రైల్వేకోడూరు: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 69 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి సెక్షన్ జానకిపురం గ్రామ సమీపంలో శనివారం జరిగింది. ముందస్తు సమాచారంతో గ్రామసమీపంలోని అరటితోటకు వెళ్లిన పోలీసులకు రవాణ చేయడానికి సిద్ధంగా ఉంచిన 69 దుంగలు గుర్తించారు. పోలీసులు వస్తున్నారని గమనించిన స్మగ్లర్లు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం సుమారు 2 టన్నుల బరువు ఉంటుందని, వాటి విలువ సుమారు కోటిన్నర ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
కోటిన్నర విలువైన ఎర్రచందనం స్వాధీనం
Published Sat, Aug 8 2015 12:39 PM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM
Advertisement
Advertisement