
కళాతపస్విని కలిసిన వెంకయ్య
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు-2016కు ఎంపికైన ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కే విశ్వనాథ్‌ను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కలిశారు.
హైదరాబాద్: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు-2016కు ఎంపికైన ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కే విశ్వనాథ్‌ను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కలిశారు. అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆయనకు అభివాదం చేసి అభినందనలు తెలిపారు.
ఆదివారం ఉదయం స్వయంగా ఆయన ఇంటికెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి మరీ తన విజ్ఞతను చాటుకున్నారు. అక్కడే ఆయనతో పది నిమిషాలపాటు కూర్చుని మాట్లాడారు. విశ్వనాథ్‌ను కలిసిన వారిలో వెంకయ్యనాయుడితోపాటు తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి కూడా ఉన్నారు.