రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం రవాణా అవుతోందనే సమాచారంతో అటవీ, పోలీసు అధికారులు సోమవారం ఉదయం మాధవరం గేటు వద్ద తనిఖీలు నిర్వహించారు. మూడు కార్లలో తరలిస్తున్న 102 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. కార్ల డ్రైవర్లు పరారు కాగా దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లు విశ్వనాథరెడ్డి, సుదర్శన్, ప్రవీణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ.2.27 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దుంగలతో పాటు మూడు కార్లను, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.