వైఎస్ఆర్ జిల్లా: 16 మంది తమిళకూలీలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నారన్న ఆరోపణలతో వైఎస్ఆర్ జిల్లా ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్ సమీపంలో కూలీలను పోలీసులు పట్టుకున్నారు. పరారీలో మరికొంతమంది తమిళకూలీలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.