చంద్రగిరి: శేషాచలం అడవుల్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన కూంబింగ్‌లో రూ.80 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్ ఆర్‌ఎస్‌ఐ భాస్కర్ తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి అటవీశాఖ అధికారులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శేషా చలం అడవుల్లోని చీకటీగల కోన సమీపంలోని ఎర్రగుట్ట వద్ద కూంబింగ్ నిర్వహిస్తుండగా సుమారు 60 మందికిపై కూలీలు అధికారులపై రాళ్లతో దాడికి పాల్పడడం.. అధికారులు గాల్లోకి కాల్పులు జరిపిన సంఘటన తెలిసిందే.
కూలీలు పారిపోయిన అనంతరం ఆ ప్రాంతంలో ఉన్న సుమారు 1.17 టన్నుల ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.80 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అదేవిధంగా చంద్రగిరి మండలం భీమవరం సమీపంలోని మూలపల్లి వద్ద శుక్రవారం రాత్రి కూంబింగ్ నిర్వహిస్తుండగా ముగ్గురు కూలీలు అధికారులు పట్టుబడ్డారు.
రూ.80 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
Published Sat, Dec 26 2015 9:31 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM
Advertisement