viswanath
-
తెలుగు సినిమాలకు ఆభరణం... శంకరాభరణం
కె. విశ్వనాథ్ చిత్రాలన్నీ విలక్షణమైనవే అయినా వాటిలో ‘శంకరాభరణం’ గురించి ముందుగా చెప్పుకోవాలి. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యమిది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ సినిమాను చూస్తే మనవైన సంగీత, సాహిత్య, నృత్య కళలపై గౌరవం ఉప్పొంగి గర్వం పెల్లుబుకుతుంది. 1980లో విడు దలైన ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం. ఇందులోని సంగీతం, సాహిత్యం ఇప్పటికీ వీనుల విందు చేస్తాయి. విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభను గొప్పగా ఆవిష్కరించిన సినిమా ఇది. ఇంకా చెప్పాలంటే ఆయన సినీ కెరీర్‌నే మార్చేసిన మూవీ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎందరో మేధావులతో పాటు సామాన్యులను సైతం మెప్పించింది.రూ. పదమూడున్నర లక్షలతో...పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు ఈ సినిమాను నిర్మించారు. శంకర శాస్త్రి పాత్ర కోసం ముందుగా కృష్ణంరాజు, శివాజీ గణేశన్ వంటి వారిని అనుకున్నారు. చివరగా ఇమేజ్ ఉన్న నటుడు ఈ పాత్ర చేస్తే పండదని భావించి జేవీ సోమయాజులను తీసుకున్నారు విశ్వనాథ్. అప్పటికే ఆయన డిప్యూటీకలెక్టర్గా పని చేస్తున్నారు. అప్పట్లో ఈ సినిమాను పదమూడున్నర లక్షల రూపాయలతో తెరకెక్కించారు. 55 నుంచి 60 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాను ఎక్కువగా రాజమండ్రి, రఘుదేవపురం, పోలవరం, రామచంద్రాపురం, అన్నవరం, సోమవరం, చెన్నైలోని తిరువాన్మయూరు, కర్ణాటకలోని బేలూరు, హలిబేడులో చిత్రీకరించారు.తెలుగు సినిమాకు కొత్త దారి...అప్పటివరకూ ఉన్న ట్రెండ్‌కి భిన్నంగా తెరకెక్కిన ‘శంకరాభరణం’ తెలుగు సినిమాకు సరికొత్త దారి చూపించింది. తెలుగు సినీ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, కళలకు పట్టం కడుతూ తీసిన ఈ సినిమాలోని పాటలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి. విశ్వనాథ్ సినిమాల కథాకథనాలు సున్నితంగానే ఉంటాయి. కానీ, బలమైన అంశాలను ఆయన తన సినిమాల్లో చర్చిస్తారు. సాంఘిక దురాచారాలను, పశుప్రవృత్తిని ఎండగడతారు. మన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తు చేస్తారు. మనలోని సున్నిత భావాలను మేల్కొలిపే ప్రయత్నం చేస్తారు. ఆకాంక్షలు, ఆశయాలు, విలువలను ముందు తరాలకు అందించే ప్రయత్నం చేస్తారు. ‘శంకరాభరణం’ సినిమాలో శంకర శాస్త్రి క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది. అందుకే కాలాన్ని, మారుతున్న అభిరుచుల్ని తట్టుకుని ఇప్పటికీ గొప్ప సినిమాగా నిలిచిపోయింది.ఫక్తు క్లాస్ సినిమా అయినప్పటికీ...శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన ఆ రోజుల్లో ఎంతో మంది సంగీతం నేర్చుకోవటం మొదలు పెట్టారంటే ‘శంకరాభరణం’ ప్రభావం ఎంతలా పని చేసిందో అర్థమవుతుంది. స్వర్ణ కమలం అవార్డ్ అందుకున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఈ సినిమాకు ఉత్తమ నేప«థ్య గాయకుడుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొలి సారి జాతీయ అవార్డు అందుకున్నారు. అంతేకాదు వాణి జయరాంకు ఉత్తమ గాయకురాలిగా, కేవీ మహదేవన్స్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు దక్కాయి. ఫక్తు క్లాస్ సినిమా అయిన ‘శంకరాభరణం’కు మాస్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. సినిమాలంటే ఇష్టం లేని వారు సైతం ఈ సినిమా కోసం థియేటర్‌కు వెళ్లిన సందర్భాలున్నాయి.‘శంకరాభరణం’ విడుదలైన రోజునే...విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభతో పాటు కేవీ మహదేవన్ సంగీతం ఈ సినిమాకు ప్రాణంగా నిలిస్తే.. జంధ్యాల మాటలు, జేవీ సోమయాజులు, మంజుభార్గవి, అల్లు రామలింగయ్యల నటన ‘శంకరాభరణం’ను ఓ కళాఖండంగా మార్చాయి. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్, యంజీఆర్, రాజ్‌కుమార్, హిందీలో శాంతారామ్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్, జితేంద్ర, సంజీవ్ కుమార్ ఈ సినిమాను పని గట్టుకొని మరీ చూసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. కాకతాళీయమో విధి విచిత్రమో గాని... 44 ఏళ్ల క్రితం ‘శంకరాభరణం’ రిలీజైన రోజునే విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 1980 ఫిబ్రవరి 2న ‘శంకరాభరణం’ విడుదలైతే 2023 ఫిబ్రవరి 2న ఆయన కన్నుమూశారు. విశ్వనాథ్ భౌతికంగా దూరమయ్యారు కానీ తాను తెరకెక్కించిన చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసుల్లో సజీవంగా ఉన్నారు. – దాచేపల్లి సురేష్‌కుమార్ -
నాకు ఆ పేరుతో పిలిపించుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే..!
-
నన్ను చాలా బాధ పెట్టిన సినిమా సిరివెన్నెల
-
నాకు సినిమాలో ఛాన్స్ లు రావడం లేదు: విశ్వనాథ్
-
నా తమ్ముడే నన్ను ప్రశ్నిస్తాడు అని అనుకోలేదు
-
నాకు ఎవరూ ఇష్టం లేదు... కానీ నన్ను చాలామంది ఇష్టపడ్డారు
-
అలాంటి సినిమా చేయాలి అంటే చాలా ధైర్యం ఉండాలి
-
వీళ్ళిద్దరి మధ్య బేధం ఇదే: విశ్వనాథ్
-
గోల్డెన్ డేస్ గుర్తు చేసుకుంటున్నా విశ్వనాథ్ గారు
-
నాకు అలాంటి సినిమాలు చేయాలని లేదు : కె.విశ్వనాథ్
-
నేను తీసిన కొన్ని సినిమాలు నాకు నచ్చవు
-
కె. విశ్వనాథ్ గారు చాలా మంచి వేత్తి : గాయని వాణీ జయరామ్
-
విశ్వనాథ్ గారు నన్ను అమ్మాయి అని కూడా చూడకుండా తిట్టేవాడు..
-
కళాతపస్వి కె. విశ్వనాథ్.. ఆ సినిమా విషయంలో చిత్రవధ అనుభవించారట
కళాతపస్వి కె. విశ్వనాథ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రాల్లో 'సిరివెన్నెల' ఒకటి. తెలుగుతెరపై మరో కళాఖండముగా నిలిచిపోయిందీ చిత్రం. అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు దర్శకుడిగా విశ్వనాథ్ కీర్తిని ఆకాశాన్ని తాకేలా చేసింది.కానీ ఇదే సినిమా తనను మానసికంగా చిత్రవధకు గురిచేసిందని స్వయంగా విశ్వనాథ్ గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన అలా ఎందుకు అన్నారు? ఇంతకీ విశ్వనాథ్‌ను ఈ చిత్రం ఎందుకు అంతలా బాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 'సిరివెన్నెల' సినిమాలో ఒక గుడ్డివాడిని, మూగ అమ్మాయిని కలపాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందన్నదాని గురించి విశ్వనాథ్ ప్రస్తావిస్తూ.. ''ఆ సంవత్సరం హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించిన ఇయర్ ఏదో అయింది. అప్పుడు అనిపించింది... అదే నేపథ్యంలో సినిమా తీస్తే ఎలా ఉంటుందని... అలా ఒక గుడ్డివాడిని, ఒక మూగ అమ్మాయిని తీసుకుని వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ బిహేవియర్‌ని తెరకెక్కించాలనిపించింది. అంతేకాక, నాకు ఎప్పుడూ అనిపించే విషయం. దేవుడు ఒకచోట ఎవరికయినా తగ్గించి ఇస్తే దాన్ని వేరేచోట భర్తీ చేస్తారని.మనం కూడా వాళ్ళ మీద సానుభూతి చూపించకుండా నార్మల్ పర్సన్స్‌లా ట్రీట్ చేయాలని. సిరివెన్నెల ప్రాజెక్ట్ నా మనసుకు దగ్గరైన సినిమా. ఎందుకంటే, దాన్ని పిక్చరైజ్ చేయడానికి, బయటికి తేవడానికి నేను మానసికంగా ఎంత వ్యధ అనుభవించానో నాకు తెలుసు. ప్రతి సీన్‌కీ కష్టపడ్డాను. ఉదాహరణకు సుహాసిని, బెనర్జీ కోటలో కలిసినప్పుడు అతన్ని (మూగ భాషలో) అడుగుతుంది – ‘మీరు ఇంతకుముందు ఇక్కడే వాయించే వారటగా?’ అని... ‘అవును, ఎవరికి తోచింది వారిచ్చేవారు... మరి మీరేమిస్తారు?’ అంటాడు. తగినంత డబ్బు లేకపోవడంతో తన బ్రేస్లెట్ తీసిస్తుంది. అప్పుడు ఒక పాటను చిత్రీకరించి ఆ సీన్‌ను ఎండ్ చేయచ్చుకదా? లేదు, అలా చేయాలనిపించలేదు. నేనే కాంప్లికేట్ చేసుకుంటాను... తగిన సమాధానం కోసం వెతుక్కుంటాను. వెంటనే అతను ‘ఇది వెండా? బంగారమా?’ అంటాడు. దానికి సమాధానం ఆ అమ్మాయి ఎలా చెప్పగలదు? అప్పటికీ ‘మీ మనసు లాంటిది’ అని చూపిస్తుంది. అప్పుడయినా ఊరుకోవచ్చు కదా! లేదు... ‘నా మనసు అయితే మట్టి’ అంటాడు... ‘పోనీ, నా మనసు అనుకోండి’ అన్నట్లు చూపిస్తుంది సుహాసిని... అలా మొత్తం సినిమాలో నాకై నేను కాంప్లికేట్ చేసుకున్న సీన్లు ఎన్నో! తన బొమ్మ గీసేటప్పుడు కళ్ళు బాగా రావాలంటాడు బెనర్జీ సుహాసినితో ఓసారి... సరే... బొమ్మ ఉన్నదున్నట్టుగా గీస్తే కాంప్లికేషనే లేదుగా? అలా తీయకూడదనుకున్నాను. చివరికి ఆ అమ్మాయి మంచి కళాఖండం ... సూర్యచంద్రుల్ని రెండు కళ్ళుగా, వేణువును ముక్కుగా, దానినుంచీ వెలువడే ఉచ్ఛ్వాస – నిశ్వాసల ఓంకారం పెదవులుగా, త్రినేత్రం అతని జ్ఞాననేత్రంగా... గీస్తుంది. గీసింది సరే, కానీ దాన్ని తనేమో చెప్పలేదు, అతనేమో చూడలేడు. సిచ్యుయేషన్ ఎంత కాంప్లికేటెడో ఆలోచించండి! నమ్ముతారో లేదో ఆ బొమ్మ గీయడానికి నంది హిల్స్‌లో నేను, మా ఆర్ట్ డైరెక్టర్ ఎన్ని రోజులు స్పెండ్ చేశామో చెప్పలేము. రోజూ వచ్చి అడిగేవాడు ‘ఏం గీయాలి సార్!’ అని... ‘నువ్వు ఏదయినా యాబ్స్ట్రాక్ట్తో రా, నేను దాన్ని ఇంటర్పెట్ చేయగలనో లేదో చూస్తాను’ అని చెప్పి పంపేవాడిని. సింపుల్‌గా చెప్పాలంటే.. రివర్స్‌లో వర్క్ చేయడం అన్నమాట. అతనికీ అర్థం కావట్లేదు, నాకూ క్లారిటీ లేదు... అలా రోజులు గడిచాయి... సడెన్‌గా ఓరోజుతెల్లవారుజామున ఐడియా వచ్చి అతన్ని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంత కష్టం దాగుంది ఆ సీన్ వెనుక! అయితే, పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. అది వేరే విషయం. ఇందులో ‘సూర్యోదయం’ సీన్ ఒకటుంది. ఒక గుడ్డివాడికి సూర్యోదయాన్ని ఎలా చూపించాలని. నేను ఎంతో రిసెర్చ్ చేశాను, ఎందరో మేధావులని కలిశాను, ఎన్నో రోజులు ఆలోచించాను. ఆ సీన్లో మూన్‌మూన్‌సేన్ అతన్ని అడుగుతుంది...‘నువ్వు ఎప్పుడయినా, ఏ అమ్మాయినైనా ప్రేమించావా?’ అని. లేదంటాడతను. ‘పోనీ ఎప్పుడయినా, ఏ అమ్మాయినైనా ముట్టుకున్నావా?’ అని అడుగుతుంది... ‘అయ్యయ్యో!’అంటాడతను. ‘అయితే నీకు చెప్పడం చాలా తేలిక’ అంటుంది తను. అంటే... మొదటిసారి ఓ అమ్మాయిని ముట్టుకున్నప్పుడు కలిగే ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్‌ల ఆధారంగా ప్రకృతిని చాలా ఈజీగా చూపించవచ్చని అనుకున్నాను. అసలు ఈ థాట్ వెనకాల చాలా గమ్మత్తైన విషయం దాగుంది. ఇంతవరకూ ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పలేదు. మేము విజయవాడలో ఉన్నప్పుడు... మా ఇంట్లో అద్దెకుండే అమ్మాయి కాఫీ పౌడర్ అప్పు తీసుకెళ్ళింది. తిరిగి గ్లాస్ ఇవ్వడానికొచ్చినప్పుడు ఇంట్లో అమ్మ లేకపోవడంతో నాకిచ్చింది. అలా ఇవ్వడంలో, అనుకోకుండా ఆమె చేయి నాకు తగిలింది... అంతే! ఏదో జరిగిందినాలో! 50–60 ఏళ్ళ క్రితం కలిగిన ఆ ఫీలింగ్ నాకిప్పటికీ అలానే గుర్తుంది.అదే సినిమాలోఎందుకు పెట్టకూడదని అనుకుని పెట్టాను. ఇక సాహిత్యం విషయానికి వస్తే.. అప్పటిదాకా వేటూరి గారితో ఎన్నో పాటలు రాయించిన నేను ఈ సినిమాకు మాత్రం సిరివెన్నెల గారితో రాయించాను. అప్పట్లో వేటూరి గారు నామీద ఎందుకో తెలీదు, అలిగారు (కారణం తెలీదు). వారికి ఇష్టం లేనప్పుడు మనం బలవంతంచేయకూడదు కదా అని, వేరెవరితోనైనా రాయించాలనుకున్నాను. ఈలోపల నేను ఓరోజు ‘గంగావతరణం’ పాటలు విన్నాను. వినగానే నచ్చేశాయి. రాసిందెవరని వాకబు చేస్తే తెలిసింది ‘సీతారామశాస్త్రి’ అని. అప్పుడతన్ని పిలిపించి, అతనికి సిరివెన్నెల కథ మొత్తం వినిపించి, రాయించుకున్నాను. మొదటిసారి ‘విధాత తలపున’రాశాడు. చాలా అద్భుతం అనిపించింది. అప్పటిదాకా వచ్చిన సినిమాల్లో శివుడ్ని స్తుతించాను. మహా అయితే ప్రశ్నించాను. కానీ ఎన్నడూ నిందించలేదు. ఈ సినిమాలో మాత్రం ‘ఆదిభిక్షువు’ పాటలో నిందాస్తుతి కనిపిస్తుంది. షూటింగ్ టైంలో లిరిక్ రైటర్, డైలాగ్‌రైటర్ ఎప్పుడూ నాతోనే ఉండేవారు. అందులోశాస్త్రికి ఇది ఫస్ట్ ఫిల్మ్ కదా, ఉద్యోగానికి సెలవుపెట్టుకొచ్చాడు, బోలెడు ఖాళీ ఉండేది. షూటింగ్ అవ్వగానే ఈవెనింగ్ కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అలా ఓరోజు నేను అతనిని అడిగాను...‘ఏమయ్యా, ఏమయినా కొత్తగా రాశావా?’ అని. అప్పుడు... ‘ఆదిభిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది?’ అని నాలుగు లైన్లు వినిపించాడు. ‘ఏదేది మళ్ళీ చెప్పు’ అన్నాను. థాట్బాగా నచ్చింది! వెంటనే నేను ‘అదే లైన్లో చరణాలు కూడా రాసెయ్. సినిమాలో దానికి తగ్గసిట్యుయేషన్ నేను క్రియేట్ చేస్తాను’' అన్నాను. -
కళాతపస్వి కె. విశ్వనాథ్ తీసిన ప్రతీ సినిమా ఓ ఆణిముత్యమే
కళాతపస్వి కె. విశ్వనాథ్..కళామతల్లి ముద్దుబిడ్డ అనే పేరుకు అసలైన రూపం. తెలుగు సినిమాకు గౌరవం, గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో ఆయన పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. సౌండ్ రికార్డిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా, దర్శకుడిగా ఎన్నో అత్యున్నత చిత్రాలను తెరకెక్కించారు. సినిమా అంటే కేవలం కమర్షియల్ హంగులు,డ్యాన్సులు మాత్రమే కాదని, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, కళలకు ప్రతిరూపం అని తన ప్రతి సినిమాల్లో నిరూపించిన మహారిషి కె. విశ్వనాథ్. స్టార్ హీరోలు లేకపోయినా, సినిమా మొత్తం పాటలు ఉన్నా సామాజిక అంశాలను కథలుగా మార్చుకొని సినిమా హిట్స్ కొట్టారు. తెలుగుదనాన్ని సమున్నతంగా నిలబెట్టారు. ఆయన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం, శుభసంకల్పం ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు వారికి అందించారు. సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ.. ఆయన తీసిన సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం ఆలోచింపజేశాయి. ఇలా ఆయన సినిమాల కోసం ప్రేక్షకులే కాదు అవార్డులు, రివార్డులు ఎదురు చూసేవి. సంగీతం, సంస్కృతి, సంప్రదాయలకు అత్యంత విలువనిచ్చే కె. విశ్వనాథ్ కమర్షియల్ హంగులు లేకపోయినా కేవలం కళలతో హిట్స్ కొట్టొచ్చని నిరూపించిన డైరెక్టర్. తన సినీ ప్రస్థానంలో సుమారు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌గానే కాకుండా, నటుడిగానూ తెలుగు సినీ ప్రేక్షకులను అలరించారు. కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి ఎన్నో సినిమాల్లో విశ్వనాథ్ నటించారు. తెలుగులో చివరగా హైపర్ సినిమాలో కనిపించారు. -
కళాతపస్వికి నివాళులు.. షూటింగ్స్ బంద్ చేస్తూ నిర్ణయం
కళాతపస్వీ కె. విశ్వనాథ్ మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఇక లేరన్న వార్త తెలిసి చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. గొప్ప దర్శకుడిగానే కాకుండా ఇండస్ట్రీ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందంటూ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులంతా కదిలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కె.విశ్వనాథ్ నివాసానికి చేరుకొని ఆయన పార్థీవదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కె. విశ్వనాథ్ మృతి నేపథ్యంలో సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన మరణానికి నివాళిగా సినిమా నేడు జరగనున్న అన్ని షూటింగులు బంద్ చేస్తున్నట్లు తెలిపింది. స్వచ్చందంగానే షూటింగులను నిలిపివేసినట్లు తెలిపింది. -
తెలుగు సినిమా గొప్పదనం మీరు.. కె.విశ్వనాథ్‌కు ప్రముఖుల నివాళులు
మరో సినీ దిగ్గజం నేలకొరిగింది. కళా తపస్వి శకం ముగిసింది. లెజెండరీ డైరెక్టర్ కె. విశ్వనాథ్ మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గతరాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చిన విశ్వనాథ్ 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.విశ్వనాథ్ మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయిందంటూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. Deeply grieved to hear of the demise of renowned film director, Sri K. Viswanath. As a film-maker he brought depth & dignity to the medium earning global recognition for his movies with a message. May his atma attain sadgati! Om shanti! pic.twitter.com/snX4RVsIVJ — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) February 3, 2023 Shocked beyond words! Shri K Viswanath ‘s loss is an irreplaceable void to Indian / Telugu Cinema and to me personally! Man of numerous iconic, timeless films! The Legend Will Live on! Om Shanti !! 🙏🙏 pic.twitter.com/3JzLrCCs6z — Chiranjeevi Konidela (@KChiruTweets) February 3, 2023 ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే మాకు K. విశ్వనాధ్ గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. Your signature on Telugu Cinema &art in general will shine brightly forever. సినిమా గ్రామర్ లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాన్తo రుణపడి ఉంటాము sir🙏🏻 — rajamouli ss (@ssrajamouli) February 3, 2023 Rest in peace Vishwanath garu … thank u for everything🙏🏻🙏🏻🙏🏻.. u Continue to live in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 #RipLegend pic.twitter.com/QfjPIYAfsx — Anushka Shetty (@MsAnushkaShetty) February 3, 2023 Sad to hear about the passing of India’s 1st auteur director #KVishwanath ..He is gone , but his films will live forever 💐💐💐 — Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2023 Deeply saddened by the passing of legendary director K. Vishwanath Garu. His urge n passion for storytelling and his commitment to excellence have inspired many filmmakers like me to strive for the best in our own work. We all will miss him dearly... #RIPVishwanathGaru 🙏🏻 pic.twitter.com/PFvbOEuaFd — Krish Jagarlamudi (@DirKrish) February 3, 2023 Disheartening to know about the tragic news of #KVishwanath garu. Words may not suffice to express his loss. His contribution to Telugu Cinema will live on in our memories forever. My sincere condolences to his entire family & dear ones. OM SHANTI 🙏 — Ravi Teja (@RaviTeja_offl) February 3, 2023 We have lost another gem! What a legend! #KVishwanath gaaru will be remembered forever for his art, his passion and understanding of films. Never got an opportunity to work with him, but been a great admirer of his work. Will be missed. RIP #KVishwanathgaru Om Shanti 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/HNxvrELJnt — KhushbuSundar (@khushsundar) February 3, 2023 Rest in peace the legendary #KVishwanath sir .. You will remembered forever in our hearts , you always live through ur great films 🙏 Om shanti#RipLegend #RIPVishwanathGaru pic.twitter.com/XZE6aYUvP8 — Director Maruthi (@DirectorMaruthi) February 3, 2023 Ulaganayagan @ikamalhaasan posted a hand-written letter bidding goodbye to the Legendary director #KVishwanath garu. 💔#KViswanathGaru pic.twitter.com/5IMs70O8Hu — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 3, 2023 తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను. pic.twitter.com/3Ub8BwZQ88 — Jr NTR (@tarak9999) February 2, 2023 Cinema is above Boxoffice. Cinema is above Stars. Cinema is above any individual. Who taught us this ? The greatest of greatest #KViswanathGaaru మీ రుణం …వీడుకోలు 🙏🏼🙏🏼🙏🏼 — Nani (@NameisNani) February 3, 2023 నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన .. ఆ రెంటి నట్టనడుమ తన తపన సాగించి , తపస్సు కావించి, తనువు చాలించిన ఋషి 🙏🙏🙏 వెండితెరకి ఇకపై దొరకునా అటువంటి సేవ ! — mmkeeravaani (@mmkeeravaani) February 2, 2023 -
బూటకపు ఎన్కౌంటర్లకు అధికార పార్టీదే బాధ్యత
కోనరావుపేట(వేములవాడ): ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దులోని వెంకటాపురం వద్ద ఈ నెల 10న జరిగిన ఎన్కౌంటర్ బూటకమని, నిద్రిస్తున్న వారిపై ఒక్కసారిగా పోలీసులు కాల్పులు జరిపారని సీపీఐ (ఎంఎల్) జనశక్తి రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ హత్యలు చేయించిందని మండిపడ్డారు. తెలంగాణ సాధనకు విప్లవ పార్టీలు ఎంతగానో కష్టపడ్డాయని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సాక్షి కార్యాలయానికి ఒక లేఖ పంపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఇందుకోసం విద్యార్థులు బలిదానాలు చేశారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో దొరలు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దొరలు పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. వెంకటాపురం సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌కు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. జనశక్తి వ్యవస్థాపకుడు కూర రాజన్న అనారోగ్యంతో బాధ పడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ధ్వజమెత్తారు. -
జగం మెచ్చిన దర్శకుడు - జనానికి దార్శనికుడు
కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు సువర్ణఘంటా సత్కారం తరలివచ్చిన ప్రముఖులు రాజమహేంద్రవరం కల్చరల్ : ‘సిరిమువ్వల’ సడి తెలసిన ‘స్వాతిముత్య’మితడు - ‘సిరివెన్నెల’ నొడిదాచిన ‘స్వర్ణకమల’మితడు - ‘స్వయంకృషి’ని గౌరవించు ‘సూత్రధారి’ ఇతడు - చైతన్యపు ‘సప్తపది’కి ‘ఆపద్భాంధవు’డితడు - ‘శృతిలయ కలసిన ‘సాగరసంగ’మితడు - శాశ్వతమై నిలుచు ‘శంకరాభరణ’మితడు....అని దర్శకుడు కె.విశ్వనాథ్‌పై ఆంగ్ల అధ్యాపకుడు నూజిళ్ల శ్రీనివాస్ కవిత చదివారు. నవరస నటసమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఆనం కళాకేంద్రంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కళాతపస్వి కాశీ విశ్వనాథునికి సువర్ణఘంటా సత్కారం జరిగింది. ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శిఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం విశ్వనాథ్‌కు సువర్ణ కంకణాన్ని తొడిగారు. ముందుగా కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన పలు చిత్రాలలోని పాటలను తెరపై ప్రదర్శించారు. డాక్టర్ ఎస్వీ రామారావు ఆయా పాటల నేపథ్యాన్ని వివరించారు. అనంతరం నర్తనబాల పురస్కార గ్రహీత షైలిక పాత్రో నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నగరప్రముఖుడు దాట్ల బుచ్చి వెంకటపతిరాజు జ్యోతిప్రకాశనంతో సన్మాన కార్యక్రమం ప్రారంభమైంది. సాంస్కృతిక పునరుజ్జీవనం మరుగున పడుతున్న సాంస్కృతిక వైభవాన్ని చలనచిత్రాల ద్వారా పునరుజ్జీవింపచేసిన మహనీయుడు విశ్వనాథ్ అని ఘంటసాల ఆరాధన కమిటీ సభ్యుడు దుర్భా శ్రీరామమూర్తి అన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు జిత్‌మోహన్ మిత్రా మాట్లాడుతూ విశ్వనాథ్‌ను ఈ గడ్డపై సత్కరించుకోవడం మన అదృష్టమన్నారు, ముగ్గురు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు బీఎస్ రెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, ఇప్పుడు కె.విశ్వనాథ్‌లను సత్కరించుకునే భాగ్యం ఈ నగరవాసులకు దక్కిందన్నారు. మేళాతాళాలతో.. ముందుగా దర్శకుడు కె.విశ్వనాథ్‌ను మేళతాళాలతో వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఆయన ఆడిటోరియంలోకి ప్రవేశించగానే సభలో ఉన్న ప్రతిఒక్కరూ గౌరవ పురస్కారంగా లేచి నిలబడ్డారు. పలువురు విశ్వనాథ్‌కు పాదాభివందనం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీ శేషసాయి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ నాయకుడు కందుల దుర్గేష్, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పాల్గొన్నారు. -
కళాతపస్విని కలిసిన వెంకయ్య
హైదరాబాద్: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు-2016కు ఎంపికైన ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కే విశ్వనాథ్‌ను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కలిశారు. అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆయనకు అభివాదం చేసి అభినందనలు తెలిపారు. ఆదివారం ఉదయం స్వయంగా ఆయన ఇంటికెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి మరీ తన విజ్ఞతను చాటుకున్నారు. అక్కడే ఆయనతో పది నిమిషాలపాటు కూర్చుని మాట్లాడారు. విశ్వనాథ్‌ను కలిసిన వారిలో వెంకయ్యనాయుడితోపాటు తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. -
కాలం తీపి గురుతులు
జీవన కాలమ్ ఎన్ని విజయాలు సాధించినా కాళ్లని నేల మీదే నిలుపుకున్న వ్యక్తి. ఫాల్కే పురస్కారం విశ్వనాథ్‌కి సబబైన కిరీటం. సినీమాని ‘అభిరుచి, సంస్కారం, సంస్కృతి, ఆ తర్వాతే ఆరోగ్యకరమైన వినోదం’ పొలిమేరల్లో నిలిపిన చాంపియన్. ఎన్ని సంవత్సరాలు! 53 గడిచిపోయాయి. అప్పుడే నేను ఆంధ్రప్రభ వదిలి హైదరాబాదు రేడియోకి వచ్చాను. దశాబ్దాలుగా ఉన్న మద్రాసు వదిలి సగం మనసుతో కె. విశ్వనాథ్ హైదరాబాదు వచ్చారు అన్నపూర్ణా సంస్థ కోసం. ఇద్దరికీ కిరాణా దుకాణం– నారాయణగూడాలో శంకరయ్యది. ఆయన శ్రీమతి జయలక్ష్మిగారు, మా ఆవిడా కలిసేవారు. నేను అప్పుడప్పుడు మా ఆవిడకి తోక. మద్రాసులో 34 భగీరథ అమ్మాళ్ వీధి అన్నపూర్ణా ఆఫీసు. ‘డాక్టర్ చక్రవర్తి’కి నేనూ, దుక్కిపాటి గారూ హాలు పక్క గదిలో కథా చర్చలు జరుపుతుండగా హాలులో ఎస్. రాజేశ్వరరావుగారితో సంగీతం కంపోజింగ్ చేయిస్తున్నారు విశ్వనాథ్. ఉన్నట్టుండి మా గది లోకి వచ్చారు–రాజేశ్వరరావుగారు: ‘‘విశ్వంగారికి సంగీ తం మీద మంచి పట్టు ఉందండి!’’ అని వెళ్లిపోయారు. ఎక్కడికి? సరాసరి ఆఫీసు నుంచి ఇంటికి. అది రాజేశ్వరరావుగారి అలక. విశ్వంగారూ కంగారు పడిపోయారు. కానీ ఆయన మాట ఎంత నిజం! తెలుగు సినిమాలో సంగీతానికి ‘రుచి’నీ, ‘శుచి’నీ మప్పి పదికాలాల పాటు ప్రాణం పోసిన దర్శకులు విశ్వనాథ్. ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాలో మొదటి సీనుని– ఆత్రేయకి బదులు నేను రాసిన మొదటి సీనుని–ఫెయిర్ కాపీ రాసుకున్న వ్యక్తి విశ్వనాథ్. నేను రాసిన మొదటి సీనుని (ఆత్మగౌరవం) మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహిం చిన వ్యక్తి విశ్వనాథ్. ఆయనా నేనూ కలసి నటించిన మొదటి సీనుని మళ్లీ నేనే రాశాను (శుభసంకల్పం). మొదటిసారిగా కెమెరామాన్ పి.సి. శ్రీరామ్ గారింట్లో మేమిద్దరం నమూనా సీను నటించాం. ‘చెల్లెలి కాపురం’ చర్చల్లో నాకు జర్దా కిళ్లీ సరదాగా మప్పిన ఘనత విశ్వనాథ్‌గారిది. సీను ‘రంజు’గా వచ్చిం దంటే స్వయంగా కిళ్లీ చుట్టి ఇచ్చేవారు సంబరంతో. 18 సంవత్సరాలు అది ఇద్దరి పీకలకీ చుట్టుకుంది. ఒకరోజు మేమిద్దరం యునైటెడ్ కాలనీ బజార్లో రాత్రి జర్దా కోసం తిరిగాం! తర్వాత ఇద్దరం బయటపడ్డాం. చక్కని భోజన ప్రియత్వం ఇద్దరికీ ఉంది. ‘శుభ సంకల్పం’ నిర్మాత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. వారిం ట్లోనే చర్చలు. ప్రతిరోజూ ముందు తినబోయే పలహారాన్ని చర్చించేవాళ్లం. వంటావిడ కాంతమ్మగారు రుచిగా పంపించేవారు– పెసర పుణుకులు, చల్ల చిత్తాలు, పెసరట్టు, రవ్వదోశె– ఇవే ముందు నిర్ణయం కావాలి. తర్వాతే కథా చర్చ. ‘రుచి’ కారణంగా చర్చలు మరికొన్నాళ్లు కొనసాగిన గుర్తు. విజయనగరంలో ‘శుభ సంకల్పం’ షూటింగు. రోజూ హోటల్ నుంచి బయలుదేరి నన్ను దారిలో కారెక్కించుకునేవారు. విజయనగరం దారిలో – అప్పుడే తోటల్నుంచి వచ్చే కూరల బుట్టలు దింపించి– బీరకాయలు, వంకాయలు, బెండకాయలు కొని– జొన్నవలస లొకేషన్లో వంటవాడికిచ్చి చేయించుకునేవాళ్లం. ఆయన దర్శకత్వంలో నేను నటించిన మొదటి చిత్రం–‘స్వాతిముత్యం’. నేను బిజీగా ఉన్న రోజులు. ఆరోజు ఆయన షూటింగుకి ఆలస్యంగా వచ్చి– ‘‘నాతో నడువు మారుతీరావ్’’ అంటూ కుడికాలు ఎత్తి ఎత్తి వేయడం మప్పారు పాత్రకి. ఆ చిన్న పాత్రకి అది మేనరిజం. రజతోత్సవ సభలో రాజ్‌కపూర్ ఆ కుంటిని గుర్తు చేసుకున్నారు–ఆ కుంటి నాదేనని భావిస్తూ. పాత్ర మీద ప్రత్యేకమైన angularityని పట్టుకోవడంలో విశ్వనాథ్‌కి విశ్వనాథే సాటి. ‘శంకరాభరణం’లో సంగీతం మేస్టారు, ‘సాగరసంగమం’లో డ్యాన్స్ మేస్టారు, ‘స్వాతిముత్యం’ లో నా పాత్ర అందుకు ఉదాహరణలు. ‘శుభలేఖ’ రాస్తూండగా అనుకోకుండా నటుడినయ్యాను. పాలకొల్లులో పగలు ‘ఇంట్లో రామయ్య–వీధి లో కృష్ణయ్య’ షూటింగు. రాత్రి సంభాషణల రచన. విశాఖపట్నానికి ‘శుభలేఖ’ స్క్రిప్ట్ చిరంజీవితోనే పంపా ను. బహుశా ఆయనకి ఎక్కువ సినిమాలు రాసింది నేనేనేమో (ఆత్మ గౌరవం, చెల్లెలి కాపురం, ఓ సీత కథ, మాంగల్యానికి మరోముడి, ప్రేమబంధం, శుభలేఖ, శుభ సంకల్పం)! ఇద్దరం కలసి మొట్టమొదటి నంది అవార్డుని పుచ్చుకున్నాం. ఆయన నటుడయ్యాక ఒక గొప్ప దర్శకుడిని తెలుగు సినీమా ఏ కాస్తో నష్టపోయిందనిపిస్తుంది. ముందు ముందు ఎన్ని సాగరసంగమాలు, స్వాతిముత్యాలు వచ్చేవో. ఖాకీ దుస్తులతో మొదటి షాట్ దర్శకత్వం వహించడం నుంచి, చేతికర్ర వరకూ ఆయన ప్రయాణాన్ని గమనించినవాడిని. ఏ కొన్ని అడుగులో కలసి వేసినవాడిని. విశ్వనాథ్ తపస్వి. కళకి పామర రంజకత్వాన్ని మప్పిన దర్శకుడు. ఎన్ని విజయాలు సాధించినా కాళ్లని నేల మీదే నిలుపుకున్న వ్యక్తి. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం విశ్వనాథ్‌గారికి సబబైన కిరీటం. సినీమాని ‘అభిరుచి, సంస్కారం, సంస్కృతి– ఆ తర్వాతే ఆరోగ్యకరమైన వినోదం’ పొలిమేరల్లో నిలిపిన చాంపియన్. జాతీయ స్థాయిలో ‘కీర్తి’ నిలిచినా జీవితాన్ని, జీవనాన్ని సడలించని మధ్య తరగతి అగ్రహారీకుడు కె. విశ్వనాథ్. గొల్లపూడి మారుతీరావు -
విశ్వజయం
విశ్వాన్ని జయించడానికి జయలక్ష్మి లాంటి సహచరి కావాలి. జయాన్ని విశ్వమంతా గుర్తించాలంటే విశ్వనాథ్ లాంటి మార్గదర్శి కావాలి. విశ్వజయానికి ప్రేమ కావాలి. స్వచ్ఛమైన ప్రేమ కావాలి. దిసీజ్ ది స్టోరీ ఆఫ్ టు సోల్‌మేట్స్. ఈ దంపతుల ప్రేమలో ఆత్మ ఉంది. అయినా... ఆత్మీయమైన ప్రేమకు ఒక రోజెలా సరిపోతుంది? అందుకే ‘ప్రేమికుల రోజు’, ‘వరల్డ్ మ్యారేజ్ డే’ లాంటివి లాంఛనాలు మాత్రమే. * ఆదిదంపతుల లాంటి మీకు నమస్కారమండీ! విశ్వనాథ్ గారూ! ఏమిటీ గడ్డం పెంచారు? కొత్త సినిమా గెటప్పా? కె. విశ్వనాథ్: అదేమీ లేదండీ! (సరదాగా...) ఈ గడ్డం చూసైనా, కొత్త తరహా వేషాలు వస్తాయేమోనని! జయలక్ష్మి: (నవ్వేస్తూ) ఆ..అదొకటి కూడానా! (నవ్వులు) విశ్వనాథ్: ఈ 19న నా బర్తడేకైనా తీసేయమని గొడవ! * ఇంతకీ, మీ పెళ్ళి తేదీ గుర్తుందా? జయలక్ష్మి: (అందుకుంటూ...) నా పుట్టినరోజు వినాయక చవితి. ఇక, మా పెళ్ళి రోజు అక్టోబర్ రెండో తేదీ. * పెళ్ళైన తొలినాళ్ళు, కొత్తకాపురం సంగతులు గుర్తున్నాయా? జయలక్ష్మి: అప్పుడు నాకు 14 ఏళ్ళు. ఆయనకు 19 ఏళ్ళు. నేను పదో తరగతి చదువుతుండగానే పెళ్ళయింది. ఆ తరువాత కాపురానికొచ్చేశాను. మద్రాసుకు వచ్చిన కొత్తల్లో వడపళని దగ్గర చిన్న ఇంట్లో ఉన్న రోజులు గుర్తే! విశ్వనాథ్: (నవ్వుతూ) అప్పట్లో సౌండ్‌రికార్డిస్ట్‌గా నా జీతం 75 రూపాయలు. చాప వేసుకొని పడుకొంటే, చేతికి చెప్పుల స్టాండ్ తగిలేంత చిన్న అద్దె గది. దానికి రూ. 20 అద్దె. ఆ గదికి ముందు కొబ్బరాకులతో చిన్న వరండా లాంటిది వేస్తే బాగుంటుందనుకొనేవాణ్ణి. చివరకు మా ఓనర్ వేయించాడు. కాకపోతే, మరో 5 రూపాయలు అద్దె పెంచాడు (నవ్వులు...). అక్కడ దానికి ఆనుకొని తోటమాలి ఉండేవాడు. అతనికి ఓ కూతురు. పిచ్చిది. జయలక్ష్మి: ఆ అమ్మాయి పేరు ఇంద్రాణి! నాకు గుర్తే! విశ్వనాథ్: మా నాన్న గారు వాళ్ళు మా ఆవిడను కాపురానికి తీసుకొని బెజవాడ నుంచి మద్రాసుకు ‘మెయిల్’లో ఉదయాన్నే వచ్చారు. చెక్క భోషాణంలో సరుకులు, సామాన్లు అవీ తీసుకొచ్చారు. కానీ నాన్న గారితో ఇంటి సంగతులు చెప్పి ఇబ్బంది పడతారని ‘వెంటనే వెళ్ళిపొమ్మన్నా’. ఉదయం కాపురానికొచ్చిన మా ఆవిడ వాళ్ళు ఆ సాయంత్రమే వెళ్ళిపోయారు (నవ్వు). జయలక్ష్మి: తర్వాత మళ్ళీ వచ్చాం లెండి! విశ్వనాథ్: ఇల్లంటే బెజవాడలో పెరిగిన రోజులు గుర్తుకొస్తాయి. కృష్ణలంకలో తాడికొండవారి తోటలో మా ఇల్లు. అప్పట్లో అగ్నిప్రమాదాలు, కృష్ణానదికి వరదలెక్కువ. ఏది జరిగినా ఇంట్లో నుంచి సామాన్లన్నీ తీసుకొని, కట్ట మీదకొచ్చి, కాలక్షేపం చేసేవాళ్ళం. మా తర్వాతే నా ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్ళకి పురుళ్ళు పుణ్యాలొస్తే తనే! పెద్దవాళ్ళను చూసుకొనేదీ తనే! ఏడాదిలో 8 నెలలు బెజవాడలో, 4 నెలలు మద్రాసులో! * మరి, మిస్సయిన ఫీలింగ్ ఉండేదా? జయలక్ష్మి: ఎప్పుడూలేదు. అత్తమామల సేవలో తృప్తుంది.చల్లగావున్నామంటే వారి ఆశీర్వాదం. విశ్వనాథ్: అప్పట్లో నైట్ షూటింగ్స్ ఎక్కువ. రికార్డిస్ట్‌గా రాత్రంతా పనిచేసి, ఉదయాన్నే స్టూడియో క్యాంటీన్లో టిఫిన్ చేసొచ్చి, రూమ్‌లో పడుకొనేవాణ్ణి. సాయంత్రమే లేవడం! మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు. లేవగానే స్నానం చేసి, స్టూడియోకి. వేరే ధ్యాసే లేదు. జయలక్ష్మి: సేవ చేసేది పరాయివాళ్లకని అనుకోలేదు. మా అత్తగారికి ఆయన కన్నా నా మీదే నమ్మకముండేది. విశ్వనాథ్: పెళ్లయిన ఎనిమిదేళ్లకు మాకు పిల్లలు పుట్టారు. నేను అన్నపూర్ణా సంస్థలో చాకిరీ చేస్తున్న రోజులవి. మా మొదటి సంతానం... అమ్మాయి పుట్టింది. విజయవాడలో అమెరికన్ ఆసుపత్రిలో డెలివరీ. మా మేనమామ అర్జెంట్‌గా రమ్మని ఫోన్ చేస్తే, వెళ్ళా. ఆరోగ్యం బాలేని పసిగుడ్డుని ఒళ్ళో పెట్టుకొని, ‘చంద్ర శేఖరాష్టకం’ చదువుకుంటూ మా ఆవిడ కనిపించింది. అప్పుడు ‘వెలుగు నీడలు’ రీరికార్డింగ్ జరుగుతోంది. రీరికార్డింగ్ నోట్స్ నా దగ్గరే ఉంది. నేను దర్శకుణ్ణి కాకున్నాసరే వెంటనే మద్రాసెళ్ళిపోయా. దాన్ని మూర్ఖత్వమనుకోవాలి! ఆమె మాత్రం ఏమీ అనుకోలేదు. * ఫలానా చేయలేకపోయానన్న గిల్టీ ఫీలింగ్ ఏమైనా ఉందా? విశ్వనాథ్: స్కూల్ ఫైనలయ్యాక చదువుతానంటూ అప్పట్లో మా ఆవిడ ఉత్తరం రాసింది. పరిస్థితుల వల్ల కంటిన్యూ చేయించలేదు. అదే ఇప్పటికీ నాకు పెద్ద గిల్టీ. జయలక్ష్మి: నాకు బాధేమీ లేదు. టెన్త్ వరకే చదివినా, ఇప్పటికీ గుర్తే. మనవరాళ్ళు చదువుతుంటే నేను సరిదిద్దుతా. ‘ఇవన్నీ తెలుసా బామ్మా!’ అని ఆశ్చర్యపోతుంటారు. * మీ చిన్నప్పటి కబుర్లు, స్కూలు విషయాలు చెప్పండమ్మా? జయలక్ష్మి: మాది కైకలూరు. మా పుట్టింటి వారు ‘బందా’ వారు. ప్రముఖ రంగస్థల కళాకారులు బందా కనకలింగేశ్వరరావు మాకు దాయాదులే! నాన్న గారు, బాబాయి అప్పట్లో ఇక్కడ హైదరాబాద్‌లో నిజామ్ వారి రైల్వేస్‌లో పనిచేసేవారు. రజాకార్ల ఉద్యమ సమయంలో కైకలూరు వచ్చేశారు. తర్వాత అన్నయ్య చదువుకి బందరు మారాం. అక్కడ లేడీ యాంథల్ మిషనరీ స్కూల్లో చదివా. * మీ పెళ్ళెలా కుదిరింది? అయినవాళ్ళ సంబంధమా? జయలక్ష్మి: (నవ్వుతూ) లేదు. బయట సంబంధమే! అదో కథ. అన్నయ్య పెళ్లి చేసుకున్న వారి వైపు నుంచి ఒక సంబంధం వచ్చింది. అంతా సిద్ధమనుకున్నాక, తీరా అది తప్పిపోయింది. అప్పుడీయనతో పెళ్ళి జరిగింది. విశ్వనాథ్: నాదీ ఓ పిట్టకథ ఉంది. ప్రసిద్ధ ఓరియంటల్ పబ్లిషింగ్ కంపెనీకి విజయవాడ మేనేజర్‌గా మా మేనమామ పనిచేసేవారు. మంచి మనిషి. వాళ్ళ యజమానికి ముగ్గురు కూతుళ్ళు. ఆ రోజుల్లోనే కోట్ల ఆస్తి. రెండో అమ్మాయిని చూడడానికి తెనాలి తీసుకెళ్ళాడు మా మేనమామ. తీరా చేసుకోనంటే, మామయ్య చెడతిట్టాడు. నా చిత్రాల్లో ‘సాక్షి’ రంగారావు పాత్రల స్వభావం ఆయనదే! * సంసారం నడుపుకోవడం, మంచీచెడు ఎలా నేర్చుకున్నారు! విశ్వనాథ్: ఏదైనా పొరపాటు చేద్దామన్నా ‘నాన్న గారేమంటారో, అమ్మేమంటుందో’ అనే భయం ఉండేది. డిసిప్లిన్డ్ మిడిల్‌క్లాస్ ఫ్యామిలీవ్యాల్యూస్తో పెరిగాం. ‘తల్లి తండ్రుల్ని ప్రేమించవలె’నని ప్రత్యేకించి నీతులు చెప్పక్కర్లేదు. జయలక్ష్మి: మన ప్రవర్తన బాగుంటే పిల్లలూ ఆ దోవలోనే. అత్తమామల్తో వచ్చేపోయే చుట్టాలతో సర్దుబాటెలా ఉండేది? జయలక్ష్మి: బంధువుల్ని చూస్తే పిల్లలకు ఆనందం! బంధువులెవరైనా వచ్చివెళ్ళిపోతుంటే, దిగులు వాళ్ళకు! ‘వెళ్లద్దు మావయ్యా’ అని ఆప్యాయత చూపేవారు. కానీ, అంతమందికి వండడం, వడ్డించడం... జయలక్ష్మి: కష్టం అనుకుంటే కష్టం, ఆనందం అనుకుంటే ఆనందం. కలసి పని చేసుకునేవాళ్లం. * వంటలో ఆయనెప్పుడైనా సాయం చేసేవారా? జయలక్ష్మి: వంట చేయడం నామోషీ కాదు. మా మామ గారు వంటలో సాయం చేసేవారు. ఈయనా కూరలు తరగడంలో సాయపడతారు. అదేగా దాంపత్యమంటే! * తరాలతో ప్రేమ, పెళ్లి మీద అభిప్రాయాలు మారుతున్నాయి! జయలక్ష్మి: ఎప్పుడూ ప్రేమలు, పెళ్లిల్లూ ఇటువంటి విషయాలన్నీ ఉన్నాయండి ఈ ప్రపంచంలో. భార్యలను కొట్టే మొగుళ్లున్నారు, ప్రేమగా చూసుకునే వారున్నారు. తల్లితండ్రులు కొట్టుకుంటుంటే పిల్లలూ అలాగే తయారవుతారు. * విశ్వనాథ్ గారికి ఒక్కోసారి కాస్తంత కోపం ఎక్కువేమో! జయలక్ష్మి: అబ్బే లేదండీ! అది చీకాకు. పని అనుకున్నట్లు జరగకపోతే వస్తుంది. వచ్చినా ఒక్క క్షణమే! * భార్యాభర్తలకు సరిపడకపోయినా కాపురం చేయాలా? విశ్వనాథ్: అవసరం లేదు. రోజూ తిట్టుకొని, కొట్టుకొనే కన్నా ఆ బంధం నుంచి బయటకొచ్చేయచ్చు. ‘మాంగల్యానికి మరో ముడి’ సినిమాలో అదే చెప్పా. జయలక్ష్మి: సరైన కారణాలుంటే సరే. ప్రతి చిన్నదానికీ విడాకులొద్దు. పిడుగుకీ బియ్యానికీ ఒకే మంత్రం కుదర్దు. విశ్వనాథ్: మహిళలు బాధ్యతలన్నీ నిర్వర్తించడం నాట్ ఎ జోక్. అందుకే సినిమాల్లో స్త్రీలని ఉన్నతంగా చూపిస్తా. మ్యారీడ్ కపుల్‌పై లవ్‌స్టోరీ తీయాలని ఇప్పుడనిపిస్తోంది. జయలక్ష్మి: అవును... ఇంత జీవితం చూసిన తర్వాత ఇదివరకటి కన్నా ఇప్పుడే బాగా తీయగలరు కూడా! (నవ్వులు) * మీరు ఎప్పుడైనా షూటింగ్‌లకు వెళ్లేవారా? జయలక్ష్మి: ఏముందనక్కడ ఇల్లు వదిలేసి వెళ్లడానికి! పిల్లలకీ అదే అలవాటైంది. ఆయన సినిమాలేస్తే చూసేవాళ్ళం. * ఆయనలో మీకు నచ్చని అంశం ఏదైనా ఉందా? జయలక్ష్మి: నచ్చని అంశం ఏమీ లేదు కానీ, ఆయనకు డబ్బు విషయంలో శ్రద్ధ తక్కువ. అదే చెబుతుంటాను. విశ్వనాథ్: అది నిజం. యావ లేదు, శ్రద్ధా తక్కువే. లేకపోతే కోట్లు కూడబెట్టేవాళ్ళం! అయినా తృప్తిగా ఉన్నాం. నలుగురొస్తే అన్నం పెట్టగలుగుతున్నాం. ఇంకేం కావాలి! * మరి మీరు మీ శ్రీమతికి ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటి? విశ్వనాథ్: ఐ హ్యావ్ గివెన్ హర్ త్రీ గుడ్ చిల్డ్రన్. జయలక్ష్మి: (నవ్వుతూ) ఇంకేం కావాలి.. పిల్లలు బంగారం! విశ్వనాథ్: మా కోడళ్ళు అంతకన్నా బంగారాలు! * అది సరే! మీరెప్పుడైనా మీ శ్రీమతికి చీరలు కొని తెచ్చేవారా? జయలక్ష్మి: (అందుకుంటూ) తెచ్చినా, నాకు నచ్చేది కాదు! విశ్వనాథ్: (నవ్వుతూ) నాకు ఆలివ్ గ్రీన్ రంగు ఇష్టం. వాళ్ళేమో దాన్ని పాచి రంగనేవారు. ఒకసారి మద్రాస్‌లో చీర కొని, బెజవాడ తీసుకెళ్ళా. చీర చూడగానే ‘ఎంత’ అంది మా ఆవిడ. ‘నాలుగువేలు’ అని చెప్పగానే ‘అంత ధర కనబడట్లేదే చీరలో’ అనేసింది. నా గాలి పోయింది! * అప్పట్లో అత్తా కోడళ్లు అంటే అమ్మా కూతుళ్లలా ఉండేవారా? జయలక్ష్మి: అప్పుడైనా ఇప్పుడైనా అలాగే ఉండాల్సింది! విశ్వనాథ్: నా సినిమాల్లో కూడా అలాగే చూపించేవాడిని. * మీ మధ్య ఎప్పుడైనా, ఏదైనా విషయంలో గొడవలు? విశ్వనాథ్: ఇప్పటివరకూ ఎలాంటి గొడవలూ లేవు, రావు! జయలక్ష్మి: మీరెన్ని రాసినా రావు (నవ్వులు...)! * విశ్వనాథ్ గారూ! ఇలాంటి జీవిత భాగస్వామి దొరకడం...? విశ్వనాథ్: నిజంగా నా అదృష్టం. జయలక్ష్మి: సేమ్ టు సేమ్. ఇది నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం. ఆయన బింబం... నేను అద్దంలో కనిపించే ప్రతిబింబం. ఏ తేడా లేదు. సాక్షి: అభిమాన దేవుళ్ళ నుంచి మీకు శతమానం భవతి. - రెంటాల జయదేవ విశ్వనాథ్: పెద్ద నగ కొంటే, డైమండ్ రింగ్ కొనిస్తేనే ప్రేమ అనుకోకండి. మా నాన్న గారు అప్పట్లో వాహినీ పిక్చర్స్‌లో ఫిల్మ్ రిప్రెజెంటేటివ్. ఆయన జీతం నెలకు 24 రూపాయలు. రోజుకు రూపాయి పావలా బేటా. ఎన్ని టూర్లకు వెళ్ళినా, ఆ కొద్ది మొత్తంలోనే జాగ్రత్తగా మిగిల్చి, తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మకు కచ్చితంగా చీర తెచ్చేవారు. మాకు చాక్లెట్లు తెచ్చేవారు. మలబార్‌కు వెళ్ళినప్పుడు ఆవకాయ ముక్కలు కోసే కత్తి పట్టుకొస్తే, పెద్ద విషయం. నాకు మూడుచక్రాల సైకిల్ కొన్నారు. అదే మాకు రోల్స్‌రాయిస్ కారు! ప్రేమ, వాత్సల్యానికి ప్రతిరూపాలైన వాటికి విలువెవరు కట్టగలరు! విశ్వనాథ్: భార్యాభర్తల మధ్య తప్పనిసరిగా ఉండాల్సింది పరస్పరం నమ్మకం. ప్రేమ, గౌరవం మన హృదయాంతరాళంలో నుంచి రావాలి. అంతేకాని, ప్రత్యేకించి ఫాదర్స్ డే, మదర్స్ డే, ప్రేమికుల దినం, వైవాహిక దినం - అని ఏడాదికి ఒక రోజే మొక్కుబడిగా చేసుకోవడంలో అర్థం లేదు. జయలక్ష్మి: ప్రేమ ఉన్నప్పుడు ఏదీ తప్పుగా అనిపించనే అనిపించదు. ఏమైనా, డబ్బు వల్ల సమస్యలొస్తాయి. అతిగా కోరికలు లేకుండా, ఉన్నదాంట్లో తృప్తి పడితే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. ‘కోరికలు దుఃఖహేతువులు’ అని బుద్ధుడు ఏనాడో చెప్పాడు కదా! (నవ్వులు...) -
నకిలీనోట్ల కేసులో నాలుగేళ్ల జైలు
మదనపల్లి రూరల్ (చిత్తూరు): నకిలీ నోట్ల చెలమాణీ కేసులో ఇద్దరు వ్యక్తులకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి రూరల్ మండలంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మదనపల్లికి చెందిన విశ్వనాథ్, ఖాదర్‌లు నకలీ నోట్ల చెలామణీ కేసులో ఇటీవల అరెస్టు అయ్యారు. వీరిని దోషులుగా నిర్ధరించిన కోర్టు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. -
చెవి చూసిన విశ్వం...
విశ్వనాథ్ గారికి రెండు కళ్లు. దాంట్లో ఒకటి చెవి. మరొకటి మాట. ఆయనకు సంగీతం తెలియదు. ఆయన సంగీతం తెలియనివారు లేరు. ఆయన ఒక్క పుస్తకం కూడా తిరగేయలేదు. తెరపై ఆయన రాసిన కథలను తిరిగి తిరిగి చదవనివారు లేరు. ఆయన చెవి విన్న సంగీతం... గుండె పలికిన మాటలు... మనం ‘చెవి’చూసిన సినిమా... దానికి మీరే సాక్షి. సంగీత సాగరసంగమం ‘శంకరాభరణం’ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ‘ఆర్ద్రతంటే ఏమిటి’ అని బేబీ తులసి అడుగుతుంది. ‘భాషకందని భావంరా!’ అంటాడు శంకరశాస్త్రి పాత్రధారి జె.వి. సోమయాజులు. సరిగ్గా సంగీతం, సాహిత్యాల అనుభూతి కూడా సరిగ్గా అంతే! దాన్ని మాటల్లో చెప్పలేం.చిన్నప్పటి నుంచి నాకు మంచి సంగీతమన్నా, సాహిత్యమన్నా, నృత్యమన్నా ఇష్టం. నేను సంగీతం నేర్చుకోలేదు. మా సిస్టర్స్ ఇద్దరూ మాత్రం చాలా బాగా పాడతారు. వాళ్ళ గానం ఇంట్లో వింటూ ఉండేవాణ్ణి. అలా బాత్రూమ్ సింగర్నయ్యా. వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన సంగీతం, పాట అంటూ ఏమీ లేవు కానీ, చెవికి హాయిగా, మెత్తగా ఉండే మంచి సంగీతం ఏదైనా వింటూ ఉంటా. అన్నమయ్య కీర్తన ‘ముద్దుగారే యశోద...’ దగ్గర నుంచి మెహదీ హసన్ గజల్స్ దాకా ఏదైనా వింటా. హిందీ పాటలు కూడా వింటూ ఉంటా. డబ డబ శబ్దాలు, అరుపులు, కూతలుంటే మాత్రం వినలేను. ఇవాళ్టికీ భీమ్సేన్ జోషీ కచ్చేరీ లాంటి మంచి కార్యక్రమం ఏదైనా ఉందంటే... వెళ్ళి వింటా. సినిమా రూపకల్పనలో ఉండగా ఒక్కోక్కప్పుడు గాఢంగా సంగీత, సాహిత్య చర్చల్లో మునిగిపోతే - అసలు టైమే తెలిసేది కాదు. భోజనవేళ దాటిపోతోందనీ ఎవరైనా గుర్తు చేస్తే కానీ గుర్తొచ్చేది కాదు. సినీ రంగంలో నేను అడుగుపెట్టింది మొదట ఆడియోగ్రఫీ విభాగంలో! పాటలు, మాటల శబ్దగ్రహణం చేసేవాణ్ణి. ఆ తరువాత దశలో దర్శకత్వం వైపు వచ్చా. అప్పటి ‘శబ్దగ్రహణ’ పరిజ్ఞానం దర్శకుడినై, పాటలు చేస్తున్నప్పుడు ఉపయోగపడింది. ఆ మాటకొస్తే మామూలు వ్యక్తి చెవులకు కూడా వినడానికి ఏది బాగుందో, లేదో చెప్పే జ్ఞానం ఉంటుంది. పాటల రికార్డింగ్ విషయంలో నేను సినీ రంగానికి వచ్చిన తొలి రోజులకూ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. తొలి రోజుల్లో సినిమా ఆఫీసుల్లోనే సంగీత చర్చలు, రిహార్సల్స్. అంతా సిద్ధం అనుకున్నాక, అప్పుడు థియేటర్‌కు వెళ్ళి, రికార్డింగ్. ఇక, రెండో దశకు వచ్చేసరికి వేదిక మొత్తం రికార్డింగ్ థియేటర్‌కు మారింది. కానీ, మధ్యాహ్నం ఒంటి గంట కల్లా పాట రికార్డింగే అయిపోయేది. ఇప్పటి మూడో దశలో సంగీత దర్శకుడు, రచయిత, దర్శకుడు, సింగర్‌స దూరంగా ఎక్కడెక్కడో ఉంటూ, పాటలు తయారుచేస్తున్నారు. తేడాలున్నా మిక్సింగ్‌లో మార్చేసుకొనే, వసతులు వచ్చేశాయి. ఇది మూడో దశ. ఇప్పటి విధానంలో కొన్ని సౌకర్యాలున్నా... ఒక పాట మొదటి నుంచి చివరి వరకు ఎలా సాగుతోంది, చివరకు ఏ రూపం తీసుకుంటోందన్నది దర్శకుడు మొదలు సంగీత దర్శకుడి దాకా ఎవరికీ తెలియడం లేదు. ఒక్కమాటలో - అతుకులు, అతుకులుగా, ఒక కొలాజ్ ఆర్ట్ లాగా పాటలు వస్తున్నాయి. అయితే, ఇంత గందరగోళంలోనూ కొన్ని మంచి పాటలు వస్తూనే ఉన్నాయి.నా సినిమాల్లో నాకు బాగా నచ్చిన పాటలంటే... చెప్పలేను. ప్రతి పాటా నా సమక్షంలో కంపోజ్ అయినదే. రకరకాలు అనుకొని, అనేక వడపోతల తరువాత, బాగుందనుకున్నదే సినిమాలో పెడతాం. కాబట్టి, నచ్చని పాట సినిమాలో ఉండే అవకాశమే లేదు. కాకపోతే, పాట జనం పాడుకోవడానికి బాగుంటుందో, లేదో అని నేను అనుమానపడ్డ సందర్భాలు కొన్ని ఉన్నాయి. ‘సిరిసిరిమువ్వ’లో ‘ఝుమ్మంది నాదం...’ అందుకు ఓ ఉదాహరణ. ఆ స్వరాలు పాడుకోవడానికి అనువుగా ఉంటాయా అని నేను ‘మామ’ కె.వి. మహదేవన్‌తో సందేహం వ్యక్తం చేశా. ఆయన మాత్రం ‘ఇదు నల్లా ఇరుక్కుమ్’ (ఇది బాగుంటుంది) అన్నారు. అరుదైన రేవతి రాగంలో ఆ పాట చేశారట. మామ మాటకి తలొగ్గా. అది పెద్ద హిట్. ఒక్కమాటలో... సంగీత దర్శకులందరూ నన్ను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు. మా బంధం తాతా మనుమళ్ళ లాంటిది. మనుమడిగా నేను మారాం చేసినా తాత బుజ్జగిస్తూ, ప్రేమిస్తాడే తప్ప, కోపగించడు. ఇదీ అంతే! పాట ఫలానాలా ఉండాలని చెప్పలేం కానీ, ఏదోలా ఉందని చెప్పగలం. మనసులో భావం చూచాయగా చెప్పగానే రాజేశ్వరరావు, మహదేవన్, రమేశ్‌నాయుడు, ఇళయరాజా నన్ను మన్నించి, కొత్త బాణీ ఇచ్చేవారు. ఎంతో విద్వత్తున్న సంగీత దర్శకుల వద్దకు వెళ్ళి, భిక్ష వేయించుకున్నా. ఇవాళ్టికీ మా పాటలు ఆపాత మధురాలుగా ఉండడానికి కారణం అదే! నా సినిమాలు, సంగీతభరితమైన నా పాటలు చూసి, నాకెంతో సంగీత జ్ఞానం ఉందని చాలామంది అనుకుంటారు. కానీ, రాగాల విషయంలో నేను సున్నా. రాగాలు, వాటి స్వరాల లాంటివేమీ తెలియకపోయినా, మంచి సంగీతం వింటే గుర్తించి, ఆనందించే మనసు నాకు దేవుడిచ్చాడు. చిన్నప్పటి నుంచి ఉన్న సంగీత పరిచయం వల్ల కంపోజింగ్ జరుగుతున్నప్పుడు బాణీ ఇంత చల్లగా ఉండాలనీ, పాట ఈ వాటేజ్‌లో ఉండాలనీ గ్రహిస్తూ ఉంటాను. నేనూ కూడా ఆ సమయంలో ఏదో ఒకటి కూనిరాగం తీస్తూనే ఉంటా. నా మాటలు, కూనిరాగాలు రచయితలకూ, సంగీత దర్శకులకూ ఏదో కొంత స్ఫూర్తిదాయకంగా ఉండాలని చేస్తుంటా. సాహితీ స్వర్ణకమలం నా సినిమాలు, పాటలు చూసి నేనేదో పురాణాలు, శాస్త్రాలు ఆపోశన పట్టేశాననుకుంటారు. కానీ, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ - ఏదైనా సరే పుస్తకాలు చదవడం నాకెప్పుడూ అలవాటు లేదు. పుస్తకం పట్టుకున్నా రెండు పేజీలు తిరగేసేసరికి, నిద్రలోకి జారుకుంటా. పురాణాలు, శాస్త్రాలు కూడా చదివినవాణ్ణి కాదు. అందుకే, పౌరాణిక చిత్రాల జోలికి పోలేదు. అన్నీ సాంఘికాలే తీశా. సాంఘికమైతే మనం రాసుకొనే కల్పిత కథ కాబట్టి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చేసుకోవచ్చు. మా సినిమాల్లోని పాటలకు రచయిత, సంగీత దర్శకుడు ఎవరైనప్పటికీ, వాటి టెక్స్చర్, మరోమాటలో చెప్పాలంటే వాటన్నిటి నేత ఒకేలా ఉంటుంది. సాఫీగా సాగిపోతుంటాయి. అందుకే, పాట వినగానే, అది ‘కె. విశ్వనాథ్ సినిమాలోని పాట’ అని తెలుస్తుంది కానీ, ఎవరు రాశారో, ఎవరు మ్యూజిక్ చేశారో చెప్పలేరు. కష్టం! ఒక సంఘటన చెబుతా. జైలర్‌గా శోభన్‌బాబు నటించిన ‘ప్రేమబంధం’ సినిమాలో ఒక పాట ఉంటుంది. భార్యను అరెస్ట్ చేసి జైలర్ భర్త తీసుకువెళుతున్న ఒక చిత్రమైన సన్నివేశం అది. ఆ సందర్భంలో పాట పెట్టాలనుకున్నా. ‘చేరేదెటకో తెలిసీ... చేరువ కాలేమని తెలిసీ... చెరి సగమైనామెందుకో... తెలిసీ... తెలిసీ...’ అని ఆ పాట నడుస్తుంది. ఆ రచన చేసింది సి. నారాయణరెడ్డి అనీ, వేటూరి అనీ అప్పట్లో కొంతమంది మధ్య చర్చ జరిగింది. నిజానికి, ఆ సందర్భానికి తగ్గట్లు పాట కోసం ఆ మాటలు నేను అల్లినవి. చిన్నప్పుడు నా మనసుకు తట్టిన భావాలను కవితల రూపంలో రాసేవాణ్ణి. అయితే, అవన్నీ అసంపూర్తిగా, అచ్చు కాకుండా అలా ఉండిపోయాయి. అంతరాంతరాళాల్లోని ఈ ప్రభావం వల్లనో ఏమో కానీ, సినిమా కథలో ఒక సీన్ రాసేటప్పుడే ఒక పల్లవి లాగా నా మనసుకు ఏదో తడుతుంది. పాత్రల తాలూకు స్వభావాల సంఘర్షణ నుంచి వచ్చిన ‘అబద్ధపు సాహిత్యాన్ని’ రాసుకొని, ఒక ఆప్షన్‌గా పెడతాను. ఆ ‘అబద్ధపు సాహిత్య’మే పల్లవులుగా స్థిరపడి, పాటలుగా వచ్చినవి చాలా ఉన్నాయి. పాట రాసే ముందే - కృష్ణశాస్త్రి గారైతే ‘నువ్వేం రాశావు?’ అని నన్ను అడిగేవారు. సినారె గారు ‘మీరేదో అనుకోని ఉంటారే! చెప్పండి!’ అనేవారు. ‘జీవనజ్యోతి’లోని ‘ముద్దులమ్మా బాబు నిద్దరోతున్నాడు...’, ‘స్వాతిముత్యం’లోని ‘వటపత్రసాయికి...’ లాంటి పల్లవులలా రాసినవే. అయితే వాటికి కర్త నేనని ఎప్పుడూ చెప్పలేదు. చెప్పుకోవాలనీ అనుకోలేదు. స్క్రిప్ట్‌లో నేను రాసినది చెప్పాక - నేను, ఆ గీత రచయిత - ఒక లైన్ నేను, ఒక లైన్ ఆయన అనుకుంటూ పోతుంటాం. ఆ క్రమంలో పాట వచ్చేస్తుంది. సందర్భోచితంగా ఉంటుంది. అదీ నా సినీగీతాల ఆవిర్భావం వెనుక ఉన్న రహస్యం. నేను పనిచేసిన సంగీత దర్శకులు, రచయితలందరూ నాకు సన్నిహితులే. కాకపోతే, చాలాకాలం పనిచేయడం వల్ల మహదేవన్‌తో నా ప్రస్థానం ఎక్కువ కాలం జరిగింది. దాంతో, ఆయనతో ఎక్కువ పనిచేసినట్లు కనిపిస్తుంది. అలాగే, గీత రచయిత వేటూరితో కూడా! వేటూరికి కూడా మేమంటే అపారమైన అభిమానం. నేను ఊళ్ళో లేకపోతే, ఇంట్లోవాళ్ళకు తోడుగా వేటూరి మా ఇంటికి వచ్చి, మడత మంచం వేసుకొని పడుకొనేవారు. అలాగే, సీతారామశాస్త్రి కావచ్చు, ఇతరులు కావచ్చు. అందరూ సన్నిహితులే. ప్రతిభ ఉంటే ప్రోత్సహించేవాళ్ళం. అయితే, మా సినిమాల్లోనే వాళ్ళ ప్రతిభా వ్యుత్పత్తులు ప్రకాశించడానికి కారణం లేకపోలేదు. వాళ్ళకు ఎలాంటి నిర్బంధాలూ పెట్టేవాళ్ళం కాదు. ‘ఈ సన్నివేశానికీ, సందర్భానికీ తగ్గట్లు విజృంభించి రాయండి. మీ కవిత్వానికి ఎలాంటి అడ్డుగోడలూ లేవు’ అని ప్రోత్సహించేవాళ్ళం. దాంతో, వారి కవితాశక్తి ప్రవాహంలా బయటకు వచ్చేది. సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’లో పాటలో ‘ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన...’ అని రాశారు. మామూలుగా అయితే సినిమా పాటల్లో ఎవరు అలా రాయిస్తారు? ఏ నిర్మాత ఒప్పుకుంటాడు? కానీ, డెరైక్టర్‌గా నేను ఏం చేసినా తమ మంచి కోసమే చేస్తారని నిర్మాతలకు తెలుసు. అందుకే, వాళ్ళెప్పుడూ నా నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. అలా ప్రతిభావంతులైన కవులందరికీ నా సినిమాల ద్వారా మంచి వేదిక దొరికింది. ఫలితంగా, మా నుంచి అంత మంచి సాహిత్యం, పాటలు వచ్చాయి. - రెంటాల జయదేవ సందర్భానికీ, బాణీకి తగ్గట్లు రచయిత కన్నా ముందే నేను రాసిపెట్టుకొనే పల్లవులను ముద్దుగా ‘అబద్ధపు సాహిత్యం’ అంటూ ఉంటా. దీనికి మూలాలు చిన్నతనంలోనే పడ్డాయి. చిన్నప్పుడు నేను పద్యాలు రాయాలని ప్రయత్నించా. మా కజిన్ ఒకతను ‘యమత రాజ భానస లగం’ అని తెలుగు ఛందస్సు గుర్తుపెట్టుకోవాలంటూ చెప్పేవాడు. కానీ, నాకు అది ఒంటబట్టలేదు. కానీ, ఇంట్లో ఆడవాళ్ళు పాడే వ్రతం పాటలు, రేడియోలో వచ్చే తత్త్వాలు - ఇలా అనేకం చెవినపడుతుండేవి. మా నాన్న గారి ‘వాహినీ పిక్చర్స్’ సినిమాల పాటలూ వినపడేవి. అప్పట్లో అవన్నీ నాకు పాటల రచన మీద, వాటిలోని భావసంపద మీద దృష్టి పెట్టేలా చేశాయి. -
అనంతలో వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య
-
అనంతలో వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దౌర్జ్యనాలు, హత్యలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌ను సోమవారం దారుణంగా హత్య చేశారు. టీడీపీ నాయకులే హత్యకు పాల్పడ్డారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కణేకల్లు మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్‌ను దుండగులు కాల్చిచంపారు. విశ్వనాథ్ కణేకల్లు వెళ్తుండగా దుండగులు మాల్యం వద్ద ఆయనపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ విశ్వనాథ్ అక్కడికక్కడే మరణించారు. -
ఆడపిల్లల చదువుపై చిన్నచూపు వద్దు
వాంకిడి, న్యూస్‌లైన్ : ఆడపిల్లలని చిన్నచూపు చూడకుండా మగవారితో సమానంగా ఉన్నత చదువులు చదివించాలని కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్‌బాబు అన్నారు. మండలంలోని ఇంధాని గ్రామంలో శుక్రవారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలని అసహ్యించుకుని ఆడవాళ్ల శాతాన్ని తగ్గిస్తున్నారని, లింగ భేదం లేకుండా సమాజంలో అందరూ సమానమే భావనతో మెదలాలని తెలిపారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. పోలీసులంటే భయపడకుండా నిర్భయంగా సహాయం కోరవచ్చని పేర్కొన్నారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, నవయువ సూర్యకిరణాలు యూత్‌కు వాలీబాల్ అందజేశారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. వైద్యాధికారి విశ్వనాథ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం ప్రసవాలు ఇంట్లోనే జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకుంటే ఆరోగ్యానికి హాని కలుగకుండా ఉండడంతోపాటు జనని సురక్ష యోజన పథకం కింద రూ.వెయ్యి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ తిరుపతి, సర్పంచ్ కొట్నాక విజయ్‌కుమార్, వైద్యులు గౌతమ్‌పవార్, ఆర్ఎంపీ అజయ్, రాజు, వెంకటి, దయాకర్, అశోక్, ఆప్తాలమిక్ వెంకటేశ్, విలేజ్ పోలీస్ అధికారి కనక జంగు, నవయువ సూర్యకిరణాలు యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ పాల్గొన్నారు. -
25 వసంతాల స్వర్ణకమలం