చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు.
చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లెలో గురువారం ఉదయం భారీ మొత్తంలో ఎర్రచందనం పట్టుబడింది. అటవీ, పోలీసు శాఖ అధికారులు జరిపిన వాహన సోదాల్లో టిప్పర్‌లో తరలిస్తున్న 63 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే, నిందితులు పరారయ్యారు.