railwaykoduru
-
టీడీపీ కోసం మరో అభ్యర్థిని మార్చేసిన పవన్
సాక్షి, అన్నమయ్య: జనసేన శ్రేణుల అభిప్రాయాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పూచిక పుల్లలా తీసి పారేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఇంకా ఒకట్రెండు పెండింగ్ స్థానాలకు అధికారికంగా అభ్యర్థుల్ని ప్రటించాల్సి ఉంది. అయితే ఈలోపే ప్రకటించిన స్థానాల్లోనూ మార్పునకు దిగింది. అదీ ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారనే!. తాజాగా రైల్వే కోడూరు అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మార్చేశారు. రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును గురువారం మధ్యాహ్నాం ప్రకటించింది జనసేన పార్టీ. యనమల భాస్కర్ స్థానంలో అరవ శ్రీధర్‌ను అభ్యర్థిగా పోటీలో నిలుపుతున్నట్లు ఒక నోట్ రిలీజ్ చేసింది. క్షేత్రస్థాయి నివేదికలు, జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ మార్పు చేసినట్లు సదరు నోట్ తెలిపింది. అయితే.. యనమల ఇంకా ప్రచారంలోకి దిగకముందే ఈ మార్పు చోటు చేసుకోవడం గమనార్హం. అదే సమయంలో.. ముక్కావారి పల్లె గ్రామసర్పంచ్‌గా ఉన్న అరవ శ్రీధర్.. మూడు రోజుల కిందటే జనసేనలో చేరడం గమనార్హం. అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా శ్రీ మండలి బుద్ధ ప్రసాద్#VoteForGlass pic.twitter.com/5zGc4kndba — JanaSena Party (@JanaSenaParty) April 4, 2024 అంతకు ముందు.. రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా యనమల భాస్కర్‌పై సర్వేల్లో సానుకూలత రాలేదని.. మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేకుండా పోయిందంటూ అభ్యర్థి మార్పుపై జనసేన నేరుగా ప్రకటన చేసేయడం గమనార్హం. ఇప్పటికే ఆళ్లగడ్డ సీటును టీడీపీ నుంచి వచ్చిన మండలి బుద్ధ ప్రసాద్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. మన్యం పాలకొండ స్థానం సైతం టీడీపీ నుంచే వలస వచ్చిన నిమ్మక జయకృష్ణకే దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. నేడో, రేపో ఆ ప్రకటన కూడా వెలువడనుంది. -
ఏడాది పాటు కాపురం.. మోజు తీరాక..
సాక్షి, రైల్వేకోడూరు (కడప): పెళ్లి చేసుకుని ఏడాది కాపురం చేసి ఇప్పుడు మీకు, నాకు సంబంధం లేదని భర్త అంటున్నాడు. తనకు న్యాయం చేయాలని మెట్టినింటి ముందు మహిళ ధర్నా చేపట్టింది. ఈ సంఘటన బుధవారం కోడూరులో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే... రాంనగర్‌కు చెందిన ఫరీదాకు పట్టణంలోని సూర్యానగర్‌కు చెందిన అహ్మద్‌బాషాతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల పాప ఉంది. రెండేళ్ల క్రితం అహ్మద్‌బాషా కువైట్‌కు వెళ్లిన తర్వాత భార్యాబిడ్డలను పట్టించుకోలేదు. ఇటీవల కువైట్ నుంచి వచ్చాడని తెలుసుకొని పలు పర్యాయాలు కలిసేందుకు మెట్టినింటికి వచ్చినా మీకు, నాకు సంబంధం లేదని పంపించేశారు. దీంతో ఫరీదా పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. మరో రెండు రోజుల్లో భర్త తిరిగి కువైట్‌కు వెళ్లిపోతున్నాడని తెలిసి తన తల్లి, బంధువులతో కలిసి భర్త ఇంటి ముందు తనకు న్యాయం చేయాలని ధర్నా చేసింది. చదవండి: (Hyderabad: విద్యార్థినిపై లైంగిక దాడికి ప్రిన్సిపాల్ యత్నం) -
అమ్మా నన్ను ఎందు‘కని’ పడేశారు..?
‘‘అమ్మా నన్ను ఎందుకని పడేశారు..? ఆడపిల్లగా పుట్టినందుకా.? లేక ఆర్థికంగా భారమవుతున్నందుకా.? నీ ఒడిలో ఉండాల్సిన నేను.. ఇలా అరటితోటలో పడిఉన్నానే.. నా ఈ దుస్థితికి కారణం ఎవరమ్మా..? ఏంటమ్మా?’’అని ప్రశ్నించలేని పసి మనసు తనది. రైల్వేకోడూరు రూరల్: అరటి తోటలో పడిఉన్న పసికందును ఐసీడీఎస్ అధికారులు అక్కున చేర్చుకున్నారు. ఈ సంఘటన రైల్వేకోడూరు మండలంలోని వీవీ కండ్రిక దళితవాడ సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, ఐసీడీస్ సీడీపీఓ రాజమ్మ వివరాల మేరకు.. వీవీ కండ్రిక దళితవాడ సమీపంలో శనివారం తెల్లవారుజామున అరటి తోటలో చిన్నారి ఏడుపులు వినిపించాయి. దీంతో కౌలు రైతు చంద్ర పరుగున వెళ్లి చూడగా పసికందు కనిపించింది. చంద్ర స్థానిక అంగన్వాడీ వర్కరు లక్ష్మీదేవికి, గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు ఆ బిడ్డను తీసుకెళ్లి రైల్వేకోడూరు పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేయించారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ పెద్ద ఓబన్నకు విషయం తెలిపారు. ఈ ఘటనపై ఎస్ఐ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డగా ఉందని, ఆడబిడ్డ కావడంతో ఎవరైనా పడేసి ఉంటారా? మరేమైనా జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తామన్నారు. శిశువును కడప రిమ్స్‌కు తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేయించి, ఐసీడీఎస్ తరుఫున శిశు గృహలో చేర్పిస్తామని ఎస్ఐ తెలిపారు. చదవండి: ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు.. -
కడప–రేణిగుంట నాలుగు వరుసల హైవేకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నైలకు తక్కువ సమయంలోనే వెళ్లేందుకు కడప–రేణిగుంట మధ్య నాలుగు వరుసల హైవేను నిర్మించనున్నారు. రాయలసీమ జిల్లాలకు ముఖ్య రహదారి అయిన ఈ రోడ్డు ప్రస్తుతమున్న రెండు వరుసల నుంచి నాలుగు లేన్లుగా మార్చేందుకు ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) పనులు వేగవంతం చేసింది. త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ హైవేను కేంద్రం ఇటీవలే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేగా గుర్తించింది. ఈ మార్గంలో 3 వంతెనలు, 2 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. రెండో ప్యాకేజీ కింద కడప జిల్లా సిద్ధవటం మండలం మొదలుకుని రైల్వేకోడూరు మండలం వరకు నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. భూ సేకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో ఈ హైవేకు ఎన్‌హెచ్–716 కేటాయించారు. ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి చొరవతో ఎన్హెచ్ఏఐ అలైన్‌మెంట్‌ను ఖరారు చేసింది. కడప వద్ద వైఎస్సార్ టోల్‌ప్లాజా నుంచి రేణిగుంట వరకు 4 లేన్ల నిర్మాణం జరగనుంది. రూ.3 వేల కోట్లతో 133 కి.మీ. మేర నిర్మించనున్న ఈ హైవే నిర్మాణానికి కేంద్రం అంగీకరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు వేగవంతంగా చేస్తోంది. ఒక్క కడప జిల్లాలోనే సుమారు 100 కి.మీ. మేర రహదారి నిర్మించనున్నారు. దీనిని రెండు ప్యాకేజీలుగా విభజించి 1,068 ఎకరాలు సేకరించనున్నారు. వైఎస్సార్ జిల్లా బద్వేలు నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమైంది. మొత్తం 138 కి.మీ. మేర రోడ్డు నిర్మాణాన్ని ఎన్హెచ్ఏఐ చేపట్టనుంది. నాలుగేళ్లలో పూర్తి చేస్తాం నాలుగు వరుసల ఈ హైవే టెండర్లను త్వరలోనే పూర్తిచేస్తాం. ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో నిర్మిస్తాం. ఇప్పటికే భూసేకరణ పనులు ప్రారంభించాం. జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. – రామచంద్ర, చీఫ్ ఇంజనీర్, ఎన్‌హెచ్ ప్రాజెక్ట్స్ -
అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ది నిరోధకులా..?
-ఆకేపాటి ఆమర్నాథ్ రెడ్డి రెడ్డివారిపల్లె(రైల్వేకోడూరు రూరల్): టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులవుతారా? అని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి నిలదీశారు. ప్రజల తరుపున ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష నాయకుడైన వైస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఉందన్నారు. రైల్వేకోడూరు మండలంలోని రెడ్డివారిపల్లెలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఇచ్చిన క్రిస్మస్ విందుకు ఆయన హాజరయ్యారు. పార్టీనాయకులు, కార్యకర్తలతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోతిరెడ్డి పాడు, గాలేరు–నగిరి, హంద్రీ నీవా పనులు 80 శాతం పూర్తిచేశారని తెలిపారు. టీడీపీ యాంలో సీఎం చంద్రబాబు 20 శాతం పూర్తి చేయలేకపోగా పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరు అందిస్తాం, పులివెందులకు సాగునీరు, తాగునీరు అందిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పూటకో మాట చెప్పడం తప్ప ఆయన రాష్ట్రానికి, జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. వైఎస్ చేసిన పనులకు గేట్లు ఎత్తారు తప్ప ఆయన గొప్ప అందులో ఏమీలేదన్నారు. ఇటీవల కడపలో జరిగిన ధర్నాకు ప్రభుత్వం దిగివచ్చి చేసిందే తప్ప జిల్లాకు ఆయన సొంతంగా చేసిందీ శూన్యమన్నారు. సోమవారం పులివేందులలో పీబీసీ రైతులు చేస్తున్న దీక్షకు అందురూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. జెడ్పీటీసీ మారెళ్ల రాజేశ్వరి, మండల కన్వీనర్లు కోడూరు సుధాకర్‌రాజు, చిట్వేలి చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, పుల్లంపేట ముద్దా బాబుల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి, క్షత్రియ నాయకులు సిద్దేశ్వరరాజు, నియోజకవర్గ అధికార ప్రతినిది ఎం.నాగేంద్ర, మెనార్టీనాయకులు ఆదాం సాహేబ్, ఎంపీటీసీలు శివయ్య, రవి కుమార్ తదితరులు హాజరయ్యారు. -
ట్రాక్టర్, బైక్ ఢీ : యువకుడి మృతి
రైల్వేకోడూరు: వేగంగా వెళ్తున్న ట్రాక్టర్, బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం తురకపల్లి వద్ద చోటుచేసుకుంది. చిట్వేల్ మండలం నాగవరం గ్రామానికి చెందిన కాకె సురేష్(25), తన స్నేహితుడు అశోక్‌తో కలిసి బైక్‌పై రైల్వే కోడూరు వస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో సురేష్ అక్కడికక్కడే మృతిచెందగా.. అశోక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ప్రాణం ఖరీదు రూ. 5 లక్షలు
రైల్వేకోడూరు: విధి నిర్వహణలో ఉన్న ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందడంతో ఆ సంస్థ ప్రతినిధులు స్థానిక పెద్దలతో మధ్యవర్తిత్వం చేసి ప్రాణం ఖరీదు రూ.5 లక్షలుగా నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట గనులలో ఆదివారం త్రివేణి ప్రైవేటు సంస్థకు చెందిన కార్మికుడు కుంచం నారాయణ (55) డ్రిల్లింగ్ పనులు నిర్వహిస్తూ కుప్పకూలాడు. ఇతను డ్రిల్లింగ్ విభాగంలో రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. శనివారం సాయంకాలం విధులకు వెళ్లాడు. ఆదివారం తెల్లవారుజామున డ్రిల్లింగ్ పనిచేస్తూ ఊపిరి ఆడక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని స్థానికులు తెలిపారు. వెంటనే రైల్వేకోడూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా మృతిచెందాడు. ధూళి కాలుష్యంతో ఊపిరాడక చనిపోయాడని కొందరు చెబుతుండగా, గుండెపోటుతో చనిపోయాడని మరికొందరు అంటున్నారు. దీంతో కార్మికుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని బికమ్మపల్లె గ్రామానికి చెందిన నారాయణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రతిరోజూ చేసే పనుల కంటే అధికంగా చేయాలని డ్రిల్లింగ్ విభాగంలో పనిచేసే కార్మికులను రెండు రోజులుగా ఒత్తిడి అధికమైంది. ఇందులో భాగంగానే డ్రిల్లింగ్ పనులు వేగవంతంలో కార్మికుడు నారాయణ ఊపిరాడక మృతిచెందాడు. మైనింగ్ చట్టాలు తమకు ఎక్కడ చుట్టుకుంటాయోనని తవ్వకాల కాంట్రాక్టర్ గుండెపోటుగా చిత్రీకరించారు. కాంట్రాక్టర్‌తో ప్రభుత్వ అధికారులు చేతులు కలిపారు. నిరుపేద అయిన మృతుని కుటుంబాన్ని ఓవైపు బెదిరింపులు, మరోవైపు పరిహారంతో మభ్యపెట్టి వాస్తవాలను వక్రీకరించి కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
కోటిన్నర విలువైన ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 69 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి సెక్షన్ జానకిపురం గ్రామ సమీపంలో శనివారం జరిగింది. ముందస్తు సమాచారంతో గ్రామసమీపంలోని అరటితోటకు వెళ్లిన పోలీసులకు రవాణ చేయడానికి సిద్ధంగా ఉంచిన 69 దుంగలు గుర్తించారు. పోలీసులు వస్తున్నారని గమనించిన స్మగ్లర్లు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం సుమారు 2 టన్నుల బరువు ఉంటుందని, వాటి విలువ సుమారు కోటిన్నర ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. -
భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం డంప్ బయటపడింది. అటవీశాఖ అధికారులు సోమవారం గాదెల-వైకోట సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతుండగా డంప్ వెలుగు చూసింది. 75 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.60 నుంచి రూ.80 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.