భారీగా ఎర్ర చందనం స్వాధీనం
Published Tue, Aug 1 2017 11:59 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం చెలికంపాడు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రూ. 5 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement