ఉత్తరప్రదేశ్‌లోని కాశీ, అయోధ్యలను సందర్శించాలనుకునేవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వేకు అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) వారణాసి, అయోధ్యలను సందర్శించేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణ సదుపాయం, వసతి, ఆహారం మొదలైనవి అందజేయనున్నారు.
ఈ ప్యాకేజీ ఆరు పగళ్లు, ఐదు రాత్రులు ఉండనుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణం సాగించేందుకు రూ.15,750(ఒక్కరు) చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణికుల తమకు అందుబాటులో ఉండే ప్యాకేజీని కూడా ఎన్నుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి ‘రామ్ మందిర్ దర్శన్’ అనే పేరు పెట్టారు. ఈ ప్యాకేజీ వారణాసి నుంచి అయోధ్య వరకూ కొనసాగనుంది. ఈ టూర్ ప్రతి శుక్రవారం ప్రారంభమవుతుంది.
ఐఆర్‌సీసీటీ వెబ్‌సైట్ www.irctctourism.comని సందర్శించడం ద్వారా ప్రయాణికులు ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. అలాగే ఐఆర్‌సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.
Embark on a divine journey to the land of spiritual awakening! Join IRCTC Tourism’s Ram Mandir Darshan and seek blessings at the revered destinations - Ayodhya & Varanasi!
To experience the essence of Hinduism and rejuvenate your soul, book your journey at… pic.twitter.com/hMPlPIbTsN— IRCTC (@IRCTCofficial) August 18, 2024
Comments
Please login to add a commentAdd a comment