
భర్త ఇంటి ముందు ధర్నా చేస్తున్న ఫరీదా, బిడ్డతో సహా బాధితురాలు ఫరీదా
సాక్షి, రైల్వేకోడూరు (కడప): పెళ్లి చేసుకుని ఏడాది కాపురం చేసి ఇప్పుడు మీకు, నాకు సంబంధం లేదని భర్త అంటున్నాడు. తనకు న్యాయం చేయాలని మెట్టినింటి ముందు మహిళ ధర్నా చేపట్టింది. ఈ సంఘటన బుధవారం కోడూరులో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే... రాంనగర్‌కు చెందిన ఫరీదాకు పట్టణంలోని సూర్యానగర్‌కు చెందిన అహ్మద్‌బాషాతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల పాప ఉంది.
రెండేళ్ల క్రితం అహ్మద్‌బాషా కువైట్‌కు వెళ్లిన తర్వాత భార్యాబిడ్డలను పట్టించుకోలేదు. ఇటీవల కువైట్ నుంచి వచ్చాడని తెలుసుకొని పలు పర్యాయాలు కలిసేందుకు మెట్టినింటికి వచ్చినా మీకు, నాకు సంబంధం లేదని పంపించేశారు. దీంతో ఫరీదా పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. మరో రెండు రోజుల్లో భర్త తిరిగి కువైట్‌కు వెళ్లిపోతున్నాడని తెలిసి తన తల్లి, బంధువులతో కలిసి భర్త ఇంటి ముందు తనకు న్యాయం చేయాలని ధర్నా చేసింది.
చదవండి: (Hyderabad: విద్యార్థినిపై లైంగిక దాడికి ప్రిన్సిపాల్ యత్నం)
Comments
Please login to add a commentAdd a comment