రూ. 3 కోట్ల ఎర్రచందనం స్వాధీనం | rs. 3 crore worth redsander seized in ysr distirct | Sakshi
Sakshi News home page

రూ. 3 కోట్ల ఎర్రచందనం స్వాధీనం

Published Thu, Mar 31 2016 2:21 PM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

rs. 3 crore worth redsander seized in ysr distirct

రైల్వే కోడూరు: వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం నాగేటికోట అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు భారీ ఎర్రచందనం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి నుంచి కొనసాగుతున్న ఈ కూంబింగ్‌లో ఇప్పటి వరకు 182 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని అక్రమంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మడానికి యత్నిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ. 3 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement