Narsapur Express
-
నెల్లూరు: నర్సాపూర్-ధర్మవరం రైలుకు తప్పిన ప్రమాదం
సాక్షి, నెల్లూరు: నర్సాపూర్-ధర్మవరం రైలుకు పెను ప్రమాదం తప్పింది. కాగా, రైల్వే పట్టాలపై గుర్తుతెలియని దుండగులు రైలు పట్టాను అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో ట్రాక్‌పై పట్టాను రైలు ఢీకొట్టింది. దీంతో, రైలు పట్టా పక్కకు పడిపోవడంతో ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. నర్సాపూర్-ధర్మవరం రైలు శనివారం అర్ధరాత్రి ట్రాక్‌పై వెళ్తుండగా కొందరు రైల్వే పట్టాలపై 2 మీటర్ల రైలు పట్టాను అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో రైలు బలంగా ఢీకొనడంతో ఓ పట్టా.. ట్రాక్‌పై పక్కకు పడిపోయింది. లేకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు. ఇక, ఈ ఘటన కావలి, బిట్రగుంట సమీపంలోని ముసునూరు వద్ద చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతం -
పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
సాక్షి, హైదరాబాద్: పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు నర్సాపూర్–సికింద్రాబాద్ (07455) ట్రైన్ ఈనెల 21, 28 తేదీల్లో నర్సాపూర్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–విజయవాడ (07456)ట్రైన్ ఈనెల 22, 29 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాత్రి 11.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. హైదరాబాద్–గోరఖ్‌పూర్ (02575/02576) ట్రైన్ ఈనెల 19వ తేదీ రాత్రి 9.05 గంటలకు బయల్దేరి రెండోరోజు ఉదయం 6.30 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుం టుంది. తిరుగుప్రయాణంలో 21వ తేదీ ఉదయం 8.30 గంటలకు గోరఖ్‌పూర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. (చదవండి: ఇకపై అన్నీ రెగ్యులర్ రైళ్లే.. రైల్వేశాఖ కీలక నిర్ణయం) -
పిల్లలను అమ్మేసిన సవతితల్లి
-
కొల్లేటి కథ
పర్యటన ఫిబ్రవరి 14, 15 తేదీల్లో కథారచయితల కొల్లేటి పర్యాటన రచనా జగత్తులోని అంతర్లోకాల కంటే బాహ్యంగా జరుగుతున్న విధ్వంసాన్నే ఎక్కువ దర్శింప చేసింది. ‘అసలే పదమూడో తేదీ... ఆపై ఎస్13... ఏదో భయంగా ఉంది మిత్రమా’... అన్న్టాడొక కవిమిత్రుడు నవ్వుతూ ఒక సృజనకారుడికి మాత్రమే ఉండే అతి ఊహా భయ అపోహతో. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎస్13లో అందరం ప్రయాణం. కొల్లేరుకి. తేదీ అదే అయ్యింది. బోగీ అదే అయ్యింది. అందుకే ఈ భయం. పదమూడు సంఖ్య కొందరి దృష్టిలో దుశ్శకునం కావచ్చు. కాని అంతకంటే పెద్ద దుశ్శకునాన్ని చూడబోతున్నామని మాకు తెలీదు. పర్యావరణానికి దుశ్శకునం. ప్రకృతికి దుశ్శకునం. ప్రపంచంలో అరుదైన చిత్తడి నేలలకు దుశ్శకునం. కొల్లేరు దురాక్రమణ! ప్రోగ్రామ్ ఏమిటంటే ఉదయాన్నే లాంచీ ఎక్కి సాయంత్రం వరకు కొల్లేరులో తిరగాలని. పక్షులను చూడాలని. రక్కసి పొదల చాటున అందంగా ఉండే లంక గ్రామాల సౌందర్యాన్ని తిలకించాలని. ఏం... జాలరి వలలూ... తాటి దోనెలూ... పట్టిన తర్వాత రేకు డ్రమ్ముల్లో చిక్కి ఎగిరి నీళ్లల్లోకి దూకాలని పెనుగులాడుతున్న కొర్రమీనులూ గొరకలూ... వేలెడంత ఉండి తప్పించుకోవడానికి వీలు లేక నాలుగు గుర్రపు డెక్కల్ని మూతగా కూరితే లోన ఉక్కిరిబిక్కిరిగా సందడి చేస్తున్న చేదిబరిగెలూ... కొల్లేరుకు ఆనుకుని నిడమర్రు సమీపాన ‘పెదనిండ్రకొలను’ గ్రామంలో ఉంటున్న రచయిత కుమార్ కూనపరాజు కూడా ఇలాగే అనుకున్నారు. చాలాకాలం న్యూయార్క్, హైదరాబాద్‌లలో ఉండి ఇటీవల సొంతూళ్లో స్థిరపడిన కుమార్ కొల్లేరును చూసి చాలా రోజులవుతోంది. బాగానే ఉంటుంది కదా అనుకున్నారట. ఆ మొత్తం కార్యక్రమానికి హోస్ట్ ఆయనే. భీమవరంలో బేస్ క్యాంప్. అక్కడి నుంచి ఆకివీడుకి. కాస్త లోనకు దారి చేసుకుంటే కొల్లేరు ఒడ్డు. పది ఇరవై అడుగుల ఎత్తున మొలచిన దుబ్బును ఒరుసుకుంటూ మూడు నాలుగు చిన్నపడవలూ... ఒక లాంచీ... ఎన్నాళ్ల కోరికో చూడాలని. ఎక్కాం. ఎ... కాకు దీర్ఘం.. వత్తు... సున్నా... పదం పూర్తయ్యే లోపలే దిగాం. అంతే కొల్లేరు. ఇక్కడి నుంచి అక్కడికి. ఒక మురుగు కాల్వ అంత. రెండు మూరలు. పోనీ నాలుగు బారలు. అంతే. ఛిద్రదేహం. ముక్కలుగా చీరిన దేహం. పూడిన దేహం. ఎండిన దేహం. కొనఊపిరితో తీసుకుతీసుకు పడి ఉన్న దేహం. కొల్లేరు. కుమార్ అప్పుడు ఏమీ మాట్లాడలేదు. అది తను చిన్నప్పుడు చూసిన కొల్లేరు కాదు. గంభీరంగా మౌనంగా ఉండిపోయి హైదరాబాద్ చేరుకుని ఫోన్ చేస్తే అన్నారు- ‘ఆక్రమణ పూర్తయ్యింది. ఇంకేం మిగల్లేదు’. అదీ కొల్లేరు. పది కాంటూర్లు.. అంటే 2.24 లక్షల ఎకరాలు. పోనీ ఐదు కాంటూర్లు... లక్ష ఎకరాలు... సరే మూడు కాంటూర్లు... ఏం లెక్క ఇది. సరస్సు సరస్సులా ఉండాలి. ప్రాణం ప్రాణంలా ఉండాలి. నీరు నీరులా ఉండాలి. చేప చేపలా ఈదాలి. ఏం చూశాం ఇక్కడ? పచ్చటి నేలలన్నీ చేపల చెరువులుగా రొయ్యల దొరువులుగా... జీవితాలు బాగుపడ్డాయి... సంపద పోగయ్యిందట... కాని అందరూ దాదాపుగా బాటిల్డ్ వాటర్ కొనుక్కొని తాగుతున్నారు. గ్రౌండ్ వాటర్ కలుషితం అయ్యింది. ఆక్వా మందులు నేల అడుగున ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జీవవాిహనీ... అంతర్వాహినీ... రసాయనిక విషవాహినీ... రెండు వాదనలు వినిపించాయి. మొదటి వాదన- మహమ్మారి కొల్లేరు... వరద వస్తే లంకలను ముంచే దుఃఖదాయిని కొల్లేరు... జలగం వెంగళరావు పుణ్యమా అంటూ చేపల చెరువులు కల్పతరువులా మారి బతుకు బాగు చేసింది. గుడ్. రెండో వాదన- కానీ ఈ ప్రయత్నమే కొల్లేరు ముక్కు మూసేసింది. గుడ్లు పీకేసింది. ఊపిరితిత్తుల్లో తిష్ట వేసి రాచపుండులా నమిలి మింగేస్తోంది. పక్షులు అరాకొరా మిగిలాయి. చేపలు బిక్కుబిక్కుమంటున్నాయి. శాక రొయ్యలు.. బుంగ రొయ్యలు.. గాజు రొయ్యలు... ఏడ్చినట్టుంది. నీళ్లా అవి? పురుగుల మందు. కొల్లేటి కాపురం... సినిమా. కొల్లేటి బతుకు... వాడుక. కొల్లేటి జాడలు... ఇంతకాలానికైనా తెలుగులో వచ్చిన అక్కినేని కుటుంబరావు నవల. కొల్లేటి కథ? చాలా రాయాల్సి ఉంది. కొల్లేటి తాజా బతుకు మీద చాలా చేయాల్సి ఉంది. దానిని ఆక్రమించో ఆధారం చేసుకునో పొట్టపోసుకుంటున్న మామూలు మనుషులకు న్యాయం జరగాలి. కొల్లేరుకు జీవం రావాలి. ఈ రెండూ సాధించడం చాలా పెద్దపని. కొల్లేటి ప్రక్షాళన అంటే చాలా మంది వణుకుతున్నారు. భుక్తి పోతుందని. కాని ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు... తెలుగువారి సరస్సు... సైబీరియా పక్షుల మెట్టినిల్లు.... అటు చూస్తే తెలంగాణలో మిషన్ కాకతీయ... హుసేన్ సాగర్ పునరుజ్జీవనం... ఆంధ్రప్రదేశ్‌లో? బెంగ. ఈలోపు కేశవరెడ్డి మరణవార్త మరో దిగులు. ఫిబ్రవరి 14న- దిగిన వెంటనే- పెదనిండ్రకొలనులో- కథాచర్చల కంటే ముందు కేశవరెడ్డి సంస్మరణ సభ- బహుశా రాష్ట్రంలోనే మొదటి సభ- ఏర్పాటు. రచయితలందరం కలిసి కేశవరెడ్డిని తలుచుకోవడం. ‘కేశవరెడ్డి గురించి తెలుగు ప్రాంతం కనీసం రెండు దశాబ్దాలు మౌనం పాటించింది. మునెమ్మ నవల మీద కాంట్రవర్సీ జరగకపోయి ఉంటే ఆ మౌనం ఇంకా కొనసాగేదేమో’ అని ఎవరో అన్నారు. ‘ఒక అగ్రకుల రచయిత అయి ఉండి జీవితాంతం శూద్రుల జీవితాలను రాసే పనికి పూనుకోవడం మామూలు విషయం కాదు’.. మరొకరు. ఇంకా ఎన్నో మాటలు... జ్ఞాపకాలు. తెలుగులో నవలను శ్రద్ధగా సాధన చేసిన ఒక శక్తిమంతమైన రచయితకి వీడ్కోలు. తెలుగు నవల తాత్కాలికంగా మూగదైంది. ఆ పిల్లనగ్రోవి మరి వినిపించదు. ఆ మధ్యాహ్నం- సోషల్ మీడియాలో రాస్తున్న కొత్త రచయితల గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. ప్రింట్ మీడియా సంకెలల నుంచి, ‘ఎడిటర్లు అచ్చుకు స్వీకరించే’ అడ్డంకి నుంచి రచయితలను సోషల్ మీడియా విముక్తం చేయడాన్ని అందరూ మంచి పరిణామంగా చూశారు. అయితే ఒకటి రెండు కథలు రాయగా, నాలుగైదు లైకులు కనిపించగా, మరి మనంతవారు లేరని భావించే కొత్త రచయితలకు జాగ్రత్త చెప్పి కాపాడుకోవాలని కొందరు సూచించారు. అక్కర్లేదనీ తెలుసుకునేవారు తెలుసుకుంటారనీ లేకుంటే వాళ్ల పాపాన వాళ్లే పోతారని మరెవరో అనుభవం మీద తేల్చారు. అయితే విస్తృతి నుంచి ‘ఉన్మాద’స్థాయికి చేరుకున్న ఈ సోషల్ మీడియాలో క్షణమాత్రం సేపు కనిపించకపోతే బెంబేలు పడిపోయే కొత్త జబ్బు ‘ఫోమో’ (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) మీద మరో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ థీమ్‌ను తీసుకొని ఆరు కథలను ఆరుగురు రచయితలతో రాయించి ఆరు షార్ట్‌ఫిల్మ్స్ తీయాలన్న ప్రయత్నానికి తలో చేయి వేసే అంగీకారమూ కుదిరింది. మహా రచయితలను తెలుసుకోవడం ముఖ్యం. ఒక రచయిత రచనా కృషిని తెలుసుకుంటే మన రచనాకృషిని బేరీజు వేసుకునే వీలవుతుంది. మహా రచయిత మార్క్వెజ్ రచనా ధోరణినీ ముఖ్యంగా పదాలతో దృశ్యం కట్టే అతడి ప్రతిభనీ విశదం చేస్తూ చాలా మంచి సెషన్ జరిగింది. ఒకే వాక్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల ప్రస్తావన వచ్చేలా మార్క్వెజ్ రాసేశైలి గురించి తెలుగువారు దృష్టి పెట్టారా? ప్రశ్న. ఈ చర్చ ఇలా జరుగుతుండగా నడక ఇబ్బంది వల్ల లాంచీలోనే ఉండిపోయిన సీనియర్ రచయితొకరు- ఐదారుమంది సిబ్బందిని కేకలేస్తూ పాసింజర్లను బుజ్జగిస్తూ పోటీదార్ల మీద కయ్యానికి దిగుతూ లాంచీని అలవోకగా నిర్వహిస్తున్న మహిళను పలకరించి మంచి కథకు సరిపడా సమాచారాన్ని సేకరించడం మిగిలినవాళ్లకు పెద్ద మిస్సింగు. ‘నేనెందుకు రాస్తున్నాను’ అనే అంశం మీద ఆ సాయంత్రం భీమవరం పాఠకుల మధ్య రచయితలు పంచుకున్న అనుభవాలు వారికే కాదు ఇతర రచయితలకు కూడా పాఠాలు. వీటన్నింటి నడుమ ప.గో.జిల్లా పల్లెల్ని చూడటం, గూడపెంకుల ఇళ్లను చూడటం, వాకిలి గోడలపై ముదురెరుపు మందారాలను చూడటం, కాలువల్లో మునకలు వేస్తున్న పిల్లలు, లారీలకు ఎక్కుతున్న తాజా చేపల తళుకులు, మిగిలి ఉన్న వరిచేల గ్రీన్ కార్పెట్, అమృతపాణి అరటిపండ్ల ఇన్స్టాంట్ శక్తి, భోజనంలో శీలవతి చేపల పులుసు అలవిగాని రుచి... ములక్కాడల్ని ఉడకబెట్టిన గుడ్లతో వండిన తియ్యగూర లొట్టలు... ఆ రాత్రి గుక్కెడు మదిరా... ఆ పైన కవుల కంఠాన పద్యమూ... కొన్ని గ్రూప్ఫొటోలూ మరికొన్ని చేబదులు సెల్స్నాప్లూ... అన్నింటి కంటే మించి అందరం కలిశాం కదా అని అభినయం లేని నిజమైన సంతోషం... రెండు రోజుల పర్యటనే... కాని రెండు సంవత్సరాలకు సరిపడా రాగిమాల్ట్. టైటానిక్ సురేష్ -7702806000, అక్కిరాజు భట్టిప్రోలు, కుప్పిలి పద్మల ఆధ్వర్యంలో కుమార్ కూనపరాజు -9989999599 పూనిక మీద జరిగిన ఈ కార్యక్రమంలో పాతా కొత్తా మిత్రులు చాలామంది. అల్లం రాజయ్య, దేవులపల్లి కృష్ణమూర్తి, హనీఫ్, భగవంతం, కోడూరి విజయకుమార్, పూడూరి రాజిరెడ్డి, పద్మజా రమణ, దాట్ల దేవదానం రాజు, పెన్మత్స శ్రీకాంత్ రాజు. కలిదిండి వర్మ, నామాడి శ్రీధర్, బి.వి.వి.ప్రసాద్, డానీ, కుప్పిలి పద్మ, బా రహమతుల్లా, అనిల్ బత్తుల, జి.ఎస్.రామ్మోహన్, విజయలక్ష్మి, అజయ్ ప్రసాద్, అక్కిరాజు భట్టిప్రోలు, పద్మావతి, తెనాలి ఉమా, నాగేశ్వరరావు, ప్రసాదమూర్తి, శిఖామణి, లెనిన్ ధనిశెట్టి, కస్తూరి మురళీకృష్ణ, అనంత్... వీళ్లతో పాటు తల్లావఝల పతంజలి శాస్త్రి, మధురాంతకం నరేంద్ర కూడా రావాల్సింది. శాస్త్రిగారు కారణం చెప్పారు. నరేంద్ర ఏ పనుల్లో చిక్కుబడ్డారో ఏమో. ఒక రచనకు విధ్వంసానికి మించిన ధాతువు లేదు. ఆ విధ్వంసాన్ని చూపిన పర్యటన ఇది. జల ప్రళయం అంటే వేరేమిటో కాదు. నీటి ఆధారిత వ్యాపారంతో జరుగుతున్న భూ విధ్వంసం, సరస్సుల విధ్వంసం, స్వచ్ఛమైన జల వనరుల విధ్వంసం. రచయితలు చూడాల్సింది వీటినే. కలవాలి మనుషుల్ని. ఈ మూల ఈసారి. ఆ మూల మరోసారి. తదుపరి పర్యటన జూన్లోనట. కాసింత బస చూపి నాలుగు పూటలు భోజనం పెట్టేవారున్నారా? రచయితలు మీ ఊరు రావడానికి సిద్ధంగా ఉన్నారూ. - ఒక కథకుడు కొల్లేటి కాపురం... సినిమా. కొల్లేటి బతుకు... వాడుక. కొల్లేటి జాడలు... ఇంతకాలానికైనా తెలుగులో వచ్చిన అక్కినేని కుటుంబరావు నవల. కొల్లేటి కథ? -
నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
పాలకొల్లు, న్యూస్‌లైన్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పెంకుళ్లపాడు వద్ద రైలు పట్టా విరిగిపోవడంతో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్‌కు బయల్దేరిన ఈ రైలు శుక్రవారం ఉదయం 8.20గంటలకు పాలకొల్లు స్టేషన్ దాటిన తరువాత పెంకుళ్లపాడు వద్ద రైలు పట్టా వెల్డింగ్ వదిలేయటంతో పెద్దశబ్దం వచ్చింది. డ్రైవర్ వెంటనే రైలును నిలిపివేశారు. మరమ్మతులు చేశాక రైలు బయల్దేరింది. ‘బొకారో’లో మంటలు పిఠాపురం, న్యూస్‌లైన్: విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ఓ బోగీ అడుగున మంటలు చెలరేగాయి. రైలు శుక్రవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని గోర్స రైల్వేగేటు వద్దకు వచ్చింది. గేట్‌మన్ ఎస్-5 బోగీ కింద మంటలను గుర్తించి పిఠాపురం స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. రైలు పిఠాపురం స్టేషన్‌కు రాగానే మంటలను ఆర్పివేశారు. దీంతో ప్రమాదం తప్పింది. -
నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్ నుంచి నర్సాపూర్ వెళ్తున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది. పాలకొల్లు - నర్సాపూర్ మధ్య గోరింటాడ గ్రామ సమీపంలో రైలు పట్టా విరిగింది. ఆ విషయాన్ని గుర్తించి రైల్వే సిబ్బంది ఆ ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేశారు. దాంతో రైలు పట్టాను సరిచేసేందుకు రైల్వే సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. -
అపూర్వం.. ఆత్మీయం..
=సుదీర్ఘకాలం తర్వాత జిల్లాకు వచ్చిన జననేతకు ఘనస్వాగతం =అభిమాన నేతను చూసేందుకు బారులుతీరిన జనం =జోరువానను లెక్కచేయని వైనం =అధికారంలోకి రాగానే పింఛన్ పెంపుపై తొలి సంతకం చేస్తానని జగన్ హామీ సాక్షి ప్రతినిధి, విజయవాడ : ప్రజాభిమానం ముందు తీవ్ర చలిగాలులు, వర్షం సైతం వెలవెలబోయాయి. సుదీర్ఘ కాలం తర్వాత తమ ప్రాంతానికి వచ్చిన జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. రోడ్డుపైకి వచ్చిన జనం వైఎస్ జగన్‌కు తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు, జెడ్పీ మాజీ చైర్మన్ కేఎన్నార్ హఠాన్మరణానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన జగన్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో గుడివాడకు చేరుకున్నారు. పార్టీ ముఖ్యనేతలు, శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పార్టీ గుడివాడ నియోజకవర్గ సమన్వయకర్త కొడాలి నాని నివాసం వద్దకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా పలుకరించారు. జగన్‌తో కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు పార్టీ శ్రేణులు పోటీపడ్డాయి. తమ కష్టాలు వివరించిన వృద్ధ మహిళలు దుర్భర జీవనం అనుభవిస్తున్న వృద్ధులు, వికలాంగులకు ప్రభుత్వ పింఛను మొత్తాన్ని పెంచుతూ తమ ప్రభుత్వం రాగానే తొలి సంతకం చేస్తామని జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. గుడివాడ నుంచి కోసూరు వెళ్లే మార్గంలో పామర్రు, పరిసర గ్రామాలలో రోడ్డుకిరువైపులా బారులుదీరి స్వాగతం పలికిన ప్రజలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, తమ కుటుంబాలు తీవ్ర కష్టాల్లో ఉన్నాయని పలువురు వృద్ధ మహిళలు జననేతకు తమ బాధను వెళ్లబోసుకున్నారు. వార్ని ఓదార్చుతూ ఆర్నేల్లు ఓపికపట్టాలని, త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, ఆ సువర్ణయుగంలో అందరికీ మేలు కలుగుతుందని జననేత భరోసా ఇచ్చారు. వృద్ధులు, వికలాంగులను ఆదుకునేందుకు పింఛను మొత్తాన్ని పెంచుతూ తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆ మహిళలు ‘మా కోసం ఆలోచించే నీవు చల్లగా ఉండాలయ్యా’ అంటూ నిండు మనస్సుతో దీవించారు. ఎన్టీఆర్ సొంతగడ్డలో అపూర్వస్వాగతం.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరులో జగన్మోహన్రెడ్డికి అపూర్వస్వాగతం లభించింది. కోసూరు వెళ్లేందుకు నిమ్మకూరు మీదుగా జగన్మోహన్రెడ్డి కాన్వయ్ సాగింది. దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎన్టీఆర్ బంధువు నందమూరి పెద్దవెంకటేశ్వరరావు, చిగురుపాటి మురళీ స్వయంగా వచ్చి జగన్మోహన్రెడ్డిని తమ ఇంటికి రావాలని ఆహ్వానించారు. దీంతో మురళీ ఇంటికి వెళ్లిన జగన్మోహన్రెడ్డి అక్కడే ఆ ఊరి ప్రజలను ‘బాగున్నారా?’ అంటూ పలకరించారు. గుడివాడ నుంచి కోసూరు వరకూ, అక్కడ నుంచి గన్నవరం దాకా దారి పొడవునా ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరి జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలను చూసి కారు దిగి వారి ఆపాయ్యంగా పలకరిస్తూ జగన్ ముందుకు సాగారు. మధ్యాహ్నాం రెండున్నర గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జగన్ హైదరాబాద్ వెళ్లారు. కేఎన్నార్ మృతి తీరనిలోటు.. ఆయన కుటుంబానికి అండగా ఉంటాం.. ప్రజలకు సేవ చేసేందుకు తపన పడే కేఎన్నార్ వంటి రాజకీయ నేత మృతి తీరని లోటని, ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. మొవ్వ మండలం కోసూరులో కేఎన్నార్ పార్ధివదేహానికి పూలమాల వేసి జగన్ నివాళులర్పించారు. జెడ్పీ చైర్మన్‌గాను, వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడిగా కేఎన్నార్ తనదైన ముద్ర వేశారని కీర్తించారు. తమ పార్టీ మంచి నాయకుడ్ని కోల్పోయిందని, ఆయన నిత్యం నవ్వుతూ అందరితోను కలుపుగోలుగా ఉండేవారని జగన్మోహన్రెడ్డి తన సంతాపం వెలిబుచ్చారు. కేఎన్నార్ సతీమణి కృష్ణకుమారి, తనయులు వెంకట్రామ విద్యాసాగర్, మోహన్‌కుమార్, కుమార్తె సీతాదేవి, అల్లుడు కాశీవిశ్వనాథ్లను పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు. జోరువానలో బారులు తీరిన జనాభిమానం.. వెన్నంటి కదిలిన పార్టీ శ్రేణులు.. పార్టీ శ్రేణులు జిల్లాకు వచ్చిన జననేత జగన్ వెన్నంటి నడిచాయి. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఆర్కే, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, మేకా ప్రతాప్‌అప్పారావు, జలీల్‌ఖాన్, వంగవీటి రాధ, ముదునూరి ప్రసాదరాజు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, డాక్టర్స్ సెల్ కన్వీనర్ డాక్టర్ శివ భరత్‌రెడ్డి, జిల్లాలో వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు పి.గౌతంరెడ్డి, ఉప్పులేటి కల్పన, ఉప్పాల రామ్‌ప్రసాద్, సింహాద్రి రమేష్, దుట్టా రామచంద్రరావు, దూలం నాగేశ్వరరావు, తాతినేని పద్మావతి, ఉప్పాల రాము, పడమట సురేష్‌బాబు, బండ్రపల్లి వల్లభాయ్, పార్టీ నాయకులు సానికొమ్ము వెంకటేశ్వరెడ్డి, మాదివాడ రాము, కాజా రాజకుమార్, నందమూరు శ్రీనివాసరత్నాకర్, గుడివాక శివరావు, యాసం చిట్టిబాబు, షేక్ సలార్‌దాదా, లాకా వెంగళరావు యాదవ్, తాడి శంకుతల, మండలి హనుమంతరావు తదితరులున్నారు.