red sandle wood
-
11 మంది ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్ట్
సాక్షి, రైల్వేకోడూరు : రైల్వేకోడూరులోని శేషాచలం సమీపాన ఉన్న ప్రదేశాల్లో మూడు వేర్వేరు ప్రాంతాలలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న 11 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 22 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. మైసూరువారిపల్లె గ్రామ పంచాయతీలోని హెలీప్యాడ్ సమీప ప్రాంతం, ఓబులవారిపల్లె మండలం బాలిశెట్టిపల్లె సమీపంలోని గుంజనేరు వద్ద, చిట్వేలి మండలం గొట్టిమానుకోన అటవీ ప్రాంతంలో కొందరు ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించేందుకు వాహనాలలో లోడ్ చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వేకోడూరుకు చెందిన కుంభకోణం శ్రీరాములు ఆచారి, చమర్తి సుబ్బరాజు, కుంభా వెంకటరమణ, షేక్ జాబీర్, తమిళనాడుకు చెందిన వెంకటేష్, కొండూరు రాజశేఖర్‌రాజు, పంటా సురేష్, కమినబోయిన రామకృష్ణ, వినోద్‌కుమార్, బయనబోయిన గుర్రయ్య, బోయ వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 ఎర్రచందనం దుంగలు, ఒక టెంపో వాహనం, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ దుంగల విలువ రూ.లక్ష 12 వేలు 800 ఉంటుంది. పారిపోయిన స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ కె.సాయినాథ్, ఎస్సైలు పి.వెంకటేశ్వర్లు, ఎమ్.భక్తవత్స లం, హెచ్.డాక్టర్ నాయక్, పి.సత్యనారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్జాతీయ స్మగ్లర్ అరెస్ట్
సాక్షి, కడప : దశాబ్దాల కాలంగా పోలీసులకు కంటిమీద నిద్ర లేకుండా చేసి తప్పించుకుతిరుగుతున్న అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అశోక్ కుమార్ అగర్వాల్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. వైఎస్ఆర్ జిల్లాలో గత కొన్నేళ్లుగా పోలీసుల కన్నుకప్పి కోట్లాది రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నాడు. పలుసార్లు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు. ఈసారి మాత్రం పోలీసులకు దొరికిపోయాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అశోక్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి సుమారు నాలుగు కోట్లు విలువ చేసే 3 టన్నుల ఎర్రచందనం దుంగలు, వాటితో తయారు చేసిన బొమ్మలను స్వాధీన పరుచుకున్నారు. అగర్వాల్ ఇప్పటి వరకు 1000 టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణా చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈమేరకు జిల్లాఎస్పీ బాబూజీ అట్టడా వివరాలు వెల్లడించారు. -
రూ.35 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
సాక్షి, బీఎన్ కండ్రిగ: ఎర్రచందనం స్మగ్లర్లను బీఎన్ కండ్రిగ పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరుజిల్లా పిచ్చాటూరు మండలంలోని అడవుల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుండగా బీఎన్ కండ్రిగ పోలీసులు దాడి చేసి ఐదుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరినుంచి రూ.35 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాలను కూడా సీజ్ చేశారు. -
భారీగా ఎర్రచందనం నిల్వలు స్వాధీనం
బెంగళూరు: బెంగళూరు రూరల్ జిల్లా కార్ఖానాహల్కిలో సోదాలు నిర్వహించిన చిత్తూరు జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున ఎర్రచందనం నిల్వలను గుర్తించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 2 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిల్వ ఉంచిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ. 2 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
కదులుతోన్న‘ఎర్ర’ డంప్‌లు
– పుష్కర విధుల్లో జిల్లా పోలీసులు – ఇదే అదునుగా పేట్రేగుతున్న స్మగ్లర్లు – శేషాచలం నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం రవాణా – బుధ, గురువారాల్లో 13 మంది స్మగ్లర్లు అరెస్ట్ – బడా స్మగ్లర్ శ్రీనివాసరెడ్డి కోసం గాలింపు సాక్షి ప్రతినిధి తిరుపతి : శేషాచలంలోని ఎర్ర చందనం డంప్‌లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తమిళనాడు నుంచి వస్తోన్న ఎర్ర స్మగ్లర్లు చాకచక్యంగా ఎర్రదుంగల తరలింపును ముమ్మరం చేశారు. జిల్లా పోలీసుల్లో 80 శాతం మంది కృష్ణా పుష్కర విధులకు హాజరవడం వీరికి కలిసొచ్చింది. ఇదే సరైన అదునుగా భావించిన స్మగ్లర్లు అడవుల్లో దాచిన ఎర్రచందనం దుంగల డంప్‌లను గుట్టూచప్పుడు కాకుండా బయటకు రవాణా చేసేందుకు యత్నిస్తున్నారు. గడచిన మూడు రోజులుగా ఈ రవాణా పెరిగినట్లు టాస్క్ఫోర్సు అధికారులు గుర్తించారు. బుధ, గురువారాల్లో విస్తృతంగా తనిఖీలు జరిపి 13 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.40 లక్షల విలువైన 58 ఎర్రచందనం దుంగలను (2 టన్నులు)స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని 5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శేషాచలంలో ఇంకా 30 శాతం ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఇప్పటికే నరికిన చెట్ల తాలూకు దుంగల నిల్వలు పెద్ద ఎత్తున అడవుల్లో నిల్వ ఉన్నాయి. వీటిని బయటకు తరలించే విషయంలో ఇటు ఆంధ్ర, అటు తమిళనాడు స్మగ్లర్లు విస్తతంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గడచిన రెండు నెలల్లో సుమారు 20 టన్నులకు పైన ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు 25 మందికి పైబడి స్మగ్లర్లును అరెస్టు చేశారు. రెడ్‌శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన 13 బృందాలు శేషాచలంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. వెలిగొండ, పాలకొండ, నల్లమల, లంకమల అటవీ ప్రాంతాల్లో వీరి కూంబింగ్ జరుగుతోంది. ఈ నెల ఏడో తేదీన జిల్లాకు చెందిన 80 శాతం మంది పోలీసులు కృష్ణా పుష్కర వి«ధులకు వెళ్లిపోయారు. దీంతో అన్ని మార్గాల్లోనూ పోలీసుల తనిఖీలు లేకుండా పోయాయి. ఇదే అదునుగా తీసుకున్న స్మగ్లర్లు రాత్రి వేళల్లో యథేచ్ఛగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్నారు. 13 మంది అరెస్టు ...పరారీలో ముగ్గురు ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం ఉగ్గరాల తిప్ప దగ్గర కూంబింగ్‌లో ఉన్న టాస్క్ఫోర్సు పోలీసులకు ఎర్ర చందనం దుంగలను రవాణా చేసే ముగ్గురు తమిళనాడు స్మగ్లర్లు దొరికారు. వీరిని చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులు వీరి నుంచి 58 దుంగలు (2 టన్నులు)స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.40 లక్షలు ఉంటుందని టాస్క్ఫోర్సు డీఎస్సీ శ్రీధర్‌రావు విలేకరులకు తెలిపారు. గురువారం ఉదయం 5 గంటలకు జూపార్కు సమీపంలోని పెరుమాళ్లపల్లి అడవుల్లో అడవిలోకి ప్రవేశిస్తోన్న ఎర్ర స్మగ్లర్లపై టాస్క్ఫోర్సు ఆర్ఎస్ఐ వాసు, నర్సింహయ్యల టీములు ఒక్కసారిగా దాడులు జరిపాయి. మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. వీరిలో రేణిగుంటకు చెందిన కె. శివ, తిరుచ్చికి చెందిన లక్ష్మన్ సెంథిల్ కుమార్, రాసు షణ్ముగం, పిలెందిరన్ అంగముత్తు, క్రిష్టన్మూర్తి, రామర్ నాగరాజన్, నల్లిస్వామి పెరుమాళ్, నగరాజన్ సత్యవేల్, సంథానమ్ రవి, సంథానమ్ రాములు ఉన్నారని డీఎస్పీ శ్రీథర్రావు వివరించారు. వీరికి నాయకత్వం వహిస్తోన్న పేరూరి శ్రీనివాసరెడ్డి, మునస్వామి, రామానాయుడులు పరారయ్యారు. అరెస్టయిన వారి నుంచి ఓ ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బడా స్మగ్లర్ పేరూరి శ్రీనివాసరెడ్డి కోసం గాలిస్తున్నారు. సహకరిస్తోన్న అగ్రికల్చర్ కాలేజీ వాచ్మెన్, రైల్వే ఉద్యోగిలను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. -
రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లెలో గురువారం ఉదయం భారీ మొత్తంలో ఎర్రచందనం పట్టుబడింది. అటవీ, పోలీసు శాఖ అధికారులు జరిపిన వాహన సోదాల్లో టిప్పర్‌లో తరలిస్తున్న 63 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే, నిందితులు పరారయ్యారు. -
16 మంది తమిళ కూలీల అరెస్ట్
వైఎస్ఆర్ జిల్లా: 16 మంది తమిళకూలీలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నారన్న ఆరోపణలతో వైఎస్ఆర్ జిల్లా ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్ సమీపంలో కూలీలను పోలీసులు పట్టుకున్నారు. పరారీలో మరికొంతమంది తమిళకూలీలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
12 వ రోజూ నిలిచిన బస్సులు
చిత్తూరు: చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ నేపథ్యంలో తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నయి. దీంతో 12వ రోజుకూడా ఆంధ్రపదేశ్ నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులని ఆర్టీసీ నిలిపేసింది. సర్వీసులని నిలపడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నామని, ఇలానే కొనసాగితే సోమవారం నుంచి తమిళనాడు బస్సులని ఏపీలో తిరగనివ్వమంటూ స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా, శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
8వ రోజూ నిలిచిన బస్సులు
చిత్తూరు: చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ నేపథ్యంలో తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నయి. ఎనిమిదో రోజుకూడా ఆంధ్రపదేశ్ నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులని ఆర్టీసీ నిలిపేసింది. నిరసనల నేపథ్యంలో ఏపీ- తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. -
కొనసాగుతున్న ఆందోళనలు
చిత్తూరు: చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ నేపథ్యంలో తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నయి. ఐదో రోజుకూడా ఆంధ్రపదేశ్ నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులని ఆర్టీసీ నిలిపేసింది. నిరసనల నేపథ్యంలో ఏపీ- తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. -
స్మగ్లర్ల కోసం ముమ్మరంగా కూంబింగ్
రెల్వేకోడూరురూరల్, న్యూస్‌లైన్: ఎర్రచందనం స్మగ్లర్లకోసం అడవులలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు రాజంపేట సబ్ డీఎఫ్ఓ శ్రీనివాసరావు తెలిపారు. రైల్వేకోడూరుకు కొత్తగా వచ్చిన 12 మంది ఆర్ముడు పోలీసులకు రైల్వేకోడూరులోని ఫారెస్టు అతిథిగృహంలో సోమవారం ఆయన పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇటీవల స్మగ్లర్లు ఫారెస్టు అధికారులను కిరాతకంగా చంపారని, వారిని పట్టుకనేందుకు అడవుల్లో జల్లెడ పడుతున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే కొన్ని బలగాలు ఉన్నాయని, సోమవారం కొత్తగా మరో 12 మంది వచ్చారని తెలిపారు. కోడి వెంగమ్మబావి, మెట్లకోన, గంగిశెట్టిబండలు, గుండంపెంట, పాయలబావి, శిలలకోన, బంగ్లాపోడు తదితర ప్రాంతాలలో గస్తీ ముమ్మరంగా సాగుతోందన్నారు. ఎఫ్ఆర్ఓ శ్రీరాములు పాల్గొన్నారు.