
(ఫైల్ ఫోటో)
కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు.. భారతీయ సంస్కృతీ, సంప్రదాయలు మరీ ముఖ్యంగా మన తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణము..
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. కళా తపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను..
- నందమూరి బాలకృష్ణ
కాగా విశ్వనాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఏకైక చిత్రం జననీ జన్మభూమి(1984). కానీ, ఆ చిత్రం ఆడలేదు. అయితే.. నరసింహానాయుడు, సీమ సింహం, లక్ష్మీ నరసింహా, పాండు రంగడు చిత్రాల్లో బాలకృష్ణ తండ్రి పాత్రలో అలరించారు కళాతపస్వి.