ఎర్రచందనం దుంగల పట్టివేత
Published Mon, Jan 25 2016 11:22 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM
పుత్తూరు: చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం గోవిందపాలెం వద్ద ఐచర్ వాహనంలో తరలిస్తున్న 125 కిలోల బరువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో పుత్తూరు చెక్‌పోస్ట్ వద్ద తనిఖీ చేపట్టిన అధికారులు ఓ ఐచర్ వాహనాన్నిఆపినా డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. పోలీసులు వాహనాన్ని వెంబడించగా గోవిందపాలెం వద్ద వాహనాన్ని ఆపి పరారయ్యాడు. పోలీసులు తనిఖీ చేయగా అందులో ఎర్రచందనం దుంగలు వెలుగు చూశాయి. వాటితో పాటు వాహనాన్ని సీజ్ చేశారు.
Advertisement
Advertisement