కళాతపస్వీ కె. విశ్వనాథ్ మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఇక లేరన్న వార్త తెలిసి చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. గొప్ప దర్శకుడిగానే కాకుండా ఇండస్ట్రీ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందంటూ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులంతా కదిలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కె.విశ్వనాథ్ నివాసానికి చేరుకొని ఆయన పార్థీవదేహానికి నివాళులు అర్పిస్తున్నారు.
ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కె. విశ్వనాథ్ మృతి నేపథ్యంలో సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన మరణానికి నివాళిగా సినిమా నేడు జరగనున్న అన్ని షూటింగులు బంద్ చేస్తున్నట్లు తెలిపింది. స్వచ్చందంగానే షూటింగులను నిలిపివేసినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment