
వనస్థలిపురం: వనస్థలిపురం కార్యాలయంలో రూ.70 వేలు లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్టార్ ఎస్.రాజేష్ కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తుర్కయాంజాల్ పరిధిలోని 200 గజాల స్థల విషయం వివాదాస్పదంగా మారింది. దీని రిజిస్టేషన్‌కు సబ్‌రిజిస్ట్రార్ రూ.లక్ష డిమాండ్ చేయడంతో బాధితుడు రూ.70 వేలు ఇస్తానన్నాడు. ఈ మేరకు శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ తన సహాయకుడు, డాక్యుమెంట్ రైటర్ వద్ద టైపిస్ట్‌గా పని చేసే రమేష్ ద్వారా రూ.70 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ.. కార్యాలయంలో జరిగే అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే టోల్ ఫ్రీ నెం. 1064కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.