రూ. కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం | 1crore worth redsander caught in chittoor distirict | Sakshi
Sakshi News home page

రూ. కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం

Published Wed, Aug 26 2015 8:35 AM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

1crore worth redsander caught in chittoor distirict

చంద్రగిరి: తరలించేందుకు సిద్ధం చేసిన ఎర్రచందనం దుంగలు పెద్ద మొత్తంలో పట్టుబడ్డాయి. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలివీ..చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అగరాల గ్రామ సమీపంలో పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం మేరకు అటవీ అధికారులు కూంబింగ్ ప్రారంభించారు.

అయితే అధికారులను పసిగట్టిన కూలీలు దుంగలను వదిలేసి పరారయ్యారు. అధికారులు మొత్తం 37 దుంగలను స్వాధీనం చేసుకుని, రంగంపేట కార్యాలయానికి తరలించారు. సుమారు ఒకటిన్నర టన్నుల బరువైన ఆ దుంగల విలువ రూ.కోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement