ఏ పనీ లేదు.. రూ.3.10 కోట్లు సంపాదించాను: అమెజాన్ ఉద్యోగి | Amazon Employee Says He Earns Rs 3 Crore For Doing Nothing Work | Sakshi
Sakshi News home page

ఏ పనీ లేదు.. రూ.3.10 కోట్లు సంపాదించాను: అమెజాన్ ఉద్యోగి

Published Sat, Aug 24 2024 8:59 PM | Last Updated on Sat, Aug 24 2024 9:11 PM

Amazon Employee Says He Earns Rs 3 Crore For Doing Nothing Work

ఏడాదిన్నర కాలంలో కంపెనీలో ఎలాంటి పనిలేకుండా ఏడాదికి 3.10 కోట్ల రూపాయలు జీతము తీసుకుంటున్నట్లు అమెజాన్ సీనియర్ ఉద్యోగి ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. పనిచేయకుండా ఇంత జీతం ఎలా తీసుకుంటున్నారు? అనే అనుమానం చాలామందిలో కలిగింది. మరిన్ని వివరాలు చూసేద్దామా..

గూగుల్ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన తరువాత.. అమెజాన్‌లో సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్ ఉద్యోగంలో చేరారు. ఏడాదిన్నర కాలంలో ఏ పనీ చేయకూండానే 370000 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 3.10 కోట్లు) జీతంగా పొందినట్లు వెల్లడిస్తూ.. ఈ అదృష్టం ఎంతకాలమో అని అన్నారు.

నిజానికి గూగుల్ కంపెనీ లేఆఫ్‌లో ఉద్యోగం కోల్పోయిన తరువాత ఏ పనీ చేయకుండానే డబ్బు సంపాదించాలనే ఆలోచనతోనే అమెజాన్ కంపెనీలు చేరినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కేవలం ఏడు సపోర్ట్ టికెట్లను పరిష్కరించినట్లు, ఒకే ఆటోమేటెడ్ డ్యాష్‌బోర్డ్‌ను రూపొందించినట్లు చెప్పారు. దాన్ని నిర్మించడానికే మూడు నెలలు సమయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏఐ ద్వారా దీన్ని కేవలం మూడు రోజుల్లో రూపొందించవచ్చని ఆయనే వెల్లడించారు. రోజులో ఎక్కువ భాగం మీటింగులకే పరిమితమవుతానని ఆ వ్యక్తి చెప్పుకొచ్చారు.

అమెజాన్ ఉద్యోగి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం 'ఎక్స్'లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఆ వ్యక్తిని విమర్శిస్తున్నారు. రోజంతా ఏ పని లేకుండా ఇదెలా సాధ్యం? ఇతర ఉన్నతోద్యోగులు ఇలాంటి వారిని గమనించడం లేదా? అని అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement