
గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి
శెట్టిగుంట(రైల్వేకోడూరు రూరల్): గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటనలో రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఎస్.మస్తాన్ వలీ(35) రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేటలో వివాహం చేసుకున్నాడు. గురువారం కొత్త ద్విచక్ర వాహనంలో పుల్లంపేటకు వచ్చి తిరిగి శ్రీ కాళహస్తికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతినికి భార్య అమీనా బేగం ఉన్నారు.