Top Stories
ప్రధాన వార్తలు

పిఠాపురం జమీందారుగా కొణిదెల నాగబాబు!
పిఠాపురం జమీందారుగా మెగా బ్రదర్ నాగబాబుకు పట్టాభిషేకం అయినట్లేనా?.. ఇక ఆ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు శంకు స్థాపనలు .. రివ్యూలు అన్నీ నాగబాబే చూసుకుంటారా? తెలుగుదేశం నాయకుడు వర్మను పూర్తిగా పక్కనబెట్టేసినట్లేనా?. పరిస్థితులు.. పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏ పనుల్లో ఉంటారో కానీ నిత్యం బిజీగా ఉంటారు. అటు సినిమాలు.. వైద్యం చికిత్స.. బిజినెస్ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉంటారు. గెలిచారే కానీ పిఠాపురం మీద ఏమీ దృష్టి సారించడం లేదు. అక్కడ అభివృద్ధి వంటి పనుల పర్యవేక్షణ.. సమీక్షలకు ఆయనకు టైం చిక్కడం లేదు. పోనీ అలాగని తనను గెలిపించిన తెలుగుదేశం వర్మకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆయన పరపతి పెరిగిపోతుందని, ప్రజల్లో ఆయన పలుకుబడి ఇనుమడిస్తుంది అని భయం!. అసలే గెలవక గెలవక పవన్ పిఠాపురం(Pithapuram)లో వర్మ పుణ్యమా గెలిచారు. ఇప్పుడు వర్మకు ప్రాధాన్యం ఇవ్వడానికి పవన్ కు ధైర్యం చాలడం లేదు. దీంతో పిఠాపురం బాధ్యతలు చూసేందుకు పవన్ కు ఎలాంటి ఇబ్బంది లేని.. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది..ముప్పు లేని వ్యక్తి కావాలి. సరిగ్గా ఆ ప్లేసులోకి నాగబాబు వచ్చి పడ్డారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు.. ఎంపీలకు ఒక నిర్దిష్ట నియోజకవర్గం ఉంటుంది. ఆ ప్రాంతంలో వారు రాజకీయ కార్యకలాపాలు చేస్తారు కానీ ఎమ్మెల్సీలకు అదేం ఉండదు. దీంతో వాళ్లు తమకు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ రాజకీయం చేస్తారు.పైగా నాగబాబుకు ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో రాజకీయంగా పట్టుంది అని చెప్పేందుకు అవకాశం లేదు. దీంతో ఆయన ఏకంగా పిఠాపురంలో పాగావేసి తమ్ముడు పవన్ తరఫున పెద్దరికం..పెత్తనం చేస్తారన్నమాట. ఈ మేరకు పార్టీ కూడా అధికారికంగా ఒక ప్రకటన చేసింది. పిఠాపురంలో ఇకపై అధికారిక రివ్యూలు.. సమీక్షలు..అభివృద్ధిపనుల పర్యవేక్షణ కూడా నాగబాబే చేపడతారని పార్టీ ఒక ప్రకటన చేసింది.వాస్తవానికి నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పని ప్రారంభించాలంటే ఎమ్మెల్యేలు.. మంత్రులే చేయాలి కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు అన్నీ నాగబాబు చూస్తారని పార్టీ చెబుతోంది. ఇకముందు పిఠాపురంలో నాగబాబు(Naga Babu)కు ప్రాధాన్యం తప్ప ఆ ప్రకటనలో ఎక్కడా వర్మ ప్రస్తావన లేకుండా కుట్ర పన్నారు. అంటే రాజకీయంగా వర్మను ఇక తెరమరుగు చేయడమే లక్ష్యంగా పవన్.. నాగబాబు ముందుకు వెళ్తున్నారు.ఇకక ముందు వర్మ తనవాళ్ళకు ఒక పెన్షన్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి తీసుకొచ్చేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. దీంతో ఇటు వర్మ వర్గీయులు లోలోన రగిలిపోతూ బయటకు కక్కలేక.. మింగలేక ఊరుకుంటున్నారు. మున్ముందు వర్మకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం కూడా అనుమానమే. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తాము అని ఆనాడు పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఆ ఇద్దరూ మాట నిలబెట్టుకున్నట్లయితే నిన్న నాగబాబుతో బాటు వర్మ కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండేది. కానీ ఆ ఇద్దరూ నమ్మించి వెన్నుపోటు పొడవడంతో వర్మకు ఆశాభంగం మిగిలింది. ఇక ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ ఇప్పించడం ఆయన్ను ప్రాధాన్యమైన పోస్టింగులో ఉంచడం అనేది బ్రదర్స్ కు కూడా ప్రమాదమే. ఎందుకంటే వర్మ స్థానికుడు కాబట్టి ఆయనకు ఏదైనా పదవి దక్కితే ఆయన దూకుడు వేరేగా ఉంటుంది. ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుంది. ఇదంతా పవన్ కు, నాగబాబుకు సైతం ఇబ్బందికరమే. అందుకే వర్మకు ఈ ఐదేళ్లలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న పదవి దక్కడం కలలో కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. వర్మ భుజాల మీదుగా నడిచివెళ్ళి అసెంబ్లీలో కూర్చున్న పవన్ ఇప్పుడు వర్మను పూర్తిగా అణగదొక్కేందుకే అన్నయ్య నాగబాబును పిఠాపురంలో ప్రతిష్టించినట్లు వర్మ అభిమానులు లోలోన మధనపడుతున్నారు. :::సిమ్మాదిరప్పన్న

‘మిస్టర్ పవన్.. దీపక్ తాట ఎందుకు తీయలేదు?’
సాక్షి, తాడేపల్లి: రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చాలా బాధాకరమని వైఎస్సార్సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మసీ విద్యార్ధి విషయంలో ఆమెకు అన్యాయం జరిగింది.. చంద్రబాబు ఏం చేశారు?. రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు.. ఇప్పుడు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.విద్యార్థిని నాగాంజలి మృతిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పందిస్తూ..‘నాగాంజలి మృతి చాలా బాధాకరం. నరరూప రాక్షసుడి వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. 12 రోజులు మృత్యువుతో పోరాడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. నాగాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్లో రాసింది. దీపక్ పనిచేసే కిమ్స్‌లోనే 12 రోజులుగా ఉంచితే సరైన వైద్యం ఎక్కడ దొరుకుతుంది. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి నుంచి కనీస స్పందించలేదు. వైద్యం అందుతుందో కూడా ఆరా తీయలేదు.పవన్.. కేవలం మాటలేనా?ఆడపిల్లలకు అన్యాయం చేస్తే అదే ఆఖరి రోజు అని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. పోలవరం సందర్శనకు వెళ్లిన చంద్రబాబు.. నాగాంజలి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు?. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు. నాగాంజలికి అంత అన్యాయం జరిగితే దీపక్ తాట ఎందుకు తీయలేదు పవన్?. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా పవన్. మీ మాటలు చేతలకు పనిచేయవా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని మంత్రి స్టేట్ మెంట్ ఇచ్చారు. నాగాంజలి 12 రోజులుగా ఆసుపత్రిలో వైద్యం పొందుతుంటే.. వారిని కనీసం పరామర్శించారా?. మెరుగైన వైద్యం అందించమని ఆదేశాలైనా ఇచ్చారా?.ఆడబిడ్డలకు రక్షణ కరువు..ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారా?. సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు కామెడీ స్కిట్స్ చూసి ఎంజాయ్ చేసే శ్రద్ధ ఆడపిల్లల మీద లేదా?. కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వాడుకుంటున్నారు. ఆడ పిల్లలు, ప్రజల రక్షణపై పోలీసులు దృష్టిపెట్టడం లేదు. ఆడపిల్లలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా శిక్షలు పడవనే ధైర్యంతో బరితెగించి రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. ఏపీలో ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొనడం చాలా దురదృష్టకరందిశ యాప్ కాపీనే శక్తి..గతంలో వైఎస్ జగన్ దిశా యాప్ తెచ్చారు. దిశా చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. కేంద్రంతో పొత్తులో ఉన్న మీరు దిశా చట్టాన్ని ఎందుకు ఆమోదించుకోలేక పోతున్నారు?. దిశ యాప్‌పై ఇప్పటి హోం మంత్రి గతంలో చాలా వెటకారంగా మాట్లాడారు. దిశ యాప్ ను కాపీ కొట్టి శక్తిగా పేరు మార్చారు. మీ శక్తి యాప్ ఏమైపోయిందో హోమ్ మంత్రి సమాధానం చెప్పాలి. శక్తి టీమ్‌లు ఎక్కడికి పోయాయి?. శక్తి యాప్ సరిగా పనిచేసుంటే ఆడపిల్లలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?. అనిత మాటలు చేతల్లో కనిపించవా?. నిందితులు తెలుగుదేశం వారైతే వారికి రక్షణ కల్పిస్తున్నారు. కేసుల నుంచి బయటపడేలా ప్రభుత్వం చూస్తోంది. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటు వేశామా అనే పరిస్థితిని తీసుకువచ్చారు. ఇప్పటికైనా మంత్రి మేల్కోవాలి. ఇలాంటి ఘటనలు మరలా పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మహిళల రక్షణకు, భద్రతకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేస్తున్నాం.బాధితురాలికి న్యాయం జరగాలి..నాగాంజలి మృతిపై మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ స్పందిస్తూ..‘నాగాంజలి మరణం బాధాకరం. బాధితురాలు సూసైడ్ నోట్లో ఏం కోరుకుందో దానిపై తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తాం. నాగాంజలి కుటుంబాన్ని ప్రభుత్వం, కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం తమ బాధ్యతగా ఆదుకోవాలి. నిందితుడు నుంచి ఆర్థిక సహాయం బాధితురాలికి అందకుంటే అంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదు. ఈ ఘటనపై హోం మంత్రి, డిప్యూటీ సీఎం స్పందించక పోవడం బాధాకరం.

వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లును(waqf amendment bill) సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. వీలైనంత త్వరలోనే ఇది ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు. రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూనే ఉంటామన్న ఆయన.. గతంలో సీఏఏ, ఆర్టీఐ, ఎన్నికల నియమాలపై పోరాటాలు చేశామని జైరాం రమేశ్(Jairam Ramesh) తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ ద్వారా తెలియజేశారు. The INC's challenge of the CAA, 2019 is being heard in the Supreme Court.The INC's challenge of the 2019 amendments to the RTI Act, 2005 is being heard in the Supreme Court.The INC’s challenge to the validity of the amendments to the Conduct of Election Rules (2024) is being…— Jairam Ramesh (@Jairam_Ramesh) April 4, 2025 ఇదిలా ఉంటే.. రాజ్యసభ(Rajya Sabha)లో గురువారం మధ్యాహ్నాం నుంచి సుమారు 13 గంటలపాటు వక్ఫ్ బిల్లుపై చర్చ జరిగింది. ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. దీంతో శుక్రవారం ఉదయం బిల్లును ఆమోదించినట్లు పార్లమెంట్ అధికారికంగా ప్రకటించింది. బిల్లుపై చర్చ సందర్భంగా.. ఇది మైనారిటీలకు వ్యతిరేకంగా.. రాజ్యాంగవిరుద్ధంగా ఉందంటూ పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అదే సమయంలో ఇది చారిత్రక సంస్కరణగా అభివర్ణించిన కేంద్రం ఈ బిల్లు ముస్లింలకు లబ్ధి చేకూరుస్తుందని అంటోంది. అంతకు ముందు..సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ(Lok Sabha) ఆమోదం తెలిపింది. చర్చ సమయంలో అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ ప్రతిధ్వనించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2.15 గం.లు దాటే వరకూ చర్చ, ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో.. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి.

ఏం చేయాలో.. అది సరిగ్గానే చేశాను: జహీర్ ఖాన్‌తో రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటి వరకు తన మార్కు చూపలేకపోయాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఈ సీజన్లో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. మొత్తంగా కేవలం 21 పరుగులే చేశాడు.తమ తొలి మ్యాచ్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌తో పోరులో డకౌట్ అయిన రోహిత్.. గుజరాత్ టైటాన్స్‌పై ఎనిమిది పరుగులకే పెవిలియన్ చేరాడు. చివరగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో పదమూడు పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇక ముంబై ఇండియన్స్ తదుపరి శుక్రవారం నాటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఇందుకోసం ఇప్పటికే లక్నోలోని ఏకనా స్టేడియంలో కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో లక్నో మెంటార్, టీమిండియా పేస్ దిగ్గజం జహీర్ ఖాన్ (Zaheetr Khan)తో రోహిత్ శర్మ జరిపిన సంభాషణ వైరల్‌గా మారింది.ఏం చేయాలో.. అది సరిగ్గానే చేశాను‘‘నేనేం చేయాలో అది సరిగ్గానే చేశాను. గతంలో చాలానే చేశాను. ఇప్పుడు కొత్త చేయాల్సింది ఏమీ లేదు’’ అని రోహిత్ జహీర్‌తో అన్నాడు. ఇంతలో లక్నో కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వచ్చి వెనుక నుంచి రోహిత్ శర్మను ఆలింగనం చేసుకున్నాడు. ఈ క్రమంలో చిన్నగా స్మైల్ ఇస్తూనే రోహిత్ సీరియస్‌గా తన సంభాషణను కొనసాగించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా ఐపీఎల్-2025లో రోహిత్ వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ గట్టిగానే విమర్శించాడు.మూస పద్ధతులకే పరిమితమైతే కుదరదు‘‘రోహిత్ ప్రస్తుతం గడ్డు దశను ఎదుర్కొంటున్నాడు. గత మూడు- నాలుగేళ్ల క్రితం ఉన్న పస ఇప్పుడు తన బ్యాటింగ్‌లో లేదు. ప్రతి ఉదయం కొత్తదే. అత్యుత్తమంగా రాణించాలంటే కఠినంగా శ్రమించకతప్పదు.పరిస్థితులు అతడి చేజారిపోయాయి. ఇప్పటికీ తన సహజమైన ప్రతిభ, మూస పద్ధతులకే పరిమితమైతే కుదరదు’’ అని మంజ్రేకర్ ఘాటు విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ జహీర్‌తో అన్న మాటలను మంజ్రేకర్‌కు ఆపాదిస్తూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఘనమైన చరిత్రఇదిలా ఉంటే.. గతేడాది ముంబై ఇండియన్స్.. కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో 2025లో అతడు జట్టును వీడతాడనే ప్రచారం జరిగినా.. హిట్‌మ్యాన్ ముంబైతోనే కొనసాగుతున్నాడు. కాగా ముంబైకి ఐదుసార్లు ట్రోఫీ అందించిన చరిత్ర రోహిత్ శర్మకు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సారథి కూడా అతడే. ఇక ఐపీఎల్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 260 మ్యాచ్‌లు ఆడి 6649 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. చదవండి: జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదేQ: For how long are you going to watch this reel? 😍A: Haaanjiiii 🫂💙#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #LSGvMI pic.twitter.com/e2oxVieoz2— Mumbai Indians (@mipaltan) April 3, 2025

అభిమానుల గుండెల్లో పవన్ గునపాలు!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అభిమానులతోపాటు కాపు సామాజిక వర్గం వారందరి గుండెల్లోనూ గునపాలు దించేలా మాట్లాడారు. తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా వాడుకుని వదిలేస్తానని, వారి ఆకాంక్షలకు తగినట్లు పనిచేయడం తన పని కాదన్నట్టుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో డ్రామా ‘పీ-4’ ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ తనకు సత్తా లేకపోవడం వల్లనే సమర్థుడు, అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబుకు 2014 నుంచి మద్దతిస్తున్నాని చెప్పడం విని అభిమానులు హతశులయ్యే ఉంటారు.చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లకు మాత్రం ఈ మాటలు చెవికి ఇంపుగా అనిపించి ఉండవచ్చు. పవన్ మన చెప్పుచేతల్లోనే ఉంటాడులే అని మనసులో ఉప్పొంగిపోయి ఉండవచ్చు కూడా. కానీ.. పదేళ్లుగా పవన్ ఎక్కడకు వెళ్లినా సీఎం, సీఎం అంటూ నినాదాలు చేసే అభిమానుల మాటేమిటి? వాస్తవానికి ఇలాంటి అభిమానులు పవన్ లాంటి నేతను నమ్ముకోవడం వారి దురదృష్టం. ఒక్కటైతే వాస్తవం.. పవన్ ఏనాడూ నిజాయితీగా, నిబద్ధతతో వ్యవహరించలేదు. అభిమానులకు కష్టంగా ఉండవచ్చు కానీ.. ఆయన కేవలం సినిమా గ్లామర్ మాత్రమే ఆయన్ను ఈ స్థాయికైనా చేర్చింది. కాపు సామాజికవర్గం నేతలు చాలా మంది ఈయన కన్నా బాగా వారికి అండగా నిలబడ్డారు. అయినా ఎందుకో వారికి ఈయనపైన అభిమానం పెరిగింది. బహుశా మెగాస్టార్ చిరంజీవి సోదరుడు కావడం, ప్రజారాజ్యం పార్టీని పెట్టినా నిలదొక్కుకోలేకపోయారన్న సానుభూతి కావచ్చు. పవన్ కళ్యాణ్ ఆ లోటును తీర్చి తాము కోరుకున్న విధంగా ముఖ్యమంత్రి అవుతారన్న ఫీలింగ్ కావచ్చు.. వీటన్నిటి రీత్యా వీరంతా మద్దతు ఇచ్చారు.గతంలో కాపు సామాజికవర్గం వైఎస్సార్సీపీకి కూడా బలంగా మద్దతు ఇచ్చినా, 2024లో మాత్రం అత్యధికులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపే మొగ్గారన్నది ఎక్కువ మంది విశ్లేషణ. అందులో వాస్తవం కూడా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఈయనకు గాలం వేసి తనవైపు లాగడంలో సఫలమయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా 2019లో ఘోర పరాజయం రీత్యా భయపడి, చంద్రబాబు ఏం చెబితే అది చేశారని అంటారు. జాక్ పాట్ తగిలినట్లుగా కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ మంత్రి అయ్యారు. చంద్రబాబు, పవన్లకంటే లోకేశే ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, రెడ్ బుక్ పేరుతో అరాచకాలను ప్రోత్సహిస్తున్నా వీరు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని చాలామంది చెబుతున్నారు.పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో అప్పడప్పుడూ తన శాఖను పర్యవేక్షిస్తూ, మిగిలిన టైమ్ లో సనాతని వేషం కట్టడం, ఇతర రాష్ట్రాలలో పర్యటించడం, ఎప్పుడైనా చంద్రబాబుకు అవసరమైతే ఆ పాత్రను పోషించడం, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ను నిందించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ మొదటి నుంచి గందరగోళంగానే మాట్లాడుతూ వచ్చారు. ఆయన కావాలని అలా మాట్లాడుతున్నారా? లేక అవగాహన లేక వ్యవహరిస్తున్నారో తెలియదు. గత పదేళ్లలో ఆయన ఎన్ని రకాలుగా మాటలు మార్చారో చెప్పతరం కాదు. తన వ్యక్తిగత జీవితం మొదలు, తన పుట్టిన ప్రదేశం, చదువుకున్న ఊరు, ఇతరత్రా పలు అంశాలపై భిన్నమైన ప్రకటనలు చేసినా ఆయన అభిమానులు, కాపు సామాజికవర్గం వారు ఆదరించారనే చెప్పాలి.పిఠాపురంలో ఎన్నికలకు ముందు టీడీపీ నేత వర్మ చేతులు పట్టుకుని మీరే గెలిపించాలని అన్నారు. గెలిచిన తర్వాత ఆయన దేముందని తన సోదరుడు నాగబాబు అంటే కనీసం ఖండించలేదు. పిఠాపురం సభలో నలభై ఏళ్ల టీడీపీని తానే నిలబెట్టానని చెప్పారు. కాని ఇప్పుడేమో తనకు సత్తా లేదని అంటారు. తన తండ్రి గురించి సైతం రెండు రకాలుగా మాట్లాడటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆయన కమ్యూనిస్టు, దీపారాధన దీపం వద్ద సిగరెట్ ముట్టించుకున్నారని ఒకసారి, ఎప్పుడూ రామజపం చేస్తారని మరోసారి చెప్పి విస్మయ పరిచారు. 2017 తర్వాత తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు, లోకేశ్‌లను ఎంత తీవ్రంగా విమర్శించారో, వారిద్దరిని ఎంత అవినీతిపరులుగా చూపారో, ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా పొగుడుతున్నారు. వారిలో ఇప్పుడు అవినీతి కనిపించడం లేదు. సమర్దత మాత్రమే కనిపిస్తోంది. చంద్రబాబు పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని అంటున్నా, భవిష్యత్తులో లోకేశ్ సీఎం అయినా కాదనకుండా పవన్ కళ్యాణ్ విధేయుడుగానే ఉంటారన్నది పలువురి నమ్మకంగా ఉంది.చంద్రబాబు, లోకేశ్‌లు కూడా ఆ రోజుల్లో పవన్‌ను బాగానే విమర్శించేవారు. అయినా ఇప్పుడు వారు పొగుడుతున్నట్లు నటిస్తున్నారు. రెండు పార్టీలు కలిసి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి పవన్ కళ్యాణ్ నోరు విప్పడం లేదు కనుక వారికి ఆనందంగానే ఉంటుంది. అలా ఉన్నంతకాలం ఆయన మంచి మిత్రుడుగానే కనిపిస్తారు. ప్రశ్నించడానికి పార్టీని పెట్టానని చెప్పిన పవన్ అసలు ప్రశ్న అంటే ఏమిటో మర్చిపోయారు. గతంలో తన తల్లిని, తనను దూషించారని చెప్పిన టీడీపీని భుజాన ఎత్తుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏకంగా తనకు సత్తా లేదని చెప్పడం చూస్తే, ఒకరకంగా నిజం చెప్పారని కొందరు, తమ పరువు తీశారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ ఇంతగా దిగజారిపోతారని తాము ఊహించలేకపోయామని ఆయనకు మద్దతు ఇచ్చినవారు వాపోతున్నారు.కాపు సామాజికవర్గ నేతలు పలువురు ముఖ్యమంత్రి చంద్రబాబుపై హోరాహోరీ పోరాడారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం పెద్ద ఎత్తునసాగింది. అలాంటి వారందరిని కాదని, కాపుల రిజర్వేషన్ గురించి, కాపుల కులభావన గురించి పలుమార్లు మాట మార్చిన పవన్నే ఈసారి కాపు వర్గం వారు ఎంపిక చేసుకున్నారు. సీఎం అని అభిమానులు నినాదాలు ఇస్తుంటే గతంలో ఓటు వేయండి. సీఎం అవుతానని అనేవారు. ఆ తర్వాత టీడీపీతో పొత్తు అనంతరం తమకు సీఎం అయ్యేంత బలం లేదని, ఎమ్మెల్యేగా గెలవడం ముఖ్యం అన్నట్లు మాట్లాడేవారు. అదే పవన్ కళ్యాణ్ టీడీపీని తానే గెలిపించానని చెబితే టీడీపీ సోషల్ మీడియా ఆయనపై విరుచుకుపడింది. జనసేన మద్దతుదారులను ఒక ఆట ఆడుకుంది. అయినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే తీరుతెన్నులపై అక్కడి జనసేన స్థానిక నేత ఆరోపణలు చేస్తే వాటి గురించి వాకబు చేయకుండా, ఆయనకే నోటీసు ఇవ్వడం విశేషం. దీన్ని బట్టి పవన్ పార్టీని బలోపేతం చేసుకోవడం కన్నా, పదవిని ఎంజాయ్ చేయడం, టీడీపీకి సేవ చేయడం ద్వారా తాను కూడా లబ్ది పొందడానికే పరిమితం అయ్యారని అర్థం అవుతోందని అంటున్నారు. చిత్రం ఏమిటంటే ఏపీలో సత్తా లేదని చెబుతున్న పవన్ కళ్యాణ్ కొద్ది కాలం క్రితం తమిళనాడు వెళ్లి అక్కడ జనసేనను విస్తరిస్తానని చెప్పి వచ్చారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుగా ఉందీ వైఖరి. వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని, ఆయన నుంచి వచ్చే ప్రయోజనాల కోసమని ఎద్దేవా చేశారు. బీజేపీ ఆడినట్లు పవన్ ఆడతారని కొంతమంది అనుకుంటున్నా, ప్రస్తుతానికి చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి సిద్దంగా ఉన్నారని అంటున్నారు. ప్రభుత్వపరంగా చూస్తే ఆయన శాఖలలో వేలాది ఫైళ్లు పెండింగులో ఉన్నట్లు చంద్రబాబు సర్కారే ప్రకటించింది. ఇందులో మొదటి ర్యాంకు ఇచ్చింది. అయినా పవన్ దానిపై పెద్దగా ఫీల్ అయినట్లు లేరు. నిజానికి పవన్ కళ్యాణ్ పెద్దగా చదువుకోలేదు. కానీ, వేల పుస్తకాలు చదువుకున్నట్లు కనిపించాలన్నది ఆయన తాపత్రయంగా కొందరు అభివర్ణిస్తుంటారు. అసలు ఏ మనిషి అయినా ఎనభై వేల పుస్తకాలు చదవడం సాధ్యమేనా అని ఒకరు ప్రశ్నించారు. అదేమిటంటే ఒక మనిషి వందేళ్లు జీవిస్తాడనుకుంటే, అందులో మొదటి పదిహేనేళ్ల నుంచి ఇరవై ఏళ్ల వరకు విద్యకు కేటాయించవలసి ఉంటుంది. అలాగే చివర ఇరవై ఏళ్లు కూడా పెద్దగా చదవలేని పరిస్థితి రావచ్చు. మనిషి వందేళ్లు జీవించడం అంటే 36500 రోజులు బతకడం అన్నమాట. రోజూ ఒక పుస్తకం చదవడం ఎక్కువ సందర్భాలలో అసాధ్యం. అందువల్ల ఎవరైనా ఏభై వేల పుస్తకాలనో, ఎనభై వేల పుస్తకాలనో, రెండు లక్షల పుస్తకాలనో చదివేశానని చెబితే అదంతా గ్యాస్ అని ఆయన వివరించారు.అంటే ఇదంతా రాజకీయ నేతల హిపోక్రసీ అన్నమాట. ప్రభుత్వపరంగా పెద్దగా పని చేయలేక, ఇటు పార్టీ పరంగా నిర్మాణం చేయలేక, ఏదో పదవిని ఎంజాయ్ చేస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీని నడపడం కన్నా వేరే పార్టీలో విలీనం చేయడం బెటర్ కదా అని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సత్తా ఉపన్యాసాలలో అబద్దాలు చెప్పడంలో మాత్రం బాగానే ఉంది. కానీ, ప్రజలకు ఉపయోగపడటంలో మాత్రం విషయం కొరవడింది. అందుకే ఆయన తనకు సత్తా లేదని అంగీకరించారని అనుకోవచ్చా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
పూర్వవిద్యార్థులందరూ కలిసి కొన్ని ఏళ్లు, దశాబ్దాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటున్నారంటే.. ఎవ్వరికైనా సరే చాలా మంచి ముచ్చటగా అనిపిస్తుంది. ఎంతోకాలం కిందట కలిసి చదువుకుని, కొన్ని సంవత్సరాలుగా.. ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు తెగిపోయిన పరిస్థితుల్లో బతుకుతెరువు బాటలో పడి యాంత్రికంగా గడుపుతున్న జీవితాలకు.. అలాంటి ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఒక మంచి నవనీత లేపనంలా అనిపిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే అలూమ్ని, గెట్ టుగెదర్ కాన్సెప్టులతో వచ్చిన మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, 93 లాంటి సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద తిరుగులేని విజయాల్ని నమోదు చేశాయి.ప్రస్తుతం ఆధునిక సాంకేతికత, కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సోషల్ మీడియా తదితర అనేక కారణాల వల్ల.. పాత కాలం మిత్రుల ఆచూకీ కనిపెట్టడం సులువుగా మారుతున్న తరుణంలో.. ఇంకా ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళ్లనాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. యాభయ్యేళ్ల కిందట కలిసి చదువుకున్న వృద్ధులు కూడా.. ఇలాంటి సమావేశాలు నిర్వహించుకుంటూ.. అప్పటికి జీవించి ఉన్న తమ గురువులను ఆహల్వానించి సత్కరించుకుంటూ.. తమ తమ అప్పటి ఆనందానుభూతులను నెమరు వేసుకుంటూ గడుపుతున్నారంటే.. ఆ పూర్వవిద్యార్థుల సమ్మేళనాలకు ఉన్న ప్రాధాన్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.అయితే.. ఇలాంటి సమ్మేళనాలకు కొన్ని వికృత ఫలితాలు కూడా ఉంటాయని తెలిస్తే మనం నివ్వెరపోతాం. ఆత్మీయ సమ్మేళనాల పుణ్యమాని చిన్నప్పటి ప్రేమానుబంధాలు తిరిగి మొగ్గతొడిగే సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. పరిస్థితుల్ని బట్టి వారి మధ్య ఆత్మీయ బంధాలు బలపడుతుంటాయి. కానీ.. పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో హైస్కూలు జీవితం నాటి ప్రియుడి కాంటాక్ట్ దొరకడం, దానిని వాడుకుంటూ భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధం కొనసాగించడం అనేది వింటేనే వెగటు పుట్టిస్తుంది. అలాంటిది.. ఆ ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం అన్నెం పున్నెం ఎరుగని, తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను ఒక తల్లి తన చేతులతోనే కడతేర్చిందంటే.. మనం నిర్ఘాంతపోతాం. కడుపు మండుతుంది. పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు ఇలాంటి వికృత ఫలితాలను కూడా ఇస్తున్నాయా? అని ఆవేదన చెందుతాం. సంగారెడ్డిలో వెలుగుచూసిన సంఘటన సమాజంలో పతనమవుతున్న నైతిక విలువల తీరును, ఒక మంచి అనుభూతి కోసం జరిగే మంచి పనులను ఎలాంటి వికృత పోకడలతో భ్రష్టు పట్టిస్తున్నారనే వైనాన్ని తెలుసుకోవడానికి మంచి ఉదాహరణ అవుతోంది.సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో ఇటీవల ఒక దారుణం జరిగింది. రజిత- చెన్నయ్య దంపతుల పిల్లలు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. తల్లి రజిత కడుపునొప్పితో విలవిల్లాడుతూ ఆస్పత్రి పాలైంది. భర్తతో తగాదాలు, కుటుంబ సమస్యల కారణంగా ఆమె ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి పెట్టి చంపేసి, తాను ఆత్మహత్యకు పాల్పడిందని తొలుత పోలీసులు భావించారు. భర్త పాత్రపై అనుమానాలు వచ్చాయి. షాపు నుంచి తెచ్చిన పెరుగు కలిపి పెట్టానని, అంతకుమించి ఇంకేం తెలియదని ఆ తల్లి బుకాయించే ప్రయత్నమూ చేసింది. కానీ అసలు వాస్తవాలు నెమ్మదిగా వెలుగులోకి వచ్చాయి.రజిత అలియాస్ లావణ్య ఇంటర్మీడియట్ చదువుతుండగా 2013లో చెన్నయ్యతో పెళ్లయింది. వారికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ కలిగారు. ఆరునెలలుగా రజిత టెన్త్ క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల ఆ ఆత్మీయ సమ్మేళనం కూడా జరిగింది. అప్పటినుంచి.. హైస్కూలు నాటి ప్రియుడు శివతో ఆమె అనుబంధం పెరిగింది. అది వివాహేతర సబంధానికి దారితీసింది. పెళ్లిచేసుకోమని అడిగింది. అయితే ముగ్గురు పిల్లల తల్లిని ఎలాచేసుకుంటానంటూ శివ తిరస్కరించాడు. పిల్లల అడ్డు తొలగితే పోతుందని వారిద్దరూ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పిల్లలను చంపేస్తే ఆ నేరం భర్త మీదకు వెళుతుందని కూడా ప్లాన్ చేసినట్టు వినిపిస్తోంది. మొత్తానికి రజిత.. పెరుగన్నంలో విషం కలిపి ముగ్గురు పిల్లలకు తినిపించి, వారి గొంతు నులిమి చంపేసింది. తాను కడుపునొప్పితో బాధపడుతున్నట్టుగా నాటకమాడింది గానీ.. పోలీసుల విచారణలో బాగోతం మొత్తం బయటపడింది. వివాహేతర సంబంధం కోసం, ప్రియుడితో శాశ్వతంగా కలిసి ఉండడం కోసం పిల్లల్ని తల్లులే కడతేర్చే దుర్మార్గాలు మనం ఇంకా అనేకం సమాజంలో చూస్తున్నాం. కానీ.. అలాంటి ఒక దుర్మార్గానికి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మూలకారణం కావడం ఇక్కడ శోచనీయమైన విషయం.పూర్వవిద్యార్థుల సమ్మేళనాలు ఎంతో గొప్పవి. జీవితంలో పసితనం నాటి స్నేహాలు, ప్రేమలు, ఆప్యాయతలు కొన్ని దశాబ్దాల యెడబాటు తర్వాత.. మళ్లీ చిగురించడం మానసికంగా గొప్ప ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి గెట్ టుగెదర్ కార్యక్రమాల వల్ల.. యాంత్రికంగా మారుతున్న జీవితాల్లో తిరిగి జీవనోత్సాహాన్ని నింపుకోగలుగుతారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు చాలాచోట్ల బాగా సక్సెస్ అవుతుంటాయి. అయితే ఇంత మంచి కార్యక్రమాలు కూడా కొన్ని వికృత ఫలితాలకు దారితీస్తున్నాయని తెలిస్తే బాధ కలుగుతుంది. రజిత- శివ లాంటి వాళ్లు ఇలాంటి కార్యక్రమాలనే సాటి సమాజం అనుమానించే విధంగా చేస్తున్నారనడంలో సందేహం లేదు. నైతిక, సామాజిక విలువల స్పృహ లేకపోవడం మనుషుల్ని ఎంతకైనా దిగజారుస్తుందని తెలుసుకోవడానికి, అమృతాన్ని అందించిన క్షీరసాగరమధనంలోంచే గరళం కూడా పుడుతుందని గ్రహించడానికి ఇది మంచి ఉదాహరణ.:: ఎం.రాజేశ్వరి

కేరళ సీఎం కుమార్తెకు షాకిచ్చిన కేంద్రం.. అదే జరిగితే పదేళ్ల జైలుశిక్ష!
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టీ వీణా విజయన్‌కు ఉహించని షాక్ తగిలింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఆర్థిక నేరం కేసులో ఆమెను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఒకవేళ ఈ కేసులో వీణ దోషిగా తేలితే, ఆర్నెళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.వివరాల ప్రకారం.. సీఎం విజయన్ కుమార్తె వీణా విజయన్ చిక్కుల్లో పడ్డారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కంపెనీ నుంచి వీణా విజయన్‌కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి అక్రమ రీతిలో డబ్బులు బదిలీ అయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో న్యాయ విచారణ చేపట్టేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ఆధారంగా కేసు విచారణకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అంతకుముందే.. కొచ్చిలోని ఆర్థిక నేరాలను పరిశీలించే ప్రత్యేక కోర్టులో ఈ కేసు ఫైల్ అయ్యింది. ఈ సందర్బంగా 160 పేజీల ఛార్జ్‌షీట్ రూపొందించారు.SFIO files chargesheet against Veena Vijayan, daughter of Kerala CM, and others in a Rs 2.7 crore CMRL payoff case. Charges include financial fraud under Section 447 of the Companies Act. pic.twitter.com/ymiOSZFFox— HKupdate (@HKupdate) April 3, 2025రుజువైతే పదేళ్ల జైలుశిక్ష.. సీఎంఆర్ఎల్, ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ మద్య అక్రమ రీతిలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అనుమానించారు. 2017 నుంచి 2020 మధ్య కాలంలో సీఎంఆర్ఎల్ కంపెనీ నుంచి వీణా విజయన్‌కు చెందిన కంపెనీ సుమారు 1.72 కోట్లు బదిలీ అయ్యాయి. దీంతో ఈకేసులో విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐఓ ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఎఫ్ఐఓ తన ఛార్జ్‌షీట్‌లో వీణా విజయన్‌తో పాటు సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిథర్ కార్తా, మరో 25 మంది నిందితుల పేర్లను చేర్చింది. ఒకవేళ ఈ కేసులో వీణ దోషిగా తేలితే, ఆర్నెళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కంపెనీస్ యాక్టు ప్రకారం ఆ శిక్ష ఉంటుంది. దీంతో పాటు పెనాల్టీ విధిస్తారు.ప్రతిపక్షాలు ఫైర్..మరోవైపు.. ఈ పరిణామాలపై ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్బంగా సతీశన్ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి కుమార్తె వీణా విజయన్ను కేసులో నిందితురాలిగా చేర్చడం చాలా తీవ్రమైన విషయం. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఛార్జ్ షీట్ ఆమెపై ఆరోపణను బలపరుస్తోంది. ముఖ్యమంత్రి కుమార్తె పదేళ్ల వరకు జైలు శిక్ష విధించదగిన నేరం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. విజయన్ ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగడం సముచితం కాదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ తన కుమార్తె విచారణను ఎదుర్కొనడాన్ని ఆయన ఎలా సమర్థించగలరు?’ అంటూ ప్రశ్నించారు.

యాపిల్‌కు టారిఫ్‌ల దెబ్బ.. ధరల పెంపునకు అవకాశం
విదేశాలతోపాటు చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాల కారణంగా యాపిల్ ఐఫోన్ ధరలు 40 శాతం వరకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్ల ధరలు భారతదేశంలో రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.చైనాలో మౌలికసదుపాయాలు, ఉద్యోగులు అధికంగా ఉండడంతో అమెరికా కంపెనీలు తయారీ యూనిట్లను ప్రారంభించాయి. అందులో భాగంగా యాపిల్ సంస్థ కూడా చైనాలో తయారీని మొదలు పెట్టింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేతపట్టిన తర్వాత చైనా వంటి దేశాల్లో తయారీని ప్రారంభించిన యూఎస్ కంపెనీలు స్వదేశంలో ప్లాంట్లు పెట్టేలా తాజా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సుంకాలు యాపిల్‌ను ఇరకాటంలో పడేశాయి. కంపెనీ ఇప్పటికీ ఐఫోన్లను చైనాలో అసెంబుల్ చేస్తోంది. అమెరికా సుంకాలతో సంస్థ 54 శాతం క్యుములేటివ్ టారిఫ్ రేటును ఎదుర్కోనుంది. యాపిల్ ఈ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించుకుంటే ప్రస్తుతం 799 (సుమారు రూ.68,000) ధర ఉన్న ఎంట్రీ-లెవల్ ఐఫోన్ 16, 1,142 డాలర్లకు (సుమారు రూ.97,000) పెరుగుతుంది. ఇది 43 శాతం పెరిగే అవకాశం ఉంది. అధునాతన ఏఐ సామర్థ్యాలు, 1 టీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్లు 2,300 డాలర్లు (సుమారు రూ.1.95 లక్షలు) చేరుకోవచ్చు.యాపిల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త ఫీచర్లకు ఆదరణ అంతంతమాత్రంగా ఉండటంతో ఇప్పటికే ప్రధాన మార్కెట్లలో ఐఫోన్ అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. అధిక ధరలు డిమాండ్‌ను మరింత తగ్గిస్తాయి. ఇది చైనా వెలుపల ఎక్కువ ఫోన్లను తయారు చేసే, టారిఫ్‌ల వల్ల తక్కువ ప్రభావితమయ్యే శామ్సంగ్ వంటి ప్రత్యామ్నాయ కంపెనీ ఉత్పత్తుల వైపు వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రూ.44 కోట్ల విలువైన గోల్డ్ కార్డు ప్రదర్శించిన ట్రంప్అమెరికా ప్రభుత్వం నుంచి యాపిల్ గతంలో టారిఫ్‌ల నుంచి మినహాయింపులను పొందగలిగినప్పటికీ, ఈసారి అటువంటి సౌలభ్యం లేదని ఇప్పటికే అధికార వర్గాలు స్పష్టతనిచ్చాయి. వియత్నాం, ఇండియాలోనూ యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. అయితే వియత్నాంపై 46 శాతం సుంకాన్ని, భారతదేశంపై 26 శాతం సుంకాన్ని విధించారు. ఇవి చైనా సుంకాల కంటే తక్కువగానే ఉన్నాయి. అయితే కంపెనీ ఇండియా వంటి దేశాల్లో ఉత్పత్తిని పెంచుతుందా లేదా అనే విషయంపై ప్రకటన రావాల్సి ఉంది.

'మ్యాడ్ స్క్వేర్' సెలబ్రేషన్స్ వివరాలు.. బావమరిది కోసం వస్తున్న ఎన్టీఆర్
'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్‌కు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూ.ఎన్టీఆర్ వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాడ్ గ్యాంగ్ (నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ )తో తారక్ అల్లరి ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో చూడొచ్చు. 2023లో వచ్చిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగవంశీ సమర్పకులుగా ఉన్నారు.మార్చి 28న విడుదలైన 'మ్యాడ్ స్క్వేర్' కేవలం ఐదురోజుల్లోనే రూ. 74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వారంలోపే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటేసి లాభాల బాట పట్టింది. దీంతో అభిమానుల కోసం సక్సెస్ మీట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తుండటంతో అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. తన బావమరిది నార్నె నితిన్ 'మ్యాడ్ స్క్వేర్'తో వరుసగా హ్యాట్రిక్ కొట్టడంతో ఆయన ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తారో చూడాలి.ఏప్రిల్ 4న హైదరాబాద్‌లోని శిల్పా కళా వేదికలో 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్ జరిపేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయింత్రం 6గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎన్టీఆర్ రాత్రి 8గంటలకు అక్కడికి చేరుకోవచ్చని తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో చిత్ర నిర్మాత నాగవంశీకి మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. గతంలో 'మ్యాడ్' ట్రైలర్‌ను రిలీజ్ చేసిన తారక్ ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిగా వస్తున్నారు.

సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని ఎలా నివారించాలంటే..?
రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ ఆమె. తరుచుగా చుట్టూ జరుగుతున్న లోపాల గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ..సలహాలు సూచనలు ఇస్తుంటారు. చిన్నారులు దగ్గర నుంచి నేటి యువత వరకు ఎలాంటి జీవన విధానంతో లైఫ్‌ని లీడ్ చేస్తే బెటర్ అనే దాని గురించి అమూల్యమైన సలహలిస్తుంటారు కూడా. అలానే తాజాగా ఆహారపు అలవాట్లు ఎలా ఉంటే ఆరోగ్యానికి మంచిదో చెప్పారు. దాంతోపాటు తన తన ఆరోగ్యకరమైన డైట్ సీక్రెట్‌ని కూడా పంచుకున్నారు. మనం మనుషులం కాబట్టి ఒక్కోసారి చీట్ మీల్ తినేస్తుంటాం. అందుకు తాను కూడా మినహా కాదని నవ్వతూ చెప్పారామె. మరీ ఆ విషయాలేంటో చూద్దామా..!.పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌తో జరిగిన సంభాషణలో రాజ్యసభ ఎంపీ, విద్యావేత్త సుధామూర్తి భారతదేశం ఆహారం, భారతీయుల ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడారు. సుధామూర్తి ఆ భేటీలో ఇంట్లో వండిన ఆహారం తినడం ప్రాముఖ్యతను హైలెట్ చేశారు. మనసుకు సంతృప్తిని, హాయిని ఇచ్చే ఆహారం తినడం గురించి నమ్ముతానన్నారు. అయితే అధిక కేలరీల ఆహారాన్ని మాత్రం తప్పకుండా నివారించాలన్నారు. అందుకోసం తానేం చేస్తారో కూడా వివరించారు. నోరూరించే అధిక కేలరీలు ఆహారాలు తన భోజనం టేబుల్‌పై లేకుండా ఉండేలా చూసుకుంటారట. చాలావరకు ఆ విషయంలో స్వీయ నియంత్రణ చాలా కష్టంగా ఉంటుంది. తాను కూడా ఒక్కోసారి చీట్ మీల్ చేస్తుంటానని అన్నారు. తనకు పెడ, బర్ఫీ లేదా మైస్ వంటి స్వీట్లంటే ఎంతో ఇష్టమని చూడగానే మనసు పారేసుకుంటానని నవ్వుతూ చెప్పారు. అయితే తీసుకునే ముందు ఇదొక్కటే లేదంటే తన ఆరోగ్యానికి ఇబ్బంది అని సర్ది చెప్పుకుంటూ ఆపేస్తా అన్నారు. డైట్ ఎలా ఉంటుందంటే..రోటీలలో ఒకటైన భక్రిని తాను ఇష్టంగా తింటానన్నారు. ఇక్కడ భక్రి అంటే మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తినే ప్రసిద్ధ ఫ్లాట్‌బ్రెడ్.ఎర్రటి గోధమ జోవర్ వంటి చిరుధాన్యాలను తీసుకుంటారెమె. చివరగా తీపి తినాలనే కోరికను నివారించడానికి పండ్లు ఎక్కువగా తీసుకుంటానన్నారు. అన్నీంట్ల కంటే కంఫర్ట్ ఫుడ్ - పోహా అంటారెమె. తన ప్రతి భోజనంలో తప్పనిసరిగా అది ఉండాల్సిందేనట.(చదవండి: అలనాటి గోల్డెన్ డేస్: ఆ తాతయ్య కనులలో కోటి పండగల కళ..)
దర్శకుడు బుచ్చిబాబుకు గిఫ్ట్ పంపిన 'రామ్ చరణ్- ఉపాసన'
20 ఏళ్లలో 60 లక్షల మంది కొన్న బైక్ ఇదే
నాట్స్ సంబరాల్లో సరికొత్త సాహిత్య కార్యక్రమాలు
ఆయుష్మాన్ భారత్ పథకంలో అవకతవకలు.. ఈడీ దాడులు
రూ. 20 కోట్లు లెక్కకాదు!.. ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలా?
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
యూనస్‌తో భారత ప్రధాని మోదీతో భేటీ
గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ మహిళా దినోత్సవం
నాగబాబు పర్యటనలో రసాభాసా.. తీవ్ర ఉద్రిక్తత
సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని ఎలా నివారించాలంటే..?
దర్శకుడు బుచ్చిబాబుకు గిఫ్ట్ పంపిన 'రామ్ చరణ్- ఉపాసన'
20 ఏళ్లలో 60 లక్షల మంది కొన్న బైక్ ఇదే
నాట్స్ సంబరాల్లో సరికొత్త సాహిత్య కార్యక్రమాలు
ఆయుష్మాన్ భారత్ పథకంలో అవకతవకలు.. ఈడీ దాడులు
రూ. 20 కోట్లు లెక్కకాదు!.. ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలా?
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
యూనస్‌తో భారత ప్రధాని మోదీతో భేటీ
గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ మహిళా దినోత్సవం
నాగబాబు పర్యటనలో రసాభాసా.. తీవ్ర ఉద్రిక్తత
సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని ఎలా నివారించాలంటే..?
సినిమా

దేశభక్తి చిత్రాలకు కేరాఫ్ 'మనోజ్ కుమార్' ఇకలేరు
బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్(87) శుక్రవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత జబ్బుతో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలీవుడ్లో ఆయన ఎక్కువగా దేశభక్తి చిత్రాలను తెరకెక్కించడంతో పాటు నటించారు. దీంతో ఆయన్ను అందరూ 'భరత్ కుమార్' అని కూడా పిలుస్తారు. ఉపకార్ (1967), పురబ్ ఔర్ పశ్చిమ్ (1970), క్రాంతి (1981) వంటి క్లాసిక్ సినిమాలను ఆయన అందించారు. దశాబ్దాలుగా భారతీయ సినిమాకు చేసిన అపారమైన కృషికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో కేంద్రప్రభుత్వం గౌరవించింది. సినిమాల నుంచి దూరం అయిన తర్వాత రాజకీయంగా ఆయన బీజేపీలో చేరారు. కానీ, ఎలాంటి పదవులు తీసుకోలేదు. మనోజ్ కుమార్ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాని మోదీ సంతాపంమనోజ్ కుమార్ మృతిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్‌మీడియా ద్వారా సంతాపం తెలిపారు. భారతీయ సినీ పరిశ్రమలో ఐకాన్‌గా ఉన్న మనోజ్ మరణ వార్త తననెంతో బాధించిందన్నారు. ఆయన తెరకెక్కించిన దేశభక్తి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని మోదీ అన్నారు. మనోజ్ రచనలు తరతాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు. మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ఎక్స్ ద్వారా మోదీ సానుభూతి తెలిపారు.

అల్లు అర్జున్, అట్లీ సినిమాలో క్రేజీ హీరోయిన్.. భారీ రెమ్యునరేషన్
పుష్ప – 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్ (Allu Arjun).. ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను బద్దలు కొట్టేశాడు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించే తదుపరి చిత్రం మామూలుగా ఉండకూడదు. అది కచ్చితంగా పాన్ ఇండియా చిత్రం అయ్యే ఉండాలి. దీంతో నటుడు అల్లు అర్జున్ అలాంటి చిత్రం వైపే నడుస్తున్నారు. అందులో భాగంగానే కోలీవుడ్ యువ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది.రాజారాణి చిత్రంతో దర్శకుడిగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అట్లీ. ఆ తర్వాత నటుడు విజయ్ హీరోగా వరుసగా మెర్సల్, బిగిల్, తేరి చిత్రాలు చేసి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి నటుడు షారుఖ్ ఖాన్ కథానాయకుడుగా జవాన్ చిత్రాన్ని చేశారు. ఇందులో నయనతార, దీపిక పడుకొనే హీరోయిన్స్‌గా నటించారు. అయితే, అల్లు అర్జున్‌తో నటించే హీరోయిన్ను కూడా అట్లీ ఫైనల్ చేశారట. ఇండియాలోనే కాకుండా హాలీవుడ్లో కూడా రాణిస్తున్న ప్రియాంక చోప్రాను హీరోయిన్గా తీసుకోవాలని ఆయన ప్లాన్ చేశారట. ఈ చిత్రంలో నటించడానికి ఆమె రూ.30 నుంచి 40 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు గాని ఆమె గనుక నటిస్తే ఈ చిత్రం వేరే లెవల్‌కు వెళుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథకు మూలం పునర్జన్మ కాన్సెప్ట్‌ను ఎంపిక చేశారట. భారీ పీరియాడిక్ డ్రామా కథతో రానున్నారట. ఇందులో అల్లు అర్జున్ రెండు భిన్న గెటప్పుల్లో కనిపిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యముందని వైరల్ అవుతుంది. ఆగష్టులో ఈ మూవీ షూటింగ్ పనులు ప్రారంభం కావచ్చు.

జలియన్‌వాలా బాగ్ నేపథ్యంలో...
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కేసరి చాప్టర్ 2’. ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ అనేది ఉపశీర్షిక. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మాధవన్, అనన్యా పాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత దురదృష్టకర, హేయమైన సంఘటనగా నిలిచిపోయిన ఘటనల్లో జలియన్‌వాలా బాగ్ ఉదంతం ఒకటి. 1919 ఏప్రిల్ 13న అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొం దింది. ట్రైలర్లో అక్షయ్, మాధవన్‌ల మధ్య వచ్చే డైలాగులు సినిమాపై ఆసక్తి పెంచేలా ఉన్నాయి.

ఎలాగా అయిపోయానే... ‘ఓ భామ అయ్యో రామ’ సాంగ్
సుహాస్, మాళవికా మనోజ్ జంటగా నటించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయనుంది. కాగా ‘ఎలాగుండే వాడ్నే... ఎలాగా అయిపోయానే...’ అంటూ సాగే ఈ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. చిత్రసంగీత దర్శకుడు రథన్ స్వరాలందించిన ఈ పాటకు శ్రీహర్ష ఈమని సాహిత్యం అందించగా శరత్ సంతోష్ ఆలపించారు. మొయిన్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘యూత్‌ఫుల్‌గా సాగే ఈ పాటలో హీరో, హీరోయిన్ ఎనర్జీ ప్లస్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని హరీష్ నల్ల పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర బాగుంటుంది’’ అని రామ్ గోధల అన్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం
క్రీడలు

చరిత్ర సృష్టించిన కేకేఆర్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి ఇలా
ఐపీఎల్-2025 (IPL 2024)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన రహానే సేన.. తాజాగా సొంత మైదానంలో మాత్రం అదరగొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై 80 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.ఆరంభంలోనే షాక్ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, హైదరాబాద్ పేసర్ల దెబ్బకు స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు క్వింటన్ డికాక్ (1), సునిల్ నరైన్(7)ల వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో కెప్టెన్ అజింక్య రహానే (27 బంతుల్లో 38).. అంగ్క్రిష్ రఘువన్షీతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.రఘువన్షీ హాఫ్ సెంచరీరహానే అవుటైన తర్వాత రఘువన్షీకి జతైన వెంకటేశ్ అయ్యర్ ఆరంభంలో నెమ్మదిగా ఆడాడు. అయితే, రఘువన్షీ మాత్రం చక్కటి షాట్లతో అలరిస్తూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగుల వద్ద ఉన్న వేళ కమిందు మెండిస్ బౌలింగ్‌లో అతడు వెనుదిరగడంతో.. రింకూ సింగ్ క్రీజులోకి వచ్చాడు.ఆఖర్లో సీన్ రివర్స్ఆ తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. రింకూతో పాటు వెంకటేశ్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన వెంకటేశ్ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. కేవలం 29 బంతుల్లోనే ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 60 పరుగులు సాధించాడు.మరో ఎండ్‌లో రింకూ సింగ్ 17 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేకేఆర్ 200 పరుగులు సాధించింది. రైజర్స్ బౌలర్లలో మహ్మద్ షమీ, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.పెవిలియన్‌కు వరుస కట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్లుఇక లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఆదిలోనే చేతులెత్తేసింది. కేకేఆర్ పేసర్ల దెబ్బకు టాపార్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టింది. విధ్వంసకర ఓపెనర్లుగా పేరొందిన ట్రవిస్ హెడ్ (4), అభిషేక్ శర్మ(2) వచ్చీరాగానే అవుట్ కాగా.. ఇషాన్ కిషన్ (2) కూడా మరోసారి విఫలమయ్యాడు.నితీశ్ కుమార్ రెడ్డి (19) సైతం కాసేపే క్రీజులో ఉండగా.. కమిందు మెండిస్ (20 బంతుల్లో 27), హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 33) ఓ మోస్తరుగా రాణించారు. మిగతా వాళ్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (14) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు చేశాడు. ఈ క్రమంలో 16.4 ఓవర్లలో 120 పరుగులకే సన్‌రైజర్స్ ఆలౌట్ అయింది.కేకేఆర్ బౌలర్లలో పేసర్ వైభవ్ అరోరా ట్రవిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్ రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చి రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో వరుణ్ చక్రవర్తి మూడు, ఆండ్రీ రసెల్ రెండు, సునిల్ నరైన్, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ సాధించారు.చరిత్ర సృష్టించిన కేకేఆర్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి ఇలాఇక ఈ విజయం ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేకేఆర్ మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. రైజర్స్పై కోల్‌కతాకు ఇది ఏకంగా 20వ గెలుపు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఆర్సీబీపై కూడా ఇప్పటి వరకు 20 విజయాలు సాధించిన కేకేఆర్.. పంజాబ్ కింగ్స్‌పై అత్యధికంగా 21 సార్లు గెలుపొందింది.ఈ క్రమంలో కోల్‌కతా సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లపై 20కి పైగా విజయాలు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఐపీఎల్-2024 ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలుపొంది చాంపియన్‌గా నిలవడం కేకేఆర్‌కు ప్రత్యేకం అన్న విషయం తెలిసిందే. ఈ గెలుపు ద్వారా కేకేఆర్ ఖాతాలో మూడో టైటిల్ చేరింది.ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్లు👉ముంబై ఇండియన్స్- కేకేఆర్‌పై 24 విజయాలు👉చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీపై 21 విజయాలు👉కేకేఆర్- పంజాబ్ కింగ్స్‌పై 21 విజయాలు👉ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్‌పై 20 విజయాలు👉కేకేఆర్- ఆర్సీబీపై 20 విజయాలు👉కేకేఆర్- సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 20 విజయాలు.After impressing with the bat and in the field, #KKR 𝙬𝙖𝙡𝙩𝙯𝙚𝙙 their way to a handsome 80-run victory at home 😌💜Scorecard ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/Ne4LJhXNP4— IndianPremierLeague (@IPL) April 3, 2025 చదవండి: Kamindu Mendis: కుడి ఎడమైతే పొరపాటు లేదోయి...

MI vs LSG: రోహిత్, పంత్‌కు పరీక్ష!
లక్నో: భారీ అంచనాలతో బరిలోకి దిగి ఈ సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఇరు జట్ల మధ్య శుక్రవారం కీలక పోరు జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌ను ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ‘ఢీ’ కొట్టనుంది. తాజా సీజన్లో చెరో 3 మ్యాచ్‌లాడిన ఇరు జట్లు ఒక్కో విజయం సాధించి రెండేసి పరాజయాలు మూటగట్టుకున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర (రూ. 27 కోట్లు) దక్కించుకున్న లక్నో సారథి పంత్... ఇప్పటి వరకు ఆకట్టుకోలేకపోయాడు. గత మూడు మ్యాచ్‌ల్లో అతడు వరుసగా 0, 15, 2 పరుగులు చేశాడు. దీంతో అతడిపై తీవ్ర ఒత్తిడి ఉండగా... ఐపీఎల్లో కెప్టెన్సీకి దూరమైనప్పటి నుంచి కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గానే ఆడుతున్న రోహిత్ శర్మ కూడా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. తాజా సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ‘హిట్‌మ్యాన్’ వరుసగా 0, 8, 13 పరుగులు చేశాడు. వీరిద్దరు ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగుతారో చూడాలి. మరోవైపు ఐపీఎల్లో ముంబైపై మెరుగైన రికార్డు ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ దాన్నే కొనసాగించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 6 మ్యాచ్‌లు జరగగా... అందులో ఐదింట లక్నో గెలుపొందింది. మరి స్పిన్‌కు సహకరిస్తున్న లక్నో పిచ్‌పై విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి! బుమ్రా లేకపోయినా బలంగానే... ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోయినా... ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళం పటిష్టంగానే కనిపిస్తోంది. నైపుణ్యం ఉన్న దేశీయ ఆటగాళ్లను గుర్తించి వారిని సానబెట్టే అలవాటు ఉన్న ముంబై ఫ్రాంచైజీ ఇప్పటికి ఎందరో స్టార్ ఆటగాళ్లను తయారు చేసింది. బుమ్రా, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇలా వెలుగులోకి వచ్చిన వారే. ఇప్పుడా జాబితాలో మరో రెండు కొత్త పేర్లు చేరేలా కనిపిస్తున్నాయి. గాయం కారణంగా తొలి దశ మ్యాచ్‌లకు బుమ్రా దూరం కావడంతో... జట్టు బౌలింగ్ బలహీనపడుతుంది అనుకుంటే... మేమున్నామంటూ బాధ్యత తీసుకునేందుకు యువ ఆటగాళ్లు ముందుకు వచ్చారు. లెఫ్టార్మ్ పేసర్ అశ్వని కుమార్, మణికట్టు స్పిన్నర్ విఘ్నేశ్ పుథుర్ చెరో 4 వికెట్లతో ఆకట్టుకున్నారు. యంగ్ ప్లేయర్లకు దిశానిర్దేశం చేయడంలో మెరుగైన రికార్డు ఉన్న ముంబై ఫ్రాంచైజీ వీరిద్దరినీ జాగ్రత్తగా తీర్చిదిద్దుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో ముంబై సాధికారిక విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ రికెల్టన్ మెరుపులు మెరిపిస్తుండగా... హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ చక్కటి టచ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌తో సూర్యకుమార్ కూడా లయ అందుకోగా... రోహిత్ శర్మ నుంచి మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. కెపె్టన్ హార్దిక్‌తో పాటు బౌల్ట్, అశ్వని, దీపక్ చాహర్, సాంట్నర్ బౌలింగ్‌లో కీలకం కానున్నారు. ఫుల్ ఫామ్‌లో పూరన్, మార్ష్... కొత్త సారథి రిషబ్ పంత్ భారీ స్కోర్లు చేయలేకపోతున్నా... లక్నో జట్టుకు బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యలు కనిపించడం లేదు. టి20 స్పెషలిస్ట్, విండీస్ స్టార్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్లతో విరుచుకు పడుతుంటే... ఆ్రస్టేలియా బ్యాటర్ మిషెల్ మార్ష్ జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తున్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు రెండేసి హాఫ్ సెంచరీలు సాధించారు. క్షణాల్లో ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకోగల సామర్థ్యం ఉన్న వీరి నుంచి మేనేజ్మెంట్ ఇలాంటి మెరుపులే ఆశిస్తోంది. మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ రూపంలో మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కూడా ధాటిగా ఆడగలిగే వాళ్లే కావడం... లక్నోకు కలిసి రానుంది. ఆయుశ్ బదోని, శార్దుల్ ఠాకూర్, షాబాజ్ నదీమ్ రూపంలో ముగ్గురు స్వదేశీ ప్లేయర్లు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధం. ఎటొచ్చి పంత్ ఫామ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది.చాంపియన్స్ ట్రోఫీలో భారత తుది జట్టులో చోటు దక్కకపోవడంతో బెంచ్‌కే పరిమితమైన రిషబ్... ఈ మ్యాచ్‌లోనైనా దంచికొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇతర జట్లతో పోల్చుకుంటే... బౌలింగ్‌లో కాస్త బలహీనంగా కనిపించిన లక్నో... శార్దుల్ ఠాకూర్ రాకతో బలంగా తయారైంది. గాయం నుంచి కోలుకున్న ఆకాశ్‌దీప్ ఈ మ్యాచ్‌లో ఆడటం ఖాయమే. రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠి కీలకం కానున్నారు. తుది జట్లు (అంచనా) లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మార్ష్, పూరన్, బదోని, మిల్లర్, సమద్, శార్దుల్, దిగ్వేశ్ రాఠి, ఆకాశ్‌దీప్, రవి బిష్ణోయ్, సిద్ధార్థ్. ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, అశ్వని కుమార్, విఘ్నేశ్ పుథుర్, ముజీబ్. 6 ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య 6 మ్యాచ్‌లు జరిగాయి. ఐదింటిలో లక్నో గెలుపొందగా... ఒక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.

ఒడిశా టైటిల్ నిలబెట్టుకునేనా!
ఝాన్సీ (ఉత్తరప్రదేశ్): పురుషుల సీనియర్ హాకీ నేషనల్ చాంపియన్‌షిప్‌నకు వేళైంది. శుక్రవారం ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ ఈనెల 15న జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది. ‘త్రీ డివిజన్’ ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 30 జట్లు పాల్గొంటున్నాయి. గత ఏడాది తమిళనాడులో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ఒడిశా జట్టు టైటిల్ సాధించి సంచలనం సృష్టించింది. వరుసగా రెండో ఏడాది ఒడిశా తమ జోరు కొనసాగించి టైటిల్ నిలబెట్టుకుంటుందో లేదో వేచి చూడాలి. ‘ఎ’ డివిజన్లో ఉన్న 12 జట్లు టైటిల్ కోసం పోటీ పడుతుండగా... ‘బి’ డివిజన్లోని 10 జట్లు, ‘సి’ డివిజన్లోని 8 జట్లు ప్రమోషన్ కోసం ప్రయత్నించనున్నాయి. ప్రదర్శన ఆధారంగా వచ్చే ఏడాది తిరిగి డివిజన్ల మార్పు జరుగుతుంది. ‘సి’ డివిజన్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు... వచ్చే ఏడాది ‘బి’ డివిజన్‌కు... ‘బి’ డివిజన్లో మెరుగైన ప్రదర్శన చేసిన రెండు జట్లు ‘ఎ’ డివిజన్‌కు చేరనున్నాయి. ప్రతి డివిజన్లో కింది స్థానాల్లో నిలిచిన రెండు జట్లు... డిమోషన్ పొందుతాయి. ‘మహిళల సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌ను ఈ ఫార్మాట్లో నిర్వహించడం వల్ల ఆటకు మేలు జరిగింది. అందుకే పురుషుల విభాగంలోనూ దీన్ని కొనసాగిస్తున్నాం. దీంతో ప్రతి డివిజన్లోని జట్టు మరింత మెరుగైన స్థితిలో నిలిచేందుకు ప్రయత్నిస్తుంది’అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అన్నాడు. » ‘ఎ’ డివిజన్లోని 12 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో మూడు టీమ్‌ల చొప్పున పోటీ పడనున్నాయి. లీగ్ దశ ముగిసేసరికి గ్రూప్ అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. » ఈనెల 13న సెమీఫైనల్స్, 15న ఫైనల్ నిర్వహించనున్నారు. » డిఫెండింగ్ చాంపియన్ ఒడిశాతో పాటు రన్నరప్ హరియాణా జట్లు ‘ఎ’ డివిజన్ నుంచి బరిలోకి దిగనున్నాయి. ఈ రెండు జట్లతో పాటు పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బెంగాల్, కర్ణాటక, పుదుచ్చేరి జట్లు ‘ఎ’ డివిజన్లో చోటు దక్కించుకున్నాయి. » ‘బి’, ‘సి’డివిజన్ మ్యాచ్‌లు నేటి నుంచి ప్రారంభం కానుండగా... ‘ఎ’ డివిజన్ మ్యాచ్‌లు ఈ నెల 8న ఆరంభమవుతాయి. » ఇది 15వ పురుషుల సీనియర్ హాకీ జాతీయ చాంపియన్‌షిప్ కాగా... గత ప్రదర్శన ఆధారంగా జట్లను విభజించారు. » తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు ప్రస్తుతం ‘బి’ డివిజన్లో ఉన్నాయి. వీటితో పాటు చండీగఢ్, గోవా, ఉత్తరాఖండ్, ఢిల్లీ, మిజోరం, దాద్రా నగర్ హవేలీ–దామన్ దియు, కేరళ, అస్సాం జట్లు కూడా ఇదే గ్రూప్‌లో రెండు ‘పూల్స్’గా పోటీ పడనున్నాయి. » ‘సి’ డివిజన్లో రాజస్తాన్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశీ్మర్, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, బిహార్, గుజరాత్ జట్లున్నాయి. » ఒక్కో మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు 3 పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ ‘డ్రా’ అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది.

127వ స్థానంలో...
లుసానే (స్విట్జర్లాండ్): ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయి మ్యాచ్‌ల్లో ఆశించిన ఫలితాలు సాధించడంలో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు విఫలమవుతోంది. ఈ నిరాశాజనక ప్రదర్శన ప్రభావం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత జట్టుపై పడింది. గురువారం విడుదల చేసిన ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 127వ స్థానానికి చేరుకుంది. క్రితంసారి భారత జట్టు 126వ స్థానంలో ఉంది. షిల్లాంగ్‌లో ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియా కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’ చేసుకుంది. తమకంటే మెరుగైన స్థానంలో ఉన్న భారత జట్టుతో మ్యాచ్‌ను 0–0తో ‘డ్రా’ చేసుకోవడం బంగ్లాదేశ్ జట్టుకు కలిసొచ్చిoది. ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ రెండు స్థానాలు పురోగతి సాధించి 183 ర్యాంక్‌లో నిలిచింది. గత ఏడాది జూన్‌లో భారత స్టార్ ప్లేయర్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సునీల్ ఛెత్రి గుడ్‌బై చెప్పాక భారత ప్రదర్శన తీసికట్టుగా మారింది. దాంతో గత నెలలో సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో, అంతకుముందు మాల్దీవులుతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత జట్టుకు సునీల్ ఛెత్రి నాయకత్వం వహించాడు. కొత్త కోచ్ మనోలో మార్క్వెజ్ వచ్చాక భారత జట్టు ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. భారత్ తమ అత్యుత్తమ ర్యాంక్ 94ను 1996లో సాధించింది. ఆ తర్వాత టీమిండియా తమ అత్యుత్తమ ర్యాంక్‌ను అధిగమించడంలో విఫలమవుతోంది. వరుసగా మూడోసారి ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించాలనే లక్ష్యంతో ఉన్న భారత జట్టు గ్రూప్ ‘సి’లో తమ తదుపరి మ్యాచ్‌ను జూన్ 10న హాంకాంగ్‌తో ఆడుతుంది. మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత విశ్వవిజేత అర్జెంటీనా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... స్పెయిన్ ఒక స్థానం మెరుగుపర్చుకొని రెండో ర్యాంక్‌కు చేరుకోగా... ఫ్రాన్స్ ఒక స్థానం పడిపోయి మూడో ర్యాంక్‌లో నిలిచింది. ఇప్పటికే 2026 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన ఆసియా దేశాలు జపాన్ 15వ స్థానంలో, ఇరాన్ 18వ స్థానంలో ఉన్నాయి.
బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 149 పాయింట్లు తగ్గి 23,103కు చేరింది. సెన్సెక్స్(Sensex) 329 పాయింట్లు దిగజారి 75,971 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.87 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 69.58 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.97 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో భారీ నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 4.84 శాతం నష్టోయింది. నాస్డాక్ 5.97 శాతం దిగజారింది.అమెరికాతో వాణిజ్య భాగస్వాములుగా ఉన్న 60 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాల విధింపుతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు వణికిపోయాయి. ఏ దేశంపై ఎంత టారిఫ్‌ల విధింపు ఉంటుందో అని లెక్కలతో సహా ట్రంప్ వివరణతో ఆసియా నుంచి అమెరికా వరకు ఈక్విటీ మార్కెట్లు ‘బేర్’మన్నాయి. ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధం తీవ్రతరమై అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటాయనే భయాలు అధికమయ్యాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్ వాణిజ్య యుద్ధ ప్రభావం ఈక్విటీ మార్కెట్‌ను కుదిపేసింది.అమెరికాకు భారత్ నుంచి ఎక్కువ ఎగుమతయ్యేవి సాఫ్ట్వేర్ సేవలు, మందులే. సుంకాల దెబ్బ నుంచి ఫార్మాను మినహాయించారు. ఇక సాఫ్ట్వేర్ సేవలపై టారిఫ్‌లు లేకున్నా.. ట్రంప్ చర్యలతో అమెరికా మాంద్యంలోకి జారే అవకాశాలున్నాయని, కంపెనీలు టెక్నాలజీపై వ్యయాలూ తగ్గించుకుంటాయనే అంచనాలు వస్తున్నాయి. అందుకే భారత ఐటీ షేర్లు భారీగా పతనం కాగా.. అమెరికాలో టెక్నాలజీ కంపెనీల సూచీ అయిన నాస్డాక్ అనూహ్యంగా 5 శాతానికిపైగా పతనమయింది.ఇదీ చదవండి: వజ్రాల వ్యాపారం గతి తప్పుతుందా..?రాబోయే రోజుల్లో ఒకవేళ కొన్ని రంగాల విషయంలో టారిఫ్‌లను సడలించినప్పటికీ కీలక పరిశ్రమలపై మాత్రం సుంకాల మోత యథాప్రకారం కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ టారిఫ్‌లతో ఇప్పటికే ప్రపంచ ఎకానమీలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లోనూ దేశాలు, పరిశ్రమలు, అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రపంచంపై టారిఫ్‌ల ప్రభావాలు రకరకాలుగా ఉండబోతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

వజ్రాల వ్యాపారం గతి తప్పుతుందా..?
ప్రపంచ లగ్జరీ మార్కెట్‌కు ప్రతీకగా ఉన్న జెమ్స్ అండ్ జువెలరీ పరిశ్రమ ప్రస్తుతం సవాళ్లు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు కళాత్మకత, ఆర్థిక సహకారం, ఉపాధి కల్పనకు ప్రసిద్ధి చెందిన ఈ రంగం ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులు, మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య సమస్యలతో పోరాడుతోంది. దాంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఈ రంగంలో ఉద్యోగ కల్పన కరువవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో ఉపాధి పొందుతున్న కళాకారులు, రిటైలర్లు సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సవాళ్లు ఇవే..రత్నాలు, ఆభరణాల పరిశ్రమ చాలాకాలంగా లగ్జరీకి సింబల్‌గా ఉంది. భారతదేశం, చైనా, యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థలకు బిలియన్ డాలర్ల కొద్దీ సహకారం అందిస్తుంది. ఈ విభాగంలో భారతదేశం ప్రపంచ మార్కెట్లో గణనీయమైన వాటాను కలిగి ఉంది. సూరత్‌లోని వజ్రాల పాలిషింగ్ కేంద్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. అయితే ఇటీవలి సంవత్సరాల్లో పరిస్థితులు తలకిందులవుతున్నాయి.ఈ రంగంలో వినియోగిస్తున్న ముడిసరుకుల ధరలు పెరగడం ప్రధాన సవాలుగా మారింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా గొలుసు అడ్డంకుల కారణంగా బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు పెరిగాయి. అదేవిధంగా సహజమైన, ప్రయోగశాలలో అభివృద్ధి(ల్యాబ్ గ్రోన్ డైమండ్స్) చేసిన రత్నాల ఖర్చు విపరీతంగా హెచ్చుతగ్గులకు గురవుతుంది. మైనింగ్ అంతరాయాలు, ఇతర ప్రత్యామ్నాయాలకు పెరిగిన డిమాండ్ కారణంగా ఈ పరిస్థితులు దాపరించాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్న నగల వ్యాపారులు, తయారీదారులకు పెరుగుతున్న ఖర్చులు తక్కువ మార్జిన్లను అందిస్తున్నాయి. దాంతో పోటీని తట్టుకోవడం కష్టమవుతుంది.మారుతున్న వినియోగదారుల ధోరణిఈ విభాగంలో వినియోగదారుల ధోరణి మారుతుంది. యువకులు ముఖ్యంగా మిలీనియల్స్(1995 తర్వాత పుట్టినవారు), జెన్ జెడ్(2000 తర్వాత జన్మించినవారు) జువెలరీ కంటే వాటిని చౌకగా మార్కెట్ నుంచి కొనుగోలు చేసి దాని నుంచి పొందే అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తరచుగా సాంప్రదాయ ఆభరణాలను ఎంచుకుంటున్నారు. దాంతో సహజ డైమండ్లను పోలి ఉండి, చౌకగా లభించే ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాల పెరుగుదల మార్కెట్‌ను మరింత దెబ్బతీసింది. వ్యాపారాల ఆర్థిక సమస్యను మరింత జఠిలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా డిస్పోజబుల్ ఆదాయాల(ఖర్చులపోను మిగిలిన డబ్బు) ఖర్చును ప్రభావితం చేసింది. ఇది ఆభరణాలు వంటి లగ్జరీ కొనుగోళ్లను వాయిదా వేసేందుకు కారణమైంది.భౌగోళిక అనిశ్చితులు, సరఫరా గొలుసు సమస్యలురత్నాలు, ఆభరణాల పరిశ్రమ ప్రపంచ వాణిజ్యంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇటీవలి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ వ్యాపారాన్ని మరింత బలహీన పరిచాయి. రఫ్ డైమండ్స్ ప్రధాన సరఫరాదారు అయిన రష్యాపై ఆంక్షలు సప్లై-చెయిన్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్యంలోని వజ్రాల దిగ్గజం అల్రోసాపై ఆధారపడిన సంస్థలకు ఈ సమస్య ఎక్కువైంది. ఇంతలో ఆఫ్రికా వంటి రత్నాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో సంఘర్షణలు, అస్థిరత వల్ల విలువైన రాళ్ల సరఫరాకు పరిమిత అవకాశం ఉంది. ఇది ఖర్చులను పెంచి కొరతను సృష్టిస్తుంది.ఉద్యోగ నష్టాలువ్యాపారులకు పెద్దగా మార్జిన్లు లేకపోవడంతో చేసేదేమిలేక ఉద్యోగులను తొలగిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ జెమ్స్ అండ్ జువెలరీ రంగం మైనర్లు, కట్టర్లు, డిజైనర్లు, సేల్స్ పర్సన్ల వంటి లక్షలాది మంది నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. ఒక్క భారతదేశంలోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదు మిలియన్లకు(50 లక్షలు) పైగా ఉద్యోగులు ఈ రంగంలో పని చేస్తున్నారు. వీరిలో చాలా మంది కొలువులు ప్రమాదంలో పడనున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.కొత్త పంథాఈ రంగంలో కొద్దిమంది వ్యాపారులు రీసైకిల్ చేసిన లోహాలను మార్కెటింగ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. మరికొందరు టెక్నాలజీని అందిపుచ్చుకుని ఖర్చులను తగ్గించడానికి, కస్టమర్ అనుభవాలను పెంపొందించడానికి 3డీ ప్రింటింగ్, వర్చువల్ ట్రై-ఆన్ సాధనాలను(ఇమేజ్ సాయంతో కస్టమర్లకు నప్పే ఆభరణాలు ఎంచుకోవడం) ఉపయోగిస్తున్నారు. ఫిజికల్ స్టోర్ల జోలికి పోకుండా తమ బ్రాండ్లు ప్రపంచ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు వీలు కల్పిస్తూ ఈ-కామర్స్‌ను వాడుతున్నారు.ఇదీ చదవండి: భారత్‌కు స్టీల్ దిగుమతుల ముప్పుభారత్లో ఈ రంగానికి ఊతమిచ్చేందుకు పన్ను రాయితీలు, సబ్సిడీలు, ఎగుమతి ప్రోత్సాహకాలు ఇవ్వాలని పారిశ్రామిక సంఘాలు కోరుతున్నాయి. సరఫరా గొలుసులను స్థిరీకరించడానికి, వాణిజ్య అడ్డంకులను తగ్గించడానికి అంతర్జాతీయ సహకారం మరింత ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నాయి.

కంపెనీల రేటింగ్ భేష్
న్యూఢిల్లీ: దేశీ కంపెనీల ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతోంది. వాటి పరపతి రేటింగ్ బలపడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ కంపెనీల రేటింగ్‌లు అప్‌గ్రేడ్ కావడం దీన్ని తెలియజేస్తోంది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా 2024–25 సంవత్సరంలో 301 కంపెనీల రేటింగ్లను అప్‌గ్రేడ్ (అప్పటి వరకు ఉన్న రేటింగ్ కంటే మెరుగైనది) చేయగా, 150 కంపెనీల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసినట్టు తెలిపింది. కంపెనీల రుణ పరపతి మెరుగుపడడం వరుసగా నాలుగో ఏడాది కావడం గమనార్హం. ‘‘బ్యాలన్స్ షీట్ల బలోపేతం వల్ల భారత కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్ మెరుగుపడడం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. గత దశాబ్ద కాలంలో మేము విశ్లేషించిన 6,000 లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీల నిర్వహణ లాభం ఏటా 12 శాతం చొప్పున కాంపౌండెడ్‌గా పెరిగింది. వాటి మొత్తం రుణం కేవలం 4 శాతమే పెరిగింది’’అని ఇక్రా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కె.రవిచంద్రన్ తెలిపారు. ఇక ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) సైతం 2024–25లో కార్పొరేట్ రుణ పరపతి మెరుగుపడినట్టు తెలిపింది. రేటింగ్‌ల డౌన్‌గ్రేడ్–అప్‌గ్రేడ్ నిష్పత్తి వరుసగా నాలుగో సంవత్సరంలోనూ చారిత్రక కనిష్ట స్థాయిలో ఉన్నట్టు ప్రకటించింది. 2023–24లో ఉన్న 0.37 నుంచి 0.28కి మెరుగుపడినట్టు వెల్లడించింది. ఇండియా రేటింగ్స్ గత ఆర్థిక సంవత్సరంలో 330 కంపెనీల ఇష్యూలకు రేటింగ్లను అప్‌గ్రేడ్ చేయగా, 94 డెట్ ఇష్యూల రేటింగ్లను డౌన్‌గ్రేడ్ చేసింది. బలమైన బ్యాలన్స్ షీట్ల కారణంగా కార్పొరేట్ కంపెనీలు రుణ పరపతి ప్రయోజనం పొందుతున్నట్టు ఇండియా రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అరవింద్ రావు తెలిపారు. సానుకూల దృక్పథం మరో ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ సైతం గత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో 423 కంపెనీలకు రేటింగ్ అప్‌గ్రేడ్ ఇవ్వగా, 160 కంపెనీలకు డౌన్‌గ్రేడ్ ఇచ్చినట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో క్రిసిల్ రేటింగ్స్ క్రెడిట్ రేషియో 2.75గా ఉంటే, ద్వితీయ ఆరు నెలల్లో 2.64 రెట్లకు తగ్గింది. భారత కంపెనీలకు సంబంధించి రుణ నాణ్యత పరంగా సానుకూల దృక్పథంతో ఉన్నట్టు తెలిపింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో డౌన్గ్రేడ్లను మించి అప్గ్రేడ్లు ఉంటాయన్న అంచనా వ్యక్తం చేసింది. ‘‘బడ్జెట్లో పన్ను తగ్గింపులు, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు పట్టణ వినియోగాన్ని పెంచనున్నాయి. దీన్నుంచి కార్పొరేట్ ఇండియా ప్రయోజనం పొందుతుంది. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై చేస్తున్న మూలధన వ్యయాలు అనుబంధ రంగాలపై ఎన్నో అంచల సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ ఎండీ సుబోధ్ రాయ్ వివరించారు. తాను రేటింగ్ ఇస్తున్న కంపెనీల మధ్యస్థ ఆదాయ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8 శాతానికి పెరగొచ్చని క్రిసిల్ తెలిపింది. దేశీ డిమాండ్ బలోపేతంతో క్యాపిటల్ గూడ్స్, నిర్మాణ రంగం, రిటైల్ ఎక్కువగా ప్రయోజనం పొందుతాయని అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానమైన రసాయనాలు, డైమండ్ పాలిషర్స్, ఆగ్రోకెమికల్స్ పనితీరును పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.

కొనసాగుతున్న సూక్ష్మ రుణ రంగం సంక్షోభం
ముంబై: సూక్ష్మ రుణ రంగంలో సంక్షోభం కొనసాగుతోంది. డిసెంబర్ త్రైమాసికంలో రుణ వితరణ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు 42 శాతం మేర తగ్గిపోయినట్టు క్రిఫ్ హైమార్క్ నివేదిక తెలిపింది. మొత్తం 1.19 కోట్ల రుణ దరఖాస్తులకు ఆమోదం లభించినట్టు.. వీటి ద్వారా రూ.63,400 కోట్ల రుణాలు జారీ చేసినట్టు తెలిపింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రుణ వితరణ రూ.97,400 కోట్లుగా ఉంది. పేదలు, తక్కువ ఆదాయ వర్గాలు సూక్ష్మ రుణ ఖాతాదారులుగా ఉండడం గమనార్హం. 31–180 రోజుల వరకు చెల్లింపుల్లేని రుణాలు (మొండి బాకీలు) మొత్తం రుణాల్లో 6.4 శాతానికి పెరిగాయి. 2023 డిసెంబర్ చివరికి ఇవి 2 శాతంగానే ఉన్నాయి. ఈ ప్రకారం సూక్ష్మ రుణ రంగంలో తీవ్ర ఒత్తిళ్లు నెలకొన్నట్టు తెలుస్తోంది. సూక్ష్మ రుణ సంస్థల నిర్వహణలోని మొత్తం రుణ ఆస్తులు 2023 డిసెంబర్‌తో పోల్చి చూస్తే 4 శాతం మేర, 2024 సెపె్టంబర్ త్రైమాసికంతో పోల్చి చూస్తే 5.4 శాతం క్షీణించి రూ.3.91 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఒక్కో వ్యక్తికి గరిష్టంగా కొన్ని సంస్థల పరిధిలోనే రుణాల మంజూరు పరిమితులు ప్రభావం చూపించినట్టు ఈ నివేదిక తెలిపింది. యాక్టివ్ రుణాలు (లావాదేవీలు కలిగిన) డిసెంబర్ చివరికి 14.6 కోట్లకు తగ్గాయి. ఏడాది క్రితం ఇవి 15.7 కోట్లుగా ఉన్నాయి. అత్యధికంగా కేరళలో 15.8 శాతం, రాజస్థాన్‌లో 11.6 శాతం, ఒడిశాలో 9 శాతం, తమిళనాడులో 8.3 శాతం చొప్పున సూక్ష్మ రుణ వితరణ తగ్గింది. యూపీలో మాత్రం 1.2 శాతం వృద్ధి నమోదైంది.
ఫ్యామిలీ

Nidhi Tiwari: ప్రధానికి ప్రైవేట్ సెక్రటరీ
వ్యక్తిగత కార్యదర్శి బాధ్యత జటిలమైనది. బాస్ చెప్పింది అర్థం చేసుకుని చెప్పబోయేది గ్రహించి చెబుతున్నది అమలు చేయాలి. మరి ఆ బాస్ ప్రధాని అయితే?అలాంటి జటిలమైన బాధ్యతకు ఎంపికైంది నిధి తివారి. వారణాసికి చెందిన ఈ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ పి.ఎం.ఓ.లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. ఆమె వ్యక్తిత్వం, వ్యక్తిగత వివరాలు.వారణాసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలు కూడా తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయి ఈ స్థానానికి చేరిందే అని గర్వంగా చూస్తున్నారు. ప్రధానికి ప్రయివేట్ సెక్రటరీగా నియమితురాలైన నిధి తివారి సొంత ఊరు వారణాసి అయితే సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. మరి ఈ హర్షం సహజమే కదా. ఏ పార్లమెంట్ స్థానం నుంచి ప్రధానిప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ స్థానానికి చెందిన మహిళకే ప్రధాని ఈ అవకాశం ఇవ్వడం వారణాసి ప్రజలకు నచ్చింది. ప్రధాని రోజువారి కార్యక్రమాల సమన్వయం చూసే వ్యక్తిగా నిధి తివారి పని చేయడం అంటే సామాన్యమా? సన్నివేశం కొంచెం అటు ఇటుగా మనం సినిమాల్లో చూసినట్టే ఉంటుంది.ప్రధాని ముందు రోజు అడుగుతారు– ‘రేపటి నా కార్యక్రమాలు ఏమిటి?’నిధి తివారి చెప్తారు: ‘సర్.. ఫలానా శాఖకు చెందిన మంత్రి మిమ్మల్ని కలవడానికి వస్తారు. ఫలానా శాఖ డైరెక్టర్ వచ్చి నివేదిక అందజేస్తారు. ఫలానా కార్యక్రమంప్రారంభోత్సవానికి వెళతారు. అయితే ఈ కార్యక్రమాలు ఫిక్స్డ్ కాదు. ఇంత పెద్ద దేశంలో ఎన్నో తక్షణ సమస్యలు వస్తాయి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రధానిని అర్జెంట్‌గా కలవాలని ముఖ్యమంత్రుల దగ్గరి నుంచి ఉన్నత అధికారులు, ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు అపాయింట్మెంట్లు అడుగుతారు. దేశాల నుంచి ఆహ్వానాలు వస్తుంటాయి. వాటన్నింటినీ సమన్వయం చేసి, ప్రధాని ప్రాధాన్యాలు గమనించి కార్యక్రమాల రూపకల్పన చేయాల్సి ఉంటుంది. ఈ కత్తి మీద సాముకే నిధి తివారి ఎంపికైంది.ఎవరు ఈ నిధి?నిధి తివారి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత కార్యదర్శి (ప్రైవేట్ కార్యదర్శి)గా ఇటీవల ఆమె నియమితులవడంలో ‘పిఎంఓ’లో స్త్రీలప్రాధాన్యం పెరుగుతున్నదనడానికి మరో ఆనవాలుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2022 నవంబర్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్నున్న నిధి ఇప్పుడు ప్రధాన వ్యక్తిగత కార్యదర్శిగా ప్రమోట్ అయ్యారు. వారణాసిలోని మెహమర్‌గంజ్‌లో పుట్టి పెరిగిన నిధి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ చేశారు. ఆ యూనివర్సిటీలోనే పరిచయమైన దియోరియా జిల్లాకు చెందిన వైద్యుడు డా.సుశీల్ జైస్వాల్‌ను 2006లో వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత సివిల్స్సివిల్ సర్వీసెస్‌లో చేరి దేశానికి తనవంతు సేవ చేయాలనేది చిన్ననాటి నుంచి నిధి లక్ష్యం. ’వివాహం విద్య నాశాయ’ అన్న మాటను అబద్ధం చేస్తూ కష్టపడి చదివి, వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (కమర్షియల్ ట్యాక్స్) ఉద్యోగం సాధించారు. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కి సన్నద్ధమయ్యారు. కొడుకు పుట్టినా ఆమె తన లక్ష్యం వీడలేదు. 2013 సివిల్స్ ఫలితాల్లో 96వ ర్యాంకు సాధించారు. ఐఎఫ్ఎస్ అధికారిణిగా 2016లో శిక్షణలో ఉన్న సమయంలోనే ఆమె చూపిన ప్రతిభకు గుర్తింపుగా ’అంబాసిడర్ విమల్ సన్యాల్ స్మారక పతకం’ అందుకున్నారు.మొదటి మహిళమోది ప్రధాని అయ్యాక ఈ 11 ఏళ్లలో వ్యక్తిగత కార్యదర్శులుగా వివేక్ కుమార్, హార్దిక్ సతీష్ చంద్ర షా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆ స్థానంలో నిధి తివారీ మొదటి మహిళగా నియమితులయ్యారు. ప్రధాని వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఆమెకు నెలకు రూ.1.44 లక్షల వేతనంతోపాటు ఇతర సదుపాయాలన్నీ అందుతాయి. ప్రతిభ, సామర్థ్యం ఉంటే స్త్రీల ఉన్నతికి ఆకాశమే హద్దు అని నిరూపించేందుకు నిధి తివారి మరో గొప్ప ఉదాహరణగా నిలిచారు.అజిత్ దోవల్ టీమ్లోప్రధానమంత్రి కార్యాలయంలో పని చేయడానికి ముందు ప్రభుత్వం ఆమెను విదేశీ వ్యవహారాల శాఖలో ’నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాలు’ (డిజార్మమెంట్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్) విభాగంలో అధికారిగా నియమించింది. దాంతోపాటు రాజస్థాన్‌కు సంబంధించిన పలు అంశాలపైనా ఆమె పనిచేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆధ్వర్యంలో ఆమె చూపిన ప్రతిభ ఆమెపై గౌరవాన్ని పెంచింది. దేశ భద్రత, అణుశక్తి, విదేశీ వ్యవహారాల వంటి అంశాలను ఆమె చాకచక్యంగా నిర్వహించగలదన్న నమ్మకం కుదిరింది. ఆ తర్వాత 2023లో భారత్‌లో తొలిసారి జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో నిధి తివారీ చురుకుదనం, వ్యవహార శైలి, దీక్ష, పట్టుదలపై ప్రధానికి ఆమె మీద విశ్వాసం ఏర్పడింది.

Ghibli AI trend జిబ్లీ..ట్రెండ్.. చిక్కులు తెలుసుకోండి!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘జీబ్లీ తరం’ కొనసాగుతుందా..? ఎప్పటికప్పుడు కృత్రిమ మేధ వేదికగా పుట్టుకొస్తున్న కృత్రిమ ఆవిష్కరణలే ఈ తరం ట్రెండ్‌గా మారుతున్నాయా..? రానున్న రోజుల్లో ప్రతీదీ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనే ఆధారపడి పనిచేస్తుందా..? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. విషయానికొస్తే.. గతంలో ఒక పోట్రేట్(ముఖ చిత్రం) వేయించు కోవాలంటే ఒక మంచి ఆరి్టస్టు దగ్గరికో, ఈ మధ్య కాలంలోనైతే ఆన్లైన్లోనే ఆర్టిస్టులకు ఆర్డర్ ఇస్తే వారే అందమైన చిత్రాన్ని వేసి ఇంటికి పంపించేవారు. అయితే కొన్ని రోజుల నుంచి జీబ్లీ ఏఐ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓపెన్ ఏ1 సంస్థ తన చాట్ జీపీటీ–40 మోడల్లో ఈ కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ ట్రెండ్ మరింత వేగంగా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ తమ ఫొటోలను ఈ వేదికగా సబ్మిట్ చేసి క్షణాల్లో వారి జీబ్లీ ఫొటోలను పొంది.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోపేస్బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్స్ వినియోగం పెరిగిన తర్వాత.. వ్యక్తిగత ఫొటోలను వివిధ సందర్భాలను మిత్రులు, తెలిసినవారికి పంచుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిన విషయం విధితమే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా అందంగా, వినూత్నంగా తమ ఫొటోలను చూసుకోవాలన్న కుతూహలం పెరిగింది. గతంలోనైతే నగరంలోని ట్యాంక్ బండ్ పైనో, అలా శిల్పారామంలోనో పోట్రేట్ వేసే కళాకారులు ఉండేవారు.. వారి వద్ద లైవ్‌గా వేయించుకునేవారు. కానీ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని.. వినూత్న, కళాత్మక యానిమేటెడ్ ఫొటోలు క్షణాల్లో వచ్చేస్తున్నాయ్.. ఇంకేముంది.. వెంటనే డౌన్లోడ్ చేసుకోవడం, షేర్లు, పోస్టులు చేయడం చకచకా జరిగిపోతున్నాయి. దీనికి సామాన్యులు మొదలు సెలబ్రెటీల వరకు మినహాయింపు లేకుండా వాడేస్తున్నారు. ఐతే ఇందులోనూ చిక్కులు లేకపోలేదు. ఈ ట్రెండ్‌లో ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాపీరైట్స్ మాత్రం జపాన్‌కు చెందిన స్టూడియో జీబ్లీ.. ప్రస్తుతం వైరల్‌గా మారిని జీబ్లీ ఫొటోలు.. చాట్‌జీపీటీలో సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్. కానీ ఈ ఫొటోలు జపాన్‌లో ప్రసిద్ధి పొందిన స్టూడియో జీబ్లీకి చెందిన యానిమేషన్ శైలిలోకి మారుస్తున్నాయి. ఈ ట్రెండ్‌తో కొన్ని ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు తలెత్తే అవకాశముంది. వినియోగదారులు తమ వ్యక్తిగత ఫొటోలను యాప్ సాధనాలకు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ డేటా నిల్వ చేస్తారు. విభిన్న విధాలుగా ఉపయోగించవచ్చనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధానంగా స్టూడియో జీబ్లీ ప్రత్యేక శైలిని అనుకరించడంతో ఆ సంస్థ కాపీరైట్ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా అనే చర్చ కూడా కొనసాగుతుంది. మిలియన్ల కొద్దీ మంది ఈ సాంకేతికతను ఒకేసారి వినియోగిస్తున్న నేపథ్యంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సందర్భమే గతంలోనూ జరిగింది. ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ అంటూ ప్రతీఒక్కరి బర్త్ డే రోజు వాడుకునే ఈ పాట వార్నర్/చాపెల్ అనే మ్యూజిక్ పబ్లిషర్ది. అప్పట్లో ఇది కూడా వైరల్ కావడంతో దీనిపై కూడా కాపీరైట్ కేసు కూడా ఫైల్ చేశారు యాజమాన్యం. కానీ అనంతరం అధికారికంగా పబ్లిక్ డోమైన్లోకి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.ఇది అనైతికం..: హయావో మియాజాకి తమ సాంకేతికత శైలిని పోలిన కళాత్మక ఫొటోలను సృష్టించడం అనైతిక చర్యగా గతంలో స్టూడియో జీబ్లీ సహ వ్యవస్థాపకుడు హయావో మియాజాకి తెలిపారు. 2016లోనే ఏఐ ద్వారా సృష్టించబడిన చిత్రాలను జీవితానికే అవమానంగా ఆయన అభివరి్ణస్తూ ఈ కళపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి ఆధునిక సాంకేతికత వలన పెయింటింగ్, డ్రాయింగ్, పోట్రేట్ పెయింటింగ్ వంటి కళలపైన జీవనం సాగిస్తున్న కళాకారులకు కష్ట–నష్టాలను తెచ్చిపెడుతుంది.

అద్భుతమైన నల్లేరు పచ్చడి : ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
నల్లేరు (సిస్సస్ క్వాడ్రాంగులారిస్) దీని గురించి ఎపుడైనా విన్నారా? సాధారణంగా ఉడుతలు అవి కొరక్కుండా ఉండేందుకు ఈ నల్లేరు తీగను కూరగాయల పాదులపై పాకిస్తారు. ఈ రోజుల్లో నల్లేరు దాదాపుగా మరచిపోయారు గానీ దీని వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నల్లేరు పచ్చడి తింటే కొలెస్ట్రాల్ కరుగుతుంది. కీళ్ల నొప్పులకు చాలా బాగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. ఎముకుల పుష్టికి, విరిగిన ఎముకలు అతకడానికి, ఎముకలు గుల్లబారకుండా ఉండడానికి కీళ్ల సందుల్లోని ఇన్ఫ్లమేషన్ను, వాపును తగ్గించడానికి అట్లు వేసుకుని తింటే దగ్గు కూడా తగ్గుతుంది. మరి నల్లేరు పచ్చడి తయారీ విధానం ఎలాగో చూద్దాం.ఆంగ్లంలో వెల్డ్ గ్రేప్ అని ,హిందీలో హడ్జోరా , తెలుగులో నల్లేరు అని పిలుస్తారు. సంస్కృతంలో, దీనిని కవితాత్మకంగా వజ్రంగి, వజ్రవల్లి అని పిలుస్తారు. అంటే వజ్రం అంత బలమైనది అని దీని అర్తం. నల్లేరు తీగలోని ప్రతి భాగాన్ని వివిధ ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారని ఆయుర్వేద గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఇందులొ విటమిన్ సీ, నీరు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ.నల్లేరు పచ్చడి కావాల్సినవితరిగిన 10 నల్లేరు కాడలు అర కప్పు వేరుశెనగలు , చింతపండు , నాలుగు ఎండు లేదా పచ్చి మిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు 1 టీస్పూన్, కొద్దిగా కొత్తిమీర పచ్చడి తయారీ తీగ నుంచి నల్లేరు కాడలను కోసేముందు చేతికి ఆయిల్ రాసుకోవాలి. ఒట్టి చేతులతో తీస్తే దురద వస్తుంది. నల్లేరు లేత కాడలను తీసుకోవాలి. వాటి ఈనెలను తీసి చిన్న చిన్నముక్కలుగా కట్ చేసుకోని, ఉప్పు నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత ఒక బాణలిలో నూన్ వేసి నల్లేరు ముక్కలను వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత, కొద్ది శనగపప్పు, వేరుశనగలు, పచ్చిమిరప లేదా ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఒక టమాటా వేసి వేయించుకోవాలి. దీన్ని కొత్తగా చింతపండు కలిపి మెత్తగా రోట్లో రుబ్బుకోవాలి. దీన్ని తాజా కరివేపాకు, పోపు గింజలు వేసి పోపు పెట్టుకుంటే కమ్మటి నల్లేరు పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. దోస, రోటీలో కూడా నంజుకోవచ్చు.నల్లేరుతో ఇతర వంటలునల్లేరు తీగలోని లేత కణుపులు కోసి వాటి నారను తీసి పచ్చడి, పప్పు, కూర చేసుకుంటారు. దీనిని కాడలతో పులుసు చేసుకొని చాలా ప్రాంతంలో తింటారు.నల్లేరుతో లాభాలు వీటి కాడల్ని శుభ్రం చేసి నీడలో ఎండబెట్టి దంచి పొడిగా చేసుకుని భద్రపరచుకొని, వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే నడుము నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. నల్లేరు కాడలతో చేసిన పొడిని రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చునల్లేరులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపులను తగ్గిస్తాయి. నల్లేరు ఆస్పిరిన్ వలె ప్రభావవంతంగా పనిచేస్తుంది.రక్తహీనత నివారణలో సహాయపడుతుంది.నల్లేరు బహిష్టు సమస్యలకు చక్కటి పరిష్కారంనల్లేరులో పీచు పదార్థం యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.ఇదీ చదవండి: రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?

ట్రంప్ సుంకాల మోత, సోషల్ మీడియాలో మీమ్స్ హోరు మాములుగా లేదు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దాదాపు అన్ని దేశాలపై నా టారిఫ్స్ కొరడా ఝుళిపింఆడు. దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై "రెసిప్రోకల్ టారిఫ్స్" (Reciprocal Tariffs) విధించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని.. అయితే కనీసం 10శాతం పన్నులు(Tariffs) చెల్లించాల్సింది ఉంటుందని ప్రకటించారు. భారత్ నుంచి దిగుమతి వస్తువులపై 26శాతం, చైనా నుండి వచ్చే వస్తువులపై 34 శాతం పన్ను విధించారు. దీంతో చైనా మొత్తం పన్నుల శాతం 54 శాతానికి చేరింది. ఇక సౌత్ కొరియాపై 25 శాతం యూరోపియన్ యూనియన్ నుండి వచ్చే వస్తువులపై 20 శాతం పన్ను విధించారు. యూకే వచ్చే వస్తువులపై 10 శాతం పన్ను విధించారు. ట్రంప్ తాజా ప్రకటనపై పలు దేశాధినేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు కూడా. మరోవైపు ట్రంప్ వడ్డింపులపై సోషల్‌మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి, వృద్ధికోసం దాని మిత్రదేశాలు సహా దాదాపు అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను విధించారు ట్రంప్. ఎవరూ ఆపలేని ఆర్థిక యుద్ధం జరుగుతోందంటూ జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించి, సుంకాలను ప్రకటించిన వెంటనే #TrumpTariffs , #TradeWar ఎక్స్( X)లో ట్రెండింగ్ షురూ అయింది. Happy Liberation Day! Thanks Trump for ensuring that we become liberated from our money. I personally will miss being able to buy food. So when Trump said he was going to make America great again, I guess he meant he was gonna take us back to the Great Depression? #trumptariffs— Meredith (@meralee727) April 2, 2025 చదవండి: రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?"విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు! మన డబ్బు నుండి మనం విముక్తి పొందేలా చేసినందుకు ట్రంప్ ధన్యవాదాలు. ఇకనాకు బువ్వ ఉండదు. అమెరికా గ్రేట్ ఎగైన్ అంటే మనల్ని తిరిగి మహా మాంద్యంలోకి తీసుకెళ్లడం అని అనుకున్నాడనుకుంట’’ అని ఒకరు ట్వీట్ చేశారు. జపాన్ ఎగుమతులపై 24 శాతం సుంకాలు విధించినందుకు ట్రంప్‌ను విమర్శిస్తూ,"సరైన మనస్సు గల జపనీస్ వ్యక్తి అమెరికన్ కారును ఎందుకు కొనుగోలు చేయాలి?" అని ప్రశ్నించారు.Happy Liberation Day! Thanks Trump for ensuring that we become liberated from our money. I personally will miss being able to buy food. So when Trump said he was going to make America great again, I guess he meant he was gonna take us back to the Great Depression? #trumptariffs— Meredith (@meralee727) April 2, 2025 చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఅంతేకాదు ఈ సుంకాల నుండి రష్యాను మినహాయించినందుకు నెటిజన్లు ట్రంప్‌ను కూడా ఎగతాళి చేశారు. "ట్రంప్ రష్యాపై విధించిన సుంకాలు లేదా ఆర్థిక చర్యలు లేవు. నాకు ఎందుకు ఆశ్చర్యంగా ఉంది" అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నవ్వుతూ ఉన్న జిఫ్‌ను ట్విట్ చేశాడు. "ట్రంప్స్టర్స్ శుభవార్త! మీ కిరాణా సామాగ్రికి ఎంత మిగులుతుందో గుర్తించడం కష్టం.. ఎందుకంటే మిగతాటికి ఖర్చులు మరింత భారం అవుతాయి కనుక’’ అంటూ మరొక యూజర్ ట్రంప్ సుంకాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
ఫొటోలు


బ్లూ శారీలో మెరిసిపోతున్న అనసూయ (ఫోటోలు)


కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే (ఫోటోలు)


Hyderabad Rains : హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. చిత్రాల కోసం క్లిక్ చేయండి


అయోధ్యలో ఫ్యామిలీతో ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ సందడి (ఫొటోలు)


హీరో సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


అందాలతో మెస్మరైజ్ చేస్తున్న రిద్ది కుమార్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!


రెడ్ డ్రెస్‌లో హీరోయిన్ దివ్య భారతి క్రేజీ లుక్స్ (ఫోటోలు)


మూడేళ్ల వయసులో తల్లి దూరం.. తండ్రి రెండో పెళ్లి.. బామ్మే అమ్మగా మారి! (ఫొటోలు)


హీరో సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్' మూవీ స్టిల్స్ (ఫొటోలు)


స్టన్నింగ్ లుక్స్‌తో మైమరిపిస్తున్న సప్తమి గౌడ (ఫోటోలు)
అంతర్జాతీయం

ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
న్యూఢిల్లీ, సాక్షి: లిబరేషన్ డే పేరిట.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ‘సుంకాల బాంబు’ పేల్చారు. ఈ క్రమంలోనే భారత్‌పై 26శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రకటించారు. దీంతో ట్రంప్ నిర్ణయంపై భారత్‌లో విశ్లేషణ మొదలైంది. అయితే ఇదేం మన దేశానికి ఎదురుదెబ్బ కాదంట!. ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల(reciprocal tariffs) ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. అయితే, ఇక్కడో మార్గం లేకపోలేదు. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే.. ఆ దేశంపై సుంకాల (Tariffs) తగ్గింపును ట్రంప్ ప్రభుత్వం పునఃపరిశీలించే నిబంధన కూడా ఉంది. కాబట్టి ఇది మిశ్రమ ఫలితమే అవుతుంది తప్ప.. భారత్‌కు ఎదురుదెబ్బ కాదు అని కేంద్ర వాణిజ్య శాఖలోని ఓ సీనియర్ అధికారి అంటున్నారు.ఎప్పటి నుంచి అమలు.. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు (అక్కడి కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో..) ట్రంప్ ప్రతీకార సుంకాలపై ప్రకటన చేశారు. తాను విధించిన టారిఫ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ అన్నారు. కానీ, 26 శాతం టారిఫ్‌లో.. 10 శాతం సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు అంటున్నాయి. మిగతా 16 శాతం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చెబుతోంది. లిబరేషన్ డే పేరిట ట్రంప్ చేసిన ప్రకటన సారాంశం.. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చు. అయితే కనీసం 10% సుంకం చెల్లించాల్సిందే. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం.. ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర విధిస్తున్నాం. భారత్ మా ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, మేం 26% సుంకం విధిస్తున్నాం. ఇదిలా ఉంటే.. ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన చేసే వేళ భారత ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు.ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనకు ముందు గతంలో భారతీయ దిగుమతులపై అమెరికా చాలా తక్కువ సుంకాలను విధిస్తూ వచ్చింది. విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై కేవలం 2.5% సుంకాలను, దిగుమతి చేసుకున్న మోటార్‌సైకిళ్లపై 2.4% సుంకాలను మాత్రమే విధించాయి. అయితే భారత్ మాత్రం అమెరికా వస్తువులపై 52% సుంకాలను వసూలు చేస్తోందన్నది ట్రంప్ వాదన.నీ క్రమంలోనే ఇప్పుడు 26 శాతం టారిఫ్‌ను ప్రకటించారు.

పుతిన్ మరో సంచలన నిర్ణయం.. 1.6 లక్షల మంది సైనికులు..
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ రష్యా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా తన సైనిక బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నంలో పడింది. మరో 1,60,000 మంది సైనికుల నియామకానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా పిలుపునిచ్చారు. జూలై నాటికి ఈ రిక్రూట్మెంట్ పూర్తి కానుంది.వివరాల ప్రకారం.. రష్యా సైనిక బలం పెంచే యోచనలో ఉన్నారు అధ్యక్షుడు పుతిన్. ఇందులో భాగంగానే 1,60,000 మంది సైనికుల నియామకానికి రంగం సిద్ధం చేశారు. 18–30 ఏళ్ల మధ్య వయసున్న పురుషులను సైన్యంలోకి తీసుకోనున్నారు. 2011 నుంచి ఇప్పటిదాకా రష్యా నిర్బంధ సైనిక రిక్రూట్మెంట్లలో ఇదే అతి పెద్దది. వచ్చే మూడేళ్లలో ఇది 1.8 లక్షలకు పెరగనుంది.ఇక, సైన్యం పరిమాణాన్ని 24 లక్షలకు, క్రియాశీల సైనికుల సంఖ్యను 15 లక్షలకు పెంచుకుంటామని పుతిన్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. కొత్త సైనికులను యుద్ధానికి పంపబోమని, ఈ నియామకాలకు ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేదని రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్యకు వారిని పంపబోమని వెల్లడించింది. Putin’s War Machine Expands: 160,000 More Drafted as Ceasefire Stalls! —largest conscription since war began. pic.twitter.com/AoTrzrzdCB— Kristin Sokoloff (@KSOKUNCENSORED) April 1, 2025

ట్రంప్ మార్క్ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పినట్టుగానే ప్రపంచ దేశాలకు షాకిచ్చారు. ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ప్రతీకార సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని చెబుతూనే భారత్ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదన్నారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్ అన్నారు. అయితే, పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించిన ట్రంప్.. రష్యా, ఉత్తర కొరియాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ రెండు దేశాలపై ఎలాంటి సుంకాలు విధించలేదు. ఏప్రిల్ 2వ తేదీని అమెరికా ‘విముక్తి దినం’గా ప్రకటించిన ట్రంప్ బుధవారం వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ..‘ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా వ్యాపారం ఈరోజు పునర్జన్మించినట్లు అయింది. అమెరికా మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండబోతుంది. సుంకాల పేరుతో అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు. ఇక అది జరగదు. మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం. అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది.🚨 It’s official. Donald Trump has signed 25% tariffs on our closest trade partners and allies. Friendly reminder that tariffs were a contributing factor for the Great Depression. pic.twitter.com/hlBNCcwyMu— CALL TO ACTIVISM (@CalltoActivism) April 2, 2025ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చింది. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయి. విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తాం. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయి. దీంతో అమెరికా స్వర్ణయుగమవుతుంది. దశాబ్దాలుగా వాణిజ్య అడ్డంకులను అమెరికా తొలగిస్తూ వచ్చింది. కానీ పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలను విధిస్తూ వచ్చాయి. పలు దేశాలు అన్యాయమైన నియమాలను అవలంభించాయి.US President Donald Trump announced 26% import duty on India… India 26%National interest first, friendship....#TrumpTariffs pic.twitter.com/ySlvRkIYzs— Equilibrium (@abatiyaashii) April 3, 2025అమెరికాలో దిగుమతి అవుతున్న మోటారు సైకిళ్లపై కేవలం 2.4 శాతమే పన్నులు విధిస్తున్నారు. అదే థాయిలాండ్, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్రవాహనాలపై 60 శాతం, భారత్ 70 శాతం, వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తున్నాయి. వాణిజ్య విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడు సైతం శత్రువు కంటే ప్రమాదకరం. అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి విధించనున్నాం. అమెరికాలో ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలపై ఎలాంటి పన్నులు వసూలు చేయం.అమెరికా ప్రతీకార సుంకాలు ఇలా..భారత్: 26 శాతంయూకే: 10 శాతంఆస్ట్రేలియా: 10 శాతంకొలంబియా: 10 శాతంచిలి: 10 శాతంబ్రెజిల్: 10 శాతంసింగపూర్: 10 శాతంటర్కీ: 10 శాతంఇజ్రాయెల్: 17 శాతంపిలిఫ్ఫీన్స్: 17 శాతంఈయూ: 20 శాతంమలేషియా: 24 శాతంజపాన్: 24 శాతం దక్షిణ కొరియా: 25 శాతంపాకిస్థాన్: 29 శాతం దక్షిణాఫ్రికా: 30 శాతంస్విట్జర్లాండ్: 31 శాతంఇండోనేషియా: 32 శాతంతైవాన్: 32 శాతంచైనా: 34 శాతంథాయిలాండ్: 36 శాతంబంగ్లాదేశ్ 37 శాతంశ్రీలంక: 44 శాతంకంబోడియా: 49 శాతంఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటోమొబైల్ కార్మికులను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్‌లుగా ట్రంప్ పేర్కొన్నారు.México , México ,México Aquí buscándolo en la lista de aranceles de Donald Trump pic.twitter.com/nouS1sMg7j— Carlos Suárez E (@Caloshhh) April 2, 2025

గాజాలో ఆకలి కేకలు: పిండీ లేదు.. తిండీ లేదు
రంజాన్ పండుగతో పాటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింల ఉపవాస దీక్షలు ముగిసినా గాజాలో మాత్రం పాలస్తీనియన్లకు నిత్య ఉపవాసాలే కొనసాగుతున్నాయి. తినడానికి ఏమీ లేక ఖాళీ జనం డొక్కలెండుతున్నాయి. గాజాకు మానవతా సాయాన్ని, ఆహార సరఫరాను ఇజ్రాయెల్ పూర్తిగా అడ్డుకోవడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఐరాసతో పాటు అంతర్జాతీయ సమాజం భారీ పరిమాణంలో పంపిన ఆహార నిల్వలన్నీ సరిహద్దుల వద్దే కుళ్లిపోతున్నాయి. గాజా ఏమో నిస్సహాయ స్థితిలో ఆకలితో యుద్ధం చేస్తోంది. రంజాన్ పండుగ సందర్భంగా కూడా కనీసం రొట్టెముక్కయినా దొరకని కుటుంబాలెన్నో...! ఇది చాలదన్నట్టు పిండి నిల్వలు కూడా పూర్తిగా నిండుకోవడంతో తాజాగా గాజాలో బేకరీలన్నీ మూతబడ్డాయి!!ఈద్. పవిత్ర రంజాన్ మాసానికి ముగింపు. సాధారణంగా అయితే గాజావాసులకూ వేడుకే. కుటుంబాలన్నీ కలిసి ఆనందంగా పండుగ జరుపుకొంటాయి. కానీ గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అక్కడ ఈద్ పాలస్తీనావాసుల ఆకలి కేకలు, ఇజ్రాయిల్ బాంబు దాడుల నడుమే ముగిసింది. యుద్ధం దెబ్బకు గాజా ఆహారోత్పత్తి సామర్థ్యం పూర్తిగా పడకేసింది. దాంతో తిండికి కూడా అంతర్జాతీయ సాయంపైనే ఆధారపడుతోంది. ఇజ్రాయెల్ మాత్రం తమ బందీల విడుదల కోసం హమాస్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా మార్చి నుంచే గాజాకు ఆహారం, మానవతా సాయం సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. దాంతో సహాయక ట్రక్కులు గాజాలో అడుగు పెట్టి మూడు వారాలు దాటింది. 18 నెలల క్రితం యుద్ధం మొదలైనప్పటి నుంచీ గాజాకు ఇంతకాలం పాటు ఎలాంటి ఆహార సరఫరాలూ అందకపోవడం ఇదే తొలిసారి. దాంతో ఇంధనం తదితరాల కొరత తారస్థాయికి చేరింది. అంతేకాదు, కనీసం పిండి నిల్వలు కూడా లేని పరిస్థితి! దాంతో బుధవారం గాజాలోని బేకరీలన్నీ మూతబడ్డాయి. స్థానిక బేకరీ యజమానుల సంఘం చీఫ్ అబ్దెల్ నాసర్ అల్–అజ్రామి ఈ మేరకు ప్రకటించారు. ‘‘గిడ్డంగుల్లో పిండి పూర్తిగా అయిపోయినట్టు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) మాకు తెలిపింది. ఇజ్రాయిల్ రఫా క్రాసింగ్ తదితరాలను తెరిచి సహాయక సామగ్రి, మానవతా సాయాలను తిరిగి గాజాలోకి అనుమతించేదాకా బేకరీలు పనిచేయబోవు’’అని వెల్లడించారు. అబద్ధాలతో నిద్రపుచ్చుతూ... పాలస్తీనియన్ల ఆకలిని తీరుస్తున్న ప్రధాన వనరు రొట్టె మాత్రమే. చికెన్, మాంసం, కూరగాయలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. అందుబాటులో ఉన్న ఇతర ఆహార పదార్థాలను రొట్టెను తింటూ రోజులు వెళ్లదీస్తున్నారు. ‘‘పరిస్థితి వివరించలేనంత దారుణంగా ఉంది. నా కుటుంబసభ్యులకు బ్రెడ్ కోసం ఉదయం 8 గంటల నుంచీ వెతుకుతున్నాను. డెయిర్ అల్–బలాహ్లోని అన్ని బేకరీల చుట్టూ తిరిగా. ఒక్కటి కూడా పనిచేయడం లేదు. పిండి లేదు. కట్టె లేదు. ఏమీ లేవు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు. ఇంత దారుణం చూస్తామని ఎన్నడూ అనుకోలేదు’’అని ఇబ్రహీం అల్ కుర్ద్ అనే స్థానికుడు వాపోయాడు. ‘‘పిల్లలు రాత్రి భోజనం చేయకుండానే పడుకుంటున్నారు. ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టండి, ఉదయాన్నే పిండి తెచ్చుకుందామని వారికి అబద్ధాలు చెబుతూ నిద్రపుచ్చుతున్నాం’’అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. రఫా తదితర క్రాసింగ్లను తిరిగి తెరిచేలా ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని ఆయన వేడుకుంటున్నాడు. చుక్కల్లో పిండి ధరలు... రొట్టెతో పాటు గాజావాసులకు వంట కోసం గ్యాస్‌ను కూడా బేకరీలే అందించేవి. అవి మూతబడటంతో తిండి వండుకోవడానికి కలపనే ఆశ్రయిస్తున్నారు. కానీ దానికీ తీవ్ర కొరతే ఉంది. కలపను బ్లాక్ మార్కెట్లో అడ్డగోలు ధరలకు అమ్ముతున్నారు. దాంతో అదీ జనానికి అందుబాటులో లేకుండా పోయింది. నూనె, ఈస్ట్ వంటి బేకింగ్ పదార్థాలు కూడా కొనలేని పరిస్థితి! బేకరీలు మూతబడటంతో పిండి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ఒక్క సంచీ ఏకంగా 400 షెకెల్స్ (115 డాలర్ల)కు అమ్ముతున్నారు. యుద్ధానికి ముందు 25 షెకెల్స్ ఉండేది. గత జనవరిలో స్వల్పకాలిక కాల్పుల విరమణ సందర్భంగా కూడా 35 షెకెల్స్కు దొరికేది. ‘‘ప్రజలు ఇప్పుడు యుద్ధ భయాన్ని, బాంబు దాడులను, వలస కష్టాలను, అన్నింటినీ మర్చిపోయారు. వారి ఆలోచనలన్నీ ఏ పూటకు ఆ పూట పిండి ఎలా దొరుకుతుందా అన్నదాని మీదే ఉన్నాయి’’అని ఉత్తర గాజాకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అహ్మద్ డ్రెమ్లీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘యుద్ధం మొదలైనప్పుడు ప్రజలు ఆరోగ్యంగా, దేన్నయినా తట్టుకునే సామర్థ్యంతో ఉన్నారు. ఇప్పుడంతా మారిపోయింది. రొట్టెకు కూడా దిక్కు లేదు! దాంతో జనం ఏది దొరికినా తిని కడుపు నింపుకుంటున్నారు. కానీ కొద్ది రోజులుగా చాలామందికి తినేందుకు ఏమీ దొరకడం లేదు. బియ్యం కొనడానికి అప్పు చేస్తున్నారు. ఇంట్లో ఉన్నవన్నీ అమ్ముకుంటున్నారు. చాలామంది పాలస్తీనియన్లు రద్దీగా ఉన్న గుడారాల్లో బతుకీడుస్తున్నారు. కొందరైతే వీధుల్లోనే నిద్రపోతున్నారు. తిండి వండుకునే పరిస్థితులు కూడా లేవు’’అంటూ గాజాలోని దైన్యాన్ని ఆయన వివరించారు. దారుణ సంక్షోభం: ఐరాస ‘‘కాల్పుల విరమణ సమయంలో గాజాలోకి రోజుకు 500 నుంచి 600 ట్రక్కుల్లో సహాయక సామగ్రి వచ్చేది. ఇప్పుడన్నీ ఆగిపోయాయి. కాల్పుల విరమణ ముగిసి యుద్ధం తిరిగి మొదలైనప్పటినుంచీ ఘోరమైన మానవతా సంక్షోభం నెలకొంది. మార్చి 2 నుంచి గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా ఆపేసింది. ముఖ్యంగా బేకరీల మూతతో ఆహారం కోసం కేవలం వాటిపైనే ఆధారపడ్డ లక్షలాది మంది అల్లాడుతున్నారు. దిగ్బంధాన్ని తక్షణం ఎత్తేయకపోతే గాజాలో త్వరలోనే మరణమృదంగం తప్పదు’’అని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారి హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

సీఎంకు సంయమనం పాటించడం తెలియదా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ముఖ్యమంత్రికి సంయమనం పాటించడం తెలియదా? ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను ఎగతాళి చేసినట్లే ఉన్నాయి..గతంలో హెచ్చరించినా ఆయనలో మార్పు రాలేదు..’అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీతో కూడిన ధర్మాసనం వరుసగా రెండోరోజు ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఆయనపై తాము గతంలో చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించింది.గురువారం సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ సందర్భంగా.. ‘ఉప ఎన్నికలు రావు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’అంటూ సీఎం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యను బీఆర్ఎస్ తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం గురువారం మరోసారి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన పత్రికా కథనాలను న్యాయమూర్తులకు చూపించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందించింది. గతంలో చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా? ‘గతంలో ఇలాంటి అనుభవం ఉన్నందున కొంత సంయమనం పాటించాలనే విషయం ముఖ్యమంత్రికి తెలియదా? 2024 ఆగస్టులో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కవితకు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. వాటిపై అప్పుడు క్షమాపణలు చెప్పారు. కానీ ఆ సమయంలో మేము సీఎంపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా? అని ఇప్పుడు అనిపిస్తోంది. సీఎం కనీస స్వీయ నియంత్రణ పాటించలేరా?..’అని ధర్మాసనం ప్రశ్నించింది.‘గతంలో ఇలాంటి ఘటనను ఎదుర్కొన్న వ్యక్తి ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా? సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుంది..’అని జస్టిస్ గవా యి హెచ్చరించారు. ‘సీఎం అటువంటి వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అడ్డుకున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విషయం, పైగా స్పీకర్ సమక్షంలో ఇలా వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదు అని వారించినా ముఖ్యమంత్రి పట్టించుకోకుండా మాట్లాడారు..’అని ఆర్యమా సుందరం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ రెండు వ్యవస్థలు సంయమనం పాటించాలి ‘న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య పరస్పర సంయమనం అవసరం. దేశ సర్వోన్నత న్యాయస్థానం అన్ని విషయాల్లో సంయమనం పాటిస్తుంది. అదే సంయమనాన్ని శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల నుంచి మేం ఆశిస్తున్నాం..’అని ధర్మాసనం పేర్కొంది. అసెంబ్లీలో విపక్షం నుంచి అంతకంటే ఎక్కువగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని స్పీకర్ తరఫు న్యాయవాది అభిõÙక్ మనుసింఘ్వీ చెప్పారు. అయితే అవన్నీ ఇప్పుడు అప్రస్తుతమని జస్టిస్ గవాయి బదులిచ్చారు. శాసనసభలో ముఖ్యమంత్రి ఫిరాయింపులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలను (ట్రాన్స్క్రిప్్ట, టేప్స్) యథాతథంగా తమకు అందజేయాలని సింఘ్వీని జస్టిస్ గవాయి ఆదేశించారు.

చైనా అధీనంలో 4 వేల చ.కి.మీ. భూభాగం
న్యూఢిల్లీ: నాలుగు వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. మరోవైపు మనం భారత్– చైనా దౌత్య సంబంధాల వజ్రోత్సవాలను జరుపుకొంటున్నామని ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీ గురువారం లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా కొత్త టారిఫ్‌లు భారత ఆర్థికవ్యవస్థ నడ్డి విరుస్తాయని పేర్కొన్నారు. చైనా దురాక్రమణ, అమెరికా టారిఫ్‌లపై కేంద్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘చైనా ఒకవైపు 4,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది. మరోవైపు కొద్దికాలం కిందట మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చైనా రాయబారితో కలిపి కేక్ కట్ చేశారు. ఇది చూసి నేను నివ్వెరపోయా. చైనా ఆక్రమించిన నాలుగు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం సంగతేమిటి? అక్కడ ఏం జరుగుతోంది?’ అని రాహుల్ నిలదీశారు. గాల్వాన్ లోయలో ఘర్షణలను ఉటంకిస్తూ 20 మంది భారత జవాన్లు అమరులయ్యారని గుర్తుచేశారు. ‘ఒకవైపు వీరి త్యాగం.. మరోవైపు కేక్ కట్ చేసి (చైనా రాయబారితో కలిసి) సంబరాలు జరుపుకుంటున్నాం. ఏమిటిది? చైనా తో సరిహద్దుల్లో సాధా రణ పరిస్థితులు నెలకొ నడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ దానికి మునుపు యథా తథస్థితిని పునరుద్ధరించాలి’ అని రాహుల్ గాంధీ పేర్కొ న్నారు. ‘మొదట మన భూభాగాన్ని తిరిగిపొందాలి. ఆక్రమిత భూభాగానికి సంబంధించి రాష్ట్ర పతి, ప్రధానమంత్రులు చైనాకు లేఖలు రాశారని నా దృష్టికి వచ్చింది. ఈ విషయం మనవాళ్ల ద్వారా తెలియలేదు. భారత్‌లోని చైనా రాయబారి లేఖల విషయాన్ని చెప్పారు’ అని రాహుల్ అన్నారు. సమర్థ విదేశీ విధానం అంటే విదేశాలతో సమాన స్థాయిలో సంబంధ బాంధవ్యాలను నెరపడం. ఒకవైపు చైనా మన 4 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. మరోవైపు అమెరికా అకస్మాత్తుగా భారత్‌పై టారిఫ్‌లు విధించింది అని కాంగ్రెస్ నేత పేర్కొ న్నారు. అమెరికా టారిఫ్‌లు భారత్‌కు శరాఘా తమని అభిప్రాయపడ్డారు. మన ఆటోమొబైల్ రంగం, ఫార్మా పరిశ్రమ, వ్యవసాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు.

వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది. దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే.సదుద్దేశమే: రిజిజు న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై గురువారం అర్ధరాత్రి దాకా జరిగిన వాడివేడి చర్చ పెద్దల సభను వేడెక్కించింది. ఉమీద్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్మెంట్)గా పేరు మార్చిన వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు నిరసనగా పలువురు విపక్ష సభ్యులు నల్లదుస్తులు ధరించి సభకు వచ్చారు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడ్డారు. ముస్లింల భూములను లాక్కోవడమే మోదీ సర్కారు అసలు లక్ష్యమని ఆరోపించారు. విపక్షాల వాదనను రిజిజు ఖండించారు. వాటి అభ్యంతరాలను తోసిపుచ్చారు. ‘‘ముస్లింల హక్కులను ఎవరూ లాక్కోబోవడం లేదు. ఈ విషయమై విపక్షాలు చేస్తున్నదంతా దు్రష్పచారమే’’ అని పేర్కొన్నారు. ‘‘2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు ఏకంగా 8.72 లక్షలకు పెరిగాయి. తద్వారా దేశంలో వక్ఫ్ అతి పెద్ద ప్రైవేటు భూ యజమానిగా అవతరించింది’’ అని వివరించారు. ‘‘వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తేవడం, వాటి ఆస్తులను మరింత సమర్థంగా నిర్వహించడం, ముస్లిం మహిళలకు సాధికారత కల్పించడం, ముస్లింలలోని అన్ని తెగల హక్కులనూ పరిరక్షించడమే బిల్లు లక్ష్యం. అంతే తప్ప మతంతో ఈ బిల్లుకు ఎలాంటి సంబంధమూ లేదు’’ అని పునరుద్ఘాటించారు. ‘‘అందుకే సున్నీలు, షియాలతో పాటు ముస్లింలలోని ఇతర వెనకబడ్డ వర్గాల వారు కూడా వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ఉంటారు. తద్వారా వారి ప్రయోజనాలకూ న్యాయం జరుగుతుంది. ఇందుకు ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు’’ అన్నారు. ‘‘కేంద్ర వక్ఫ్ మండలి సభ్యుల్లో అధిక సంఖ్యాకులు ముస్లిమేతరులే ఉంటారనడం అవాస్తవం. 22 మందిలో వారి సంఖ్య 4కు మించబోదు. వక్ఫ్ బోర్డులు చట్టపరమైన సంస్థలు. అంతే తప్ప కేవలం ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలు కాదు. వక్ఫ్ ట్రిబ్యునళ్ల ముందు 31,999 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వివాదాస్పద వక్ఫ్ భూముల్లో ఇప్పటికే కోర్టుల్లో పరిష్కారమైన వాటి జోలికి పోబోం. పసలేని ఆరోపణలు మాని బిల్లును ఆమోదించడంలో విపక్షాలు కూడా కలసి రావాలి’’ అని కోరారు. దురుద్దేశాలు: విపక్షాలు వక్ఫ్ (సవరణ) బిల్లు వెనక మోదీ సర్కారు దురుద్దేశాలు దాగున్నాయని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా ఆరోపించారు. మోదీ ప్రభుత్వాన్ని ముస్లింలు విశ్వసించడం లేదని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు రామ్‌గోపాల్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం అన్ని మతాలనూ సమానంగా చూడాలన్నారు. బిల్లులో పలు అంశాలు పైకి బాగానే ఉన్నా దీని వెనక మోదీ సర్కారు ఉద్దేశమే అనుమానాలకు తావిస్తోందని బీఆర్ఎస్ సభ్యుడు కె.ఆర్.సురేశ్‌రెడ్డి అన్నారు. బిల్లులోని 75 శాతం అంశాలను బిల్లుతో నిమిత్తం లేకుండానే అమలు చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుచ్చి శివ (డీఎంకే), వై.వి.సుబ్బారెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్ట), అభిõÙక్ మను సింఘ్వీ, సయీద్ సనీర్ హుసేన్ (కాంగ్రెస్), సుష్మితా దేవి (టీఎంసీ), సంజయ్ రౌత్ (శివసేన–యూబీటీ), సంజయ్‌సింగ్ (ఆప్), ముజీబుల్లా ఖాన్ (బీజేడీ), జాన్ బ్రిటాస్ (సీపీఎం), పి.పి.సునీర్ (సీపీఐ), హరీస్ బీరన్ (ఐయూఎంఎల్), వైగో (ఎండీఎంకే) తదితర సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ (జేడీఎస్) బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. వక్ఫ్‌కు ముస్లిమేతరులూ విరాళాలు ఇవ్వొచ్చు: సిబల్ ముస్లిమేతరులకు కూడా వక్ఫ్ విరాళాలిచ్చే హక్కుందని స్వతంత్ర సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. ‘‘నా ఆస్తిని ఫలానా వారికి ఇవ్వొద్దని చట్టం చేయడానికి మీరెవరు? హిందువులు వక్ఫ్ విరాళాలు ఇవ్వడమే కాదు, స్వాతంత్య్రానికి ముందే వక్ఫ్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. దీన్ని పలు హైకోర్టులూ సమరి్థంచాయి’’ అని చెప్పారు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో హిందూ మత సంస్థలకు 10 లక్షల ఎకరాలకు పైగా భూములున్నాయని ఆయన అన్నారు. ‘‘హిందూ మతంలో స్వార్జిత ఆస్తిని కుమారులకు మాత్రమే ఇవ్వగలరు. దాన్ని కూతుళ్లకూ ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ చట్టాన్ని మార్చండి’’ అని సూచించారు. చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ జోక్యం చేసుకుంటూ కూతుళ్లతో పాటు ఎవరికైనా ఇచ్చేందుకు మన చట్టాలు వీలు కల్పిస్తున్నాయని చెప్పారు. అయోమయం సృష్టిస్తున్నారు: రిజిజు సిబల్ తీరును మంత్రి రిజిజు తీవ్రంగా దుయ్యబట్టారు. హిందూ మత సంస్థలకు చెందిన భూమిని వక్ఫ్ భూములతో పోల్చడాన్ని ఖండించారు. ‘‘పలువురు సీనియర్ సభ్యులు ఏ అంశం పడితే అది లేవనెత్తడం ద్వారా అయోమయం సృష్టిస్తున్నారు. కానీ వాటిపై వివరణలు వినే దాకా కూడా సభలో ఉండటం లేదు’’ అంటూ అసహనం వెలిబుచ్చారు. కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే: ఖర్గే వక్ఫ్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దానిపై చర్చలో ఆయన పాల్గొన్నారు. బిల్లు ముసుగులో సమాజంలో విభజన బీజాలు నాటేందుకు, ముస్లింలను వేధించేందుకు, వారి భూమిని లాక్కొని కార్పొరేట్ మిత్రులకు పంచేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ‘‘ఈ బిల్లు ఆమోదం పొందితే ముస్లింల ఆస్తులను లాగేసుకుంటారు. వారి ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటాయి’’ అని ఆరోపించారు. అస్మదీయులను వక్ఫ్ బోర్డుల్లోకి చొప్పించేందుకు వీలుగా సవరణలు చేశారంటూ బిల్లులోని పలు అంశాలపై తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చారు. ‘‘గత 11 ఏళ్లలో ముస్లింల సంక్షేమానికి కేటాయించిన రూ.18,274 కోట్ల నిధులనే పూర్తిగా వెచ్చించని చెత్త రికార్డు మోదీ సర్కారుది. అలాంటివాళ్లు పస్మాంద వంటి పేద ముస్లింల సంక్షేమంపై మొసలి కన్నీరు కారుస్తున్నారు’’ అంటూ తూర్పారబట్టారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉండాలన్న ప్రతిపాదనను ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం, రామమందిర్ ట్రస్ట్ వంటివాటిల్లో ఒక్కరైనా ముస్లిం ఉన్నారా అని ప్రశ్నించారు. ఆలయ ట్రస్టుల్లో కనీసం దళితులకు కూడా స్థానం కల్పించడం లేదని ఆక్షేపించారు. ‘‘‘దేశంలో శాంతి, సామరస్యాలను దెబ్బ తీయకండి. ప్రతిష్టకు పోకుండా ఈ తప్పులతడక బిల్లును తక్షణం వెనక్కు తీసుకోండి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పాపమే: నడ్డా కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో ముస్లిం మహిళల అభ్యున్నతికి చేసిందేమీ లేదని రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా ఆక్షేపించారు. వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చిన పాపం ఆ పారీ్టదేనంటూ దుయ్యబట్టారు. ‘‘ముస్లిం మహిళలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడంతో కోట్లాది మంది ముస్లిం మహిళలు గౌరవంగా జీవిస్తున్నారు. వక్ఫ్ బిల్లు జాతి ప్రయోజనాల కోసం ఉద్దేశించింది. వక్ఫ్ ఆస్తులు తీవ్రంగా దురి్వనియోగమవుతున్నాయి. దానికి పూర్తిగా అడ్డుకట్ట వేసి వక్ఫ్ వ్యవహారాల్లో జవాబుదారీతనం తేవడమే బిల్లు లక్ష్యం. వక్ఫ్ బిల్లులో సవరణలు సూచించేందుకు ఏకంగా 31 మంది సభ్యులతో జేపీసీ వేశాం. యూపీఏ హయాంలో కేవలం 13 మందితో జేపీసీ వేసి మమ అనిపించారు’’ అని నడ్డా ఆరోపించారు. ‘‘వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చి ప్రజా సంక్షేమానికి, అభివృద్ధి కార్యకలాపాలకు ఉపయోగించేందుకు వీలుగా సౌదీ అరేబియా, తుర్కియే వంటి ముస్లిం దేశాలు కూడా పలు చట్టాలు చేశాయి. వక్ఫ్ ఆస్తులను డిజిటైజ్ కూడా చేస్తున్నాయి. అదే పని భారత్‌లో చేస్తుంటే అభ్యంతరమెందుకు?’’ అని విపక్షాలను ప్రశ్నించారు.

లాస్ట్ మినిట్‌లో వక్ఫ్ బిల్లుపై బీజేడీ యూటర్న్..
ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు గురువారం రాజ్యసభ్యలో చర్చకు వచ్చిన సందర్భంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. తొలుత వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ అదే రాజ్యసభలో ముందురోజు(బుధవారం) చెప్పిన ‘ద బిజు జనతాదళ్(బీజేడీ).. గురువారం నాటికి వచ్చేసరికి యూటర్న్ తీసుకుంది. ఆ బిల్లుకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థులు ఎలాగైనా ఓటేసుకోవచ్చని స్పష్టం చేసింది. వారి( బీజేడీ ఎంపీలు) మనస్సాక్షి ప్రకారం ఓటేసుకోవచ్చంటూ యూ టర్న్ తీసుకుంది. ఇక్కడ తమ ఎంపీలు ఎలా ఓటేసినా అంటే అనుకూలంగా ఓటేసినా ఎటువంటి విప్ జారీ చేయబోమని తేల్చి చెప్పింది. తాము మైనార్టీ వర్గాల సెంటిమెంట్స్ ను గౌరవిస్తామన్న రోజు వ్యవధిలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం హైడ్రామాకు తెరలేపింది.బీజేడీ తొలుత చెప్పింది ఇదే..‘‘ మేము మైనార్టీల సెంటిమెంట్స్ ను పరిగణలోకి తీసుకుంటాం. మా సభ్యులంతా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారు. మాకు లోక్ సభలో ఎంపీలు లేరు.. మాకు రాజ్యసభలో ఉన్న ఏడుగురు సభ్యులు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటేస్తారు’’ అని పేర్కొంది.మరి మళ్లీ బీజేడీకి ఏమైంది?అయితే రాజ్యసభలో ముందు చెప్పిన మాటకు బీజేడీ కట్టుబడలేదు. తమ ఎంపీలు ఇష్టప్రకారమే ఓటేయొచ్చని తెలిపింది. ‘‘వారు ఫ్రీగా ఓటేసుకోవచ్చు. అనుకూలంగా ఓటేసినా, వ్యతిరేకంగా ఓటేసినా తాము వారికి ఎటువంటి విప్ జారీ చేయం’’ అని తెలిపింది. బీజేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలతోనే ఆ పార్టీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్ఆర్ఐ

అమెరికాలో గుడివాడ యువకుడి బలవన్మరణం
హైదరాబాద్, సాక్షి: అమెరికాలో ఆంక్షలు ఓ భారతీయుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేశాయి. ఉద్యోగం పొగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చివరకు ఓ తెలుగు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి.. అంత్యక్రియల విరాళాలు చేపట్టిన సోదరుడి పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అభిషేక్ కొల్లి(Abhishek Kolli) స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ దొండపాడు. పదేళ్ల కిందట అభిషేక్ సోదరుడు అరవింద్‌తో కలిసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. ఏడాది కిందట వివాహం జరగ్గా భార్యతో పాటు అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో ఉంటున్నాడు. అయితే ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అవి తాళలేక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అభిషేక్ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన అతని భార్య.. చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్లకు సమాచారం అందించింది. వాళ్లంతా చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు, వలంటీర్లు అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల అంతా గాలించారు. అయితే చివరకు మరణాన్ని సోదరుడు అరవింద్ ఆదివారం ధృవీకరించారు. మృతదేహాన్ని సొంత ప్రాంతానికి తరలించడానికి దాతలు సాయానికి ముందుకు రావాలని గోఫండ్‌మీ ద్వారా ఆయన ప్రయత్నిస్తున్నారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని నాట్స్ టీం దర్శించుకుంది. ఆ తిరుమలేశుడి హుండీలో నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను సమర్పించి ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంది. తెలుగు వారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆ శుభకార్య ఆహ్వాన పత్రికను ఆ తిరుమలేశునికి సమర్పించడం ఓ సంప్రదాయంలా వస్తుంది. అమెరికాలో ప్రతి రెండేళ్లకు జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ శుభకార్యంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలను నాట్స్ టీం దర్శించుకుని ఆహ్వాన పత్రికను వేంకటేశ్వరునికి సమర్పించింది. జులై4,5,6 తేదీల్లో టంపా వేదికగా అమెరికా తెలుగు సంబరాలను జరగనున్నాయి. ఇందులో మన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడుకి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి పాల్గొన్నారు.అమెరికా తెలుగు సంబరాలకు రండి తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానంఅమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరుతూ నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించింది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాట్స్ బృందం కలిసింది. అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరింది. తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.ముఖ్యమంత్రులను కలిసిన నాట్స్ బృందంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, తదితరులు పాల్గొన్నారు.

ఏయూ హాస్టల్‌కి నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత మంచాలు
ఆంధ్ర యూనివర్సీటీలో విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో, ఆంధ్ర యూనివర్సీటీ పూర్వ విద్యార్థి తాళ్లూరి పూర్ణ చంద్రరావుల ఆర్ధిక సహకారంతో మంచాలను విరాళంగా ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సీటీలో కొత్తగా నిర్మించిన విశ్వేశ్వరయ్య వసతి గృహానికి కూడా ఆర్థిక చేయూతను అందించారు. మరిన్ని NRI వార్తలకోం ఇక్కడ క్లిక్ చేయండి!విద్యార్ధులకు నిద్రకు ఇబ్బంది లేకుండా అల్యూమినియంతో తయారుచేసిన 432 మంచాలను తయారు చేయించి ఏయూ హాస్టల్‌కి బహుకరించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ బోర్డు మాజీ ఈసీ సభ్యులు, శ్రీనివాస్ బొల్లు, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ బోర్డ్ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ అరసడ,నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, గ్లో సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

నాట్స్ తెలుగు సంబరాలు సినీ ప్రముఖులకు ఆహ్వానం
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ బృందం పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించింది. హైదరాబాద్‌లో తొలుత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావును కలిసి నాట్స్ 8 వ అమెరికా తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.నాట్స్ సంబరాలకు ముఖ్య అతిధిగా రాఘవేంద్రరావును కోరింది. ఆ తర్వాత వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్‌ను కలిసి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ని కూడా నాట్స్ బృందం కలిసి సంబరాలకు ఆహ్వానించింది. జూలై 4, 5, 6 తేదీల్లో టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని కోరింది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు థమన్‌ను కూడా నాట్స్ బృందం కలిసింది. నాట్స్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా థమన్ కూడా గుర్తు చేసుకున్నారు. అమెరికా తెలుగు సంబరాలకు థమన్ తప్పనిసరిగా రావాలని నాట్స్ ఆహ్వానించింది.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!సినీ దర్శకులు హరీశ్ శంకర్, మోహర్ రమేశ్‌లను కూడా కలిసి నాట్స్ ఆహ్వాన పత్రికలు అందించింది. సినీ ప్రముఖుల ఆహ్వానాలు అందించే కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమీటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

బాలికపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: అభం..శుభం తెలియని 12 ఏళ్ల బాలికను చెరబట్టాడు టీడీపీకి చెందిన ఓ కామాంధుడు. అలాంటి వాడిని శిక్షించాల్సిన కుటుంబ సభ్యులు వెనకేసుకొచ్చారు. ఏదో చిన్న తప్పు జరిగిపోయింది..ఇక్కడితో వదిలేద్దామని బాధిత బాలిక తండ్రిని బెదిరించి బలవంతంగా ఒప్పించారు. ఆ బాలిక శీలానికి విలువ కట్టారు. రూ. లక్ష అపరాధంగా చెల్లించేందుకు నిర్ధారిస్తూ ..అడ్వాన్స్ గా రూ. 20వేలు చెల్లించారు. ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది ఎక్కడో కాదు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే. వివరాల్లోకి వెళితే.. 10 మంది సంతానమున్న ఓ తండ్రి పొట్టకూటి కోసం కుటుంబాన్ని తీసుకుని సమీపంలోని వేరే గ్రామానికి వచ్చాడు. అక్కడ ఓ రైతు దగ్గర వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా పిల్లలు గొర్రెలు, ఆవులు మేపుతున్నారు. వారిలో పన్నెండేళ్ల బాలిక బుధవారం (ఏప్రిల్ 2) అడవిలోకి వెళ్లింది. ఆమెను గిడ్డెగానిపెంట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆర్ రమేశ్ అనుసరించాడు. నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధ భరించలేని ఆ బాలిక కేకలు వేస్తూ పరుగులు తీసింది. గమనించిన ఓ వ్యక్తి బాధితురాలని ఏమైందని ప్రశ్నించగా జరిగిన ఘోరాన్ని తెలియజేసింది. ఆ వ్యక్తి రమేశ్‌ను మందలించి పిడిగుద్దులు కురిపించాడు.రూ. లక్షకు ఒప్పందం..రూ. 20వేల అడ్వాన్స్ నిందితుడి కుటుంబ సభ్యులు ఈ విషయం బయటికి పొక్కకుండా పెద్దల సమక్షంలో బుధవారం రాత్రి బాలిక తండ్రితో బలవంతంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ. లక్ష ఇస్తామని, ఎవరితోనూ చెప్పవద్దంటూ అడ్వాన్స్‌గా రూ. 20వేలు ముట్టజెప్పారు. అయితే ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో వారు విచారణ చేపట్టి రమేశ్ లైంగిక దాడికి పాల్పడినట్టు నిర్ధారించారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులను కుప్పం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు. ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడు రమేశ్ పరారయ్యాడు. కాగా ఫేస్బుక్ ఖాతాలో టీడీపీ నాయకులతో దిగిన ఫొటోలు, బ్యానర్లను రాత్రికి రాత్రే తొలగించాడు.

100 కోట్లతో ఉడాయించిన చిట్టీల పుల్లయ్య అరెస్ట్
హైదరాబాద్ : చిట్టీలు, అధిక వడ్డీల ఆశ చూపి ప్రజలను నిలువునా మోసం చేసిన పుల్లయ్య ఆస్తులను సీసీఎస్ పోలీసులు సీజ్ చేశారు. సనత్‌నగర్ బీకేగూడ దాసారం బస్తీ రవీంద్రనగర్ సమీపంలో ఉండే పుల్లయ్య చిట్టీలు, వడ్డీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి..వందల మందిని మోసం చేసిన విషయం విదితమే. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు ఇటీవల బెంగుళూరులో పుల్లయ్యను అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. విచారణలో భాగంగా బుధవారం సాయంత్రం సీసీఎస్ పోలీసులు బీకేగూడలోని నివాసానికి పుల్లయ్యను తీసుకువచ్చారు. ఏసీపీ మల్లికార్జున చౌదరి ఆధ్వర్యంలో పుల్లయ్య తోపాటు అతని ఇద్దరు కుమారులను మూడు గంటల పాటు విచారించి ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నారు. ఐదు అంతస్తుల ఇంటితో పాటు ఫార్చూనర్ కారు, ఇతర సామాగ్రిని సీజ్ చేసి తరలించారు. కాగా ఇంటిపై రూ.60 లక్షల బ్యాంకు లోను ఉన్నట్లు తెలిపారు. కాగా పుల్లయ్యను ఇంటికి తీసుకువచ్చారన్న సమాచారంతో బాధితులు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకుని ఆందోళకు దిగారు. మహిళా బాధితులు కొందరు ఆగ్రహంతో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పుల్లయ్యతో మాట్లాడించాలని వారు పోలీసులతో వాగి్వవాదానికి దిగారు. తిరిగి పుల్లయ్యను సీసీఎస్‌కు తరలించే క్రమంలో పోలీసు వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డు తగిలారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కారు వెంట పరుగెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దశలో పోలీసులు అప్రమత్తమై జనాలను అడ్డుకున్నారు.

హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. పోస్టల్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం టాస్క్‌ఫోర్స్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించి∙వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న ఓ మహిళ, నలుగురు విటులను అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం..హనుమకొండ జిల్లా వేలేరు మండలం శోడషపల్లి గ్రామానికి చెందిన తిమ్మాపురం లలిత సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పోస్టల్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చి రహస్యంగా సంవత్సర కాలంగా వ్యభిచారం నిర్వహిస్తోంది. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలు లలితతోపాటు విటులు జనగామకు చెందిన బంతిని అశోక్, బుక్క కరుణాకర్, ఘన్పూర్ మండలం మీదికొండకు చెందిన వడ్లకొండ రమేశ్, కాజీపేట విష్ణుపురికి చెందిన బొల్లి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి బాధిత మహిళలను కాపాడినట్లు తెలిపా రు. వీరి నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ.2,450 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ కోసం నిందితులను సుబేదారి పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ తెలిపారు.

భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్మేట్ శివతో వివాహేతర సంబంధం
సంగారెడ్డి జోన్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లలను ఊపిరి ఆడకుండా చేసి అతి కిరాతకంగా తల్లే హత్య చేసిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమీన్పూర్ మండలం బీరంగూడ గ్రామం రాఘవేంద్రనగర్‌లో ఇటీవల జరిగిన ముగ్గురు పిల్లల మృతి ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. పిల్లల తల్లి రజిత ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా.. ఆరు నెలల క్రితం పదో తరగతి పూర్వ విద్యార్థులు అంతా కలసి పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ పార్టీ సందర్భంగా తన క్లాస్ మేట్ అయిన శివతో రజిత స్నేహం ఏర్పరుచుకుంది.రోజూ చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడేవారు. అంతే కాకుండా పలు మార్లు రహస్యంగా కలుసుకున్నారు. కాగా, రజిత భర్త చెన్నయ్య.. ఆమె కంటే వయసులో ఇరవై సంవత్సరాలు పెద్దవాడు కావడంతో మొదటి నుంచీ ఆమెకు చెన్నయ్య అంటే ఇష్టం ఉండేది కాదు. తరచూ గొడవలు పడేవారు. ఈ క్రమంలో తన పదోతరగతి క్లాస్మేట్ శివను కలసుకోవడం, అతనికి పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతడిని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని భావించింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోమని రజిత, శివను అడగ్గా.. పిల్లలు లేకుండా ఒంటరిగా తనతో వస్తా అంటే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. దీంతో శివను పెళ్లి చేసుకోవాలంటే పిల్లలను అడ్డు తొలగించుకోవాల్సిందేనని రజిత నిర్ణయించుకుంది. మార్చి 28న సాయంత్రం ఆరు గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పగా, త్వరగా ఆ పని పూర్తి చేయమని చెప్పాడు. అదే రోజు రాత్రి భర్త భోజ నం చేసి 10 గంటలకు ట్యాంకర్ తీసుకొని చందానగర్ వెళ్లగా, ఇదే అదనుగా భావించి మొదట పెద్ద కొడుకు సాయికృష్ణ (12)ను, తర్వాత కూతురు మధుప్రియ (10)ను, ఆ తర్వాత చిన్న కొడుకు గౌతమ్ (8)ను.. ఇలా ముగ్గురిని ఒకరి తరువాత ఒకరిని ముక్కు, మూతిపై టవల్ వేసి, చేతితో గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి చంపింది. పిల్లలను అడ్డు తొలగించుకోవాలని రజితను శివ ప్రోత్సహించగా ఆమె కిరాతకంగా వారిని చంపివేసిందని ఎస్పీ వెల్లడించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశామన్నారు. ఈ సమావేశంలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, అమీన్పూర్ ఇన్స్పెక్టర్ నరేశ్, డీఐ రాజు, ఎస్ఐ సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
వీడియోలు


రామ్ చరణ్ తో గ్లోబల్ కథ యూరప్ వెళ్లిన సుకుమార్


నాగాంజలి మృతి బాధాకరం: మార్గాని భరత్


నాగాంజలి వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?


పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాదులు.. ఆ ఒక్కటే కారణమా?


జగన్ భవనాలు కట్టిస్తే తప్పు.. అమరావతికి వేలకోట్ల అప్పు కరెక్ట్.. బాబు గారూ మీరు సూపర్


పరిటాల సునీతపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్స్


బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ మనోజ్ కుమార్ కన్నుమూత


పల్నాడు జిల్లాలో YSRCP కార్యకర్త దారుణ హత్య


ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి


ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం