రెల్వేకోడూరురూరల్, న్యూస్‌లైన్: ఎర్రచందనం స్మగ్లర్లకోసం అడవులలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు రాజంపేట సబ్ డీఎఫ్‌ఓ శ్రీనివాసరావు తెలిపారు. రైల్వేకోడూరుకు కొత్తగా వచ్చిన 12 మంది ఆర్ముడు పోలీసులకు రైల్వేకోడూరులోని ఫారెస్టు అతిథిగృహంలో సోమవారం ఆయన పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
ఇటీవల స్మగ్లర్లు ఫారెస్టు అధికారులను కిరాతకంగా చంపారని, వారిని పట్టుకనేందుకు అడవుల్లో జల్లెడ పడుతున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే కొన్ని బలగాలు ఉన్నాయని, సోమవారం కొత్తగా మరో 12 మంది వచ్చారని తెలిపారు. కోడి వెంగమ్మబావి, మెట్లకోన, గంగిశెట్టిబండలు, గుండంపెంట, పాయలబావి, శిలలకోన, బంగ్లాపోడు తదితర ప్రాంతాలలో గస్తీ ముమ్మరంగా సాగుతోందన్నారు. ఎఫ్‌ఆర్‌ఓ శ్రీరాములు పాల్గొన్నారు.