కౌడిపల్లి మండలం బుజిరంపేట సమీపంలో సోమవారం రాత్రి బైక్, ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.
మెదక్: కౌడిపల్లి మండలం బుజిరంపేట సమీపంలో సోమవారం రాత్రి బైక్, ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. వెలమకన్న గ్రామానికి చెందిన పోలా లక్ష్మీనారాయణ(35) అనే టైలర్ సోమవారం సాయంత్రం జోగిపేటకు బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. టైలర్ వృత్తి మీదే ఆధారపడిన ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. కౌడిపల్లి ఎసై్స శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.