వేగంగా వెళ్తున్న ట్రాక్టర్, బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
రైల్వేకోడూరు: వేగంగా వెళ్తున్న ట్రాక్టర్, బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం తురకపల్లి వద్ద చోటుచేసుకుంది.
చిట్వేల్ మండలం నాగవరం గ్రామానికి చెందిన కాకె సురేష్(25), తన స్నేహితుడు అశోక్‌తో కలిసి బైక్‌పై రైల్వే కోడూరు వస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో సురేష్ అక్కడికక్కడే మృతిచెందగా.. అశోక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.