సాక్షి, అన్నమయ్య: జనసేన శ్రేణుల అభిప్రాయాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పూచిక పుల్లలా తీసి పారేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఇంకా ఒకట్రెండు పెండింగ్ స్థానాలకు అధికారికంగా అభ్యర్థుల్ని ప్రటించాల్సి ఉంది. అయితే ఈలోపే ప్రకటించిన స్థానాల్లోనూ మార్పునకు దిగింది. అదీ ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారనే!. తాజాగా రైల్వే కోడూరు అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మార్చేశారు.
రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును గురువారం మధ్యాహ్నాం ప్రకటించింది జనసేన పార్టీ. యనమల భాస్కర్ స్థానంలో అరవ శ్రీధర్‌ను అభ్యర్థిగా పోటీలో నిలుపుతున్నట్లు ఒక నోట్ రిలీజ్ చేసింది. క్షేత్రస్థాయి నివేదికలు, జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ మార్పు చేసినట్లు సదరు నోట్ తెలిపింది. అయితే.. యనమల ఇంకా ప్రచారంలోకి దిగకముందే ఈ మార్పు చోటు చేసుకోవడం గమనార్హం. అదే సమయంలో.. ముక్కావారి పల్లె గ్రామసర్పంచ్‌గా ఉన్న అరవ శ్రీధర్.. మూడు రోజుల కిందటే జనసేనలో చేరడం గమనార్హం.
అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా శ్రీ మండలి బుద్ధ ప్రసాద్#VoteForGlass pic.twitter.com/5zGc4kndba
— JanaSena Party (@JanaSenaParty) April 4, 2024
అంతకు ముందు.. రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా యనమల భాస్కర్‌పై సర్వేల్లో సానుకూలత రాలేదని.. మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేకుండా పోయిందంటూ అభ్యర్థి మార్పుపై జనసేన నేరుగా ప్రకటన చేసేయడం గమనార్హం. ఇప్పటికే ఆళ్లగడ్డ సీటును టీడీపీ నుంచి వచ్చిన మండలి బుద్ధ ప్రసాద్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. మన్యం పాలకొండ స్థానం సైతం టీడీపీ నుంచే వలస వచ్చిన నిమ్మక జయకృష్ణకే దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. నేడో, రేపో ఆ ప్రకటన కూడా వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment