నెల్లూరు: నర్సాపూర్‌-ధర్మవరం రైలుకు తప్పిన ప్రమాదం | Narsapur-Dharmavaram Train Misses Accident At Nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరు: నర్సాపూర్‌-ధర్మవరం రైలుకు తప్పిన ప్రమాదం

Published Sun, Jul 30 2023 8:18 AM | Last Updated on Sun, Jul 30 2023 8:59 AM

Narsapur-Dharmavaram Train Misses Accident At Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు: నర్సాపూర్‌-ధర్మవరం రైలుకు పెను ప్రమాదం తప్పింది. కాగా, రైల్వే పట్టాలపై గుర్తుతెలియని దుండగులు రైలు పట్టాను అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో ట్రాక్‌పై పట్టాను రైలు ఢీకొట్టింది. దీంతో, రైలు పట్టా పక్కకు పడిపోవడంతో ప్రమాదం తప్పింది. 

వివరాల ప్రకారం.. నర్సాపూర్‌-ధర్మవరం రైలు శనివారం అర్ధరాత్రి ట్రాక్‌పై వెళ్తుండగా కొందరు రైల్వే పట్టాలపై 2 మీటర్ల రైలు పట్టాను అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో రైలు బలంగా ఢీకొనడంతో ఓ పట్టా.. ట్రాక్‌పై పక్కకు పడిపోయింది. లేకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు. ఇక, ఈ ఘటన కావలి, బిట్రగుంట సమీపంలోని ముసునూరు వద్ద చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఆర్‌పీఎఫ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: పీఎస్‌ఎల్‌వీ సీ-56 రాకెట్‌ ప్రయోగం విజయవంతం


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement