కువ అర్హతలున్న విశ్వనాథ్ రెండు రోజుల్నుంచి ఆఫీస్‌కు రాలేదు. ఆఫీస్‌కు వచ్చుంటే విశ్వనాథే మేనేజర్ అయ్యేవాడేమో! విశ్వనాథ్ ఎక్కడున్నాడు? సాయిరామ్ ఆలోచిస్తున్నాడు. ప్రమోషన్ వచ్చిన ఆనందం లేదు అతని కళ్లలో. విశ్వనాథ్ గురించే ఆలోచిస్తున్నాడు. ‘‘నాన్న ఇంకా ఇంటికి రాలేదంకుల్!’’ విశ్వనాథ్ కూతురు ముందురోజు రాత్రి ఫోన్లో చెప్పిన మాటలు సాయిరామ్‌కు పదేపదే గుర్తొస్తున్నాయి. అతనలా ఆలోచనల్లో ఉండగానే బేకరీ డెలివరీ బాయ్ ఒకతను వచ్చి, విశ్వనాథ్ ఆర్డర్ చేశాడంటూ కేక్ ఇచ్చి వెళ్లాడు. విశ్వనాథ్ తన కూతురు పుట్టినరోజు కోసం ఆర్డర్ చేసిన కేక్ అది. ఆ కేక్ తీసుకెళ్లి, విశ్వనాథ్ ఇంటికెళ్లాడు సాయిరామ్. విశ్వనాథ్ భార్య, కూతురు విశ్వనాథ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా, ఏదో చెడు వార్త వినడానికి సిద్ధమవుతున్నట్టుగా ఉంది. ‘‘ఆయన ఎక్కడికెళ్లారో మీకు తెల్సా?’’ అడిగింది విశ్వనాథ్ భార్య. తెలీదన్నట్టు తలూపాడు సాయిరామ్. ఇంట్లో చిన్న చిన్న గొడవలనీ, ఎంత గొడవ జరిగినా, రాత్రి ఫ్రెండ్స్ ఇంట్లో పడుకుని, తెల్లారేసరికల్లా వచ్చేస్తారనీ, పాప ఫోన్ చేస్తుందని ఫోన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచుకుంటారనీ, పాప రాత్రినుంచి ఏమీ తినలేదని, వాళ్ల నాన్న వచ్చేదాకా ఏమీ తిననని కూర్చుందని, ఆయన ఎక్కడున్నారో తెలిస్తే ఇంటికి రమ్మని చెప్పండంటూ విశ్వనాథ్ భార్య చెప్తూ పోతోంది. సాయిరామ్ నోటినుంచి ‘సరే’ తప్ప ఇంకేమాటా బయటకు రావడం లేదు. సాయిరామ్ లేచి, ఇంటి బయటకొచ్చి, బండి స్టార్ట్ చేశాడు. ఇంట్లోనుంచి పాప.. ‘‘అంకుల్.. అంకుల్.. ఆగండి!’’ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ‘‘మా నాన్నకు కోపమొచ్చినప్పుడు ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లరు. ఎక్కడికెళ్తారో నాకు తెలుసు. అక్కడికి తీసుకెళ్తారా? ప్లీజ్..’’ బతిమిలాడింది పాప. సాయిరామ్ తన బండిమీద పాపను ఎక్కించుకొని వెళ్తున్నాడు. కొద్దిదూరం వెళ్లాక, మెయిన్‌రోడ్ మీదనే ఉన్న ఒక బార్‌ను చూడడమే.. ‘‘ఇక్కడే.. ఇక్కడే..’’ అంటూ బండి ఆపింది పాప. ‘‘ఈ పైనే అంకుల్..’’ అంది ఆ పాప.‘‘మీ నాన్న డ్రింక్ చేయడు. ఏదో సరదాగా చెప్పుంటాడు..’’‘‘లేదంకుల్! మా నాన్న నాతో అస్సలు అబద్ధాలు చెప్పరు. ఒకసారి వెళ్లి చూద్దాం.. ప్లీజ్..’’ అంది పాప. నేను వెళ్లి చూసొస్తానంటూ సాయిరామ్ ఆ బార్ ఉన్న కాంప్లెక్స్ పై ఫ్లోర్‌కి వెళ్లాడు. కానీ సాయిరామ్‌కు తెలుసు.. అక్కడ విశ్వనాథ్ ఉండడని. చుట్టూ చూసినట్టు నటించాడు. విశ్వనాథ్ అక్కడ లేడని పాపతో చెప్పాడు. టెర్రస్‌పైన చూశారా? అక్కడ చూడండంటూ పాప మళ్లీ బతిమిలాడింది. సాయిరామ్ టెర్రస్ మీదకు వెళ్లకుండానే వెళ్లి చూసినట్టు, విశ్వనాథ్ అక్కడ కూడా లేడని పాపతో చెప్పాడు. సాయిరామ్‌కు ఎంత ప్రయత్నించినా ఏడుపు తన్నుకొస్తోంది. పాప ముందు మాత్రం స్థిరంగా నిలబడి, ‘‘మీ నాన్న ఎక్కడున్నా నేను తీసుకొస్తాను..’’ అని పాపకు ధైర్యమిచ్చే ప్రయత్నం చేశాడు. అదే సమయానికి సాయిరామ్‌కు ఒక ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘నమస్తే సార్! నా పైసలు రెడీనా?’’ అని ఆ గొంతు పలికింది. ఫోన్లోని వ్యక్తి సాయిరామ్‌తో డబ్బులకోసం బేరాలు సాగిస్తున్నాడు. సాయిరామ్ ఒక లెక్క చెబుతూంటే, ఫోన్లోని వ్యక్తి అంతకు ఎన్నోరెట్లు కావాలంటున్నాడు.‘రేయ్ దాస్! ఇది మోసంరా.. నేన్నిన్ను నమ్మాను..’’ అన్నాడు సాయిరామ్.‘‘నీకంటే పెద్ద మోసగాడినా? ఆ విశ్వనాథ్ నీతోనే పనిచేశేటోడు.. ఆణ్నే నువ్వు మోసం చెయ్యాలని చూసినవ్..’’.. దాస్ మాటలను మధ్యలోనే ఆపేస్తూ.. ‘‘అవున్రా.! నాదే తప్పు. చెంపలు వేసుకుంటున్నా. వాణ్ని వదిలెయ్‌రా..’’ అంటూ బతిమిలాడుతున్నాడు సాయిరామ్. ‘‘నా బండమ్మి పాతికవేలు ఇస్తాన్రా..’’ ఏడుస్తూ అడిగాడు సాయిరామ్. ‘‘నీ బాధలు ఇంటుంటే ఏడుపొస్తోంది సాబ్! నా బాధలు చెప్తే నువు గుడ ఏడుస్తవ్. విశ్వనాథ్ ఏడున్నడో చెప్పాలంటే లక్షా యాభైవేలు రెడీ చేస్కో..’’ ఆ చివరి మాట చెప్పాక దాస్ ఫోన్ కట్ చేశాడు. సాయిరామ్‌కు విశ్వనాథ్ ఎక్కడున్నాడో తల్చుకోవాలంటేనే భయంగా ఉంది. తనకు ప్రమోషన్ వచ్చేంత వరకు విశ్వనాథ్‌ను ఆఫీస్‌కు రాకుండా చేయమని సాయిరామ్ దాస్‌కు డబ్బులు ఇచ్చాడు. దాస్ సాయిరామ్ ప్లాన్‌ను తిప్పికొట్టి ఎక్కువ డబ్బుకోసం విశ్వనాథ్‌ను కిడ్నాప్ చేసి తానొక్కడికే తెలిసిన ప్లేస్‌లో ఉంచాడు. దాస్ అడిగినంతా ఇస్తే తప్ప విశ్వనాథ్ దొరకడు.సాయిరామ్ సరిగ్గా ఆ నిమిషం నుంచి పిచ్చోడిలా తిరిగాడు డబ్బుల కోసం. వాళ్లనడిగి, వీళ్లనడిగి డబ్బు కూడగట్టుకున్నాడు. విశ్వనాథ్ జాడ చెప్పగలిగే ఒకే ఒక్క వ్యక్తి దాస్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఫోనొచ్చింది. ‘‘పైసల్ తీస్కొని ఆల్వాల్ స్టేషన్‌కి రా.. అక్కడ బ్రిడ్జీ ఎక్కి సరిగ్గా మధ్యలో ఆగు. కింద రెండో నెంబర్ ప్లాట్‌ఫాం మీద నేను కనిపిస్తా. పైసలు బ్రిడ్జి మీద పెట్టు. విశ్వనాథ్ ఏడున్నడో బల్లమీద చీటీ రాసి పెడతా. తేడా వస్తే నీ దోస్ నీకు కనిపించడు. యాదుంచుకో..’’ దాస్ చెప్పాల్సిందంతా చెప్పి ఫోన్ కట్ చేశాడు. సాయిరామ్ ఆల్వాల్ స్టేషన్‌కి వెళ్లి బ్రిడ్జి ఎక్కి, మధ్యలో ఆగి చూశాడు. దాస్ కనిపించాడు. పిలిచాడు. అతను పలకలేదు. గట్టిగా పిలిచాడు. అయినా అతను పలకలేదు. సాయిరామ్ పరిగెత్తుకుంటూ దాస్ కూర్చొని ఉన్న బెంచీ దగ్గరికెళ్లి చూశాడు. దాస్ అప్పుడే బెంచీ మీద వాలిపోతూ ఉన్నాడు. సాయిరామ్ అతణ్ని కదిలించి చూశాడు. అతను అప్పుడే చివరిశ్వాస విడిచాడు. సాయిరామ్ వణికిపోతూ అతణ్నుంచి దూరంగా కదిలాడు. చుట్టూ జనం చేరారు. విశ్వనాథ్ ఎక్కడున్నాడో చనిపోయిన దాస్‌కు మాత్రమే తెలుసు. -
సాహెబ్ విశ్వనాథ్
నదిలో ప్రవాహం ఉంటుంది. కథలో ప్రవాహం ఉంటుంది.క్షణం ముందు ముట్టుకున్న నీటి బొట్టును మళ్లీ ముట్టుకోలేం. అలాంటి ఎన్నో కన్నీటి బొట్లు, ఆనందభాష్పాలతో మనల్నిఅలరించిన విశ్వనాథ్‌గారు ప్రేక్షక తపస్వి. సరస్సులో చలనం ఉండదు, ఆవేశం ఉండదు. స్థిరత్వం ఉంటుంది. దాని ఒడ్డున కూర్చున్న తపస్వి ప్రతిబింబం ఉంటుంది. విశ్వనాథ్‌గారి సినిమాల్లో మన ప్రతిబింబం ఉంటుంది. ప్రవాహం, ప్రతిబింబం కలబోసిన కళా తపస్వి, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత కాశీనాథుని విశ్వనాథ్‌గారితో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... ► స్వప్న: ‘కళా తపస్వి’ గారికి నమస్కారం! విశ్వనాథ్: ‘కళా తపస్వి’ అని ఎందుకు? విశ్వనాథ్‌గారు అనొచ్చు కదా! అలా పిలిస్తేనే నాకు హాయిగా ఉంటుంది. ► ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చిన సందర్భంగా మీ ఆనందాన్ని మాతో పంచుకుంటారా? విశ్వనాథ్: ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను... వినగలుగుతున్నాను... మాట్లాడగలుగుతున్నాను. ఈ స్టేజిలో అవార్డు ఇచ్చినందుకు ఆనందపడాలి. ఎందుకంటే... నేను ‘పద్మశ్రీ’ అవీ తీసుకున్న రోజుల్లో అలాంటి పురస్కారాలు దక్కించుకున్నవాళ్లలో చూడలేనివాళ్లు, నడవలేనివాళ్లు, వినపడనివాళ్లు ఉన్నారు. అవార్డు వచ్చిన ఆనందాన్ని నేను అనుభవించడం కంటే కూడా నా వీరాభిమానులందరూ తమ ఆనందాన్ని వెలిబుచ్చుతున్న తీరు చూస్తుంటే... నా వెనక ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందనే ఆనందం ఎక్కువగా కలుగుతోంది. ► ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డును అత్యున్నత పురస్కారంగా సినీ పరిశ్రమకు చెందినవారు భావిస్తారు. ఈ అవార్డు అంటే మీ మనసులో కలిగే భావన ఏంటి? విశ్వనాథ్: కాశీలో ఓ దేవుడు ఉన్నాడు. ఆయన గురించి అందరూ అనుకున్నట్లుగానే నేనూ అనుకుంటాను. శిరిడీలో సాయిబాబా ఉన్నాడు. మీ ఉద్దేశంలో సాయిబాబా అంటే? అనడిగితే... నేను గొప్ప భక్తుణ్ణి లేదా భక్తుణ్ణి అని చెబుతా. అలాగే, శాంతారామ్, సత్యజిత్ రే, దాదా సాహెబ్ ఫాల్కే వంటి కొందరు ఓ కేటగిరీలో ఉన్నారు. ఇప్పుడు ఒకరు ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ పేరుతో అవార్డు స్థాపించారు. దానికి ఒక విలువ ఏర్పడింది. జనాలు ఏదైతే మంచి, గొప్ప అనుకుంటున్నారో.. నేనూ దాన్నే ఫాలో అవుతా. భవిష్యత్తులో సత్యజిత్‌రే పేరుతో అవార్డు ఇచ్చినా అంతే. ఐయామ్ హ్యాపీ. ► దర్శకుడిగా చిత్రపరిశ్రమకు మీరెంతో సేవ చేశారు. అసలు మీ ఉద్దేశంలో గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ అంటే? విశ్వనాథ్: దర్శకుడిగా నేనేదో చేశానని ఎప్పుడూ అనుకోను. ఒకవేళ నేను టీచర్‌ను అయ్యుంటే పిల్లలకు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ టీచ్ చేయడం నా డ్యూటీ. ఒకవేళ డాక్టర్ అయితే నా పేషెంట్స్ ఎక్కువ రోజులు బతికేలా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాగే, దర్శకుడిగా నేను ఫాలో కావాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. సమాజానికి మంచి చేయకపోయినా, చెడు చేయకుండా ఉండడం కూడా కొంతవరకూ మేలే కదా. అలా అనుకుంటాను తప్ప నేనేదో మేలు చేశాననుకోను. మంచి సినిమాలు తీయడం నా బాధ్యత. సినిమాల్లో అనేక రకాలుంటాయి. నేను సంగీత, సాహిత్యాలను ఎంచుకున్నాను. మహానుభావులు త్యాగరాజస్వామి వంటివారు సంగీత, సాహిత్యాలను కాపాడడానికి తమ జీవితాలు ధారపోశారు. వాళ్ల తర్వాతే మనమంతా. ఈ తరం ప్రేక్షకులకు వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేనేం చేయగలను? వాట్ ఈజ్ మై కంట్రిబ్యూషన్? అని ఆలోచిస్తా. అంతే తప్ప... ‘నేనేదో గొప్ప చేశా, ఇండస్ట్రీలో కళలను కాపాడా’ వంటి మాటలు చెప్పను. ► సినిమా ఇండస్ట్రీ అంతా ఓ పోకడలో కొట్టుకుపోతూ, ప్రవాహంలో వెళ్తున్న టైమ్‌లో అడ్డుకట్ట వేసి మళ్లీ మీరు దాన్ని వెనక్కి తెచ్చారనే భావన మీ అభిమానుల్లో ఉంది... విశ్వనాథ్: నిజమే. ‘పాశ్చాత్య సంగీతపు పెను తుఫానులో రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ సంగీతపు జ్యోతిని కాపు కాయడానికి తన చేతులు అడ్డు పెట్టిన వారందరికీ పాదాభివందనం చేస్తున్నా’ అని ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రి డైలాగ్ చెబుతాడు. నేను అలా చేశానని నాకు పాదాభివందనం చేయమని కాదు. అభిమానుల అభిప్రాయాన్ని నేను ఒప్పుకుంటాను. ఇప్పటికీ ఒప్పుకోకపోతే నేను మూగవాణ్ణి అయిపోతా. నా బుద్ధి మేరకు నేను నిజంగానే చేశాను. క్లాసికల్ మ్యూజిక్, డ్యాన్స్ పెట్టి సినిమాలు చేస్తే ఎవరు ఆదరిస్తారు? ఇది కమర్షియల్ ఆర్ట్ కదా? మీ సినిమాలకు డబ్బు వస్తుందా? నిర్మాత ఏమవుతాడు? అన్నదానికి విరుద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. దాని ఫలితమే నాకు వచ్చిన అవార్డులు... ఈ రోజు వచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా! ► మీలో ఆధ్యాత్మిక కోణం, పూర్తి లౌకిక కోణం, ప్రపంచాన్ని ప్రేమించే ఓ కోణం కనిపించాయి. మీలోని జీవం ఈ మూడు పాత్రల్లో ఎక్కడుంది? విశ్వనాథ్: (నవ్వుతూ..) కిచిడీలాగా అన్నీ కలిపి ఉంటాయేమో! ఎందుకంటే... ఏ కథకైనా ఇవన్నీ ముఖ్యమైన పార్శా్వలే. దాంట్లో శృంగారం, ఆధ్యాత్మిక చింతన, మరొకటి, మరొకటి ఉండాలి. చిన్న సందేశం కూడా జోడించి ఉండాలని నా నమ్మకం. సినిమా కావొచ్చు... నాటకం కావొచ్చు... మరొకటి కావొచ్చు... ఈ కోణాలన్నీ ఉండాలి. వీటిని ఎవరికి తగ్గట్టుగా వాళ్ల మోతాదుల్లో చూపిస్తారు. నేను శృంగారం చూపిస్తే లో–కీలో ఉన్నట్టు ఉంటుంది. కానీ, ప్రేక్షకులను అది తప్పకుండా ఎగ్జయిట్ చేస్తుంది. బహుశా... కొన్ని పాత్రలను వాటి పరిమితుల్లో డీసెన్సీగా చూపడంలో నేను స్పెషలిస్ట్ అనుకుంటా! ఆడ, మగ.. ఒకరినొకరు ఇష్టపడ్డారంటే... పబ్లిగ్గా ఊటీ లేదా కొడైకెనాల్లో 600 మంది డ్యాన్సర్ల మధ్యలో ‘నేను నిన్ను ప్రేమిస్తున్నా’నని చెప్పవలసిన అవసరం ఉందా? లేదా? అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. లేదు, మనిద్దరం ఏ నది ఒడ్డునో, కొండల చాటునో ఉండి... ‘ఐ డోంట్ నో, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు మి. ఐ లైక్ యు’ అని కృత్రిమంగా కాకుండా హృదయం లోతుల్లో ఉన్న ప్రేమను ముఖ కవళికలతో, మాటల్లో చెబితే.. అక్కడుండే పవిత్రత ఎవర్గ్రీన్. కొన్నిటిని గుంబనంగా అట్టిపెడితేనే పదే పదే చూడాలనే ఆశ కలుగుతుంది. ► ‘మనసు పలికే మౌనగీతం’ పాటలో, ‘సిరివెన్నెల’ సినిమాలో ప్రేమను మీరు చూపించిన విధానం... విశ్వనాథ్: (ప్రశ్న మధ్యలోనే) ఒక్క సినిమా అని కాదు, ప్రతి సినిమాలోనూ అంతే. ‘సాగర సంగమం’లో కమల్‌హాసన్, జయప్రదల పాత్రల మధ్య అనుబంధం అలాగే ఉంటుంది. ‘స్వయంకృషి’లో మోటుగా ఉండే చిరంజీవి, చెప్పులు అట్టిపెట్టుకుని దేవాలయంలో చీటీలు ఇచ్చే విజయశాంతి మధ్య అనుబంధం అయినా అలాగే ఉంటుంది. ► ఇప్పుడు మీరు మీ సినిమాలన్నీ తలచుకుంటూ వాటిని అందమైన జ్ఞాపకాలుగా భావిస్తారా? ఇంకా ఏమైనా చేయాలనే తపన పడతారా? విశ్వనాథ్: నాకు ఏ తపనా లేదంటే సంతృప్తి వచ్చేసిందా? లేకపోతే బ్రెయిన్ పని చేయట్లేదు కాబట్టి తపన లేదంటున్నాడా? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. క్రియేటివిటీకి వయో పరిమితులు ఏమీ లేవని నా అభిప్రాయం. చివరి శ్వాస వరకు ఆలోచిస్తూనే ఉంటాం. అలాగని గతమంతా తలచుకుంటూ ఆనందపడిపోయి నేను చేయవలసింది ఏమీ లేదని కాదు. యాక్టర్, సింగర్, పెయింటర్... ఏ క్రియేటివ్ ఆర్టిస్ట్ అయినా ఇది కాదు ఇంకేదో ఉందనుకుంటాడు. ‘నువ్వు చాలా గొప్పగా నటించిన సినిమా ఏది?’ అని ఎవరినైనా అడిగితే... ఠక్కున ఒకటి చెప్పేస్తే అది కరెక్ట్ కాదు. అప్పటికి ఓకే. కానీ, మనసు మాత్రం ఇంకా ఎంతో ఉందని చెబుతుంది. అప్పుడే మనుగడ. నేను అలాంటి నమ్మకం ఉన్నవాణ్ణి. ఇవి చాలా డెలికేటెడ్ ఇష్యూస్. ఎప్పుడైనా ఎవ్వరూ లేనప్పుడు నాలుగు గోడలే నా ప్రేక్షకులు అనుకుని నా సినిమాలు నేను చూసుకున్నప్పుడు విపరీతమైన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అప్పుడు మనకీ ఆలోచన ఎలా వచ్చింది? అనిపిస్తుంటుంది. దురదృష్టం ఏంటంటే... అన్ని విషయాలనూ అందరితో పంచుకోలేం. కొన్నింటిని మాత్రమే క్లోజ్ ఫ్రెండ్స్‌తో పంచుకోగలం. అలా అని పాతవన్నీ తలుచుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నానని కాదు. ► నిజజీవిత, వాస్తవిక కథలు మిమ్మల్ని ఆకర్షించలేదా? విశ్వనాథ్: లేకేం! ఒకప్పుడు నాకు ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మిగారి పేరిట ‘విదుషీమణి’ అని సినిమా చేయాలనే ఒక కోరిక వచ్చింది. బయోపిక్స్ అనేవి ఒళ్లు దగ్గరపెట్టుకుని చేయాల్సినవి. ధృవీకరించిన విషయాలను చెప్పాలి. వాస్తవికంగా ఉండాలి. కల్పనగా ఉండకూడదు. అలా ఎప్పుడైతే చేయాలనుకుంటామో అప్పుడు భయం వేస్తుంది. అందుకే నేను బయోపిక్స్ జోలికి పోలేదు. ఇప్పుడు ‘శంకరాభరణం’ ఉంది. రాత్రికి రాత్రి శంకరశాస్త్రిగారి పాత్రలో మార్పులు చేయగలను. నన్నెవరూ అడగరు. అదొక ఫిక్షన్. సినిమా ఒక ఎఫెక్షన్. నా సినిమాలన్నీ, కథలన్నీ ఎప్పటికప్పుడు సొంతంగా ఆలోచించుకుని, అప్పటికప్పుడు విశ్వామిత్రుని సృష్టిలా.. ఇంచ్ బై ఇంచ్ పెంచుకుంటూ పోయి, దానిపేరు ‘సిరివెన్నెల’ అనో ‘స్వర్ణకమలం’ అనో ‘సూత్రధారులు’ అనో పేరు పెట్టుకుంటూ పోయి.. నా వస్తువులనే నమ్ముకుంటూ, వాటి మీద శ్రద్ధ పెట్టి కథలను తీర్చిదిద్దాను. ► రామ్‌గోపాల్ వర్మ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు విశ్వనాథ్‌గారికి తక్కువ.. విశ్వనాథ్‌గారు ఆయన కంటే గొప్పవారు అన్నారు. మీరేమంటారు? విశ్వనాథ్: అతని అభిప్రాయం అతనిది. అంతవరకే. నా మీద గౌరవం కానివ్వండి... లవ్ కానివ్వండి.. అందుకే ఆయన అలాంటి మాటలు అన్నారు.. నన్ను పొగడడానికి. ► మీరు తీసిన సినిమాల్లో మిమ్మల్ని కష్టపెట్టిన సినిమా? విశ్వనాథ్: నన్ను మానసికంగా బాగా ఇబ్బంది పెట్టి, బాగా చిత్రవధ చేసేసి, రాత్రీపగలూ ‘ఎందుకు ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం. మధ్యలో వదల్లేం. కంటిన్యూ చేయలేం, మార్గం కనిపించడం లేదు’ అని బాధ పెట్టిన సినిమా ‘సిరివెన్నెల’. అసలు ఒక మూగ అమ్మాయి ఏంటి? ఒక గుడ్డివాడు ఏంటి? వారిద్దరి మధ్యనా కనెక్షన్ ఏంటి? లిటికేషన్ ఏంటి? కథకుడిని నేనే కదా... దారిని సుగమంగా చేసుకోవచ్చు కదా. ఏదేమైనా అలాంటి క్లిష్టమైన సినిమాలు తీసినందుకు ఇప్పటికీ గర్వంగా ఉంటుంది. ► మీరెంతో మందితో సినిమాలు తీశారు. వాళ్లల్లో మీ ఫేవరట్ యాక్టర్? విశ్వనాథ్: అలా నాకు ఏ భేదం లేదు. ఆ సినిమా అయ్యేంత వరకు చిరంజీవిగారితో చేస్తుంటే నేను ఆయనకు సొంతం. ఆయన నాకు సొంతమైపోయి నటిస్తారు. అయిపోయింది వదిలేసుకుంటున్నాం అంటే అది అలాగే ఉంటుంది. ఇంట్లో కూడా నేను కొన్ని విషయాలను సీరియస్‌గా ఆలోచించకపోవచ్చు. అమ్మాయి సంబంధానికి కూడా నేను అంత ఇదిగా ఆలోచించకపోయి ఉండవచ్చు. కానీ, ఈ పాత్ర ఇక్కడ ఏం చేస్తుంది? ఎలా వ్యవహరిస్తుంది? అని నేను పడుతున్న బాధను ఒక ఆర్టిస్టుకు ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడం, ఆ ఆర్టిస్టు దాన్ని తన నటన ద్వారా చూపించడం... రెండూ సరిగ్గా కుదరడం ముఖ్యం. సీన్స్‌ని ఆర్టిస్టుకి వివరిస్తాను. మేం మా అభిప్రాయాలను పంచుకుంటాం. ఈ సినిమా పూరైన తర్వాత ఆయన ఎవరో? నేనెవరో? అంతే కదా. అయినా ఆ కాసేపు అతను నావాడు. నా మనిషి.. అంతే! ఆ అయిదు సినిమాలు బాగా నచ్చాయి విశ్వనాథ్‌గారి సినిమాల్లో నాకు అన్నీ ఇష్టమే. బాగా మనసుకి నచ్చిన ఐదు సినిమాలంటే శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వర్ణకమలం. వీటిలో ‘సిరివెన్నెల’ నా ఇంటి పేరుగా మారిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ విశ్వనాథ్‌గారు సినిమాలు తీశారు. -సిరివెన్నెల సీతారామశాస్త్రి శంకరాభరణం: శంకర శాస్త్రి గొప్ప సంగీత విద్వాంసుడు. ఊరంతా వెలివేసిన వేశ్య తులసికి మానవీయ దృక్పథంతో ఆశ్రయం కల్పిస్తాడాయన. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న శాస్త్రిని ఆదుకోవడానికి ఆయనకు తెలియకుండానే ఓ సంగీత కచేరీ ఏర్పాటు చేస్తుంది తులసి. ఆ వేదికపై తులసి కొడుకుని తన సంగీతవారసుడిగా ప్రకటించి, కన్నుమూస్తాడు శంకరశాస్త్రి. అతని పాదాల దగ్గరే ఆమె కన్ను మూస్తుంది. ‘మాస్’ చిత్రాల హవా సాగుతున్న టైమ్‌లో విశ్వనాథ్ తీసిన ఈ మ్యూజికల్ మూవీ మేజిక్ చేసింది. సాగర సంగమం: పెళ్లయ్యి, భర్తకు దూరంగా ఉంటుంది మాధవి. నాట్యాన్ని ఇష్టపడే బాలూని ప్రోత్సహించాలనుకుంటుంది. ఒకరి పట్ల మరొకరికి ఆరా«ధన మొదలవుతుంది. ఈలోగా మాధవి భర్త రావడంతో ఇద్దరూ దూరమవుతారు. మద్యానికి బానిస అయిన బాలు కొన్నేళ్లకు మాధవికి తారసపడతాడు. ఆమె కూతురికి నాట్యం నేర్పిస్తాడు. చివరికి మాధవి సమక్షంలోనే తుది శ్వాస వదులుతాడు. ఆ ఇద్దరి గుండెల్లో దాగున్న ప్రేమ ప్రేక్షకుల హృదయాన్ని మెలిపెడుతుంది. స్వాతిముత్యం: పెద్దలను ఎదిరించి ప్రేమించి, పెళ్లి చేసుకున్న లలిత భర్త చనిపోవడంతో ఒంటరిదవుతుంది. ఆమెకు సహాయం చేయాలంటే పెళ్లి చేసుకోవాలనుకుని, మూడు ముళ్లూ వేసేస్తాడు అమాయకుడు శివయ్య. అప్పటివరకూ పనీపాటా లేకుండా తిరిగిన శివయ్య లలితనూ, ఆమె కొడుకునీ పోషించడానికి గుడిలో ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ తర్వాత జరిగే అనేక మలుపులతో ఎమోషనల్‌గా సాగే ఈ చిత్రం ఓ ఆణిముత్యం. సిరివెన్నెల: అంధుడైన వేణువు విద్వాంసుడు, మూగ చిత్రకారిణి చుట్టూ తిరిగే ప్రేమకథ ‘సిరివెన్నెల’. ప్రేమకు మాట రాకపోయినా, చూపు లేకపోయినా మనసు ఉంటే చాలని చెప్పే సినిమా. ‘విధాత తలపున ప్రభవించినది..’, ‘ఈ గాలి ఈ నేల..’, ‘ఆది భిక్షువు వాడినేమి కోరేది..’ వంటి హిట్ పాటలతో ప్రేక్షకుల హృదయాలను మీటిన చిత్రం ఇది. స్వర్ణకమలం: కూచిపూడి నృత్యం నేర్చుకున్న మీనాక్షికి ఈ కళలు కడుపు నింపవనే భావన . విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటుంది. మీనాక్షి నాట్యం చూసి చంద్రశేఖర్ అభిమానించి, ఓ నృత్యప్రదర్శన ఏర్పాటు చేయిస్తాడు. మీనాక్షికి ఇది నచ్చదు. ఆ తర్వాత అమెరికాలో ఉన్న ఓ భారతీయ నర్తకి సహాయంతో మీనాక్షికి అక్కడికెళ్లే ఏర్పాటు చేస్తాడు. ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచి చంద్రశేఖర్‌కి తన పట్ల ఉన్న ప్రేమ అర్థమవుతుంది. మనసు మార్చుకుని అమెరికా వెళ్లకుండానే వెనుదిరుగుతుంది మీనాక్షి. ఈ చిత్రం ఓ స్వర్ణకమలం. ► సంపూర్ణమైన జీవితానికి కావాల్సిన అంశాలన్నీ చాలా సున్నితంగా స్పృశిస్తూ, మీ ప్రయాణం సాగింది. ఇది మీరు సంకల్పించుకోకపోయినా... మీకు ఓ బాట ఏర్పడిపోయింది. ఇది దైవేచ్ఛ అంటారా? విశ్వనాథ్‌గారి ఇచ్ఛ అంటారా? విశ్వనాథ్: నాకు ఇచ్ఛ ఉంటే ఉండొచ్చు. అది నెరవేరాలంటే దైవేచ్ఛ ఉండాలి. నాకు ఓ రోల్స్ రాయిస్ కారు కావాలని కలగనొచ్చు. అది తప్పు కాదు. టు గెట్ దట్ రోల్స్ రాయిస్ కార్ అండ్ ఎంజాయ్.... నాకు దేవుడి సహాయం కావాలి. మంచి అవార్డు రావాలి. నా సినిమా చూసి ప్రతివాడు ‘ఇది ఫలానా వాడి సినిమా, ఇది అతని స్టాంప్’ అనుకోవాలని లోపల తప్పకుండా నాకు కోరిక ఉంటుంది. అందుకోసమే అహర్నిశలు నేను ప్రయత్నిస్తా. అది బయటకు చెప్పను. కానీ, నా లక్ష్యం అదే. దానికోసం పనిచేస్తాను. దేవుడు నాకు అవకాశం కల్పించాలని వెయిట్ చేస్తాను. ‘పని చేస్తా. ఫలితం గురించి ఆలోచించను’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతా. – స్వప్న, ‘సాక్షి’ టీవీ -
చెంగలరాయుడుకు చేదు అనుభవం
విజయవాడ: కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగలరాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆయన భావించగా.. రైల్వేకోడూరు టీడీపీ నేతలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో చెంగలరాయుడు టీడీపీలో చేరడం తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. చెంగలరాయుడు టీడీపీలో చేరడం వలన పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని, ఆయన రూ. 70 కోట్ల కాంట్రాక్టు పనుల కోసమే పార్టీలోకి వస్తానంటున్నారని రైల్వేకోడూరు టీడీపీ ఇంఛార్జ్ విశ్వనాథ్ అన్నారు. చెంగలరాయుడుకు జిల్లాలోకానీ, నియోజకవర్గంలోకానీ ఎలాంటి బలం లేదని ఆయన విమర్శించారు. -
నాలుగేళ్లలో 5వేల పడకలకు!
♦ ఏడాది చివరికల్లా వెయ్యి పడకల ఆసుపత్రులు ♦ వచ్చేనె ల్లో బంజారాహిల్స్ ఆసుపత్రి ప్రారంభం ♦ 600 పడకలు; 300 కోట్ల వ్యయం ♦ వైద్యానికి టెక్నాలజీని జోడించటమే మా ప్రత్యేకత ♦ ‘విరించి’ సంస్థ వ్యవస్థాపకుడు విశ్వనాథ్ కొంపెల్ల సాక్షి, బిజినెస్ బ్యూరో: ‘‘వైద్య రంగంలో ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులొస్తున్నాయి. కానీ అవి మన దేశంలో అందుబాటులోకి రావటానికి చాలాకాలం పడుతోంది. టెలీ మెడిసిన్, రొబోటిక్ సర్జరీలు కూడా జరుగుతున్న ఈ రోజుల్లోనూ ఇంత సమయం పట్టడం సరికాదు’’ అని ‘విరించి’ సంస్థ వ్యవస్థాపకుడు విశ్వనాథ్ కొంపెల్ల చెప్పారు. ఐటీ సొల్యూషన్స్‌తో మొదలుపెట్టిన ఈ సంస్థ హెల్త్‌కేర్ టెక్నాలజీస్‌పై దృష్టిపెట్టింది. నూరు శాతం అనుబంధంగా ఉన్న ‘విరించి హెల్త్‌కేర్ సొల్యూషన్స్’ ద్వారా ఇప్పటికే హైదరాబాద్‌లోని బర్కత్‌పుర, హయత్‌నగర్‌లో రెండు ఆసుపత్రులుండగా... బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్-1లో 600 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తోంది. వచ్చేనెలలో ఇది ఆరంభం కానున్న నేపథ్యంలో బుధవారమిక్కడ విలేకరులతో విశ్వనాథ్‌తో పాటు సీనియర్ మేనేజ్మెంట్ ప్రతినిధులు విశాల్ రంజన్, శ్రీనివాస్ మైనా, డాక్టర్ మూర్తి నెక్కంటి మాట్లాడారు. హెల్త్‌కేర్‌లో తాము అందుబాటులోకి తెస్తున్న టెక్నాలజీని వివరించారు. ఈ ఏడాది చివరకు తమ ఆసుపత్రులు వెయ్యి పడకలకు విస్తరిస్తాయని, 2020 చివరి నాటికి 5వేల పడకలకు విస్తరించాలన్నది లక్ష్యమని చెప్పారు. ‘సైన్స్ అందరికీ అందుబాటులో ఉండాలి. అందులో వస్తున్న మార్పులు ప్రతి ఒక్కరికీ కావాలి. ఇవి అందించటమే లక్ష్యంగా హెల్త్‌కేర్‌లో అడుగులేస్తున్నాం’’ అని విశ్వనాథ్ చెప్పారు. రూపు మారిన అశోకా మాల్!! బంజారాహిల్స్‌లోని అశోకామాల్ హైదరాబాదీలందరికీ సుపరిచితమే. పెద్ద పెద్ద సంస్థలు తమ దుకాణాలు తెరిచినా ఎందుకనో సక్సెస్ కాలేదు. దాన్ని 30 ఏళ్లపాటు లీజుకు తీసుకుని విరించి సంస్థ ఆసుపత్రిగా మార్చింది. దీనికోసం రూ.300 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు విశ్వనాథ్ చెప్పారు. దీన్ని అంతర్గత వనరులు, రుణం ద్వారా సమకూర్చుకుంటున్నట్లు వెల్లడించారు. ‘‘వచ్చేనెల్లో దీన్ని ఆరంభిస్తాం. మొత్తం ఆసుపత్రి 4.50 లక్షల చదరపు అడుగుల్లో వస్తుంది’’ అన్నారాయన. అమెరికాలో తమ సంస్థకున్న శాఖల ద్వారా అక్కడి వైద్య పరిజ్ఞానాన్ని ఇక్కడ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మున్ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు జిల్లాల్లో ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తామని, అవసరమైతే ఇతర ఆసుపత్రులను కొంటామని, నిధుల సేకరణకు షేర్ల జారీ వంటి మార్గాలను కూడా పరిశీలిస్తామని ఆయన తెలియజేశారు. ఈ ఆసుపత్రులన్నీ 200 నుంచి 500 పడకల మధ ్య ఉండే అవకాశముందని తెలిపారు. ఆసుపత్రుల విస్తరణకు అవసరాన్ని బట్టి ఎంత మొత్తం సమీకరించాలనేది నిర్ణయిస్తామని చెప్పారాయన. బంజారాహిల్స్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సహా అత్యాధునిక పరికరాలన్నీ తెస్తున్నామని 15000 రకాల పరీక్షలు చేసే ల్యాబ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. బహుశా! ఇలాంటి ల్యాబ్ దేశంలో ఇదే మొదటిది కావొచ్చన్నారు. వైద్యంతో పాటు టెక్నాలజీ... ‘‘అత్యుత్తమ వైద్యం అందించటమే ఏ ఆసుపత్రికైనా గీటురాయి. దానికి మేం టెక్నాలజీని జోడిస్తున్నాం. విరించి ఆసుపత్రిలో కంప్యూటర్లుండవు. మొబైల్స్, ట్యాబ్లెట్లతోనే వ్యవస్థ నడుస్తుంది. పేషెంట్ చేరిన వెంటనే యాప్‌లో రిజిస్టర్ చేస్తాం. అక్కడి నుంచి ప్రతి వైద్య పరీక్షా అందులో నమోదవుతుంది. దాన్ని వేరే వైద్యుడికి పంపటమూ ఈజీనే. వైద్య పరీక్షల ఫలితాలు ఏడాది తరవాత చూసుకున్నా భద్రంగా ఉంటాయి. అదే కాదు. హెల్త్‌కేర్ టెక్నాలజీలో మాకున్న నైపుణ్యాన్నంతా వినియోగించి విదేశాల్లో అందుబాటులోకి వచ్చిన అత్యుత్తమ వైద్యాన్ని ఇక్కడికి తెస్తాం. వీడియో కన్సల్టింగ్ సహా రకరకాల మార్గాల ద్వారా అమెరికాలోని నిపుణుల సాయం తీసుకుంటాం. డిశ్చార్జి అయ్యేటపుడు బిల్లు కూడా మొబైల్‌కే వస్తుంది. లైన్లో నిల్చుని చెల్లించే బాధ కూడా ఉండదు’’ అంటూ తమ ఆసుపత్రి గురించి విశ్వనాథ్ వివరించారు. -
మిస్టరీగా ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి మరణం
సూరత్ నుంచి విశాఖకు మృతదేహం దర్యాప్తులో కారణాలు తెలుస్తాయంటున్న అధికారులు రోదిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గోపాలపట్నం : సెలవులు పూర్తి చేసుకుని తిరిగి విధులకు హాజరవుతున్న తరుణంలో ఏం జరిగిందో ఏమో... ఆ ఉద్యోగి రైలు ప్రమాద సంఘటనలో మరణించాడు. చిన్నవయసులోనే కుటుంబానికి పెద్దదిక్కుగా మారిన ఆ యువకుడు ఇప్పుడు అందని లోకాలకు వెళ్లిపోయి అందరినీ శోకసంద్రంలో ముంచేశాడు. గోపాలపట్నం చంద్రనగర్‌కి చెందిన వీర్ల విశ్వనాథ్(28) ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో నాన్ కమిషన్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. జూన్2న తల్లిదండ్రులను చూడడానికి సెలవుపై చంద్రనగర్ వచ్చాడు. తిరిగి గత శనివారం ఇంటి నుంచి సూరత్ బయల్దేరి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం సూరత్‌కి 20 కిలోమీటర్ల దూరం ఉందనగా ఏం జరిగిందో ఏమో... విశ్వనాథ్ మరణించాడన్న చేదు కబురు ఇంటికి చేరింది. మంగళవారం విశ్వనాథ్ మృతదేహాన్ని సూరత్ నుంచి ఎయిర్‌ఫోర్సు అధికారులు విశాఖ విమానాశ్రయానికి తీసుకు వచ్చారు. వారెంట్ అధికారి ఆర్.సింగ్‌తో సహా అధికారులు గౌరవ వందనం చేశారు. విమానాశ్రయం నుంచి చంద్రనగర్‌కి మృతదేహాన్ని వ్యానులో ఊరేగింపుగా తీసుకొచ్చారు. పెద్ద దిక్కయి... పరలోకాలకు... చంద్రనగర్‌కు చెందిన చక్రరావు, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక్క కొడుకు విశ్వనాథ్. చక్రరావు చాలాకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో విశ్వనాథ్ ఇంటికి పెద్దదిక్కయ్యాడు. పంతొమ్మిదో ఏటే ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో ఉద్యోగం సంపాదించాడు. అక్క స్వాతి పెళ్లి జరిపించాడు. ఇంటి బాధ్యతలు భుజానికెత్తుకున్న తరుణంలో విశ్వనాథ్ మరణించాడన్న నిజాన్ని తల్లిదండ్రలు జీర్ణించుకోలేక గుండెలు బాదుకుని విలపిస్తున్నారు. తల్లి వెంకటలక్ష్మి, అక్క స్వాతి, చెల్లి శ్రావణి రాజ్యలక్ష్మి విలపిస్తున్న తీరు చూపరులను కలచివేస్తోంది. ఇక్కడి చంద్రనగర్ శ్మశానవాటికలో విశ్వనాథ్ భౌతికకాయానికి తండ్రి చక్రరావు అంత్యక్రియలు జరిపారు. స్థానికులతోపాటు పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు. మిస్టరీగా విశ్వనాథ్ మరణం విశ్వనాథ్ ఎలా మరణించాడో ఎయిర్‌ఫోర్సు అధికారులు తెలియజేయడం లేదు. రైలు ప్రమాదంలో మరణించినట్లు సమాచారం ఉందని... ఇది ఎలా జరిగిందో దర్యాప్తు జరగాల్సి ఉందని మృతదేహాన్ని తీసుకొచ్చిన అధికారులు తల్లిదండ్రులకు తెలియజేశారు. చివరి నిమిషంలో తల్లిదండ్రుల కోరిక పై విశ్వనాథ్ ముఖాన్ని అధికారులు చూపించినా ఫొటోలు తీసేందుకు అనుమతించలేదు. దీన్నో మిస్టరీగా బంధుమిత్రులు, స్థానికులు చర్చించుకుంటున్నారు. -
ఆ పదవికి ఆయన తగడు
దిగ్విజయ్ సింగ్‌ను కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ పదవినుంచి తప్పించండి పార్టీ బలోపేతానికి ఆయన చేసిందేమీ లేదు కాంగ్రెస్ సీనియర్ నేత హెచ్.విశ్వనాథ్ బెంగళూరు: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ సీనియర్ నేత హెచ్.విశ్వనాథ్ పేర్కొన్నారు. దిగ్విజయ్ సింగ్‌ను మార్చాలన్న కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేల డిమాండ్ సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో దిగ్విజయ్ సింగ్‌ను మార్చడం అత్యంత ఆవశ్యకమని విశ్వనాథ్ పేర్కొన్నారు. దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వస్తారు, వెళ్లిపోతారు తప్పితే పార్టీ పటిష్టత కోసం ఆయన చేస్తున్నదేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి చెందిన నేతలతో అసలు దిగ్విజయ్ సింగ్ సమావేశం కారని, వారి అభిప్రాయాలను తెలుసుకోరని విమర్శించారు. గతంలో కర్ణాటక వ్యవహారాల ఇన్చార్గా ఉన్న గులామ్‌నబీ ఆజాద్ రాష్ట్రంలో పరిస్థితులు తెలుసుకునేందుకు బస్‌లో పర్యటించి పార్టీ పటిష్టత కోసం కృషి చేసేవారని ఈ సందర్భంగా విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు. -
ఏటీఎం గార్డే.. దొంగ..
వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఎస్బీఐ ఏటీఎం దగ్గర బంగారు నగల చోరీకి పాల్పడింది... అక్కడ విధులు నిర్వహిస్తున్న గార్డేనని తేలింది. ఎస్బీఐ స్థానిక శాఖ వద్ద గార్డ్‌గా పనిచేస్తున్న శ్రీరాములు సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బ్యాంకు ఏటీఎం దగ్గరకు వెళ్లాడు. వాహనాన్ని నిలిపి లోపలికి వెళ్లి నగదు డ్రా చేసుకుని వచ్చాడు. ఏటీఎం బయట గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న విశ్వనాథ్... ద్విచక్ర వాహనంలో ఉంచిన 30 తులాల బంగారు ఆభరణాల బ్యాగును కొట్టేశాడు. నగల బ్యాగు కనిపించకపోవడంతో కంగారుపడ్డ శ్రీరాములు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడింది సెక్యూరిటీ గార్డ్ విశ్వనాథ్‌గా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. -
తెరపైకి పోస్టర్లు అంటించే కుర్రాళ్ల జీవితాలు
తాజ్‌మహల్‌కు రాళ్లెత్తిన కూలీలను ఎవరూ పట్టించుకుంటారు? అలాగే సినిమా ప్రచారానికి పోస్టరు అంటిం చేవారి జీవితాల గురించి అసలు ఎవరూ ఆలోచించరు. అలాంటి ముగ్గురు కుర్రాళ్ల జీవన విధానాలను ఆవిష్కరించే చిత్రంగా కె-3 తెరకెక్కించింది. కామథేను ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన చిత్రం ద్వారా ఛాయాగ్రాహకుడు ఎంఎస్ అన్నాదురై దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన కథ, కథనం, మాటలు, ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన చిత్రంలో విమల్‌రాజ్ హీరోగాను, ఆదిర హీరోయిన్‌గాను నటించారు. విశ్వంత్, సుదీర్, పావలా లక్ష్మణ్‌మీసై రాజేంద్రనాథ్‌లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎన్.తిరుమురుగన్, ఏ.ప్రకాష్‌రాజ్ సహ నిర్మాతులగా వ్యవహరిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వివరించారు. అర్ధరాత్రుల్లో పోస్టర్లు అతికించే కదీర్, గంజా, కరుప్పు అనే ముగ్గురు యువకుల జీవన విధానాలే చిత్రకథ అని తెలిపారు. అందుకే ఈ చిత్రానికి కే-3 అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ముగ్గురు కూలీలుగా ఎలామారారు? అం దుకు ఎవరు కారణం? లాంటి పలు ఆసక్తికరమైన అంశాలతో విభిన్న కథనంతో తెరకెక్కిస్తున్న చిత్రం కే-3 అని చెప్పారు. ఈ పోస్టర్లు అం టించే పని ని 18 నుంచి 20 వయసుగల వా రే అధికంగా చేస్తుంటారు. చిత్ర షూ టింగ్‌ను తిరునెల్వేలి, కేరళ, చెన్నై, సే లం మొదలగు ప్రాంతాల్లో నిర్వహిం చినట్లు తెలిపారు. చిత్ర నిర్మాణం పూర్తయ్యిందని, ఈ నెల 20న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఓ కన్నడ నిర్మాత కన్నడ, తెలుగు అనువాద హక్కులను పొందినట్లు చెప్పారు. -
అధికార పార్టీ అండతో రాత్రికి రాత్రే కబ్జా
హిందూపురం : అధికార పార్టీ అండ ఉంటే చాలు.. కోర్టు పరిధిలో ఉన్న భూమైనా కేవలం 24గంటల్లో కబ్జా చేసేయవచ్చు. కోట్లు విలువజే సే భూమైతే చాటు ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయచ్చు. హిందూపురం పట్టణంలోని ధన్‌రోడ్డు సమీపంలో ఉన్న ఓ భూమిని సోమవారం రాత్రికి రాత్రే ఓ రియల్టర్ కబ్జా చేయడమే ఇందుకు ఉదాహరణ. బాధితుడు లక్ష్మినరసారెడ్డి తెలిపిన మేరకు పూర్తీ వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ధన్‌రోడ్డు సమీపంలో వై.తిమ్మారెడ్డి, లక్ష్మినరసారెడ్డి, రమేష్‌రెడ్డి అన్నదమ్ముల పేరిట (సర్వే నంబరు 66/1ఎ1) 18.40 ఎకరాల పొలం ఉంది. ఇందులో మూడోవంతు భాగం 6.40 ఎకరాల స్థలాన్ని బెంగళూరుకు చెందిన రాంప్రసాద్, సంధ్యారాణి, రజని, నగేష్‌కు విక్రయించారు. వీరు ఆ స్థలాన్ని 2012లో వేరొకరికి విక్రయించారు. అయితే విక్రయ సమయంలో సర్వే నంబరు తప్పుగా రావడంతో బాధిత అన్నదమ్ములు కోర్టును ఆశ్రయించారు. నాటి నుంచి ఆ స్థలం కోర్టు పరిధిలో ఉంది. అయితే కాలక్రమేనా కోర్టు పరిధిలో ఉన్న 6.40ఎకరాల స్థలానికి అమాంతం ధర పెరిగిపోయింది. సుమారు రూ.10 కోట్లు విలువజేసే ఆ స్థలంపై బెంగుళూరుకు చెందిన రియల్టర్ టీ.నాగబాబు కన్ను పడింది. అంతే తడవుగా బెంగళూరుకు చెందిన రాంప్రసాద్, సంధ్యారాణి, రజని, నగేష్ పేరిట బినామీ అగ్రిమెంట్ సృష్టించుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధిత లక్ష్మినరసారెడ్డి పదిరోజుల క్రితం మరోమారు కోర్టును ఆశ్రయించాడు. ఈ లోగా నాగబాబు గతంలో పనిచేసిన తహశీల్దార్ విశ్వనాథ్, ఓ కానిస్టేబుల్ సాయంతో నకిలీ పాసుపుస్తకాలు సృష్టించాడు. తన అనుచరగణంతో సోమవారం రాత్రి 6.40ఎకరాల భూమిని కబ్జా చేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. రియల్టర్ ప్రస్తుత మంత్రికి బంధువని, అందుకే కోర్టు పరిధిలో ఉన్నా ఆ భూమిని కబ్జా చేశాడని బాధితుడు లక్ష్మినరసారెడ్డి సాక్షికి తనగోడు వెళ్లబోసుకున్నాడు. స్థల విషయమై కోర్టు స్పందించి ప్రస్తుత తహశీల్దార్‌కు మంగళవారం నోటీసులు జారీ చేసినట్లు తెలిపాడు. -
తుంగభద్ర తీర వాసులకు వరద ముప్పు
10 గేట్ల ద్వారా దిగువకు 22 వేల క్యూసెక్కుల నీరు విడుదల హొస్పేట : తుంగభద్ర జలాశయం ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండటంతో డ్యాంలోకి లక్ష క్యూసెక్కులకు పైగా వరదనీరు శుక్రవారం రాత్రికి వచ్చి చేరనుండటంతో శుక్రవారం సాయంత్రం డ్యాంకు సంబంధించిన 10 క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు 22 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు విడుదల చేశారు. అదే విధంగా శనివారం ఏ సమయంలోనైనా 22 క్రస్ట్ గేట్లను పెకైత్తి లక్ష పైచిలుకు క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఏ సమయంలోనైనా డ్యాం నుంచి భారీగా నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర బోర్డు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 10 తుంగభద్ర గేట్ల ఎత్తివేత తుంగభద్ర డ్యాం పూర్తిగా నిండటంతో శుక్రవారం ఉదయం తుంగభద్ర బోర్డు అధికారులు డ్యాం వద్ద విశేష పూజలు చేసి 10 క్రస్ట్ గేట్లను పెకైత్తి దిగువకు నీరు విడుదల చేశారు. డ్యాంకు చెందిన మొత్తం 33 క్లస్టర్ గేట్లలో ఉదయం 3 గేట్లను ఒక్కొక్క గేటును 9 అంగుళాల మేర పెకైత్తి మొత్తం 4,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి మొత్తం 10 గేట్లు 2 అడుగుల మేర పెకైత్తి 22 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా తుంగభద్ర మండలి కార్యదర్శి జీ.రంగారెడ్డి, ఈఈ ఇంగళల్లి, డ్యాం జేఈ వీరేష్, గార్డెన్ సూపరింటెండెంట్ విశ్వనాథ్, డ్యాం ఇన్చార్జ్ అధికారి పార్థసారథి, మునిరాబాద్ ఇరిగేషన్ ఈఈ భోజానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్మార్ట్ సిటీ’ దిశగా కదలిక
తిరుపతిని స్మార్ట్ సిటీగా అభి వృద్ధిచేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తిరుపతిని స్మార్ట్ సిటీగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించే బాధ్యతను రాష్ట్ర ప్రణాళికా విభాగం ఓఎస్డీ విశ్వనాథ్‌కు అప్పగించా రు. ఆ నివేదిక ఆధారంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించడానికి టెండర్ పిలవాలని నిర్ణయించారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: దేశంలో 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం విదితమే. ఇందుకు బడ్జెట్లో రూ.7060 కోట్లను కేటాయించింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద తిరుపతిని కూడా కేంద్రం ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను రూపొందించే పనిని రాష్ట్ర ప్రణాళిక విభాగం ఓఎస్డీ విశ్వనాథ్‌కు అప్పగించారు. జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్, తుడా వీసీ వెంకటేశ్వరరెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ సకలారెడ్డి, ప్రణాళిక విభాగం ఓఎస్డీ విశ్వనాథ్, ఆర్డీవో రంగయ్య ఇటీవల సమావేశమయ్యారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి అందుబాటులో ఉన్న వనరులను గుర్తించాలని నిర్ణయించారు. తిరుపతి నగరంతోపాటూ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించడంతో.. రెవెన్యూ అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఇక తిరుపతిలో 2050 నాటికి పెరిగే జనాభా.. భక్తుల సంఖ్యను అంచనా వేసి, అప్పటి అవసరాలను తీర్చేలా రోడ్లు, తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వంటి వాటిని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. తిరుపతి నగరంలో తిరుపతి ఈస్డ్, తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతి ఈస్ట్ రైల్వేస్టేషన్నే అధికంగా వినియోగించుకుంటున్నారు. తిరుపతి ఈస్ట్ రైల్వేస్టేషన్ తరహాలోనే వెస్ట్తోపాటూ మరో రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసే ప్రతిపాదనలను సిద్ధం చేసే బాధ్యతను ఆ శాఖ అధికారులకు అప్పగించారు. తిరుపతికి ఉత్తరం వైపున ఏడుకొండలు విస్తరించి ఉన్నాయి. నగరాన్ని విస్తరించాలంటే.. తూర్పు, పశ్చిమ, దక్షిణ దిశల వైపు అభివృద్ధి చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి.. నగరాన్ని విస్తరించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. ప్రణాళికా విభాగం ఓఎస్డీ విశ్వనాథ్ రూపొందించే ప్రాథమిక నివేదిక ఆధారంగా తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారుచేయడానికి గ్లోబల్ టెండరు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీపీఆర్‌కు టెండర్లు పిలవడానికి కనీసం ఆర్నెళ్లు పట్టే అవకాశం ఉందని తిరుపతి కార్పొరేషన్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - కె. విశ్వనాథ్